19 భాగం

 

19

నా జీవితములో నేను ఎన్నడు చూడని మూడు సంఘటనలను  చూడటము జరిగింది. దానితో నా ఆలోచనలు అలాగే నా జీవితమే మారిపోయింది. నేను యధావిధిగా స్నేహితుడైన చెన్నుతో కలిసి రాజ్య గ్రామాల సంచారమునకు బయలుదేరినాను. గాకపోతే ఎప్పుడు వెళ్లే  గ్రామాలకి వెళ్ళకుండా క్రొత్త గ్రామాల వైపు నేను వెళ్లుతుండేసరికి చెన్నులో తెలియని భయాందోళనలు మొదలై

"రాజకుమారా. ఎప్పుడు వెళ్లే గ్రామాలకి వెళ్లకుండా క్రొత్త గ్రామాల వైపు ఎందుకు వెళ్తున్నారు? మీ  భద్రత నాకు ముఖ్యము" అనగానే....

నేను వెంటనే "చెన్ను. క్రొత్త గ్రామాలను దర్శనం చేస్తే అక్కడున్న గ్రామ వాసుల సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలు చెప్పే వీలుంటుంది. మార్పు అనేది ఒక ప్రాంతానికి గాకుండా అన్ని ప్రాంతాలలో రావాలిగదా" అంటూ క్రొత్త గ్రామాల వైపు నా ప్రయాణము కొనసాగించాను.

                   ఇంతలో నా అశ్వానికి అడ్డంగా ముప్పెయి సంవత్సరాల  వయస్సు వ్యక్తి బాధతో మెలికలు తిరిగిపోతూ కళ్లు తేలవేస్తూ, విలవిలలాడుతూ నాకంట కనిపించేసరికి నేను వెంటనే గుఱ్ఱము దిగి  ఆ రోగి దగ్గరికి వచ్చాను. శరీరము తాకితే విపరీతమైన జ్వరముతో బాధపడుతున్నాడని నేను తెలుసుకొని ఇతనికి రాజవైద్యుని చేత వైద్యము చేయించమని చెన్నుకి ఆజ్ఞ ఇవ్వగానే.... అతను వెంటనే "రాజకుమారా. అది అంటురోగము. ఏ వైద్యుడి చేత నయంకాని రోగము అది. మీరు తాకకుండా దూరముగా వచ్ఛేయ్యండి" అంటూ ఇంకా ఏదో అంటూండగానే..... ఆ రోగి ప్రాణాలు నా చేతిలో పోయేసరికి నా ప్రాణాలు పోయినంత పని అయింది. అంటే శరీరానికి నయంకాని రోగము వచ్చి ప్రాణాలు పోతాయని మొట్టమొదటిసారిగా నేను తెలుసుకున్నాను.

               ఆ తర్వాత నా గుఱ్ఱమును మరో దారి వైపుకి పోనిస్తూండగా.... ఒక వయోవృద్ధుడు శరీరము పెట్టే ఈతిబాధలు భరించలేక అవస్థలు పడటము చూసిన నాకు ఈ శరీరానికి ముసలితనము అనే స్థితి ఒకటి ఉంటుందని..... నేను తెలుసుకున్నాను. అప్పడిదాకా ఆరోగ్యముగా, యవ్వనముగా ఉండే  యువకులను, యువతులను చూస్తూ ఉన్న నేను కాస్త ముసలి అయిన ముసలితన వ్యక్తిని చూడటము నా జీవితములో ఇదే మొదటిసారి గావడము నేను కాస్త ఈ ముసలి శరీరమును చూసి వణికిపోయాను.

*** *** *** *** *** ***

త్రివేది అలాగే కులకర్ణి ఇలా వీరిద్దరు కలిసి ఇన్నాళ్ళు తమకి కనిపించకుండా దాకున్న నిర్వాణలామా బృందము ఉన్న కాకా హోటల్ గదికి చేరుకున్నారు.గదిలోపుల వీరిద్దరు ఏమైన ఆధారాలు దొరుకుతాయేమోనని నిశిత దృష్టితో అనుమాన దృష్టితో  ప్రతి వస్తువు చాలా జాగ్రత్తగా గమనించిన గూడ వీరికి ఎలాంటి ఆధారాలు కనిపించలేదు.దానితో కులకర్ణి సహనము కోల్పోయి తన చేతిలో ఉన్న సిగార్ ను వెలిగించుకొని ఒక దబ్బున బలంగా పీల్చుకొని

త్రివేది.వీళ్ళు ఎందుకు చనిపోయిన అంబేద్కర్ శవము దగ్గరికి వచ్చి ఉంటారు అనగానే

సార్.నాకు తెలిసి ఆయన గుండెల మీద ఉన్న డైమండ్ గుర్తు మరియు త్రికోణ గుర్తు కోసము వచ్చి ఉంటారు.

త్రివేది.ఆ గుర్తులు వలన వీళ్ళకి ఏమి ఉపయోగము?అసలు అంబేద్కర్ ఏమి పరిశోధన చేశాడు?”

సార్. బుద్ధుడు తన దేశ పర్యటనలో హిమాలయాలలో రహస్య గ్రామములో ఉన్న ఏదో మణిని దర్శనము చేసుకొని వచ్చారని ఈయన పరిశోధనలో తెలుసుకొని ఆ మణి ఉండే రహస్య గ్రామమును ఈయన   గూడ దర్శించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైనాడని దానితో దీనికి సంబంధించిన అన్ని వివరాలను ది బుద్ధ కోడ్ అనే పేరుతో కోడ్ భాషలో దాచి ఉంచారని బహుశా ఈయన గుండెల మీద ఉన్న గుర్తులు వాటికి ఆధారాలు అయ్యి ఉండవచ్చని ఈయనతో ఉన్న బౌద్ధ భిక్షువుల దగ్గర నేను ఈ సమాచారమును సేకరించాను.

ఇంతలో

కులకర్ణికి ఫోన్ రావడముతో అవతలి వాళ్ళు చెప్పిన విషయాలు తన బుర్రలో ఎక్కించుకుంటూ మనస్సులో కలిగే ఆందోళనను కళ్ళల్లో కనబడనీయకుండా అవస్థలు పడుతూ జాగ్రత్తగా ఆ సమాచారము వినసాగాడు.ఫోన్ కట్ అయిన తరవాత

త్రివేది.మనము అనుకున్నదంతా అయినది.ఈ అంబేద్కర్ మణి పరిశోధన వివరాలు దేవదత్తకి చేరాయి.వాడు ఇండియాకి వచ్చాడుట.నిర్వాణలామాని కలవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.వాడికి కావలసిన వివరాలు వీళ్ళు చెప్పకపోతే ప్రాణాలు తీయడానికి వెనకాడని నరరూప హంతకుడు వాడు.ఏమి జరుగుతుందో చూడాలి.అసలు ఇంతకి వీడికి ఈ మణితో ఏమి అవసరము?అది అంత విలువైన మణియేనా?ఇంతకి బుద్ధుడు దర్శించుకున్న మణి పేరు ఏమిటి?”అనగానే

సార్.ఆ విషయాలు ఎవరికి తెలియవు.14 వ శతాబ్దపు నాటి బుద్ధుడి చిత్రాలలో మణి పట్టుకున్న చిత్రాలు బాగా ప్రాచుర్యము పొందాయి.కొంతమంది ఆ మణిని చింతామణి అని, మరికొందరు స్ఫటిక మణి అని, ఇంకొందరు సహస్ర కమలములోని మణి యని, మరికొందరు అయితే మన మెదడులోని పిట్యుటరి గ్రంధియే మణి పద్మముగా చెప్పారని చెబుతున్నారు.ఇపుడూ దేవదత్త లాంటి దేశ ద్రోహి ఈ మణి గూర్చి ప్రయత్నాలు చేస్తున్నాడంటే బహుశా నా లెక్క ప్రకారము ఆ మణి అనేది శ్రీ కృష్ణుడు దగ్గర ఉన్న శమంతకమణి అని అనుకుంటున్నాను.ఇదియే ప్రతిరోజు 72 కేజిలు బంగారము ఇస్తుంది.పైగా శ్రీ కృష్ణుడి అవతారము తరవాత బుద్ధుడి అవతారము వచ్చినది.వీటి లెక్కన చూస్తే ఖచ్చితముగా అది శమంతకమణి అయి ఉంటుంది.

త్రివేది.అదే నిజమైతే ఈ పాటికి హిమాలయాలు అంతా గూడ బంగారుమయం అయి ఉండేది గదా అనగానే..

 సార్.ఎవరికి తెలుసు.ఆ మణి ఉండే రహస్య గ్రామము ఏకముగా బంగారుమయము అయి ఉండవచ్చు గదా.ఇంతవరకు ఏ నర మానవుడు దానిని చూసిన దాఖలాలు లేవు.

త్రివేది.సరే.ఈ మణి విషయము ప్రక్కన పెడదాము.మనము ఏదో విషయములో తప్పు చేశామని నాకు అనిపిస్తోంది.ఎక్కడో ఏదో పొరబాటు చేశామని నా మనస్సు గోల చేస్తోంది.సరే ఆ చచ్చిన అంబేద్కర్ సన్యాసి ఫోటోలు నాకు చూపించు అనగానే

త్రివేది.తనసెల్ ఫోన్ లో ఉన్న ఫోటోలు చూపిస్తుండగా..

వాటిని తదేక దృష్టితో చూస్తున్న కులకర్ణికి ఏదో అనుమానము వచ్చి రెండు ఫోటోలు దగ్గర ఆగిపోయాడు.

త్రివేది.జాగ్రత్తగా ఈ రెండు ఫోటోలు గమనించుమనగానే

త్రివేది జాగ్రత్తగా చూశాడు.

తేడా ఏమి కనిపించలేదు అనగానే

త్రివేది.మొదటి ఫోటోలో అంబేద్కర్ శవము చేతిలో పద్మాకార తాళము చెవి ఉన్నట్లుగా రెండవ ఫోటోలో అది లేనట్లుగా కనబడుతోంది.జాగ్రత్తగా చూడు అనగానే

సార్.మీరు చెప్పినది నిజమే.అంటే నిర్వాణలామా బృందము వాళ్ళు ఈ   తాళము చెవి కోసము వచ్చి ఉంటారు అనగానే

కులకర్ణి సాలోచనగా త్రివేది.అది నిజము గావచ్చును.గాకపోవచ్చును.గాకపోతే తాళము చెవి మిస్ అయినది.అది ఎవరి చేతికి వెళ్లిందో..అది ఏ ఆధారాలు ఇచ్చినదో మనము తెలుసుకోవాలి అంటూ

తన ఆఫీసుకి కులకర్ణి ఫోన్ చేసి జేసి కారు ప్రస్తుతము ఎక్కడ ఉన్నదని అడుగగా

సార్.అది జేసి ఉండే ఇంటివైపుకి వస్తోంది అనగానే

అదేమిటి?మనవాళ్ళు అక్కడ ఉంటారని తెలిసిగూడ జేసి అక్కడికి వస్తున్నది అంటే ఆ అమ్మాయి ఏదో ప్లాన్ చేసి ఉంటుంది.జాగ్రత్తగా కారును మన వాళ్ళు అనుసరించమని చెప్పు అని చెప్పి ఫోన్ కట్ చేసి

త్రివేది.జేసి వాళ్ల ఇంటికి వెళ్లుతున్నదని సమాచారము వచ్చినది.మనము గూడ అక్కడికి చేరుకోవాలి అనగానే

హోటల్ బయట ఉన్న తమ కారులోనికి వీరిద్దరు శరవేగముతో ఎక్కి అంతే వేగముగా జేసి ఇంటివైపుకు పోనిచ్చారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి