13 భాగం

 

13

మా నవదంపతుల సుఖభోగాల కోసము మా తండ్రిగారు మూడు ఋతువులకి తగ్గట్లుగా మూడు భవనాలు కట్టించారు. మా శరీరాలు అంతఃపురాలలో ఉన్నాయి కాని మా మనస్సులు మాత్రము పేదవాడి గుడిసెలలోనే ఉన్నాయని నాకు అలాగే యశోధరకి తెలుసు. మాకు రాజభోగాల మీద మమకారాలు, రాజ పదవుల మీద మోహ,వ్యామోహాలు లేవు. ఉన్నది ఒక్కటే. మా కలలు వేరు. మా కలవరింతలు వేరు. మనిషి కన్నీరు తుడవడము ఎలా? మనిషికి కష్టనష్టాలు, ఈతి బాధలు లేకుండా చెయ్యడము ఎలా? అనేది మా ఇద్దరి మనోదృష్టి.

             యశోధర నా కళ్ళు చూచి నా మనస్సులోని  భావాలు చదివేది. నేను ఏమి మాట్లాడకుండానే చెప్పకుండానే నాకు గావలసిన ఏర్పాట్లు, పనులు స్వయంగా ఆమె చేసేది. దానితో నా మనస్సు దోచుకున్న యశోధరను నేను ప్రేమతో 'గోపా' అని ముద్దుగా మురిపెంగా పిలిచేవాడిని. ఇలా ఒక సంవత్సరము గడిచింది. ఆ తర్వాత మేమిద్దరము కలిసి నా స్నేహితుడైన చెన్ను సహాయముతో నా గుర్రమైన కంటకముతో కలిసి యశోధరను వెంట పెట్టుకొని దేశ పర్యటన చేస్తుండేవాడిని. అన్ని ఊళ్లు తిరిగేవాళ్ళము. పేదల గుడిసెలలో భోజనాలు చేసేవాళ్ళము.అక్కడే నిద్రించేవాళ్ళము. ఇది అంతా మాకు కష్టముగా ఉండేది గాదు. ఎందుకంటే ఇలా ఉండటము మాకు ఇష్టమైన పని గావడము.

*** *** *** *** *** ***

నిర్వాణలామా  బృందము కాస్త ..

తమని వెంబడించేవారందరిని కనుగప్పి ఊరికి చివర ఉన్న అంతగా పేరులేని కాకా హోటల్ కి చేరుకొని గది అద్దెకి తీసుకొని లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ..

జేసి.ఈ రోజు రాత్రికి మ్యూజియమునకు వెళ్ళి మీ నాన్నగారు చెప్పిన ఆధారాల సంగతి నిశిత దృష్టితో పరిశీలించాలని అప్పటిదాకా గాఢ నిద్ర పోదామని అందరికి చెప్పి నిర్వాణలామా నిద్రలోనికి జారుకున్నాడు.

సాయంత్రమయ్యేసరికి

అందరికి మెలుకువ వచ్చి ఆహారమును తీసుకొని తమకు గావలసిన వస్తువులు అనగా పెన్ టార్చిలైట్లు, టేపులు,ఆయుధాలు తీసుకొని ఆ రాత్రి మ్యూజియమునకు చేరుకున్నారు.మ్యూజియము ముందు ద్వారము వద్ద పోలీసులు కాపలా ఉండటము గమనించిన వీరు అంతా చాటుమాటుగా ఈ మ్యూజియము వెనుక గోడ దగ్గరికి చేరుకొని వెనుక ఉన్న ద్వారము దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ గూడ దేవదత్త అనుచరులను గమనించేసరికి వీళ్ళకి ఎక్కడలేని నిరుత్సాహము ఆవరించినది.లోపలకి ఎలా వెళ్ళాలో వీళ్ళకి ఒక పట్టాన అర్ధము అవ్వక పోయేసరికి

జేసి ఆలోచిస్తుండగా ఒక ఆలోచన వచ్చి ఆ విషయాన్ని మిగతావారికి చెప్పి వాళ్ళని చీకటి చాటున ఉండమని చెప్పి జేసి కాస్త ఈ దుండగులు ఉన్న చోటుకి వెళ్ళి వాళ్ళని తన చూపులతో కవ్విస్తూ మాటలలో శృంగార భావాలు కల్గిస్తూ..వారిలో ఒక్కొక్కరిని తన వైపుకు తిప్పుకొని శృంగార ప్రక్రియ కోసము చాటుగా ఉన్న చెట్టు దగ్గరికి తీసుకొని వచ్చేసరికి అక్కడ మార్షల్ ఆర్ట్స్ నందు అవార్డులు పొందియున్న నిర్వాణలామా అలాగే ఆనందభిక్షువు తాము నేర్చుకున్న విద్య వచ్చినవాడి మీద నిశ్శబ్దముగా ప్రయోగము చేస్తూ వాడిని శాశ్వత నిద్రకు పంపించడము చేసేసరికి అందరు గూడ చనిపోయారని జేసి చెప్పగానే వీరిద్దరు గూడ బయటికి వచ్చి అందరు కలిసి ఎవరు చూడకుండా గోడపైనుండి దూకి మ్యూజియము లోపలికి నిశ్శబ్దముగా ప్రవేశించి అతి లాఘవముగా అక్కడున్న గది తలుపు తాళము తీసి లోపలికి వెళ్ళి అంబేద్కర్ శవము దగ్గరికి వెళ్ళారు.

శవమును నిశిత దృష్టితో చూస్తున్న నిర్వాణలామాకి ఆయన ఎడమ చేతిలో ఉన్న పద్మాకార తాళం చెవి లేకపోవడము గమనించాడు.అలాగే ఈయన ఒక కన్ను మాత్రమే తెరచుకొని ఉండటములో ఏమైన అర్ధముందా అనుకుంటూ జేసికి చెప్పేసరికి ఏదో అనుమానము వచ్చిన జేసి వెంటనే ఆ గది సీలింగ్ పైన తన చేతిలో ఉన్న టార్చిలైటు వేసేసరికి సుమారుగా 36 అడుగుల ఎత్తు సీలింగ్ మీద వాళ్ళకి 

డైమండ్ గుర్తు ఉన్న తాళం చెవి కనిపించేసరికి వీళ్ళకి ఆనందాశ్చర్యములు కలిగాయి.

వెంటనే ఆనందభిక్షువు ప్రక్క గది దగ్గర ఉన్న నిచ్చెన ఒకటి తెచ్చి ఈ తాళం చెవిని తీసే పనిలో నిమగ్నమై ఉండగా ఇంకా ఆ గదిలో ఏమైన ఆధారాలు దొరుకుతాయేమోనని జేసి అలాగే నిర్వాణలామా తదేకదృష్టి నిశితముగా పరిశీలించి చూస్తుండగా వీరిద్దరి దృష్టి ఆ గదిలో ఉన్న బోధిసత్వుడు,అవలోకితేశ్వర,క్షితిగర్భా చిత్ర పటాలు క్రింద వరుసగా బో-అ-క్షి అనే అక్షరాల అచ్చులు ఉన్నట్లుగా కనిపించేసరికి..ఇది ఏమైన ఆధారమును ఇస్తుందేమోనని జేసి ఈ అచ్చులలో వ్రేలు పెట్టి తిప్పి గూడ ఎలాంటి ఫలితము ఇవ్వక పొయేసరికి నిరుత్సాహము పడినది.కాని నిర్వాణలామాకి మాత్రము ఈ మూడు చిత్రాలు ఏవో మర్మ రహస్యము మర్మముగా దాచి ఉంచినాయని గ్రహించాడు.కాని ప్రస్తుతానికి అది ఎలా సాధ్యపడుతుందో తెలుసుకోవడము బ్రహ్మతరం గాదని..వీటికి సంబంధించిన ఆధారాలు దొరికేంతవరకు వీటిని పట్టించుకోకూడదని నిర్ణయించుకొని ఆనందభిక్షువు వైపు చూడగా గోడపైన ఉన్న తాళం చెవి తీసుకొని నిచ్చెన మెట్లు దిగుతూ ఆనందముగా కనిపించడముతో వీరిద్దరి ముఖములో గూడ ఆనందమేసింది.

కాని వీరి ఆనందము ఎక్కువసేపు ఉండలేదు.ఎందుకంటే మ్యూజియము బయట కాపలా కాస్తున్న పోలీసులకి శవము ఉన్న గది నుండి ఏదో వస్తువును కదుపుతున్న శబ్దాలు అలాగే టార్చిలైట్ కాంతులు కనిపించేసరికి వారిలో ఒక పోలీసు పెద్దగా విజిల్ వేస్తూ మిగిలినవారందరికి సమాచారము ఇస్తూ ఈ గది వైపుకి శరవేగముతో బయలుదేరాడు.విజిల్ శబ్దము విన్న జేసి వెంటనే గదికి ఉన్న కిటికి అద్దము తెరిచి చూడగా దూరంగా కాపలా కాస్తున్న పోలీసుల బృందము తాము ఉన్న గది వైపుకు వస్తున్నారని తెలుసుకొని మిగిలిన వారికి ఈ విషయము చెప్పి వాళ్ళకి దొరికిన డైమండ్ కీ ని తీసుకొని ఎలా లోపలికి వచ్చారో అలా శరవేగముతో బయటికి వెళ్ళి చీకటిలో ఉంచిన కారుచీకటి నల్ల రంగుయైన తమ కారును ఎక్కి అక్కడ నుండి శరవేగముతో బయలుదేరడముతో ఇది గమనించిన కొంతమంది పోలీసులు ఈ కారును వెంబడించారు.

ఇదంతా సివిల్ డ్రస్సులలో చీకటిమాటుగా కాపల కాస్తున్న గూఢచారులు గూడ తెలుసుకొని వారి బైకుల మీద శరవేగముతో ఈ వాహనాలను వెంబడించడము మొదలుపెట్టారు.జేసి తన కారులోని శాటిలైట్ టెక్నాలజి ద్వారా తమని వెంబడిస్తూ వసున్న గూఢచారుల బైకులను అలాగే పోలీసుల జీపులకి కళ్ళుగప్పి వారికి అందకుండా దొరకకుండా కారును గజ్జెల గుర్రమైన పంచకళ్యాణి వలె శరవేగముగా పోనిచ్చాసాగింది.

కారులో కూర్చున్న ఆనందభిక్షువు ఇదంతా చూస్తుంటే ఏదో తెలియని భయము, ఆందోళన తన ముఖములో చూసిన నిర్వాణలామా వెంటనే..

మిత్రమా.కంగారు పడకు.ఇదంతా ఒక ఆట వేట అనుకో.దైవరహస్యమును చేధించేటపుడు ఇలాంటి రిస్క్ లు తప్పవు.ధైర్యముగా ఉండు.నీ ప్రాణానికి ఏమిగాదు.నా ప్రాణము అడ్డువేస్తాను అనగానే..

గురూజీ.నేను దానికి భయపడటము లేదు.ఇందాకా అంబేద్కర్ గారి చేతిలో ప్రొద్దున ఒక పద్మాకార తాళం చెవి చూసినట్లుగా బాగా గుర్తు. అది ఇపుడు లేదు.అది ఏమైంది.ఒకవేళ ఎవరి చేతికైన వెళ్ళిందా?వాడు దేశ ద్రోహి అయితే ప్రమాదము వస్తుంది గదా.ఇపుడు మనము వెతికే మణి శోధనకు ఈ రెండు తాళం చెవులుండాలా?ఇలా పలురకాల ఆలోచనలు వస్తున్నాయి అనగానే..

ఇది విన్న జేసి వెంటనే అవునా.మా నాన్నగారి చేతిలో పొద్దున మేము వచ్చి చూసినపుడు ఎలాంటి తాళం చెవి కనిపించలేదు అనగానే

ఇది విన్న నిర్వాణలామా ఆలోచనలో పడ్డాడు.ఎందుకంటే వీళ్ళు వచ్చే ముందే కొన్ని క్షణాల ముందు అక్కడికి అంగుళీమాల వచ్చి కాగిత పక్షి ప్రయోగము చేశాడు.అంటే వీడు బహుశా ఈ తాళం చెవిని ఎత్తుకొని వెళ్ళి ఉంటాడు అని నిర్ధారణకు వచ్చి..

మిత్రమా.ఆ తాళం చెవి నాకు తెలిసి అంగుళీమాల చేతికి చేరి ఉంటుంది.వాడు ఈపాటికి దేవదత్త సహాయముతో మణి శోధన చేసేసి ఉండాలి అనగానే..

జేసి వెంటనే లామాజీ.మరి ఇప్పుడు ఏమి చేద్దాము. మన దగ్గర ఒక తాళం చెవి మాత్రమే ఉన్నది.మరొక తాళం చెవి మన హంతకుడి చేతిలో ఉన్నది.మణి శోధనకి ఈ రెండు తాళం చెవులతో పని ఉందేమోనని నా అనుమానము అనగానే..

జేసి.ఉన్న లేకపోయిన మనము చేసేది ఏమిలేదు.మనకి దొరకిన ఈ తాళం చెవితో ముందుకి వెళదాము.అది ఎక్కడిదాకా తీసుకొని వెళితే అక్కడిదాకా వెళదాం.అంతవరకు మనము ఏదో ఊహించుకొని కంగారుపడటము అనవసరము.మనకి ఏది ఎంతవరకు దక్కాలో అంతవరకే అదే దక్కుతుందిఅనగానే

ఆనందభిక్షువు వెంటనే గురూజీ.పోయి పోయి దేశ ద్రోహి చేతిలో ఆ తాళం చేరినదని తెలిసిగూడ ఏమిచేయలేకపోతే ఎలా?”

మిత్రమా.తెలుసుకొని ఏమి చేయగలము?వాడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలుసు.మనము వెతకవలసినది వాడిని గాదు.మణి అనేది ఉన్నదా లేదా తెలుసుకోవాలి.ఈ మణి రహస్యము అనేది దైవ రహస్యము.అది విద్రోహుల చేతికి వెళ్ళే విధముగా యోగులు, సిద్ధులు ఏర్పాట్లు చేయరు.ఒకవేళ వెళ్ళితే అది దేశరహస్యము అవుతుంది.  దేశరహస్యము వలన దేశానికి ప్రమాదము కలుగుతుంది.అదే దేవ రహస్యానికి ప్రమాదము వాటిల్లితే అది విశ్వానికి ప్రమాదము కలుగుతుంది.అవును.ఇంతకి నీ దగ్గర ఉన్న తాళం చెవి చూపించు అనగానే..

ఆనందభిక్షువు తన సంచిలో నుంచి ఈ తాళం చెవి తీసి నిర్వాణలామాకి ఇచ్చాడు.ఈ తాళం చెవి చూసి

జేసి వెంటనే..ఇది మా నాన్న గారి హోటల్ గదిలోని లాకర్ కీ. నాకు బాగా గుర్తు. నాకు తెలిసి దీని వెనుక కంటకము-477 అనే అక్షరాలు ఉండి ఉండాలి.ఎందుకంటే ఈ లాకరును తనకి కావలసిన విధముగా మా నాన్నగారు చేయించుకొని దీని గుర్తుగా బుద్ధ భగవాను వాడిన గుర్రము పేరు అయిన కంటకము పేరును ఈ కీ కి పెట్టినట్లుగా చెప్పినట్లు గుర్తు అనగానే ఇది నిజమే అన్నట్లుగా నిర్వాణలామా వెంటనే ఈ తాళం చెవి వెనక్కి త్రిప్పి చూడగా అవే అక్షరాలు కనిపించాయి.

జేసి. అయితే మనము రేపు ఉదయము మీ నాన్నగారి లాకర్ దగ్గరికి వెళదాం అనగానే.. 

లామాజీ.రేపటి సంగతి రేపు చూసుకుందాము.ఇపుడు మనలని వెంటాడే పోలీసుల వేటను ఎలాగా తప్పించుకోవాలో ఆలోచించండి అనగానే..

నిర్వాణలామాకి మెరుపులాంటి ఆలోచన వచ్చి..జేసి.మన కారును విష్ణు గయకు వెళ్ళే రహదారి మీదకు కొంతదూరము పోనిమ్ము.వాళ్ళు గూడ మనలని అనుసరించి వస్తారు అనగానే..

గురూజీ.దీని వలన మనకు ఏమి ఉపయోగము?”

జేసి.అది ముందుగానే చెపితే ఏమి కిక్ ఉంటుంది అనగానే..

నిర్వాణలామా చెప్పినట్లుగా జేసి వెంటనే తమ కారును విష్ణుగయ వెళ్ళే హైవే మీదకి పోనిచ్చిన 15ని.లకి పోలీసులు అలాగే గూఢాచరుల వాహనాలు వెంబడించే దృశ్యము తన కారు అద్దములోంచి గమనించిన

జేసి వెంటనే..లామాజీ.మీరు చెప్పినట్లుగా వాళ్ళు గూడ మనలని ఫాలో అవుతున్నారు.ఇపుడు ఏమి చేయాలి అనగానే

జేసి.కంగారుపడకు.స్పీడు పెంచు.ఏది ఎపుడు ఎలా చేయాలో నీకు చెబుతాను అనగానే..

జేసి తమ కారు అతివేగముగా పెంచేసరికి వెంబడించే వాహనాల వేగము తగ్గాయి.

అపుడూ నిర్వాణలామా వెంటనే..జేసి.మన కారును రోడ్డుకి ప్రక్కనే పొదలలోకి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి కారు లైట్లు ఆపు అని చెప్పగానే..

జేసి వెంటనే బాగా వెలుతురు తక్కువగా ఉండి కారుచీకటిగా ఉన్న పొదలవైపుకు పెద్ద పెద్ద కాండాలు ఉన్న చెట్లు ఉన్న వెనకకి నెమ్మదిగా కారును తీసుకొని వెళ్ళి లైట్లు ఆర్పి పార్కింగ్ చేసి ఏమి జరుగుతుందో చూడాలని అందరు ఎదురు చూస్తుండగా

కొద్దిసేపటికి..

ఈ విషయము గమనించని పోలీసులు అలాగే గూఢాచారులు వాహనాలు కాస్త విష్ణుగయ వైపుకి శరవేగముతో పరిసరాలు గమనించకుండా రాకెట్ వేగముతో దూసుకొని వెళ్ళడం అదిగూడ తమని దాటి దూరముగా వెళ్ళిపోయాయని వీరు నిర్ధారణ చేసుకున్న తరవాత వీళ్ళ కారును వెనక్కికి తిప్పి బుద్ధగయ వైపుకి తాము ఉన్న కాకా హోటల్ వైపుకి జేసి కాస్త ప్రయాణము గావించడము మిగిలిన వీరిద్దరు విశ్రాంతిగా ధ్యాన నిష్ఠలోనికి వెళ్ళిపోయారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి