05 భాగం

 

05

దానితో మా నాన్నగారిలో తిరిగి అంతర్మధనం మొదలైంది. అంటే నా సిద్ధార్థుడు సన్యాసి గావడము ఏమిటి? భోగాలకి చక్రవర్తి గావలసినవాడు యోగులకి చక్రవర్తి గావడము ఏమిటి? నిజముగానే ఈ అసిత మహర్షి చెప్పిన విషయాలు జరుగుతాయా? జరిగితే ఈ రాజ్యానికి వారసుడు లేకుండా పోతాడు గదా. ఇలా జరగకూడదు. ఈ మహర్షికి వృద్దాప్యము రావడము  వలన మతి గతి తప్పి ఏదేదో మాట్లాడి వెళ్లి ఉంటాడని తన మతికి మా నాన్నగారు సర్ది చెప్పుకోసాగారు. ఆయన ఈ మహర్షి చెప్పినది నిజమో గాదో ఆరోజు జాతక ఫలితము చెప్పకుండా మౌనముగా వెళ్ళిపోయిన ఆ యువ జ్యోతిష్య పండితుడిని పిలిపించి నిజ జాతక ఫలితాలు చెప్పమని అడిగితే... ఈ అసిత మహర్షి చెప్పిన విషయాలు ఎంతవరకు సత్యమో మనకి తెలుస్తుంది గదాయని మా నాన్నగారు తక్షణమే ఈ పండితుడిని ఆస్థానానికి పిలువడము జరిగింది.

        వచ్చిన యువ జ్యోతిష్య పండితుడిని సావధానముగా కూర్చోపెట్టి "మహాత్మా. ఆ నాడు మీరు ఒక్కరే మా పిల్లవాడి జాతక ఫలితాలు చెప్పకుండా మౌనముగా వెళ్లిపోవడము నేను గమనించాను. జాతక ఫలితాలలో ఉన్న ఎంతటి కఠోర సత్యాలు చెప్పినగూడ నేను విశ్వసిస్తాను. మిమ్మల్ని దండించను. అనగానే..

మహారాజా. అదిగాదు. ఈ పిల్లవాడు నిజానికి చక్రవర్తిగాలేడు. సన్యాసము స్వీకరించి భిక్షాటన చేస్తూ ధ్యాననిష్టాపరుడై మహాత్ముడై లోక పూజ్యుడవుతాడు. అనగానే....

స్వామి. మీరు చెప్పే జాతక ఫలితాలు నిజమని నేను ఎలా నమ్మేది అనగానే....

మహారాజా. ఈ పిల్లవాడు తల్లి గండము నందు జన్మించాడు. నా లెక్క ప్రకారము ఈ పిల్లవాడు పుట్టిన 8 వ రోజు కల్లా ఇతని తల్లి మరణము పొందుతుంది. ఇదే మీకు సత్యదర్శనము... సాక్ష్యముగా నిలుస్తుంది అనగానే

మా నాన్నగారు ఆలోచనలో పడ్డారు.

*** *** *** *** *** ***

హడావుడిగా బైక్ స్టాండ్ వద్ద పార్క్ చేసి అపుడికే తను బౌద్ధ సన్యాసి దీక్షలో ఉండుట వలన ఎవరికి ఏ మాత్రము అనుమానము రాకుండా తను హత్య చేసిన మ్యూజియము గది దగ్గరకి అంగుళీమాల వెళ్ళాడు.లోపల శవము చుట్టూ చాక్ పీసుతో తెల్లని గీత గీసి ఉండటము దీని చుట్టూ టేపులతో కంచె వేసి ఉండటము ఈ గది కిటికి నుండి ఇతను గమనించి తనని ఎవరు గమనించడము లేదని నిర్ధారణ చేసుకొని తన కళ్ళలో ఏ మాత్రము తత్తరపాటు  తెలియకుండా గది ద్వారము దగ్గరికి చేరుకొనేసరికి..అక్కడ కాపలాగా పోలీసులుండేసరికి వీళ్ళని చూసేసరికి ఏ మాత్రము తడబడకుండా..కళ్ళలో భయము కనిపించనీయకుండా వారి అనుమతితో చనిపోయిన బౌద్ధసన్యాసికి ఆఖరి వందనము చేసుకొని వస్తానని చెప్పి గదిలోనికి ప్రవేశించడము జరిగినది.

విశాలమైన గది ప్రాంగణములో దూరముగా..కనికనిపించని విధముగా అంతగా వెలుతురు లేని భాగములో తీవ్ర ధ్యాన నిష్ఠలో నిర్వాణలామా అలాగే ఆనందభిక్షువు ఉండటము అంగుళీమాల గమనించకుండా గది చుట్టూ సి.సి.కెమెరాలు లేవని నిర్ధారణ చేసుకొని హడావుడిగా చనిపోయిన శవము చేతిలో ఉన్న తాళము చెవిని తెలివిగా తన చేతిలోనికి తీసుకొని తనని ఎవరూ గమనించడం లేదని నిర్ధారణ చేసుకొని ఈ శవమును నాశనము చేయాలనే దురుద్ధేశ్యముతో కాగిత యంత్రమును గరుడ పక్షి యంత్రముగా తాంత్రిక మంత్రాలతో దానిని మారుస్తుండగా..ఎక్కడో శవమునకు దూరముగా ఉన్న నిర్వాణలామాకి ధ్యాన భంగమై ఎవరో ఎక్కడో తాంత్రిక కాగిత పక్షి యంత్రము ప్రయోగము చేస్తున్నారని ఙ్ఞాన స్ఫురణ రావడముతో కళ్ళు తెరచి చూడగా ఎదురుగా దూరముగా శవమునకు దగ్గరగా ఒక బౌద్ధ సన్యాసి నిలబడి ఈ తంత్ర ప్రయోగము చేస్తున్నారని తెలియగానే ఆవేశము ఆపుకోలేక అతడి వైపు శరవేగముతో పెద్ద అంగలు వేస్తూ బయలుదేరేసరికి అపుడికే తాంత్రిక మంత్రముతో కాగితమును పక్షి యంత్రముగా మార్చి శవము దగ్గర వేస్తుండగా తన వైపు వస్తున్న నిర్వాణలామాను చూసి అంగుళీమాల కంగారుపడుతూ హడావుడిగా ఈ మంత్ర కాగితమును శవము మీద వేయడానికి బదులుగా శవమునకు రెండు గజాల దూరములో వేసి అక్కడ నుండి జారుకోవడము నిర్వాణలామా శరవేగముతో ఈ మంత్ర కాగితము దగ్గరకి చేరుకోవడము ఏకకాలములో జరిగిపోయింది.

వెంటనే ఈ కాగితమును తన చేతులలో ఉంచుకొని గుప్పెట మూస్తుండేసరికి ఇది గమనించిన ఆనందభిక్షువు

స్వామి.ఏమిటి?ఎందుకు కంగారుపడుతూ ఇక్కడిదాకా వచ్చారు అనగానే



మిత్రమా.ఈ శవము మీద పక్షి యంత్రము ప్రయోగము చేయడము జరిగినది అనగానే

స్వామి. అంటే అర్ధము గాలేదు.

మిత్రమా. బౌద్ధ ధర్మంలో ఒక శాఖయైన మహాయాన అను శాఖ తాంత్రిక విధివిధానాలకు సంబంధించినది.ఇందులో అన్నిగూడ ప్రపంచానికి హాని కల్గించే విధానాలు చాలామెండుగా ఉన్నాయి.అందులో ఒక మంత్రమే ఈ కాగిత పక్షి యంత్రము అన్నమాట.అంటే ఈ మంత్రముతో కాగితమునకు ప్రాణశక్తి ఇవ్వడముతో అదికాస్త ఒక పక్షిగా మారి ఏ వ్యక్తి మీద ఈ ప్రయోగము చేసినారో ఆ వ్యక్తిని  చంపేదాకా లేదా వినాశనము చేసేదాకా అది నిద్రపోదు.దాని ప్రాణము పోదు.కేవలము ఈ మంత్ర వ్యతిరేక శక్తిని ఎవరైతే ఆపాదించగలరో వారి చేతిలో ఈ పక్షికి మరణము ఉంటుందని అంటూ

తను మూసి ఉంచిన గుప్పిట్లో కిల కిల శబ్దము చేస్తూ పక్షి గొంతు వినబడటము.. పక్షిని చూసిన ఆనందభిక్షువుకి తల తిరగడము మొదలై కాగితము కాస్త పక్షిగా ఎలా మారినదో అర్ధము కాక అయోమయములో ఉండగా

నిర్వాణలామా ఇదేమి గమనించకుండా పట్టించుకోకుండా ప్రాణము పోసుకున్న పక్షి తలను పట్టుకొని తన మంత్ర శక్తితో దానిని చంపుతుండేసరికి అది కాస్త పెద్ద పెద్ద అరుపులతో అరుస్తూ ఉండేసరికి

బయట కాపలాగా ఉన్న పోలీసులు ఈ అరుపులు విని లోపల ఏదో గడబిడ జరుగుతున్నదని అనుకొని లోపలికి రావడము ఈ లోపలే నిర్వాణలామా తన మంత్రశక్తితో ఈ పక్షిని చంపివేయడముతో అది కాస్త తిరిగి యధావిధిగా కాగితముగా మారిపోవడము ఏకకాలములో జరిగినది.శవము దగ్గర ఉన్న వీరిద్దరిని పోలీసులు అక్కడి నుండి బయటికి పంపివేసి పక్షి అరుపులు గదిలో ఏ మూల నుండి వచ్చినాయో తెలుసుకొనే ప్రయత్నములో పోలీసులు వెతకడము ప్రారంభించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి