46 భాగం

 

46

ప్రతి ఆశ్వయుజ పౌర్ణమికి లేదా కార్తీక పౌర్ణమి నాడు 'సర్వభిక్షు' పేరుతో నా సంఘ సభ్యులైన బౌద్ధ భిక్షువులతో, భిక్షణులతో సమావేశాలు ఏర్పాటు చెయ్యడము... అందులో వారికి వచ్చిన సాధన సందేహాలు లేదా ధర్మసందేహాలు తీరుస్తూ... కాలానికి అలాగే పరిస్థితులు తగ్గట్లుగా క్రొత్త లేదా పాత నియమాలలో ఏర్పాట్లు చేస్తూ మార్పులు చేస్తూ ఉండేవాడిని. ఇలా సమావేశములో ఒకరోజు వీరందరికి ప్రవచనము చెప్పడము ఆరంభించాను. అది ఏమిటంటే శూన్య ధ్యానము ఎలా చెయ్యాలో చెప్పడము ప్రారంభించాను.

           ధ్యానం ఒక్కటే అక్షయమని... తరగని సంపదయని... మనిషికి నిజమైన సుఖము నిచ్చేది ధ్యానం ఒక్కటేయని... ఈ ధ్యానమును 'ఎరుక' (తెలివితో) చెయ్యాలని పూర్ణ ఎరుకతో ధ్యానం చేస్తే సత్ ఫలితాలు కలుగుతాయని అదే సమాధి స్థితిలో శరీరాన్ని మర్చిపోవడం, శరీర స్పృహ కోల్పోవడము  చాలా తప్పుయని... శ్వాస మీద ధ్యాసయే ధ్యానముగా మార్చుకోవాలి అదియే నెమ్మది నెమ్మదిగా శూన్యంపైన ధ్యానం అవుతుందని తద్వారా మనలో ఆలోచనలు తగ్గి-ఆపై ఆలోచనలు ఆగిపోవడముతో శూన్య మార్గము ఏర్పడుతుందని... ఈ మార్గము ఒక సొరంగము లాంటిదని... ఇందులోనికి అనగా శూన్యంలోనికి మనస్సు ప్రవేశించగానే అది కాస్త దాని యదార్ధ చైతన్యం మేల్కొంటుందని... తద్వారా హృదయము జాగృతమవుతుందని... ఆపై మనస్సు పని చేయని స్థితిలో సత్యము ఒక మణి లాగా మెరుస్తుందని.... జ్ఞానం అదే మణి కాంతి లాగా తళుక్కుమంటుందని ఎరుకతో ధ్యానించడము వలన సమాధి, అచేతనస్థితి, మృత్యుభయము ఉండదని... ఏ క్షణములోనైనా వెనక్కి స్వస్థితికి అనగా మామూలు స్థితికి రావచ్చునని... అంటే మొదట శరీరంపైన ఆపై మనస్సు ఆపై బుద్ధి మీద ధ్యాన ధారణ నిల్పితే మనకి ఆఖరికి మార్పులేని ఆనందస్థితియైన శాంతిస్థితిని పొందడము జరుగుతుందని ఇదియే నిశ్చలస్థితియని.... అంటే మన మనస్సు ధ్యానముతో నిర్మలమై అది కాస్త నిశ్చలమవుతుందని... ఆపై శాంతిని పొందుతుందని... ఇందుకుగాను 12 రకాల ధ్యాన స్థితులు దాటుతూ ధ్యాన అనుభవాలు పొందవలసి ఉంటుందని ఇలాంటి నిశ్చలస్థితి పొందడమే శాశ్వతానంద స్థితి.... ప్రశాంతస్థితి.. శాంతిస్థితి అవుతుందని ఇదియే నిర్వాణ సుఖమని అని నేను ధర్మబోధ చేసేసరికి ఇది వింటున్న 3 వేల మంది గూడ పరమానందస్థితిని అనుభవించసాగారు. అంటే వీరందరిలో బుద్ధ(బుద్ధి) చైతన్యముతో నిండి పోయినదని నేను గ్రహించాను. దానితో వీరందరూ బుద్ధులు అయ్యారు అన్నమాట. నిజానికి బుద్ధుడు అంటే నేను కాదు. ఎవరైతే తమ అవివేక బుద్ధిని వివేక బుద్ధిగా ధ్యానముతో చేసుకుంటారో వారందరు గూడ బుద్ధులే అన్నమాట. ఆ తర్వాత వీరు పొందిన ధ్యాన అనుభవాలు బోధిస్తే వారందరు గూడ బోధి సత్వులే అన్నమాట.తను పొందిన అనుభవాలు అనుభూతిలోనికి వస్తే వారంతాగూడ నాలాగానే తథాగతులు అవుతారు అన్నమాట.

*** *** *** *** *** ***

ఈ రోజు కృష్ణాష్టమి

గావడముతో నిర్వాణలామా బృందము కాస్త హిమాచలప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఉన్న మణికైలాష్ పర్వత దర్శనము కోసము చేరుకోవడము జరిగింది.ఈ పర్వతములో ఆదిదంపతులైన పరమేశ్వరుడు,పరమేశ్వరి కాస్త మహాశివుడిగా గిరిజా మాత పేరుతో ఆవాసము చేస్తుంటారని స్థల పురాణగాధ.మహాశివుడికి వివాహము అయిన తరవాత ఈ మణిపర్వతము మీద దంపతులుగా ఆవాసము చేస్తున్నారు.మణికైలాష్ అను పేరులో కైలాష్ అంటే శివుడని మణి అంటే శివుడి కిరీటము మీద ఉన్న ఆభరణము అని అర్ధమున్నదని ఈ ఆభరణమైన మణి అనేది ఉదయము తొలి సూర్యకిరణాలు పడతాయని ఈ పర్వతము క్రింద ఉన్న రవి సరస్సులో ఈ మణి కాంతి పడుతుందని అలాగే ప్రతి పౌర్ణమి రోజున ఈ మణి మీద చంద్ర కిరణాలు పడి ఈ మణికాంతి అనేది సరస్సులో పడతాయని అలాగే కృష్ణాష్టమి తిధి నుండి రాధాష్టమి తిధి వరకు లోపల ఈ మణి కాంతి కిరణాలు మనకి సరస్సులో చాలా ఫ్రస్ఫష్టముగా కనబడతాయని మిగిలిన అన్ని రోజులలో ప్రతి 5ని||లకి మేఘాలు అడ్డు వచ్చి మనకి మణి కాంతి కిరణాల ప్రసారమునకు అవాంతరము కలిగిస్తుంటాయని  ఈ పర్వతము ఎవరు ఎక్కడానికి సాహసించరని అలాగే ఈ పర్వత పరిసరాలలో ఎవరు గూడ ఆవాసము చేయరని ఎందుకంటే ఈ పర్వతము మీద ఉండే మహాశివుడి ప్రశాంతతకు భంగము కలిగించకూడదని ఇక్కడి వాళ్ళు ఉండరని ఈ మణికైలాష్ పర్వతమును చూస్తూ నిర్వాణలామా చెపుతూంటే

ఆనందభిక్షువు వెంటనేగురూజీ.నిజముగానే ఈ పర్వతము మీద మహాశివుడు ఉన్నాడా?”అనగానే

మిత్రమా.హైందవ ధర్మ గ్రంధాల ప్రకారము చూస్తే మహాశివుడు కాస్త భస్మాసురుడి యొక్క అమితమైన భక్తికి మెచ్చి ఎడమ చేయి ఎవరి నెత్తిన పెడితే వాళ్ళు భస్మము అవుతారని వరము  వీడికి ఇవ్వడముతో వీడు సంతసించి ఈ వరము పనిచేస్తోందో లేదో అని మహాశివుడి మీద తన ఎడమ చేయి పెట్టడానికి ప్రయత్నించేసరికి మహాశివుడు కాస్త కైలాస పర్వతము నుండి పారిపోయి ఈ చంబా జిల్లాలో ఉన్న మణికైలాష్ పర్వతము దగ్గర ఉన్న సరస్సు దాటి ఈ పర్వతము లోపల ఉన్న గుహలోనికి దాక్కున్నాడని భస్మాసురుడు కాస్త శివుడిని వెంబడిస్తూ ఈ సరస్సు దగ్గరకి వచ్చి వెనుతిరిగి వెళ్ళిపోవడముతో తరవాత విష్ణుమూర్తి యొక్క మోహిని రూపముతో ఈ రాక్షస సంహారము  జరగడముతో మహాశివుడు ఊపిరి పీల్చుకున్నాడు.ఈ సంఘటనతో ఆయన కాస్త ధ్యాన నిష్ఠుడై మృత్యుంజయము పొందటానికి తీవ్రమైన యోగ ధ్యాన సిద్ధి పొందటము జరిగింది.మహామృత్యుంజయుడైనాడని స్థలపురాణ గాధ చెపుతోంది అనగానే

వెంటనే ఆనంధభిక్షువు గురూజీ.నిజముగానే ఈ పర్వతము మీద  కనిపించే మణికాంతి అనేది ఏదైన నిజమణి నుండి వస్తుందా?”

నిర్వాణలామా వెంటనే హైందవ ధర్మ పురాణాల ప్రకారము చూస్తే శివుడి సిగలో రుద్రమణి ఉంటుందని ఈ మణిని ధరించిన పర్వతమే మణికైలాష్ మని అంటారు.ఇది నిజమా కాదా అని కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేయడానికి అనుమతి పొంది కొంతదూరము వెళ్ళిన తరవాత ఏదో తెలియని అదృశ్యశక్తి తమని పైకి వెళ్ళనీయకుండా ఆపుతోందని తెలుసుకొని వెనుతిరిగి క్రిందకి వచ్చారు.ఆ తరవాత ఎవరు గూడ ఈ పర్వతము ఎక్కకుండా ఆంక్షలు పెట్టడము జరిగింది.ఒక పర్వతారోహకుడు ఈ పర్వతము మీద సగము పైకి వెళ్ళి అక్కడ ఒక అరుగు ఉన్నదని దాని మీద ఒక నంది విగ్రహము ఉన్నదని  ఆపై తను ముందుకు వెళదామని అనుకున్న ఏదో అదృశ్యశక్తి తన కాళ్ళను బంధించినట్లుగా అనుభవ అనుభూతి అయ్యేసరికి క్షమించమని వేడుకొనేసరికి ఆ బంధవిముక్తి అవ్వడముతో బ్రతుకుజీవుడా అనుకుంటూ వెనుతిరిగి రావడము జరిగినదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రముఖ పర్వతారోహకుడు తన ఆత్మ కథలో వ్రాసుకున్నాడు.కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయము ప్రకారము ఈ పర్వతము మీద ఎలాంటి మణి లేదని కేవలము అష్టమి తిధులలో ఒక నక్షత్రము ఈ పర్వతము దగ్గరికి వచ్చి అతిశక్తివంతముగా ప్రకాశము చేస్తుందని అందువలన ఈ నక్షత్ర కాంతియే మనకి మణికాంతిగా సరస్సులో కనబడుతుందని చెప్పడము జరిగింది.ఇందులో ఎవరి వాదన నిజమో ఎవరికి తెలియదు అనగానే

ప్రకృతి వెంటనే స్వామి.అయితే మనమంతా ఈ పర్వతము ఎక్కి మణి ఉన్నదో లేదో చూడవచ్చు గదా అనగానే

ప్రకృతి.ఈ పర్వతము ఎక్కాలంటే శివయోగమున్నవారు లేదా శివాంశ సంభూతులు లేదా శివయోగులు, శివయోగినులు లేదా శివైక్యము చెందేవారికి మాత్రమే అర్హత,యోగ్యత ఉన్నాయని  శివ గ్రంధాలలో చెప్పడము జరిగింది.అలాగే ఒక పాము ఈ పర్వతము ఎక్కి దానికి అర్హత లేక శిలలాగా మారిపోయినదని స్థలపురాణగాధ చెపుతోంది.గావాలంటే ఈ పర్వతమును నిశితదృష్టితో చూస్తే అది శివుడి మెడలో ఉండే వాసుకి సర్పాకారంగా ఉంటుందని అనగానే వీరందరు ఈ పర్వతముకేసి నిశితదృష్టితో చూడగానే శివుడి మెడలోని పాములాగా ఈ పర్వతము కనిపించసాగింది.

ప్రకృతి వెంటనే స్వామి.ఈ విషయాలు ఏవి నాకు తెలియవు.నేను ఈ పర్వతము ఎక్కి మణి దర్శనము చేసుకోవాలని అనుకుంటున్నాను.మీరు వచ్చిన లేదా రాకపోయిన గూడ అనేసరికి

నిర్వాణలామా మౌనము వహించాడు.

కాని ఆనంద భిక్షువు మాత్రము అమ్మతో నేను తోడుగా వెళతానని అంటూ వీరిద్దరు ఈ మణికైలాష్ ఎక్కడము ప్రారంభించారు.దానితో నిర్వాణలామా మాత్రము ఈ శిఖరము అడుగున ఉన్న సరస్సు ఒడ్డున కూర్చుని ధ్యానము చేయడము ప్రారంభించాడు.

ప్రకృతి మరియు ఆనందభిక్షువు కలసి సగము పైగా ఈ పర్వతమును ఎలాంటి ఆటంకము లేకుండా ఎక్కారు.ఆ తరవాత ఉన్నట్టుండి వీరికి మేఘాలు అడ్డు రావటము మొదలైంది.ఆ తరవాత మంచు గడ్డలు క్రిందకి దొర్లడము మొదలైంది.ఆపై ఉధృతముగా మంచు గాలులు వీచడము మొదలైంది.ఎన్ని ఆటంకాలు వచ్చిన ఎదురైన గూడ ప్రకృతి ఈ మణి సంగతి తేల్చుకోవాలని మనోసంకల్పము చేసుకుంది.ఆ తరవాత ఉన్నట్టుండి మంచు తుఫాను రావడము మొదలైంది.దీని దెబ్బకి ఆనందభిక్షువు కాస్త పర్వతము అడుగున ఉన్న సరస్సు దగ్గరకు వచ్చిపడ్డాడు.ఎదురుగా నిర్వాణలామా కనిపించేసరికి తను ఎక్కడ ఉన్నాడో తెలిసి ధ్యానము చేసుకోవడము ప్రారంభించాడు.కాని ప్రకృతి మాత్రము వీటికి భయపడకుండా ఓం-మణి-పద్మ-హుం అని మణి మంత్రమును ఎంతో శ్రద్ధా భక్తితో ఆపకుండా నిరంతరముగా చేస్తూనే ఉంది.ఈ పర్వతము మధ్యభాగములో ఉన్న అరుగు ప్రాంతము వరకు వచ్చింది.అక్కడున్న నంది విగ్రహమునకు నమస్కారము చేస్తుండగా కాళ్ళకి ముందుకి కదలనీయకుండా కాళ్ళబంధనము ఆపుతుండగా

వాసుకి నాగరాజా.నీవు సూక్ష్మ శరీరముతో నన్ను బంధనము చేస్తున్నారా? నీ స్వామి దర్శనము నాకు కానీయకుండా చేస్తున్నారా?”అనగానే కాళ్ళ బంధనవిముక్తి నెమ్మది నెమ్మదిగా జరుగుతోందని గ్రహించగానే

 ఒక అశరీరవాణితో ప్రకృతి.నీ శివభక్తికి మెచ్చినాను.కాని నువ్వు చింతామణిని దర్శనము పొంది ఆపై తీర్ధమును తీసుకుని తరవాతనే నా తండ్రియగు శివయ్య సన్నిధికి వచ్చే అర్హత,యోగ్యత లభిస్తుంది.నీ సంకల్పము మేర శివైక్యం చెందుతావు.అదిగో నా నిజమణి దర్శనము పొందే సమయము ఆసన్నమైంది అంటూండగా

ఈ పర్వతము యొక్క చంద్ర వంపు దగ్గర ఒక నక్షత్రము కాస్త అతి సమీపమునకు రావడము ఈ నక్షత్ర కాంతి కాస్త వంపు మీద పడేసరికి సరిగ్గా ఈ వంపు దగ్గర ఒక అంగుళము మేర ఉన్న తెల్లని వజ్రము మీద ఈ నక్షత్ర కాంతి పడేసరికి ఈ వజ్రము కాస్త మణిలాగా మెరవడము ఈ కాంతిని చూడలేక ప్రకృతి కళ్ళు మూసుకోవడము కళ్ళు తెరిచి చూసేసరికి తన ఎదురెదురుగా ఆనందభిక్షువు అలాగే నిర్వాణలామా కాస్త ధ్యానము చేస్తూ కనిపించేసరికి తను ఈ పర్వతము అడుగున ఉన్న సరస్సు దగ్గర ఉన్నానని అలాగే ఈ సరస్సులో అతి స్ఫష్టముగా తను పర్వతము మీద చూసిన మణికాంతి కంబడేసరికి తన ప్రమేయము లేకుండా ఈ మణికాంతికి నమస్కారము చేస్తుండగా వీరిద్దరు ధ్యానము నుండి కళ్ళు   తెరిచారు.ఎదురుగా నమస్కార భక్తిగా ఉన్న ప్రకృతిని చూసి ఈమె క్షేమముగానే ఉన్నదని గ్రహించి అసలు జరిగిన విషయము ఏమిటో ఈమెను అడుగుతూ అందరు కలిసి కైలాస పర్వతములో ఉన్న రహస్యగ్రామ దర్శనానికి కాల చక్రములో దొరికిన రూట్ మ్యాప్ అధారముగా ముందుకి బయలుదేరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి