12 భాగం

 

12

ఇది ఇలా యుంటే...ఇలా వచ్చిన 1000  మంది రాజ కన్యలకి నా చేతుల మీదుగా బహుమతులు ఇమ్మని మా అమ్మ కోరడముతో... ఎవరికి ఏమి ఇవ్వాలో తెలియని స్థితిలో ఉన్న నన్ను చూసిన యశోధర వెనువెంటనే ఎవరికి ఏమి బహుమతులు ఇవ్వాలో తనే నిర్ణయించి నా చేతుల మీదగా ఇప్పించడము ప్రారంభించింది. ఇలా 'సోమ' అనే రాజకన్యతో మొదలై 'షీలా' అనే రాజకన్యకు బహుమతులు ఇవ్వడము ముగిసింది. బహుమతులు అయిపోయాయి.

ఇంతలో.....అనూహ్యంగా నన్ను ఇరకాటములో పెట్టడానికి అన్నట్లుగా వేదిక మీదికి యశోధర వచ్చి అందరి ముందు...."రాజకుమారా. నాకేమిస్తారు?" అని అడిగింది.

ఇవ్వడానికి ఏముంది. నా హృదయము తప్ప అన్పించి ఆమె మెడలో నా మెడలో అపురూపముగా చూసుకొనే ముత్యాలమాల వేశాను. దానితో ఆమె కంగారు పడింది. తత్తరపడింది. సిగ్గు, భయముతో తల వాల్చి "రాజకుమారా. బహుమతులు లేని సమయములో మీ సమయస్పూర్తి, మీ వివేకబుద్ధి ఎలా ఉంటుందో చూడాలని అన్పించింది. నా మనస్సు దోచుకున్నారు అంటూ తన మెడలో ఉండే రత్నాలహారమును నాకు వేస్తూ "రాజకుమారా. ఇది మణిహారము గాదు. నా హృదయ మణి" అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దానితో మా ఇద్దరి అనురాగ ప్రేమ వ్యవహారము మా అమ్మకి తెలియడముతో... ఏ మాత్రము ఆలస్యము చెయ్యకుండా మా ఇద్దరికి అంగరంగ వైభవముగా.... అదిగూడ రాజవంశాలకు క్రొత్త ఒరవడిగా.... సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారముగా.... మా వంశ రాజరిక తొలిప్రేమ వివాహము జరిగింది.

*** *** *** *** *** ***

ఒకప్రక్క త్రివేది పోలీసులకి

మరొకప్రక్క దేవదత్త అనుచరులకి

ఇంకొక ప్రక్క కులకర్ణి బృందానికి

నిర్వాణలామా బృందము ఎక్కడ ఉన్నదో తెలియడము లేదు.నగరమంతా ఎవరికివారే జల్లెడ పట్టిన ఇసుమంత ఫలితము లేకపోయేసరికి ఎవరికి వాళ్ళు తీవ్రమైన అసహన స్థితిలోనికి చేరుకున్నారు.తమ కోపాలను ఎవరిమీద చూపించాలో అర్ధముగాక తమలో ఇముడ్చుకోలేక అవస్థలు పడుతున్నారు.

ఇది ఇలాయుండగా

దేవదత్తకి విపరీతమైన ఆవేశము కల్గి తనకెదురుగా ఉన్న చైనీస్ బాక్స్ ను బలముగా నేలకేసి కొట్టగా..దాని మూత తెరుసుకొని అందులోంచి మిగిలిన ఏడు బాక్స్ లు బయటికి వచ్చేసరికి దేవదత్తలో అమిత ఆనందము వేసి అంటే ప్రతి పెట్టెను ఇలాగే నేలకేసి బలముగా కొడితే ఈ పెట్టెలు  తెరుసుకుంటాయని ఆనంద ఆవేశములో ఈ పెట్టెను బలముగా మరొకసారి కొట్టగా ఏ మాత్రము తెరుసుకొనకపోయేసరికి ఆశ్చర్యముపోతూ మళ్ళీ మళ్ళీ బలముగా ఈ పెట్టెను నేలకేసి కొట్టిన ఎలాంటి ఫలితము కనిపించకపోయేసరికి ఇందులో ఎదో మర్మమున్నదని తన గది సి.సి కెమెరా పుటేజీ తెప్పించుకొని ఇంతకుముందు జరిగిన దృశ్యమును చూస్తూండగా మొదటసారిగా ఆవేశములో విసిరికొట్టిన పెట్టె కాస్త కుర్చి యొక్క కొనకి తగిలి అది నేల మీడ పడే లోపుల బాక్స్ తెరుసుకున్న దృశ్యము చూసేసరికి దేవదత్తకి ఆశ్చర్యమేసినది.దానితో ఈ దృశ్యమును మళ్లీ మళ్లీ చూస్తూ నిశిత దృష్టితో చూడగా ఈ బాక్స్ చుట్టూ ఉన్న అష్ట మంగళ వస్తువుల రేఖాచిత్రాలున్నాయని వాటిలో మొదటి దాని బాక్స్ యొక్క డీకోడ్ శంఖము గావడముతో ఈ రేఖా చిత్రము యధాలాపముగా కుర్చి చేతి కొనకు తగిలేసరికి ఈ బాక్స్ తెరుసుకున్నదని విషయము తెలుసుకొనేసరికి దేవదత్తకి నోటమాట రాలేదు.ఇలాగూడ రేఖా చిత్రాలతో బాక్స్ లను లాక్ చేయవచ్చని తెలుసుకున్న అంబేద్కర్ అధ్భుత నైపుణ్య శక్తిని మనస్సులో పొగడకుండా ఉండలేక పోయాడు. దానితో ఒక్కొక్క బాక్స్ మీద ఉన్న ఆధార శ్లోకమును చదువుతూ అష్ట మంగళ వస్తువులలో అది దేనిని సూచిస్తున్నదో ఉహించి ఆ బాక్స్ యొక్క రేఖా చిత్రమును బలముగా ఒత్తేసరికి ఆ బాక్స్ తెరుసుకోవడము ఇలా అష్ట బాక్ల్స్ తెరుసుకొనేసరికి దేవదత్త ఆనందానికి పట్టపగ్గాలు లేవు.ఎందుకంటే అందులోనే మణి ఉంటుందని అనుకున్నాడు.

కాని మణికి బదులుగా ఎ.బి.సి. బాంక్ లాకర్ కీ దర్శనమిచ్చేసరికి చేసేది ఏమిలేక దేవదత్త వెంటనే తన అంగుళీమాలకు ఫోన్ చేసి తన దగ్గర బాంక్ కీ తీసుకొని లాకర్ ఓపెన్ చేసి అందులో ఏమున్నదో తెలుసుకొమ్మని అనుఙ్ఞ ఇచ్చి ఆలోచనలో పడ్డాడు.ప్రారంభ పరిశోధనకే ఇంత జాగ్రత్తలు తీసుకొంటే అంబేద్కర్ రాబోవు మణి శోధన విషయాలు ఇంతకంటే బ్రహ్మాండమైన చిక్కు ముడులు ఎన్నింటినో పెట్టి ఉంటాడు గదా అనుకోగానే..దేవదత్త శరీరము ఒక్కసారిగా జలదరించి ఇలాగైతే మన వలన మణి శోధన జరగదని..ఎన్నడికి మణి రహస్యము ముందుకి జరగదని..దీనికి అర్హత యోగ్యత ఉన్న నిర్వాణలామాను ఆశ పెట్టి లేదా భయపెట్టి లేదా బాధ పెట్టియైన ది బుద్ధ కోడ్ ను డీకోడ్ చేసి ఎలాగైనా ఆ మణిని చేజిక్కించుకోవాలని బలముగా నిశ్చయించుకొని నిశ్చింతగా పడుకున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి