54 భాగం

 54


 

నేను కాస్త వెల్లకిలా పడుకొని ఆకాశము కేసి దృష్టి సారించాను. ఇంతలో ఆనందభిక్షువు  నా దగ్గరికి వచ్చి "భగవాన్ ఇది కూసినార కుగ్రామం. ఇక్కడ మీరు మహానిర్యాణం చెందితే ఎవరికీ తెలియదు అదే శ్రావస్త్రి, వారణాసి, కోశంభి, చంప,రాజగృహ ప్రాంతాలలో ఎక్కడైనా మీరు నిర్యాణము చెందితే అందరికి తెలుస్తుంది. అందరు రావటానికి వీలు అవుతుంది.అనగానే...

నేను వైరాగ్యముగా నవ్వి... వాడితో

          జనం కోసం- కీర్తికోసం, ప్రచారం కోసం ఈ తథాగతుడు నిర్యాణం చెందవలసిన అవసరమే లేదు. నాకు ఇష్టమైన ప్రాంతము ఈ కూసినార. ఇందులోని సాల్వవనం అని తెలుసుకో. ఈ రాత్రి నాలుగవ జామున ఈ బుద్ద తథాగతుడు నిర్యాణం చెందుతున్నాడని.ఇక్కడున్న అందరికి తెలియచెప్పు అని నేను విశ్రాంతిగా కళ్లు మూసుకున్నాను.

4 వ జాము రాగానే అనుకోకుండా ఒకసారి భూమి కంపించింది. అక్కడే ఉన్న సాల్వ పుష్పాలు నా మీద పడ్డాయి. నా కళ్లు శాశ్వతముగా మూత పడ్డాయి. దానితో నా చుట్టు ఉన్న ప్రతి భిక్షువు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. నేను కాస్త మహా నిర్యాణం చెందినానని తెలుసుకొని రోధించడము మొదలు పెట్టారు. దుఃఖించసాగారు.

            ఇంతలో నా శిష్యభక్తుడైన అనిరుద్ర పైకి  ఏడ్చే వారితో  "ఇక్కడ ఎవరు గూడ తథాగతుడి కోసము ఏడ్వవద్దని,దుఃఖించవద్దని, కన్నీరు కార్చ వద్దని, దుఃఖ నివారణకోసము నేను ఇన్నాళ్లు జీవించినానని వారందరికి గుర్తు చేశాడు.

                 బుద్ధుడి శరీరమును ఆరు రోజుల పాటు ఈ వనము నందు అందరు వచ్చి దర్శనార్ధము కోసము ఉంచినారు. ఆ తర్వాత ఏడవరోజున 'మల్ల' పెద్దలు ఈ బుద్ధుడి శవమునకు స్నానము చేయించి క్రొత్త కాషాయ బట్టలు ధరింపచేసి ఊరేగింపుగా తూర్పు ద్వారం గుండా ముక్కుట బంధనాలయానికి తీసుకొని వెళ్లి మంచి గంధం చెక్కలపైన ఈ మృత దేహమును ఉంచి అగ్నిసంస్కారమును చేశారు. చితిమంటలు ఆకాశాన్నంటాయి.చితా భస్మం, అస్థికలు, అవశేషాలను సేకరించి బంగారు కలశాలలో భద్రపర్చారు.అలాగే బుద్ధుడు బ్రతికి ఉన్నపుడు సేకరించిన దంతాలు, వెంట్రుకలు, గోర్లు గూడ అతి భద్రముగా భద్రపరిచారు. ఆ తర్వాత బుద్ధుడి చితా అస్థికలను ఏనిమిది భాగాలుగా చేసి మగధ, వైశాలి, శాక్క, కాలీయ, బులాయా, పాప, యేత రాజ్యాలలో బౌద్ధ స్థూప నిర్మాణాలు చెయ్యడానికి వీటిని ఉపయోగించారు. అలాగే బుద్ధుడు ఉపయోగించిన భిక్షా పాత్ర అలాగే ఈయన వాడిన ఆఖరి వస్త్రము, జపమాలలు, వేసుకున్న పాదుకలు, అన్ని గూడ వేణువనానికి చేర్చారు.

           బుద్ధుడి మహా నిర్యాణానంతరం ఎక్కడి వారక్కడకి వెళ్లిపోయారు.... బుద్ధ భగవాన్ స్మృతులతో....

*** *** *** *** *** ***

నిర్వాణలామా మాత్రము శంభల గ్రామములో ఉన్న బ్రహ్మ చింతామణి దర్శనార్ధము శ్రీ చక్ర సోపానాలు ఎక్కడము ప్రారంభించాడు.

ఇలా అన్ని త్రిభుజాలు కోణాలు కలిసే ఏకైక మార్గం మోక్ష ద్వారమునకు ఎపుడైతే చేరుకున్నాడో  దీనితో  ఈ శ్రీ చక్ర కోట లోనికి ప్రవేశించాడని నిర్వాణలామాకి  అర్థం అయింది.

ఈ కోట లోపల పశ్చిమానికి తిరుగుతూ ఉత్తరానికి వెళ్లి అక్కడ నుండి పశ్చిమానికి వస్తే ఒక చిన్న త్రోవ కనిపించింది. ఈ త్రోవలో గుండా వెళితే అది కాస్త ఉత్తరం వైపుకి తిరగటం ఆరంభించింది. అక్కడ నుండి మళ్ళీ పశ్చిమానికి తిరిగితే అక్కడ రెండు చిన్న దారులు కనిపించాయి. ఇందులో ఒక దారి పూర్వ దిక్కుకి చూపిస్తుంటే మరోదారి పశ్చిమదిక్కుకు చూపిస్తుందని నిర్వాణలామాకి అర్థమైంది. ఇక్కడ ఏ వైపుకి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. ఇందులో ఒక మార్గము లోపలికి తీసుకొని వెళితే మరో మార్గం మాయ లోనికి దింపి అక్కడే ఉంచేస్తుందని నిర్వాణలామాకి అనుభూతి కలగ సాగింది. అక్కడ ఉన్న అష్టవసువులని అడిగినా ప్రయోజనం ఉండదు. వాళ్లు ఉలకరు.పలకరు.మౌనముగా ఉంటారు. స్థిర మనస్సులకు మాత్రమే ఇందులో ని నిజ త్రోవ తెలుస్తోంది. అస్థిర మనస్సులకి అయితే ఖచ్చితంగా మాయ త్రోవలోకి వెళ్ళటం జరుగుతుంది.  అప్పుడు నిర్వాణలామాకి తన ఏకాగ్రత మనస్సుతో పూర్వ దిక్కున త్రోవ లోనికి ప్రవేశించడం  జరిగింది. అప్పుడు అక్కడ ఒక మహా ద్వారము కనబడింది. ఈ ద్వారం లోపల గోముఖ తీర్థం అనే పుష్కరిణి కనబడింది. ఈ పుష్కరిణిలో స్నానం చేయటానికి నిర్వాణలామా ఇందులోనికి దిగడం జరిగింది..ఇలా స్నానము చేసి వచ్చిన నిర్వాణలామాకి స్థిరబుద్ధి నిజ జ్ఞాన బుద్ధి కలిగి ఉన్న వివేక బుద్ధి ఏర్పడినట్లు గా అనుభూతి పొంద సాగింది. దానితో ఇతను కాస్త ఉత్తర దిశకి వెళ్ళటం ప్రారంభించాడు.. అప్పుడు మరల పూర్వ దిక్కుకి వెళితే అక్కడ మరల రెండు త్రోవలు కనబడింది. ఇక్కడ ఏ దారిలో వెళితే ఏమి వస్తుందో అర్థంకాక సతమతమవుతుంటే అక్కడ ఉన్న ఏకాదశ రుద్రులు ఉలకరు.పలకరు. దానితో స్థిరబుద్ధితో దక్షిణ దిక్కు ఉన్న ద్వారం దారి వైపు కి వెళ్ళటం జరిగింది.  ఎందుకంటే వివేక బుద్ధి వలన ఉత్తర దిక్కుకి వెళ్లితే నక్షత్ర మండలాలు నక్షత్రాలు కనబడతాయని ఇది ఒక మాయా ప్రపంచం అని అనుభూతి కలిగేసరికి ఆ దిశ వైపు వెళ్ళకుండా దక్షిణ దిశకి వెళ్లడం జరిగింది. అప్పుడు ఒక చిన్న సోపానము కనిపించింది. ఇందులో 16 మెట్లు కనపడ్డాయి. ఈ చిన్నగా ఉన్న మెట్లు ఎక్కుతూ ఉండగా అక్కడ ఒక వృత్తాకార మైన త్రోవ కనబడసాగింది. అంటే శ్రీమేరు చక్రములో ఈ 16 మెట్లు కాస్త 16 రేకుల పద్మం అని నిర్వాణలామాకి  అర్థం అయింది. ఈ వృత్తాకార మార్గము గుండా వెళుతూ ఉంటే అక్కడ ఒక మహాద్వారం కనిపించింది. మళ్లీ ఈ ద్వారము వద్ద రెండు చిన్న దారులు కనిపించాయి. అందులో ఒకటి పశ్చిమ దిక్కుకి వెళితే మరొకటి పూర్వ దిక్కుకి వెళుతుంది.  ఇక్కడ అష్టభైరవులు కనపడ్డారు. కానీ వాళ్లు ఉలకరు. పలకరు. వివేక బుద్ధి వలన ఆలోచన చేస్తే పూర్వ దిక్కుకి వెళ్ళితే ఈసారి స్వర్గ  భవనము కనబడుతుందని ఇందులో అతి గుప్తమైన శమంతకమణి, కౌస్తుభమణి, రుద్ర మణి ఇలాంటి నవ మణులు,నవ రత్నాలు సుందరమైన విగ్రహలు ఉంటాయి. వీటిలో అష్ట సిద్ధులను ఇచ్చే మాయా దేవతలు ఆవాసము చేస్తూ ఉంటారని చచ్చినా కూడా ఈ సుందర భవనం లోనికి వెళ్లకూడదని నిర్వాణలామా  నిశ్చయించుకొని పశ్చిమ మార్గం వైపు ప్రయాణించడం  నూటికి 80% మంది యోగసాధకులు ఇక్కడ అష్టసిద్ధులు మాయలో పడి తమ సాధనను పరిసమాప్తి చేసుకుని అక్కడే నిలబడి పోతారని అనుకుంటూ  ఇలా వెళ్ళుతుండగా ఇక్కడ చిన్న సోపానము కనిపించింది. అందులో 8 మెట్లు కనిపించాయి. ఈ మెట్లు చూస్తుంటే  శ్రీమేరు శ్రీ చక్రములోని 8 రేకులు ఉన్న పద్మము లాగా కనపడింది. ఈ త్రోవ గుండా వెళితే అక్కడ మనకి ద్వాదశాధిత్యులు కనపడ్డారు..వీళ్లు కూడా ఉలకరు. పలకరు అనుకుంటూ  అక్కడ ముందుకి కనిపించే త్రోవ లోనికి వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద సోపానం కనిపించింది. అందులో 14 మెట్లు కనిపించాయి. వీటిని చూస్తుంటే శ్రీ మేరు శ్రీచక్రము లో నాలుగవ ఆవరణలో ఉన్న 14 త్రిభుజ కోణాలకి సంకేతం అని నిర్వాణలామాకి అర్థం అయింది. వీటిని ఎక్కడము చాలా కష్టమని శ్రమపడి ఎక్కవలసి ఉంటుంది అని  ఎక్కి చూస్తే నీలాకాశం చాలా విశాలమైన ఒక చక్ర ద్వారమైన వస్తువు ఉన్నట్లుగా కనబడుతుంది. ఇందులో జలదేవత ఆవాసము చేస్తుంది. దీనిని నీలకోట గా పిలవడం జరుగుతుంది.ఈ దేవత అనుగ్రహము వల్లనే మనకి జలాలు వర్షాలు కలుగుతున్నాయని నిర్వాణలామాకి అర్ధమైంది. అప్పుడు దీనిని దాటుకుంటూ వెళ్ళితే మనకి ఒక చిన్న సోపానం కనబడుతుంది. ఈ సోపానము లోపల 10 చిన్న మెట్లు కనిపించాయి. వీటిని ఎక్కితే ఒక వృత్తాకార మైన రెండు దారులు కనబడతాయి ఇక్కడ అగ్ని దేవత ఆవాసము చేసే ముత్యపు కోట కనబడుతుంది. ఈయన వద్ద దగ్ధశక్తి, నిగ్రహశక్తి, అగ్నిస్తంభన శక్తి సాధకునికి ఇవ్వటం జరుగుతుంది. ఈ పది మెట్లు చూస్తుంటే శ్రీ మేరు శ్రీచక్రములో పంచమ ఆవరణలో ఉన్నట్లుగా నిర్వాణలామాకి అనిపించసాగింది.ఇక్కడ ఉన్న పన్నెండు దేవతలు మనకి దర్శనము ఇస్తారు. వీళ్లు ఉలకరు. పలకరు.కాబట్టి మన వివేక బుద్ధిని ఉపయోగించుకుని నైఋతి దిక్కున ఉన్న మార్గం వైపుకి వెళ్లాలి. అక్కడ మళ్ళీ చిన్న సోపానము కనబడుతుంది. ఈ సోపానంలో మనకి తిరిగి పది మెట్లు కనబడతాయి. ఈ మెట్లు చూస్తుంటే మనం శ్రీమేరు శ్రీ చక్రములోని ఆరవ ఆవరణము లోనికి ప్రవేశించినట్లుగా నిర్వాణలామాకి అర్ధమైంది. మళ్ళీ ఇక్కడ రెండు దారులు కనబడతాయి. ఇది మరకత కోట అని నాకు అవగతమైనది. ఇందులో మాయ దేవత ఆవాసము చేస్తోంది. ఇక్కడ మనకి 12 మంది దేవతలు కనబడతారు కానీ వీళ్లు కూడా ఉలకరు. పలకరు అన్నట్లుగా ఉంటారు. మన చావు మనమే చావాలి. ఇక్కడ కనిపించే దారులలో ఒక దారి ఉత్తరానికి వెళితే మరొక దారి దక్షిణానికి వెళ్ళుతుంది. ఇది దక్షిణ మార్గంలోనే మాయ సుందరి ఆవాసమైన మరకత కోట ఉంటుంది. ఇక్కడ అమ్మ వారు కాస్త సుందరి రూపములో అతి సుందరమైన స్త్రీ మూర్తిగా దర్శనం ఇస్తుంది.ఈమెకి భువన సుందరి అని పేరు ఉంది. ఈమె మోహమాయకి చిక్కిన వారు ఇక్కడ ఈ కోటను దాటి ముందుకు వెళ్ళలేరు. అక్కడితో ఆగిపోవాల్సి ఉంటుంది. ఈమె  దగ్గర ప్రపంచ గమన మాయ శక్తి ఉంటుంది.ఈమె  చెప్పినట్లుగానే అసత్యముగా ఉండే ప్రపంచము కాస్త మాయ వలన మనకి సత్య ప్రపంచంగా కనబడుతుందని నిర్వాణలామాకి అర్థమైంది. ఈమెను దాటుకుని వేళ్తే ఉత్తర మార్గంవైపుకి వెళ్లే మార్గము కనబడుతుంది. అక్కడ మౌనముగా ఉండే చతుర్ముఖ బ్రహ్మ లు కనబడతారు. వీరి అనుగ్రహమును పొంది ముందుకు వెళితే మనకు చిన్న సోపానము కనబడుతుంది. అందులో 8 మెట్లు కనబడతాయి. వీటిని చూస్తుంటే శ్రీ మేరు శ్రీ చక్రములోని ఏడో ఆవరణలో ఉన్న ఎనిమిది త్రిభుజ కోణాలు అని నిర్వాణలామాకి అర్ధం అవసాగింది. ఇక్కడ మనకి 14 మంది దేవతలు అగుపడతారు. ఇక ఇక్కడ నుండి మనము మెట్లు ఎక్కవలసిన పనిలేదు. అవి పైకి తీసుకుని పోతాయి. ఎందుకంటే ఈ విశ్వ ప్రపంచములో ఉన్న నానావిధ రకాల మహామాయలను మనము దాటటం జరిగింది. ఎలా అంటే ఇక్కడ మనకి మాణిక్య కోట ఉంటుంది. ఇందులో శక్తి దేవత ఉంటుంది. ఈమె అనుగ్రహము మనము పొందినట్లయితే అపారమైన ప్రపంచ శక్తి మన స్వాధీనంలోకి వస్తుందని నిర్వాణలామాకి అర్థం అయింది  ఈమె అనుగ్రహము వలన నిర్వాణలామా ముందుకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాడికి కెంపు కోట కనబడింది. ఈ కోట లోపల సర్వశక్తి దేవత ఉన్నట్లుగా ఈమె అనుగ్రహము పొందితే మనకి ఈ లోకంలో భావాతీత స్థితి పొంది విభిన్న భావాలను ఏక భావ స్థితికి చేరుకోవడం జరుగుతుందని ఇది శ్రీమేరు శ్రీచక్రము లోని అష్టమ ఆవరణము క్రిందకి వస్తుందని నిర్వాణలామాకి అర్ధమైంది. ఈ ఆవరణలో మనకి పంచ దేవతలు కనబడతారు. వీరు కూడా ఉలకరు.పలకరు. వీరి అనుమతి తీసుకుని నా సూక్ష్మధారిముందుకి వెళ్ళడం జరుగుతుంది అని నిర్వాణలామాకి అర్ధమైంది. అప్పుడు వాడికి ఒక చోట అది కాస్త త్రికోణాకారంలో ఉంది. ఇందులో అమృత సముద్రము ఉన్నట్లుగా నిర్వాణలామా అనుభూతి పొందుతూ ఉండగా ఈ అమృత సముద్రము మధ్యలో ఒక బిందువు ప్రాంతము ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. ఇది శ్రీమేరు శ్రీచక్రంలో అష్టమ ఆవరణలో ఉన్న త్రికోణము అని నిర్వాణలామాకి అర్ధమైంది. ఆ కనిపించే బిందువు కాస్త నవమ ఆవరణలో మేరు శ్రీ చక్ర బిందువు అని అర్ధమయ్యేసరికి నిర్వాణలామా ఈ అమృత సముద్రములో కనిపించే బిందువు వైపుకి ఈదుకుంటూ వెళుతున్నాడు. అంటే శ్రీ చక్ర పరిక్రమణ చిట్ట చివరి అంకానికి చేరుకుందని నిర్వాణలామాకి అర్థం అవుతుండ గా మనవాడు కాస్త ఈ బిందువు దగ్గరికి చేరుకోవడం జరిగింది. అక్కడ కోటి పరమాత్మలును 36 కోట్ల మంది దైవ స్వరూపాలు  84 లక్షల జీవజాతులు ప్రతినిధులు కనిపించి వరుసగా కారణ లోకము, సూక్ష్మ లోకాలు, సహస్ర లోకాలు, గ్రహలోకాలు గురించి అందులో ఉండే సుఖభోగాలు గూర్చి లోక పాలకులు  నిర్వాణలామాకి వివరించడం జరిగింది. ఒకవేళ మనము ఇక్కడ ఏమైనా ఆశిస్తే మనకి కూడా ఒక బ్రహ్మ పదవిని ఇచ్చి మన కోసం ఒక లోకమును సృష్టించి ఇవ్వడం జరుగుతుంది అని పతంజలి మహర్షి అలాగే శ్రీ లాహిరీ మహాశయుడు చెప్పిన విషయాలు నిర్వాణలామాకి లీలగా గుర్తుకు రావడం జరిగింది. నిర్వాణలామా వీరు చూపించే ప్రలోభాలకి ఆశలకి అలాగే నన్నే గదా స్వయంగా సిద్ధగణాలు ఆహ్వానించారని ఇసుమంత గర్వం లేకుండా మౌనముగా భావ రహితముగా స్పందన రహితముగా ఉండేసరికి అమృత బిందువు లోపలకి అనుమతి నిర్వాణలామాకి కలిగింది. ఈ బిందువు లోపల ఒక మణిద్వీపము ఉన్నట్లుగా అందులో ఒక మనోహరమైన ఉద్యానవనము ఒకటి ఉన్నట్లుగా దీని లోపల ఒక ముగ్ధ మనోహరమైన సుగంధపరిమళాలు విరజల్లే ఒక వనము ఉన్నట్లుగా దీని లోపల ఒక గృహము ఉన్నట్లుగా ఈ గృహం లోపల నాలుగు కోడులు ఉండి త్రిభుజాకారముగా ఉన్న ఒక మంచము ఉన్నట్లుగా ఈ మంచము మీద బ్రహ్మ తదాకార స్థితిలో అవలోకితేశ్వరుడు యోగ నిద్రలో ఉండగా అవలోకితేశ్వరి మాత ఈయన మీద కూర్చుని ఉన్న ముగ్ధ మనోహర దృశ్యం కనిపించి   శ్రీ మేరు శ్రీ చక్ర కోట పరిక్రమణ దృశ్యము అంతర్ధానమైంది.

అపుడు ఈ విశ్వానికి ఆకార భూతమైన ఆధారబిందువైన విభూతిరేణువుకి ప్రతీక అయిన షట్కోణములోని బిందువు స్ధానములో స్వచ్ఛమైన నిజమైనా విష్ణుశాలిగ్రామము అనగా తాబేలు ఆకార పరిమాణము అంతా ఉండి పైగా వంపు లాగా గీతలాగా నోరు వంటి నిర్మాణము ఆపై స్వస్తిక్ గుర్తు ఉన్న బ్రహ్మచింతామణి సప్త కాంతులతో విరజిమ్ముతూ నిర్వాణలామాకి కనిపించింది.

దీనిని దర్శించుకొని అక్కడే ఉన్న తులసి జలముతో దీనికి అభిషేకము చేసి ఆ తీర్ధమును తీసుకొని ఈ మణి కేసి చూస్తూ

"ఓ మణి పద్మమా..నేను ఎంతో కష్టపడి ఇంత దూరము ఎందుకు వచ్చినానో..నా మనస్సులోని చింత ఏమిటో నీకు తెలుసు.అదే ఈ విశ్వానికి శాశ్వత విశ్రాంతి ఇవ్వాలని అనగా మృత్యువుకే మహామృత్యువు ఇవ్వాలని శూన్యము నందు విశ్వము శూన్యమవ్వాలని చింతతో అలాగే అయ్యేవిధంగా నీ దరికి వచ్చాను.ఇన్నాళ్లుగా చిట్టచివరిగా మిగిలేపోయే విభూదిరేణువు యొక్క రూపమైన నాగమణిలోని పాముచారిక యొక్క భావసంకల్పము వల్లన ఈ విశ్వమును అలాగే విశ్వనాటకమును స్వప్నశరీరాలతో స్వప్ననాటకమును నడిపించి అసత్యమైన అరిషడ్వర్గాల మాయలలో,సప్తవ్యసనాలతో,అష్టమాయలతో విశ్వబ్రహ్మ నాటకము ఆడుతున్నాడని..దీనికి తోడు నువ్వు గూడ అష్టకోరికమాయతో ఈ స్వప్న ప్రపంచమును నడిపిస్తున్నావని నేను తెలుసుకున్నాను. మేము ఉంటున్న 1800 భూలోకాలను మిగిలిన 13 లోకాలవాసులు తమ భావసంకల్ప ఆలోచనల ప్రయోగాలకి మా లోకాలు వాడుతున్నారని నీకు తెలుసు.అక్కడ మేము కష్టాలు పడే విధముగా వీళ్ళు చేస్తూ ఆనందపడుతున్నారని నీకు తెలుసు.అందుకే మా లోకవాసులు పడే కష్టనష్టాలకి అంతము పలకాలని ఈ విశ్వమే శూన్యము అయ్యేవిధముగా నేను ఇక్కడకి రావడము జరిగింది.ఆ విషయము నీకు తెలుసు అని నాకు తెలుసు.అంటే ఈ విశ్వానికి విశ్వమాయ అయిన మనస్సుకి తన యదార్ధ జ్ఞానస్ధితి అనగా రూపము లేని తను తన మాయవలన రూపమున్నదని అనుకుంటోంది.తద్వారా రూపము లేని మనస్సు కాస్త రూపాంతరము చెంది రూపమున్న వస్తువుల మీద ప్రేమ,మోహ,వ్యామోహ,ఆశ,భయం,ఆనందం,ఆలోచన,సంకల్పం,స్పందన చేస్తూ విశ్వనాటకమును ఒక మనస్సు అదిగూడ నాగమణిలోని పాము చారిక చేస్తోంది.

ఇన్నాళ్ళుగా ఇలా ఏర్పడిన మీరంతాగూడ మనస్సుమాయలో పడి మనస్సు అనే నాగపాము ఉన్న నాగమణిలో పాముచారికగా మార్చి దానిని ఈ మణి యందు అష్టదిగ్బంధన చేశారు.అది భావించినట్లుగా ఆడుతున్నారు. మమల్ని ఆడుకుంటున్నారు.గాకపోతే ఇదింతా మీలో ఒక్కడికి తెలుసు.కాని ఇది లోకానికి తెలియనీయ్యకుండా జాగ్రత్తపడుతూ శూన్యబ్రహ్మగా ఉంటూ నాగమణిలోని నాగపామును శాశ్వత కోమా స్ధితిలోనే దానిని ఉంచి దానిని ఆధీనము చేసుకొని ఆ తర్వాత నుండి ఈ శూన్యబ్రహ్మ తన స్వార్ధముతో తనకి ఇష్టము వచ్చినట్లుగా ఈ విశ్వజగన్నాటకము ఆడటం ప్రారంభించాడు. మొదట నాగపాము భావాలు చేస్తే..ఆ తర్వాత వచ్చిన శూన్యబ్రహ్మ ఏకముగా స్వప్నశరీరాలలో స్వప్ననాటకమును ఈ పాము యొక్క భావసంకల్పముతో నడిపించాడని నాకు తెలియటానికి 48 కోట్ల జన్మలు పట్టింది.అందుకే నేను తిరిగి ఈ పాము చారికకి  ప్రాణశక్తి ఇచ్చి నా సంకల్పబలముతో అష్టదిగ్బంధనలో ఉంచిన నాగమణిని ఈ పాము చేధించుకొని బయటికి రావడము అంటే మనస్సుకి తన యదార్ధ స్ధితి అనగా రూపము లేని మనస్సు కాస్త ఇక రూపాలు రూపాంతరము చెందకుండా రూపము లేని తన యదార్ధ జ్ఞానస్ధితికి చేరితే ఈ విశ్వము శూన్యమవుతుంది.అంటే ఇన్నాళ్లుగా ఈ విశ్వములో అసత్యాలై కాని సత్యాలుగా ఉన్న  విశ్వములోని సకల జీవ,దైవ,ఆత్మ జీవులు మరియు వీటి రూపాంతర భావ శరీరాలు అన్నిగూడ రూపము లేని యదార్ధ స్ధితికి చేరుకొని శూన్యము అవుతాయి గదా.ఈ నా సంకల్పము నెరవేర్చు.నా ఈ చింతను తొలగించు.ఎందుకంటే ఈ విశ్వములో సకల చింతలను తీర్చే అలాగే తొలగించే బ్రహ్మచింతామణివి. ఆ విషయము జ్ఞానము పొందిన బుద్ధజీవులకి తెలిసి నీ దగ్గరికి అందరు అనగా మహా శివుడు,ఏసుప్రభువు, ప్రవక్త, బుద్ధుడు,శంకరతీర్ధుడు వచ్చారు కదా.

మా బుద్ధభగవానుడు నీ దర్శనానికివస్తే నీకున్న అష్టకోరికమాయకి గురిచేసి కోరిక లేని సమాజము చూడాలనే ఇష్టకోరిక కలిగేటట్లుగా చేసి పున:జన్మ కల్కి అవతారముగాను..పున:సృష్టిగా ధార్మిక జీవిత ప్రపంచము ఉండే విధంగా ఏర్పాటు చేశావు.ఆయన కూడ నాకు లాగానే ప్రజలు కష్టాలు పడకూడదని తపన పడ్డారు.వీటికి మూలము కోరిక యని తెలుసుకున్నాడు.కాని ఏమి లాభము.కోరిక లేని సమాజము కోసము కోరికతో మళ్ళీ సాధన చేసేటట్లుగా నీవు చేశావు కదా.దానితో ఆయనగూడ ఆత్మశరీరముతో చిరంజీవుడిగా మారి ఈ పర్వతము మీద అవలోకితేశ్వరుడిగా మిగిలిపోయాడు గదా. ఆ తప్పు నేను చెయ్యదల్చుకోవడము లేదు.నాకు ఏలాంటి కోరికలు లేవు.కాని చింత ఉంది.అది నా మనస్సుకి ఉన్న మాయ తొలగాలి.నాకున్న మాయ తొలిగితే ఈ విశ్వానికున్న మాయ తొలిగినట్లే గదా.ఎందుకంటే విశ్వములో ఉన్నది నాలో ఉంది.నాలో ఉన్నది ఈ విశ్వములో ఉన్నది.నన్ను నేను తెలుసుకుంటే విశ్వమును తెలుసుకున్నట్లే.నన్ను నేను మార్చుకుంటే ఈ విశ్వము మారినట్లే.యత్ భావం తత్ భవతి కదా.

నా భావ సంకల్పసిద్ధి కోసము మనస్సు చేసే అన్ని రకాల మాయలు,మర్మలు దాటుకొని చివరికి ఈ విశ్వశూన్యములో విభూది రేణువుగా ఒక నాగమణి పైగా అందులోని పాముచారిక ఉంటుందని  దీని భావసంకల్పాలే ఈ విశ్వసృష్టియని తెలుసుకొని.. పాము చారిక అనేది మనస్సు అనే నాగపాము అని..ఇదియే ప్రతి జీవుడిలో ఉండే కుండలీనీశక్తియని అందుకే ఇది పాము ఆకారముగా మూలాధారచక్రము నందు ఉండి ఈ శక్తి జాగృతి అయినపుడు పాము మెలికలుగా సహస్ర చక్రములోని అనగా మెదడు మధ్యభాగం దగ్గర ఉండే పిట్యూటరీ గ్రంథి అను చింతామణి దగ్గర కోరిక మాయ దాటలేక ఆగిపోతుందని  నేను తెలుసుకొని కోరిక లేని సమాజం అని కాకుండా కోరికలు కలిగించే మనసు అనేది లేకుండా చేయాలని దానికి శాశ్వత విముక్తి కలిగించాలని అనే సంకల్పంతోనే ఇక్కడికి రావడం జరిగింది.ఇప్పటిదాకా మా సంకల్ప బలానికి విశ్వంలోని పంచభూతాలు సహాయం అందించాయి. కానీ ఇంతవరకు నీ అనుగ్రహం  లభించలేదు ఎందుకంటే నీ అనుగ్రహం కలిగితే నా చేతిలోనికి నీలిరంగుతో వస్తావని గూడ నాకు తెలుసు.అపుడే నా సంకల్పము తీరుతుందని..సంకల్పము తీరితే శ్వాసతో పని ఉండదని గూడ నాకు తెలుసు అని అంటూండగా ..

ఇతడి మనోనేత్రము ముందు

మణి కైలాష్ పర్వతము ఎక్కే ప్రకృతి పాముకి ఏదో ఆవాంతరాలు కల్గుతున్నాయని నిర్వాణలామా దివ్యదృష్టికి వచ్చింది.దానితో ఇతను ధ్యానములో కూర్చోగానే ఇతని మనో నేత్రము ముందు కోటి గణదేవతలు అంతా కలిసి ఈ పామును అష్టదిగ్బందన చేసి పైకి ఎక్కనీయ్యకుండా చేసే దృశ్యమును చూసేసరికి నిర్వాణలామా ఆలోచనలో పడ్డాడు.అసలు వీరందరికి శాశ్వత మరణము అంటే ఎందుకింత భయమో అర్ధముగావడము లేదు. ఏవరికి వారే పుడుతున్నారు.చస్తున్నారు.కష్టనష్టాలు పడుతున్నారు.ఎందుకు పుడుతున్నారో ఎందుకు చస్తున్నారో తెలుసుకొనేలోపలే పున:జన్మలు,పున:కర్మలు,కర్మ:జన్మలు,పాప:పుణ్యాలు కలుగుతున్నాయి గదా.అయిన గూడ వీళ్ళకి బుద్ధి రావడము లేదు.వీళ్ల బుద్ధి ఏపుడు బుద్ధం అవుతుందో ఎవరికి తెలియదు.ఎందుకంటే ఏవరికి వారే సాధన చేసి తమ అజ్ఞానం  అయిన అవివేక బుద్ధి నుండి జ్ఞానము ద్వారా వివేక బుద్ధిగా మార్చుకోవాలి గదా.ఇది అందరికి సాధ్యపడే విషయము కాదు. మాయ దాటితే కాని మాయ మాయం అవ్వదు.తాము మాయలో ఉన్నామని వాళ్ళకే తెలియదు.వీళ్ళకి ఎవరైనా చెప్పిన అర్ధమై చావదు. ఎలా చచ్చేది.జ్ఞానము ఇచ్చిన అర్ధము చేసుకొనే స్ధితిలో ఎవరు లేరు.అది అర్ధమయ్యేసరికి జీవితము ఏదో ఒక కోరిక మాయలో పడి చిక్కుకొని ఆ జన్మ వ్యర్ధమవుతుంది.ఇలా వీరందరిని దృష్టిలో ఉంచుకొని అందరికి శాశ్వత మరణమైన మార్పు లేని ఆనందస్ధితి అయిన మరణము తర్వాత శాశ్వత విశ్రాంతి స్ధితిని తను ఇవ్వాలని సంకల్పమును పెట్టుకొంటే దానికి వీరంతా తమ అశ్వాత దైవాల మీద శాశ్వత నమ్మకభక్తి మాయలో ఉండి అజ్ఞానమాయవలన తన మనో ప్రయత్నమునకు తమకి తెలియకుండా తాము ఏమి చేస్తున్నారో అర్ధము కాని అమాయక స్ధితిలో ఉండే వీరందరు

ఇలా ఒకసారిగా తన వాళ్ళ మీద తిరగబడటానికి కారకమైన కారణమైన అసలు వ్యక్తి ఎవరు అనుకోగానే ఆకాశములో ఒక యక్షుడు కనిపించేసరికి అంటే ఇదింతా వీడి పని అనుకొని ఈ యక్షుడిని తన ఆత్మశక్తితో అష్టదిగ్బందన చేసేసరికి వాడు కాస్త బంధనము అయ్యాడని శంభల గ్రామవాసుల దివ్యదృష్టికి రావడముతో వాళ్ళలో వాళ్ళు ఇక మనము ఏమి చెయ్యలేమని మనలో ఎవడో ఒకడు ఇలా అశక్తుడైనా మనమంతా గూడ అశక్తులు అవుతామని నిర్వాణలామా తెలుసుకొని ఇలా చేశాడని అక్కడున్న యక్షులు అనుకోసాగారు.

అపుడు ఆశరీరవాణితో నిర్వాణలామా ప్రకృతి పాముతో "ప్రకృతి.నీ శరీరమును 42 అడుగుల దాకా అమాంతముగా పెంచు.అపుడు నువ్వు అవలోకితేశ్వరుడి మెడలో ఉండే ముకులిందుడు సర్పమని అనుకుని భ్రమ పడతారు.అపుడు నీవు ఈ అష్టదిగ్భందనము నుండి నువ్వు విముక్తి పొంది ఆపై ఆయన మెడయందు ఎలాంటి ఆటంకము లేకుండా చేరుకొని ఆయనలో ఐక్యం చెందు.ఈ లోపుల నేను పూర్తి చెయ్యవలసిన పనిని పూర్తి చేస్తాను అనగానే  

ఇది విన్న ప్రకృతి పాము అపుడిదాకా అయిదు అడుగులున్న తన శరీరమును తన ఆత్మశక్తిసిద్ధితో 42 అడుగులు దాకా పెంచేసరికి అక్కడున్న కోటిగణాల దేవతలు కాస్త క్షణకాలము అయోమయములో పడి ఇది మన దేవర మెడలో ఉండే ముకులిందుడు పాము గదా.దీనిని చూసి మనకి చెప్పిన యక్షుడు పొరపడి ఏదో పాము మనల్ని చంపటానికి వస్తోందని భయపెట్టి దీనిని బంధించమన్నాడు.నిజానికి మనల్ని రక్షించే పాము కదరా..దీనికి దారి ఇవ్వండి.మన దేవర మెడకి దగ్గరికి చేరేవరకు ఎవరు గూడ ఎలాంటి ఆటంకాలు కలిగించవద్ధు అని గణాధిపతి అధినాయకుడు ఆజ్ఞ ఇవ్వగానే..మిగిలిన వారంతా ఈ ప్రకృతి సర్పమునకు దారి ఇవ్వడముతో ఈ పాము కాస్త అమితోత్సాహముతో తన దైవమైన అవలోకితేశ్వరుడి దగ్గరికి చేరడానికి శరవేగముతో కొండ పైకి ఎగబ్రాకడము మొదపెట్టింది.



అపుడుకే అవలోకితేశ్వరుడికి విషయము అర్ధమై తన మనస్సులో అంటే ఇలా వచ్చే ప్రకృతిపాము తన కంఠములో ఇన్నాళ్ళుగా ఉన్న ప్రభావము చూపని కాలకూట విషము ఈ పాము రాకతో అది ప్రభావము చూపడము ఆరంభమవుతుందని తద్వారా విశ్వమునకు శాశ్వత మరణము కలుగుతుందని అనగా విశ్వమంతా శాశ్వత నిశ్చలస్ధితిని పొందడముగా శూన్యమవుతుందని అలాగే తను ధరించే రుద్రమణియే నిజానికి... ముకులిందుడు సర్పము ధరించే నాగమణియని..ఈ మణిలో ఉండే నాగపాము వలన తనకి అలాగే ఈ విశ్వానికి శాశ్వత మరణము కల్గుతుందని అందువలనే తన కోరిక మాయ ప్రభావము వలన ఇన్నాళ్ళు ఈ పాము కాస్త ఒక పాముచారిక లాగా ఈ మణిలో ఉండేటట్లుగా చేసిన మర్మరహస్యమును తన అంశమైన నిర్వాణలామా తెలుసుకొని..ఆ నాగపాముకి తన భార్య అయిన ప్రకృతి ఆత్మశక్తితో ప్రాణముపోసి..తిరిగి తనకి ఈ పాము ద్వారా శాశ్వత మరణమును కల్గించి అశాశ్వత విశ్వమును శాశ్వతముగా శూన్యము చెయ్యాలని ఈ పాము తన దగ్గరికి వస్తోందని గ్రహించి మౌనము వహించి తాను నిత్యము ఉండే 48 నిమిషాల నిర్వికల్ప సమాధి స్ధితికి తిరిగి చేరుకొనే ధ్యాననిష్టను కొనసాగించాడు.

ఈ విషయము గమనించిన అవలోకితేశ్వరి గూడ మౌనము వహించి విషమును హరించేవాడు విషమును సేవించాలని మనో నిశ్చయము చేసుకుంటే ఇన్నాళ్ళుగా ప్రభావము చూపనియ్యకుండా చేసిన ఈయన కంఠములోని సాగరమధన సమయములో వచ్చిన హాలాహలము అనే మహాకాలకూట విషప్రభావము అనేది తమ దరిచేరే ప్రకృతిపాముతో ఆరంభమవుతుందని..ఎపుడికైనాఈ విశ్వానికి విశ్రాంతి తప్పదు కదా అది ఈ పాము వలన జరుగుతోందని ప్రకృతిమాత గ్రహించి తనుగూడ తనపతిదేవుడిలాగా ఏమాత్రము ప్రతిఘంటించకుండా శాశ్వత మరణస్ధితి అయిన శూన్యస్ధితి అనగా తాము ఇన్నాళ్ళుగా ఉన్న ఆకారస్ధితి నుండి నిరాకారస్ధితిని పొందడానికి  ధ్యానసమాధి స్ధితిలోనికి శాశ్వతముగా సుమంగళిగా వెళ్ళిపోయింది.ఈ విషయాలు ఏమి తెలియని అమాయకభక్తిపరులైన గణాధిదేవతలు అందరుగూడ మహామృత్యువు సంకేతమైన ప్రకృతి పాముకి స్వాగతము పలుకుతూ తమ దేవిదేవర దగ్గరికి దగ్గర ఉండి చేర్చారు.

కళ్ళుమూసుకొని అంతిమ ధ్యాననిష్టలో ఉన్న తమ ఆత్మదైవాలు అయిన అవలోకితేశ్వరుడు మరియు అవలోకితేశ్వరికి ఈ ప్రకృతిపాము అంతిమముగా వీరి పాదపద్మాలకి నమస్కారము చేసి ఈయన కంఠమును శరవేగముతో చేరుకోవడము ఆరంభించేసరికి పాపము విషయము ఏమితెలియని గణాధిదేవతలు పెద్దగా అరుస్తూ తమ హర్షధ్వానాలు తెలియచేస్తునారు.విషయము విషము ఎక్కించడమేనని వీళ్ళకి తెలిసి ఉంటే కధ మరోలా మారి ఉండేది.

అపుడికే ఈ ఆదిదంపతులు శరీరసృహ లేనిస్ధితికి అలాగే బ్రహ్మచింతామణి వద్ధ ధ్యాననిష్ఠలో నిర్వాణలామా అలాగే అవలోకితేశ్వరుడి మెడకి చేరుకున్న ప్రకృతిపాము కూడ చేరుకోవడము జరిగింది.ఇదింతా శంభల గ్రామవాసులు మరియు అగర్తల గ్రామవాసులు మరియు భూలోకవాసులతో పాటుగా మిగిలిన 13 లోకవాసులు గూడ తెలుసుకొని అలాగే ఈ విశ్వములోని ప్రతి రేణువు,ప్రతి పరమాణువు,ప్రతి అణువు తెలుసుకొని అనగా నిర్జీవమైనవి సజీవమైనవి చేతనమైనవి అచేతనమైనవి అన్నిగూడ ఏమి జరుగుతోందని ఉత్కంఠముగా ఎదురుచూస్తునాయి.వీటిలో కొన్ని తమకి శాశ్వతమరణము పొందుతున్నామని తెలుసుకొని ఆనందడోలికలలో ఉంటే మరికొన్ని తమని శాశ్వత మృత్యువు పొందుతున్నామనే మరణభయముతో ఆవేదన అవస్ధలు పడటము ప్రారంభమైంది.

నిజానికి ఆనంద అలాగే ఆవేదన భావాలు అందరిలో పొందేది మనలోని ఏకైక మనస్సు గదా. ఈ రెండు విభిన్న భావాలు కల్గటానికి దానికున్న స్పందన గుణములోని తేడాలు గదా.ఈ మనస్సే అందరిని కలుపుతుంది.ఇదే అందరిని విడకొడుతుంది.ఇదే నవ్విస్తుంది.ఇదే భాదపడుతుంది.ఇదే అందరిని సృష్టిస్తుంది.ఇదే అందరిని ఆడిస్తుంది.ఇదే అందరికి అశాశ్వత భౌతిక మరణమును ఇస్తుంది.మరలా ఇదే అజ్ఞానమాయ అయిన కోరికమాయలో తనుపడి పున:జన్మలెత్తి ఆవేదన ఆనంద అవస్ధలు పడుతుంది.ఇలాంటి అందరిలోని మనస్సుకి తన శాశ్వత మరణవేదన అనగా ఇన్నాళ్ళుగా తన భావసంకల్ప భావశరీరాలకి రూపము ఉండదని..ఇక ఇవి తనకి అనుగుణముగా రూపాంతరాలు చెందవని ఎందుకంటే ఇలాంటి శాశ్వతమరణావస్ధను నిర్వాణలామా దంపతులు చేస్తునారని అందరిలోని ఏకైక మనస్సుకి తెలిసింది.అంటే ఇక తనలో స్పందన-ప్రతిస్పందనలు శాశ్వతముగా ఆగిపోయి నిశ్చలము నిర్మలముగా తాను అయ్యి రూపము లేని తన యదార్ధస్ధితికి తిరిగి వెళ్ళుతున్నానని మనస్సు గ్రహించి మౌనము వహించక తప్పడము లేదు.తను ఇన్నాళ్ళుగా చివరికిగా మిగిలిపోయి ఉండే నాగమణిలో పాముచారిక లాగా అష్టదిగ్బందనలో తను బంధీగా ఉన్నానని తనకే తెలియని పైగా తనకి అంటూ ఒక రూపము లేదని..అసలు రూపము లేని తను రూపమున్న ఆకారాలమీద అదిగూడ తన భావసంకల్ప శరీరాలమీద మమకారాలు, మోహాలు, వ్యామోహాలు, ఆశలు,భయాలు,ఆనందాలు,ఆలోచనలు,స్పందనలు,సంకల్పము చేసుకున్నానని మనస్సుకి మంచి జ్ఞానము అందడము మొదలైంది.ఇన్నాళ్ళుగా తను అవివేకబుద్ధితో తను చేసిన స్వప్న శరీర నాటక పాత్రల మీద స్మశానవైరాగ్యము రావడము మొదలైంది.



ఇది ఇలా ఉంటే అవలోకితేశ్వరుడు కంఠమునకు చేరుకున్న ప్రకృతిపాము తన ప్రభావమును చూపడముతో ఈయన కంఠములోని నాగమణి రూపములోని కాలకూటవిషము ప్రభావము చూపడము మొదలైంది. దీని ప్రభావము వలన శరీరమంతా నెమ్మది నెమ్మదిగా విషరంగు అయిన నీలిరంగులోనికి మారడము ఆరంభమైంది.దానితో విశ్బములోని పంచభూతాలు మీద ఈ ప్రభావము పడి ఉన్నట్టుండి..

ఆకాశము కాస్త లేతనీలిరంగులో విషముగా మారిపోవడము

వాయువు కాస్త లేతనీలిరంగు విషవాయువులలో నిండిపోవడము..

అగ్ని కాస్త లేత నీలిరంగు విష మంటలతో మారడం..

నీళ్ళు కాస్త లేత నీలిరంగులో విషముగా మారడం...

భూమి కాస్త లేత నీలిరంగుగా విషముగా మారడం

విశ్వములోని సర్వ దైవ మరియు సర్వ జీవ కోటి గమనిస్తూ...

విషము అనేది లేతరంగులోనే ఉంటుంది గదా.పాము కాటు వేసిన వాడి శరీరము గూడ విషప్రభావములోనికి మారుతుంది.ఈ విధముగా పంచభూతాలు ఎందుకు మారతాయో విశ్వ జీవకోటికి అర్ధము కాలేదు.

కాని ఈ విషయము విషము వలన అని విశ్వదైవకోటికి అర్ధమైన చెప్పలేదు.ఎందుకంటే జ్ఞానము పొందినవాడు చెప్పలేడు.తెలియనివాడు తెలుసుకొనేదాకా తెలియనితనము ఉంటాడు కదా.

ఆ తర్వాత నిర్వాణలామా చేతికి నీలిరంగుతో బ్రహ్మచింతామణి రావడముతో శరీరములో మార్పులు రావడము మొదలైంది.

తన కంఠములో ఉన్న నాగమణి ప్రతీకయైన ధైరాయిడ్ గ్రంధి నుండి విషము బయటికి రావడము మొదలైంది.   ఈ విషము కాస్త గుండెకి ఆపై తన పంటికి ఆపై చెవికి చేరి ఆపై కంటికి చేరి మెదడు యొక్క పిట్యూటరీ గ్రంధికి చేరుకొని అందులో ఉన్న 36 తత్వాలున్న మనస్సుకి విముక్తి కలిగి  రూపము లేని స్ధితిని పొందడముతో అది కాస్త బ్రహ్మరంధ్రము నుండి మెరుపు కాంతితో బయటికి పోవడముతో శరీరము కాస్త విషముగా మారడముతో విశ్వములోని విశ్వ జీవ, దైవ,ఆత్మ కోటి శరీరాలు గూడ ఇలాగే జరుగుతూండేసరికి వారి శరీరాలు గూడ పాము కాటు వేసిన మాదిరిగా లేతనీలిరంగులోనికి మారుతూ విషపూరితముగా ఉండము పైగా తమమీద పంచభూతాలు మీద జరిగినట్లుగా విషప్రయోగము జరిగినదని వీళ్ళు గ్రహించేలోపుల వీళ్ళంతా అచేతనస్ధితి శరీరాలు పొందుతూ దహనాగ్నితో దహనమవుతూండేసరికి



బుద్ధ భగవానుడు ప్రతిపాదించిన కాలచక్రతంతుములోని ఆదిబిందువుగా ఉంచిన లేతనీలిరంగులోనికి డ్యోర్జీ అలాగే పసుపు రంగు డ్యోర్జీ ప్రతీకయైన

అవలోకితేశ్వరుడు,అవలోకితేశ్వరీ.. ప్రతీకయైన

నిర్వాణలామా..ప్రకృతి..కాస్త



పూర్ణ మహా నిర్వాణ నిర్యాణము చెందుతూ..మెరుపుకాంతిలాగా

ఆకారాలు లేకుండా నిరాకారముగా ఆకాశములో అదృశ్యమయ్యేసరికి

విశ్వములోని సకల ఆత్మ,దైవ,జీవ కోటి ఆకారాలు కాస్త నిరాకారమవ్వడముతో

రూపమున్న మనస్సు కాస్త రూపము లేకపోవడముతో

శూన్యబ్రహ్మ కాస్త శూన్యమవ్వడముతో ఆకార విశ్వము గూడ నిరాకార మవ్వడముతో

పూర్ణశూన్యం శూన్యమవ్వడము ఆరంభమై .......

                                                                           సంపూర్ణమైంది.

 

మనము సహజస్ధితిలో ధర్మముగా ఉంటే

మనము చేసే ప్రతి పని గూడ ధ్యానమై 

తనకి తాను ఎవరో జ్ఞానమును పొంది

మనస్సులేని పూర్ణశూన్యస్ధితిని పొందడమే

మహా నిర్వాణ నిర్యాణమవుతుందని

ది బుద్ధ కోడ్

మనకి చెపుతుందని ఎవరికి వారే

 తెలుసుకోండి.

********************************************************

పూర్ణ మోక్ష విధి విధానము: 

ఇది నేను మీకు ఒక యోగమిత్రుడిగా నా 32సం.రాల అధ్యాత్మికానుభవముతో ఈ విషయము చెపుతున్నాను.చెయ్యడము లేదా చెయ్యకపోవడము మీ ఇష్టము..కాని చెప్పడము మంచిదని చెపుతున్నాను.నా మనోదృష్టికి చాలామందికి మోక్షము పొందాలన్నా కోరిక ఉన్నప్పడికి అది ఎలా ఎవరు తీరుస్తారో మార్గాలు తెలియక ఒకవేళ తెలిసినగూడ అవి చెయ్యలేక..ధ్యానానుభవాలు పొందలేక..పొందిన అనుభవాలు నిజమో లేదా అబద్ధమో అర్ధము గాక అవస్ధలు పడుతూ..నకిలి గురువులను నమ్మి ధనామానాలు కోల్పోయి అగచాట్లు పడుతూ..ఈ జన్మకి మోక్షము వస్తోందో రాదో అర్ధమవ్వక..ఎవరిని అడాగాలో..ఎవరిని నమ్మాలో అర్ధము కాని అయోమయ స్ధితిలో..ఇలా చాలామంది భావితరాల యోగసాధకులు ఉన్నారని నాకు అవగహనకి వచ్చింది.ఇలాంటి వారి కోసము నా సాధానుభవముతో మీకు మోక్షము మీద అలాగే దీనిని సాధన విధివిధానము మీద అవగహన కల్పించాలని నాకు బలమైన సంకల్పము కల్గింది.చెప్పేది నేను అయిన చెప్పించేవాడు దైవమని తెలుసుకొండి..

ఇక అసలు విషయానికి వద్దాం..మోక్షము అంటే ఏమిటి అన్నపుడు మన మనస్సుకి 64 తత్త్వబంధాలుంటాలు.వీటిని సాధన ద్వారా విముక్తి చేసుకొంటే అస్ధిర మనస్సు కాస్త స్ధిరమై ఆత్మగా రూపాంతరము చెందుతుంది.అంటే మన మనస్సుకున్న కామాత్వము పోయి దైవత్వ స్ధితిని పొందడమే ముక్తి అవుతుంది.ఈ దైవత్వస్ధితి నుండి ఆత్మస్ధితికి చేరుకొని పూర్ణశూన్యస్ధితికి చేరడమే మోక్షమవుతుంది.ఒకరకముగా చెప్పాలంటే నేనుయున్నాను అను స్ధితి నుండి నేను లేను అను పూర్ణజ్ఞానము పొంది పూర్ణశూన్యస్ధితికి చేరడమే మోక్షమవుతుంది.అదే నేను వేరు..దేవుడు వేరు అను ద్వైతస్ధితి ఉంటే అది ముక్తి అవుతుంది.అంటే ముక్తిలో నేనుయున్నాను భావముంటే..అదే మోక్షములో నేనులేను భావప్రాప్తి ఉంటుంది.ఇక వివరముగా చెప్పాలంటే ముక్తిలో మీకు మీ దైవము లేదా గురువు కాస్త మామిడి పండు రుచి గూర్చి చెపుతారు.అదే మోక్షములో మీకు మీరే మామిడిపండు తిని రుచిని స్వానుభూతిని పొందుతారు.

ఇక సాధన విషయానికి వస్తే మనకి 18 యోగమార్గాలున్నాయి.అందులో ముఖ్యముగా కర్మ,భక్తి,జ్ఞాన,ధ్యాన,ఆత్మయోగ మార్గాలున్నాయి.వీటిలో కర్మమార్గము అంటే చేసే కర్మ యందు ఫలితాలు ఆశించి చివరికి ఫలితాలు ఆశించని స్ధితి చేరుకోవాలి.అదే భక్తి మార్గములో అయితే విగ్రరాధన నుండి విశ్వారాధన స్ధితికి చేరుకోవాలి.అదే జ్ఞానమార్గము లో అయితే నేను ఉన్నాను స్ధితి నుండి నేనులేను అను స్ధితికి చేరుకోవాలి.అదే ధ్యానమార్గములో అయితే కుండలీశక్తిని జాగృతి చేసుకుని మూలాధార చక్రము నుండి బ్రహ్మరంధ్రము దాకా ఉన్న 13 యోగచక్రాలను శుద్ధిచేసుకొని ఆయా ఈ చక్రానుభవాలు ధ్యానములో పొందాలి.అదే ఆత్మయోగము నందు అయితే మన ఆత్మను కాస్త పరమాత్మ లయం చేయాల్సి ఉంటుంది.

ఇక కర్మయోగమైతే మనకి ఏ కర్మలు చేస్తే పుణ్యము లేదా పాపము వస్తోందో తెలియదు.అలాగే ఏ కర్మలు మనకి బంధమవ్వుతాయో లేదా బంధవిముక్తి కల్గిస్తాయో గూడ తెలియదు.కాబట్టి ఈ మార్గములో మనకి తెలియని మాయ ప్రమాదము ఉన్నట్లే గదా.ఇక భక్తిమార్గము తీసుకుంటే ఇందులో మనకి 36 కోట్ల దైవాలున్నారు.వీరిలో ఏవరిని పూజిస్తే మోక్షము వస్తోందో ఎవరికి తెలియదు.ఒకవేళ తెలిసి చేసిన ఆయనకి ఈ పూజలు వెళ్ళుతున్నాయో లేదో తెలియని అయోమయ పరిస్ధితులు ఉన్నాయి.కాబట్టి ఈ మార్గము గూడ మన వంటికి పడదు.ఇక జ్ఞానమార్గమునకు వస్తే నేనుయున్నాను నుండి నేనులేను స్ధితికి చేరాలంటే ముందు మనము నేను అనేది ఏమిటో తెలుసుకోవాలి.అంటే నేను ఏవరిని అనుకుంటూ ఉంటే సరిపోదు.అది ఏమిటో జ్ఞానానుభవానుభూతిగా పొందాలి.ఇది కారణజన్ముడికి తప్ప నరమానవుడికి ఈ పూర్ణజ్ఞానము అందదు.అంటే ఈ మార్గముగూడ మన వంటికి సరిపడదు.ఇక ధ్యానమార్గములో అయితే మన కుండలీశక్తి జాగృతి నుండి యోగచక్రాల ధ్యానానుభవాలు పొందుటకు మనకి వరుసగా మంత్రగురువు, శక్తిపాతగురువు, సద్గురువు, పరమగురువు,ఆదిగురువు అనే పంచ నిజగురువుల అనుగ్రహము పొందాలి.ఈ కలియుగ ప్రభావములో ఎవరు నిజగురువో లేదా నకిలి గురువో గుర్తుపట్టడము చాలా కష్టము..ఒకవేళ గుర్తుపట్టిన ఆయన అనుగ్రహము పొందడము చాలా చాలా కష్టము.ఎందుకంటే నిజగురువు పెట్టే నిత్య మాయపరీక్షలు ఎదుర్కోవడము అంత తేలికైన విషయము గాదు.ఏ చిన్న తప్పు లేదా పొరబాటు చేసిన మన కధ మొదటికే వస్తోంది.ఆయన అనుగ్రహము పొందవలసిన చోట అగ్రహామును లేదా గురుశాపమును పొందవలసి ఉంటుంది. ఈ మార్గము అనేది పులి మీద స్వారీ లాంటిది కాబట్టి ఇది గూడ మన వంటికి పడదు.ఈ నాలుగు మార్గాలలో నేను ఎన్నో కష్టాలు పడి నానా చంకాలు నాకి ప్రాణము మీదకి తెచ్చుకున్న నాకు గావాలసిన స్ధితిని..ఆనందమును ఇవి ఇవ్వలేకపోయాయి. దాదాపుగా ఈ నాలుగు మార్గాల సాధన కోసము నా జీవితములో దాదాపుగా 27సం.రాలు వృధా చేశాను.కర్మల నుండి నిజగురువులు వెతకడములో ఇన్ని సం.రాలు ఎందుకు పనికిరాకుండా పోయాయి.ఈ తప్పు మీరు చెయ్యకూడదని ఒక యోగమిత్రుడిగా ఈ అనుభవాలు చెప్పడము జరుగుతోంది.కాబట్టి మీరు ఎవరు గూడ ఈ నాలుగు మార్గాలలో సాధన చెయ్యకండి.దైవాల నుండి నిజగురువులను వెతకడము ఆపివెయ్యండి.గురువుల కోసము ఆశ్రమాలు అలాగే దైవాల కోసము గుడులు తిరగకండి.డబ్బులు,కాలము,జీవితము వృధా చేసుకోకండి. 

ఇక ఆఖరిదైన ఆత్మయోగ మార్గములో నేను కేవలము 5 సం.రాలు ప్రయాణించి నేను ఉన్నాను ఉన్నస్ధితి నుండి నేను లేను ఉన్నతస్ధితికి నా సాధన చేరుకోవడమే కాకుండా నా ఆత్మ కాస్త పరమాత్మయందు లయమయ్యే స్వానుభవము పొందడమే గాకుండా అంతిమ స్ధితియైన ఆత్మానందస్ధితికి అలాగే కైవల్యముక్తి అగు మోక్షానుభవము పొందడము జరిగింది.నాకు తెలిసి సాధన మార్గాలలో ఉన్న 112 మార్గాలలో సాధన చేసినప్పడికి ఆఖరికి ఈ ఆత్మయోగ మార్గమునకు ప్రతిసాధకుడు రాకతప్పదు.మరి అలాంటప్పుడు కష్టసాధ్యమైన మార్గాలలో ప్రయాణించము కన్నా అతిసులువైన ఆఖరిదైన ఆత్మయోగమార్గములో ప్రయాణించి సాధన సాధ్యతే సాధ్యం అను నానుడి నిజము చేస్తూ అందరుగూడ  మోక్షగామిగా మారి మోక్షమును పొందండి.

ఇంతకి ఈ మార్గ సాధన విధివిధానము మీకు నేను చెప్పుతాను.ఇందులో మనకి ఆదిదైవముగా..ఆదిగురువుగా.... ఆదియోగిగా మనకి అరుణాచల క్షేత్ర నివాసియైన శ్రీ మేధా దక్షిణామూర్తి మనకి తోడుగా..రక్షకుడిగా..మోక్షగురుదేవుడిగా ఉంటాడు.కాకపోతే ఈయన అనుగ్రహమును మనము పొందటానిటి సాధన చేయాల్సి ఉంటుంది.అందుకు మనకి  గావాలసిన దైవిక వస్తువులు నాలుగు.అవి ఒకటి లింగజ్యోతి దీపారాధన 2. ఊదే శంఖము 3. పాదరస శివలింగము లేదా రుద్రాక్ష 4. దక్షిణామూర్తి ఫోటో లేదా విగ్రహాము... ఈ నాలుగు వస్తువులు మీకు ఇంటర్నెట్ వెతికితే దొరుకుతాయి.ఈ నాలుగు వస్తువులలో లింగజ్యోతి అంటే ప్రమీద ఆకారము ఒక శివలింగకారముగా ఉండి లింగస్ధానములో ఒక దీపము ఓత్తి ఉంటుంది.దీనిని వెలిగిస్తే ఈ కుందె కాస్త అగ్నిలింగముగా కనపడుతుంది.ఈ నిత్య దీపారాధన వలన మన జన్మాంతరాల పాపాలు..శాపాలు..బంధ కర్మాల నుండి ఈ జ్ఞానాగ్నికి దగ్ధమవుతాయి.ఎలాంటే మన జన్మకి కారకము కామాగ్ని..మన సాధనకి కారకము జ్ఞానాగ్ని...మన మరణానికి కారకము దహగ్ని..అంటే మన జీవిత సృష్టి..స్ధితి..లయలకి మూలము అగ్నియే గదా.కాబట్టి అంతిమ ఈ అగ్నిరూపము ఒక అగ్నిశిఖ అయిన అగ్నిలింగము గావడము వలన ఈ లింగజ్యోతిరాధన చెప్పడము జరిగింది.ఇక ఉదే శంఖరావము వలన మన శరీరములో మనకి తెలియకుండానే ప్రాణాయామ విధివిధానము జరిగి కుండలీనిశక్తి జాగృతి అయ్యి యోగచక్రాలలో ఈ శక్తి ప్రయాణము నిరంతరము చేస్తూంది.అలాగే అరుణాచల క్షేత్రములో ధ్యానములో ఉండే దక్షిణామూర్తికి ఈ శంఖనాదము వినబడి మనగూర్చి ఆయన ఆలోచన చేస్తాడు.ఇక పాదరస లింగము లేదా రుద్రాక్షను ప్రతినిత్యము తాకడము వలన ఏరోజు చేసిన పాపాలు..కర్మపాపఫలితాలు నాశనమవుతాయిఎందుకంటే పాదరసము అనేది ఒకవిధమైన విష ఔషదమని ఆయుర్వేద వైద్యము చెపుతుంది..అలాగే నయము కాని దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనము మరియు జ్ఞానాభివృద్ధి, ధనాభివృద్ధి, కామ్యసిద్ధి,ఆరోగ్యవృద్ధి,శాంతము కల్గుతాయని శాస్త్రవచనము.అలాగే నా అంతిమ అనుభవములో దక్షిణామూర్తి ఆత్మలింగముగా పాదరస లింగముగా దర్శనము ఇచ్చిన విషయము మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది.అందుకని ఈయన అనుగ్రహమును పొందుటకు పాదరసలింగము లేదా పాదరస రుద్రాక్షను పెట్టడము జరిగింది.ఎవరైన దీనిని పూజించవచ్చు.నిరభ్యంతరముగా ఇంటిలో పెట్టుకోవచ్చు.పైపెచ్చు ఇంటి వాస్తు దోషాలు తొలగుతాయి.అంతెందుకు దేవాలయ ప్రతిష్ట యంత్రాల సమయములో తప్పనిసరిగా పాదరసమును వాడుతారు.వాడాలని ఆలయ ఆగమ శాస్త్రములో ఉంది.ఇప్పుడికి దీనిని వాడుతున్నారు.ఇక దక్షిణామూర్తి ఫోటో లేదా అంగుళము నుండి మూడు అంగుళాల విగ్రహము అనేది మన ఇళ్ళలో ఉంచుకోవలసిన దైవిక వస్తువులలో ఇది తప్పనిసరిగా ఉండాలని శాస్త్రవచనము.కాబట్టి ఈ ఫోటోను లేదా విగ్రహామును ప్రతినిత్యము చూడటము లేదా తాకడము వలన మనకి గురుగ్రహనుకూలత కల్గి మనకి అన్ని శుభాలు కల్గుతాయని ఏకముగా జ్యోతిష్యశాస్త్ర వచనము.

ఇక సాధన విషయానికి వస్తే...ఈ నాలుగు దైవిక వస్తువులు ఎలా ఉపయోగించాలో మీకు చెపుతాను.మొదట ఆవుపేడతో చేసిన విభూది ధరించి ఆ తర్వాత ఉదేశంఖముతో ఒకసారి శంఖనాదము చేసి ఆ తర్వాత  లింగజ్యోతి దీపారాధన ... దీనిని ప్రతినిత్యము ఉదయము మరియు సాయంత్రము వెలిగించాలి.ఇది ఒక కుందెగా ఉంటుంది.ఇందులో పూర్తిగా నువ్వులనూనె పోస్తే సుమారుగా ఆరుగంటలు పాటు వెలుగుతుంది.ఈ దీపారాధన ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము 6 గం నుండి 7 గం లోపు వెలిగించాలి.ఈ దీపారాధన ఒక అగ్నిలింగము గావడము వలన దీనిని అరుణాచల నామముతో జపించాలి.అలాగే దీనికి మహనైవిధ్యముగా ఒక చెంచా శుద్ధ ఆవునెయ్యి ఈ కుందెలో వెయ్యాలి.అంతే మీ పూజ పూర్తి అయ్యినట్లే...ఆ తర్వాత ఒకసారి పాదరస శివలింగము లేదా ఈ రుద్రాక్షను తాకి మీ దగ్గరున్న జపమాలతో 11 నుండి 1080 సార్లు అరుణాచల శివా నామమును దక్షిణామూర్తి ఫోటో లేదా విగ్రహమును చూస్తూ ఈ నామజపము చెయ్యండి.ఇంతడితో జపము పూర్తి అయ్యినట్లే..ఆ తర్వాత 20 ని..పాటూ మౌనముగా ఉండి ఆలోచనరహితముగా ఉండటానికి కళ్ళు మూసుకొని మీ గురుదేవుడైన శ్రీ మేధా దక్షిణామూర్తికి మీ కోరికలు చెప్పుకొండి.కాని ఫలితాలు ఆశించకండి.ఆయన ఏమి ఫలితము ఇస్తే అదే ఆనందముగా స్వీకరించి కృతజ్ఞతలు చెప్పుకొండి.ఇలా విధివిధానము అంతా మీకు 48ని..పూర్తి చేసుకొని ఇక నిత్యకృత్య పనులలో చేసుకొండి.అంతే..ఇలా మీరు  వేళ తప్పకుండా..క్రమము తప్పకుండా 14సం.రాలు పాటు చేస్తే మీకు తప్పకుండా ఆయన అనుగ్రహము కల్గి అంతిమ కైవల్యముక్తియగు మోక్షము కల్గుతుందని నా స్వానుభవము వలన ఘంటాపధముగా చెపుతున్నాను.గాకపోతే ఈ అనుగ్రహము అనేది 14రోజుల నుండి 14 సం.రాలు పట్టవచ్చు.మీ ఈ సాధన బట్టి ఫలితము ఆధారపడి ఉంటుంది.

మనకి శ్రీ మేధా దక్షిణామూర్తి అనుగ్రహము కల్గినదో లేదో తెలియానికి కొన్ని అనుభవాలు కల్గుతాయి.అవి 1. మనకి ధ్యానములో లేదా స్వప్నములో నిరంతరముగా అరుణాచల వాసియైన రమణామహర్షి స్వప్న దర్శనము అవుతుంది.2. ఈయనను మీరు దాటకల్గితే మీకు పంచ శిఖరాలున్న అరుణాగిరి కనపడుతుంది.3.ఆ తర్వాత ఏకశిఖరమున్న అరుణాగిరి కనపడుతుంది.4. అరుణాగిరి గుడి అయిన అగ్నిలింగము కనపడుతుంది.5.ఆ తర్వాత అరుణాగిరి పైన ఉన్న పద్మకారశివ అగ్నిలింగము అలాగే అగ్నిశివుడు అలాగే ఈ శిఖారగ్రభాగములో ఉన్న శివపాదముద్రలు కనపడతాయి.6.అరుణాగిరి లోపున ఉన్న నల్లటి ఆకారముగా ఉన్న దక్షిణామూర్తి ఆత్మస్వరూపము కనపడుతుంది.7.ఆ తర్వాత ఆఖరి అంతిమ అనుభవాలుగా ధ్యానము నందు మీ శరీరములో ఉన్న 13 యోగచక్రాలలో ఉన్న యోగలింగాలు కాస్త ఒక్కొక్కటిగా ఈ అరుణాగిరియందు లయము చెందే దృశ్యాలు కనపడుతూ ఆఖరిగా మీ ఆత్మ కాస్త మోక్షగురుదేవుడు అగు పరమాత్మ దక్షిణామూర్తి యందు కైవల్య చెందే దృశ్యము చూస్తూ మీ ప్రాణాలు కపాలములోని బ్రహ్మరంధ్రము ద్వారా పోయి ఆయనలో శివైక్యము చెందుతాయి.ఈ అనుభవాలు అన్నిగూడ నాకు కేవలము 5 సం.రాలలో జరగడము వలన ఇంతా ఇదిగా చెప్పడము జరిగింది.ప్రస్తుతానికి నా యోగ శివలింగాలు అన్నిగూడ ఈ అరుణాగిరియందు ఐక్యము చెందిన ధ్యానానుభవాలు పొందడము జరిగింది.ఆత్మానంద స్ధితిని పొందడము జరిగింది.ఇంక శివైక్య విధానముగూడ రేపో మాపో జరుగుతుంది.ఈ లోపు ఈ దేహ తెలుసుకున్న ఈ మోక్షవిధానము గూర్చి మీరందరికి చెప్పడము జరిగింది.ఈ విశ్వములో విశ్వాదిడేవుడుగా..విశ్వాదిగురువుగా.. విశ్వాదియోగిగా..విశ్వాదిమోక్షగురుదేవుదిగా.. .ఒకే ఒక్కడిగా.. అరుణాచల నివాసియైన
  శ్రీ మేధా దక్షిణామూర్తిగా ఉన్నాడని ఈ ధ్యానానుభవాలు చదివి తెలుసుకొండి.

ఈయన ఒక్కడినే పూజించండి. ఆరాధించండి. జపించండి. .ధ్యానించండి.అనుగ్రహము పొంది  జ్ఞానమును పొంది కైవల్యముక్తియగు మోక్షమును పొందండి.ఈయన ఒక్కడే మనకి కష్టసాధ్యమైన సాధనలు లేకుండా ఈయన నిత్య నామస్మరణతో మనకి గావలసిన మోక్షము ఇస్తాడు.ఎందుకంటే ఈయనే ఈ విశ్వానికి మోక్షదేవుడు.ఈ అనుగ్రహము కోసము మిగిలిన 36 కోట్ల దైవాలు..ఒక కోటి పరమాత్మలు..84 లక్షల ఆత్మస్వరూప యోగగురువులు అరుణాగిరి చుట్టు తిరుగుతూ సాధన చేస్తున్నారంటే విషయము ఏమిటో ఈ పాటికి మీకు అర్ధమై ఉంటుంది.ఇపుడిదాకా మీరందరు అసలు దేవుడిని పూజించకుండా ఈ దైవమును పూజించే పూజారి  దైవ గురువులను పూజిస్తున్నారని ఇపుడికైన తెలుసుకొండి.బాగుపడండి.నేను చెప్పేది వింటే బాగుపడతారు.లేదంటే బాధపడతారు.మీకు ఈ రెండింటిలో ఏది గావాలో తెల్చుకొండి.సాధన చేసుకొని మోక్షము పొందుతారని ఆశిస్తూ..శుభంభూయాత్...

3 కామెంట్‌లు:

  1. ఈ బ్లాగ్ నాకు కనిపించడం నా పూర్వ జన్మ సుకృతం. లాభాపేక్ష లేకుండా ఒక పరమ హంస చూపిన మార్గం లో పయనించడం నా లక్ష్యం. వందన సమర్పణ తో కృతజ్ఞలు .

    రిప్లయితొలగించండి
  2. please give your contact details pavananda ji. i need initiation into kriya yoga. please give me initiation.

    రిప్లయితొలగించండి
  3. Sivoham gurudeva 🙏🙏🙏miru chupina maargamlo nadustamu. Mi avedana artamaidi gurudeva. Mokshamargam chupinamiku sarvada krutagnatalu🙏

    రిప్లయితొలగించండి