26 భాగం

 

26

సాయంత్ర సంధ్యవేళకి నేను నా ధ్యానమునుండి కళ్లు తెరచి చూడగా ఎదురుగా ఒక నిజ సన్యాసి కన్పించి

"నాయనా. ఎవరు నీవు. ఎవరి కోసము వచ్చావు. అనగానే

"స్వామి. నా పేరు సిద్ధార్థుడు. మా నాన్నగారి పేరు శుద్ధోధనుడు. మా అమ్మగారి పేరు గౌతమి. నేను కపిలవస్తు యువరాజు. ఇప్పుడు సన్యాసిని. నాకు సద్గురు అనుగ్రహం కోసము అలామా కలామ అను యోగిని కలవడానికి వచ్చాను అనగానే....

మంచిది నాయనా. నేను ఆయన శిష్యుడినే నా పేరు భార్గవ. నా వెంట వస్తే మన గురువుగారు ఉండే ఆశ్రమానికి తీసుకొని వెళ్తాను. ఇక్కడ నుండి సుమారుగా తొమ్మిది రోజులపాటు ప్రయాణము చేస్తేకాని ఆయన ఆశ్రమానికి చేరుకోలేము అంటూ మేమిద్దరము ఆ వైపుగా ప్రయాణము కొనసాగించాము.

దారిలో ఈయన బోధనల ద్వారా సన్యాసులు ఎలాంటి పండ్లు తినాలో, ఏవి తినకూడదో, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ప్రతిరోజు సన్యాసులు చేసే దినచర్యలు, భిక్షాటన గూర్చి, ధ్యాన విధి విధానాలు గూర్చి నాకు ఒక అవగాహన కల్పించారు. ఇలా మా తొమ్మిది రోజుల ప్రయాణము పూర్తికాగానే వైశాలి నగరములో ఉండే అలామా కలామ ఆశ్రమానికి మేమిద్దరము చేరుకోవడము జరిగింది.

*** *** *** *** *** ***

నిర్వాణలామా బృందము రాత్రి దాకా బుద్ధగయ క్షేత్రములో ఉండి రాత్రి అవ్వగానే ఎవరికి అనుమానము రాకుండా కాశీక్షేత్రము వైపుకి వెళ్ళే  రహదారి దగ్గరకి చేరుకున్నారు.ఏదైనా కంటైనర్ ఉన్న ట్రక్కు ఎక్కి లోపల కూర్చుంటే పోలీసులు పట్టుకోలేరని వీళ్ళ ఆలోచన.దానితో ఖాళీగా ఉండే కంటైనర్ ట్రక్కు కోసము ఎదురు చూస్తుండగా మధ్య రాత్రి సమయానికి ఇలాంటి వాహనము వారికి కనిపించినది.ఈ డ్రైవర్ 20వేలు అడిగితే జేసి వెంటనే వాడికి ఆ డబ్బులు ఇచ్చి ఖాళీ కంటైనర్ లోపల అందరు కూర్చున్నారు.కంటైనర్ వేగముగా పోతుంది.అంతే వేగముగా వీళ్ళందరు గూడ మంచినిద్రలోకి జారుకున్నారు.ఒక గంట తరవాత కంటైనర్ ఆగిన శబ్దము వినగానే అంతలోనే జేసి సిక్స్త్ సెన్స్ నిద్రలేపి అనుమాన సూచనలు ఇవ్వడము అలాగే నిర్వాణలామా మనస్సు ఏదో ప్రమాద సూచనలు ఇవ్వడముతో వీరిద్దరికి అంత గాఢ నిద్రలో ఎవరో తట్టి లేపినట్లుగా మెలుకవ వచ్చేసరికి    ఎదో అనుమానము వచ్చిన జెసి వెంటనే కంటైనర్ కి ఉన్న చిన్నపాటి కిటికీ తెరవగానే ఈ ట్రక్కు రహదారి మీద లేదని ఏదో అడవిలో ఉన్నదని దీనిచుట్టూ పోలీసులు అలాగే తమ సంస్థ అధికారులు కార్డులతో గన్ లతో ఈ కంటైనర్ చుట్టుముట్టిన దృశ్యము చూసిన జేసి వెంటనే నిద్రలో ఉన్నవారి అందరిని అలర్ట్ చేస్తుండగానే ఈ కంటైనర్ తలుపు తెరుచుకోవడము ఈ డ్రైవర్ కే తుపాకి గురి పెట్టేసరికి జేసికి అసలు విషయము అర్ధమైనది.అంటే తమ బృందమును పోలీస్ ట్రాప్ లో పడేటట్లుగా తన బాస్ అయిన కులకర్ణి కుట్రయని గ్రహించి చేతులు పైకి ఎత్తుతూ అందరూ గూడ ఈ కంటైనర్ దిగడము మొదలుపెట్టారు.ఇకలోపల ఎవరులేరని ఏ వస్తువులు లేవని పోలీసు డ్రైవర్ గమనించి వీళ్ళని ఒకచోట మోకాళ్ళమీద కూర్చోమని సైగ చేసి మిగిలిన అక్కడున్న పోలీసులకి అధికారులకి సైగ చేయగానే

వాళ్ళ అందరిని చూస్తున్న నిర్వాణలామా మనస్సులోనే సుమారుగా వీళ్ళంతా గూడ 20 మందికి మించిలేరని వీళ్ళ చేతిలో ఆధునిక తుపాకులు మాత్రమే ఉన్నాయని గ్రహించి

జేసితో జేసి.వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను.కంగారుపడకండి.మన కాశీయాత్రకి ఎలాంటి ఆటంకము ఉండదు అంటూ

 ఒకసారిగా బలముగా గుండెలనిండా గాలిని పీల్చుకొని బలముగా తమ కాళ్ళతో నేలను కొట్టగానే బంతి నేలను తాకి ఆకాశములోకి ఎగిరినట్లుగా గాలిలో 42 అడుగుల ఎత్తు ఎగిరేసరికి ఈ హఠాత్తు పరిణామము ఊహించని పోలీసు అధికారులు అసలు అక్కడ ఏమి జరుగుతుందో తెలుసుకొనేలోపల జేసి, ఆనందభిక్షువు, గంజాయిస్వామి నెమ్మదిగా పారిపోయి చెట్ల పొదలలోకి వెళ్ళిపోయి ఏమి జరుగుతుందో శ్రద్ధగా చూడసాగారు.

దానితో నిర్వాణలామా చిరునవ్వు నవ్వుతూ గాలిలో నుండి నేలమీదకి వస్తూనే ముగ్గురి పోలీసులమీదకి ఎటాక్ చేసేసరికి వీళ్ళ గుండెలమీద పది టన్నుల బరువుపడినట్లుగా ఫీల్ అవుతూ క్రింద  పడిపోవడము ఇది గమనించిన పోలీసులు కొంతమంది తమ చేతిలోని తుపాకులకి పని చెప్పగానే నిర్వాణలామా ఏమాత్రము కంగారు పడకుండా, భయపడకుండా తన ఖాళీచేతులనే చురకత్తులుగా వాడుతూ ఈ బుల్లెట్లను రెండుగా చీల్చే విధానము చూసిన జేసి ఆఫీసర్ బిత్తరపోవడము గమనించి

ఆనందభిక్షువు వెంటనే జేసి మేడమ్.కంగారుపడకండి.మార్షల్ ఆర్ట్స్ లో ఉద్దాయన అనే విద్య ఉంది.ఈ విద్యకోసము 48 నెలల పాటు కేవలము నాలుగు వేపాకులు తిని సాధన చేయాల్చి ఉంటుంది.అపుడు శరీరము తేలిక అయ్యి వజ్రకాయముగా మారుతుంది.1000 ఏనుగుల బలము కలుగుతుంది.గుండుసూదిని తమచేతులతో రెండుగా చీల్చే సామర్ధ్యము వస్తుంది.అలాగే గాలిలో భూమి మీద 42 అడుగుల ఎత్తువరకు ఒక కోతి పిల్లలాగా ఒక చెట్టు నుండి మరో చెట్టుకి అలాగే ఒక కొండ నుండి మరో కొండకి ఎగిరే సామర్ధ్యము వస్తుంది అని అంటూండగానే ఇది నిజమని అనునట్లుగా నిర్వాణలామా ఒక పెద్దచెట్టు నుండి మరొక చెట్టుమీదకి ఏమి ఆధారము లేకుండా ఒక పెద్దకోతిలాగా ఎగురుతుండేసరికి మార్షల్ విద్య అంటే ఇదే కాబోలు అనుకుంటూ.. దీని గొప్పతనము ఏమిటో ప్రత్యక్షముగా చూడటముతో జేసి ఆశ్చర్యముగా చూస్తూ ఉండిపోయింది.

పోలీసు అధికారుల తుపాకుల గుండ్లుకి దొరకకుండా  నిర్వాణలామా ఒక చోట స్థిరముగా నిలబడకుండా అందినపుడల్లా దొరికిన వాళ్ళని దొరికినట్లుగా ప్రాణాపాయము లేకుండా వాళ్ళని తనకి తెలిసిన మర్మ కళ విద్యతో నరాలునొక్కి స్పృహ కోల్పోయేట్లుగా చేస్తూ ఉగ్రమూర్తిగా మారే సమయములో గూడ తమ శాంతమూర్తి తత్వమును ప్రదర్శిస్తున్న నిర్వాణలామాను చూసిన జేసి తన మనస్సులో అబినందించకుండా ఉండలేకపోయింది.

ఇదంతా చూస్తున్న గంజాయి స్వామి వెంటనే ఆనందభిక్షువుతో చిన్నగురువా.మన పెద్దగురువు  వాళ్ళకి దొరుకుతారా లేదా?” అనగానే

గంజాయిస్వామి.మా గురువుగారు మార్షల్ ఆర్ట్స్ లో రారాజులుగా వెలుగొందిన బ్రూసులీ,జాకీచాన్ లను తయారు చేసిన దేశాలలో శిక్షణ పొందిన యువరాజు.ప్రాణాలు పోతే వారికి పోవాలిగాని మన గురువుకి ఎలాంటి అపాయము కలుగదు.కేవలము వాళ్ళని మన గురువు ప్రేమతో శాంతముగా వీలుదొరికినప్పుడల్లా స్పృహ కోల్పోయేవిధముగా చేస్తున్నారు అనగానే 20 మంది అధికారులను 20ని.లలో స్పృహ కోల్పోయే దృశ్యము చూసిన గంజాయి స్వామి బిత్తరపోవడము అతడివంతు అయినది.

నిర్వాణలామా సైగ అందుకున్న వీరంతా నిర్భయముగా చెట్టు పొదల నుండి బయటికి వచ్చిరాగానే జేసి తనకి తెలిసిన స్నేహితురాలి నుండి జిపియస్ లేని కారును తెప్పించుకొని మహా స్మశానక్షేత్రమైన మహాకాశీ వైపు ప్రయాణించడము మొదలుపెట్టారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి