36
అలాగే
ప్రతిజీవికి మంచి జ్ఞానముంటే ఏది మంచో, ఏది చెడో
తెలుసుకొనే వీలు ఉంటుందని గ్రహించి దానితో నిగ్రహించాను. ఇది జరిగిన నాలుగు
రోజులకి నాలో అన్నింటి మీద ప్రేమ, మాయ, మొహం వ్యామోహాల బంధనాల నుండి నా మనస్సు విముక్తి పొందుతోందని అని
గ్రహించగానే నాకు విజయానికి సంకేతమైన ధ్వజ పటము గుర్తుకు వచ్చింది. అంటే నా మనస్సు
ప్రారంభ మంచి సమాధి స్థితిలోనికి వెళ్లుతోందని గ్రహించాను. ఇలా సుమారుగా 8x4=32 రోజులు గావడము అనగా 64 పగళ్లు, రాత్రులు
గడిచినట్లుగా నా మనస్సు గ్రహించింది. అంటే యోగపరిభాషలో చెప్పాలంటే నాలో కలిగిన
కామభావాలు మూలాధారచక్రమైతే.... నాలో కలిగిన ధనభావాలు స్వాధిష్టానము, కాంతి
శరీరాల దర్శనం మణిపూరక చక్రము, నల్లటి ఆకారాల దర్శనం అనాహత
చక్రముగా, నాలో జ్ఞాన అహంకారభావాలు విశుద్ధ చక్రమునందు నాలో
ద్వైత భావాలు ఆజ్ఞాచక్రమునందు నాలో విపరీత భావాలు సహస్రచక్రమునందు నాలో స్మశాన
వైరాగ్యభావాలు హృదయ చక్రము నందు ఉన్నప్పుడు కల్గినాయని తెలుసుకోండి. వరుసగా
మంచిదృష్టి, మంచి సంకల్పము, మంచిమాట,
మంచిపని, మంచి జీవితము, మంచి
వ్యాయామం, మంచి జ్ఞానం, మంచి సమాధి
అనేవి నా అష్టాంగ నియమాలుగాను అలాగే జీవహింస చెయ్యకుండా, దొంగతనం
చెయ్యకుండా ఉండటం,అబద్ధమాడకుండా ఉండటం, వ్యభిచారం చెయ్యకుండా ఉండటం, మత్తు పదార్ధాలు
సేవించకుండా ఉండాలని పంచశీల సూత్రాలుగా పెట్టుకున్నాను. అలాగే అష్టాంగ నియమాలు
గూర్చి ప్రజలకి త్వరగా అర్ధమవ్వటానికి వీలుగా అష్టమంగళ వస్తువులు అనగా జంటచేపలు,
గుప్తనిధిపాత్ర, గొడుగు, శంఖము, కమలము, చిక్కుముడి,
ధర్మచక్రము, ధ్వజ పటాలను గుర్తులుగా
పెట్టుకున్నాను. ఇలా నేను ధ్యానములో అనుకుంటున్న సమయములో నాలో వివిధ రకాల ధ్యాన
అనుభవాలు కల్గడము మొదలైనాయి.
***
*** *** *** *** ***
నిర్వాణలామా
బృందము కాస్త బౌద్ధమ్యూజియమునకు చేరుకొని అంబేద్కర్ చనిపోయిన గది దగ్గరికి
వెళ్ళారు.గది లోపల అంబేద్కర్ శవము కనిపించలేదు.అలాగే శవము చుట్టూ గీసిన పోలీసుల
గుర్తులు గూడ కనిపించలేదు.జేసి తన మనస్సులో అంటే తన తండ్రి శవమును పోలీసులు
ఆస్పత్రి మార్చురీలో భద్రముగా దాచి ఉంచి ఉంటారని అనుకుంది.
నిర్వాణలామా
వెంటనే అక్కడ గోడకి వ్రేలాడుతున్న మూడు బుద్ధుల ఫోటోల దగ్గరికి వెళ్ళి అక్కడున్న
భో-అ-క్షి అక్షరాల ఆకారాలలో తను కాశీ క్షేత్రము నుండి తెచ్చిన మూడు స్ఫటిక
రత్నాలను అమర్చగానే ఏదో మాయ జరిగినట్లుగా ఒక్కసారిగా గది యొక్క సీలింగ్ పైన
సరిగ్గా తమకి దొరికిన మణి ఆకార తాళమున్న చోట గోడ ప్రక్కకి జరిగి జరగగానే
సూర్యకాంతి ఈ గదిలోనికి ప్రవేశించడం సరిగ్గా ఈ కాంతి కాస్త భోధిసత్వుడు ఫోటోకి అమర్చిన
భో అక్షర స్ఫటిక రత్నము మీద పడగానే సరిగ్గా
ఇంతవరకు అంబేద్కర్ శవము పడిన ప్రాంతము ఒక్కసారిగా కరగడము మొదలైనది.అంటే ఈ
చోటు నేలగా కనిపించే లక్కతో చేసిన నిర్మాణమని నిర్వాణలామా గ్రహించేసరికి అక్కడ
విచిత్రముగా ఒక చిత్రము రూపుదిద్దుకుంది.
అక్కడ
ఎవరు ఊహించని హఠాత్తుగా ఒక విచిత్ర సంఘటన జరిగింది.
సూర్యకాంతి
కాస్త ఎదురుగా ఉన్న అవలోకితేశ్వరుడి చిత్రము యొక్క తెలుపు స్ఫటిక రత్నము మీద పడటము
ఈ కాంతి కాస్త విచిత్రమైన పాము చిత్రము మీద పడిపడగానే చిత్రములో ఉన్న నాగుపాము
కాస్త సజీవమూర్తిగా మారి ఒక్కసారిగా పడగ ఎత్తేసరికి అక్కడున్న వారంతా ఈ దృశ్యమునకు
బిత్తరపోయారు.భయపడిపోయారు.
నిర్వాణలామా
వెంటనే అక్కడున్న వారితో …
“మీరంతా జాగ్రత్తగా ఉండండి.ఇది కాగిత యంత్ర నాగబంధనము వేశారు.దీనికి
హిమాలయాలలో ఉండే 42 అడుగుల దేవత నాగపామును బంధనముగా
వేశారు.ఇది మనల్ని భయపెట్టడానికి ప్రయత్నము చేస్తుంది.అపుడిదాకా అందరు భయపడకుండా ఉన్నచోటనే కదలకుండా నిశ్చల శిలలుగా
ఉండిపోండి.కొన్ని నిమిషాల తరవాత దీనికి విరుగుడు మంత్ర విధివిధానము గూడ ఏదో
ఏర్పాటు చేసి ఉంటారు.అపుడిదాకా అందరు ప్రశాంత వదనముతో శాంతముగా ఉండండి” అనగానే
గంజాయిస్వామి
వెంటనే “పెద్ద గురూజీ.మీరు భలే చెబుతున్నారే.అది ఏమైన చిన్న పామా?సుమారుగా అనకొండ మించిన అంత ఎత్తులో ఉంది.దాని ముందు మనమంతా గూడ చిన్న లిల్లిపూట్స్
లాగా ఉన్నాము.ఆబగా మనల్ని తినడము మొదలుపెడితే ఎవరుగూడ మిగలరు.ఇక్కడ ఉండటము నా వల్ల
కాదు.నాకు మణి వద్దు.నాకు నా ప్రాణాలే ఎక్కువ.నేను పోతాను.మీ చావు మీరు చావండి” అంటూండగానే
నిర్వాణలామా
వెంటనే “దేవా.నువ్వు కదిలితే దాని చూపు నీ మీదనే ఉంటుంది.నువ్వు అన్నపని చేసేదాకా
అది నిద్ర పోదు.మేమంతా బ్రతికిపోతాము.నువ్వు మాత్రమే దాని చేతిలో కాటు పడి
చస్తావు.నీ ఇష్టము.మా కోసము చావాలని అనుకుంటే నీ ఇష్ట ప్రకారము చేసుకో” అని చెప్పగానే
అన్ని
మూసుకొని మౌనఃభయముతో అందరు గూడ శిలాప్రతిమలాగా బిగిసిపోయారు.కాగితపాము మాత్రము
అందరిని చాల ఉగ్రస్వరూపముగా చూస్తూ విషాలు చిమ్ముతూ కోరలు బయటికి తీస్తూ అక్కడున్న
వారందరిని బెదిరించి భయపెట్టే ప్రయత్నము ఆపకుండా చేస్తోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి