31 భాగం

 

31

వైశాలి ప్రాంతము నుండి నా ప్రయాణము కాస్త బింబసారుడు అనే మహారాజు పరిపాలించే మగధ రాజ్యము వైపు నా ప్రయాణము కొనసాగింది. ఈ రాజ్యములో ఉన్న అన్ని ఆశ్రమాలలో ఆశ్రయించి యున్న గురువులను, వేదగురువులను, యోగ గురువులను కలిశాను. వారు చేస్తున్న సాధనలు అనగా సగము నీటిలో మునిగి మంత్రసాధన చెయ్యడం, పూర్తిగా నీటిలో జలసమాధి సిద్ధి ద్వారా సాధన చెయ్యడం, ఆహారము లేకుండా ఉపవాస దీక్షతో సాధన చెయ్యడం, దిగంబర సాధన, ఒంటి కాలిపై తపస్సు, పంచాగ్నుల మధ్య సాధనలను అన్ని గూడ నేను చేస్తూ వచ్చినను ఎట్టి ప్రయోజనము కనిపించలేదు. నా జీవిత ప్రశ్నలకి సరియైన జ్ఞానస్ఫురణ సమాధానాలు దొరకలేదు. దానితో వీళ్ళల్లో ఎవరు నా యోగ గురువులు లేరని గ్రహించాను.

                    ఒకరోజు అనుకోని విధంగా నేను భిక్షకి వెళ్లితే రాజఠీవిలో  ఉన్న నన్ను చూసి బింబసారుడు నన్ను సమీపించి మహాత్మా. మీరు చూస్తుంటే రాజపుత్రుడిలాగా ఉన్నారు. అలాంటి మీరు ఇలా సన్యాసదీక్షలో ఉండటములో ఉన్న అంతరార్ధము ఏమిటి తెలుసుకోవచ్చునా?” అనగానే....

మహారాజా. నేను శుద్ధోధన మహారాజు యొక్క కుమారుడిని. నా పేరు సిద్ధార్థుడు. నేను జీవిత ప్రశ్నలకి సమాధానము కోసము ఈ సన్యాసమును స్వీకరించి సత్యాన్వేషణకి బయలుదేరినాను. మీ రాజ్యములో ఎంతో మంది గురువులుంటారని తెలుసుకొని ఇక్కడికి రావడము జరిగింది. కాని నాకు సరియైన సద్గురువు ఇక్కడ లభించలేదు ఏమి చెయ్యాలో తోచడము లేదు. అనగానే...

మిత్రమా. మనకి దూరపు బంధుత్వాలున్నాయి.సిద్ధార్ధ. చింతించకు. ఇక్కడికి దగ్గరిలో యున్న రాజగృహ ప్రాంత సమీపంలో ఉద్రక రామపుత్ర అనే సద్గురువు ఉన్నారు. వారు మీ సమస్యకి ఏదైనా పరిష్కారము చూపగలరు. అంటూ...

స్వామి. మీ జీవిత ప్రశ్నలు ఏమిటో నాకు కాస్త వివరించగలరా?”

మహారాజా. మనిషికి కష్టాలు ఎందుకు కలుగుతాయి. దేనివలన కలుగుతాయి? మనిషికి మరణము, రోగము, ముసలితనం లేనిస్థితి ఉంటుందా? ఉండదా? జీవితం శాశ్వతం కాదని అందరికి తెలుసుకానీ ఎప్పుడు పోతామో ఎవరికీ తెలుసు. అందువలన మనుష్యుల కష్టాలు, కన్నీరు తొలగించాలి. అందుకు ఏది మార్గం అనేది నా సత్యాన్వేషణ అని చెప్పగానే.... మహారాజు ఎంతో సంతోషించి....

మిత్రమా. మీ ప్రశ్నలు నాకు నచ్చాయి. మీకోసము గాకుండా జనాల కోసము సత్యాన్వేషణ చెయ్యడము నాకు బాగా నచ్చింది. మీ పట్టుదల నచ్చింది. నన్ను మీ శిష్యుడిగా స్వీకరిస్తే... నా రాజ్యములో సగభాగం అలాగే అర్ధసింహాసనం మీకు సమర్పిస్తాను అనగానే...

నేను కాస్త రాజా. అశాశ్వతమైన వాటిని వదిలి శాశ్వతమైన దానిని అన్వేషించడమే నేను ఎపుడు చేశాను. అంటూ భిక్షాపాత్ర పట్టుకొని ముందుకి సాగిపోయాను. ఆ తర్వాత ఈయన నన్ను తరుచుగా వచ్చి కలువడము వలన నా ఏకాంత సాధనకి భంగము కలిగే ప్రమాదమున్నదని గ్రహించి ఆరోజు రాత్రే అక్కడ నుండి బయలుదేరి రాజగృహ ప్రాంతము వైపు బయలుదేరాను.

*** *** *** *** *** ***


చింతామణి                                        రుద్రమణి                            నాగమణి

సార్.నాకొక సందేహము.చింతామణికి అలాగే రుద్రమణి మరియు నాగమణి కి గల సంబంధము ఏమిటి?”అనగానే..



నాధ్.నాకు గూడ ఈ సందేహము వచ్చినది.దీనికి సమాధానము కాలచక్రమే చెప్పినది.అది ఎలా అంటే కాలచక్ర నిర్మాణములో అంతిమముగా నీలిరంగు డ్యోర్జి అలాగే పసుపు రంగు డ్యోర్జిను పెట్టడము జరిగినది.ఇందులో నీలి రంగు డ్యోర్జి అనేది నాగమణి రంగు అయితే పసుపు రంగు డ్యోర్జి అనేది రుద్రమణి రంగు సూచన అని నా పరిశోధనలో తెలుసుకున్నాను.దీనినే భోధిసత్వుడు కాస్త చింతామణిని అలాగే అవలోకితేశ్వరుడు కాస్త రుద్రమణిని అలాగే క్షితిగర్భ కాస్త నీలి రంగు మణిని అదే నాగమణిని ధరించినట్లుగా గ్రహించాను.

సార్.అయితే చింతామణి కాస్త కైలాస పర్వతములో ఉంటే మరి మిగిలిన ఈ రెండు మణులు ఇంక ఎక్కడ ఉన్నాయి అని నేను అడిగితే

నాధ్.ఇతమిద్ధముగా చెప్పలేను.అవి గూడ హిమాలయ పరిసర ప్రాంతాలలో ఎక్కడో ఒక చోట ఉండి ఉండాలి అనగానే

సార్.బౌద్ధ ధర్మము ప్రకారము చింతామణి అంటే సహస్ర పద్మములోని మణి అని అన్నారు గదా అనగానే

నాధ్.చింతామణి అంటే చింతలు తొలగించే మణి యని అర్ధము.ఇది యోగ పరిభాషలో సహస్ర చక్రములోని అనగా మెదడు మధ్య భాగములో ఉండే పిట్యుటరి గ్రంధియే మన శరీర చింతామణి అవుతుంది.అలాగే రుద్రమణి అంటే మన హృదయములోని అష్టదళ పద్మము మధ్యలో ఉండే హృదయగ్రంధి అన్నమాట.ఇక్కడ ఇష్ట కోరికలు తీర్చే కామినికామ దేవతలుంటారు.ఇదే హైందవ ధర్మములో అయితే ఇష్టకామేశ్వరుడు ఇష్టకామేశ్వరి అయితే బౌద్ధ ధర్మములో అయితే అవలోకితేశ్వరుడు మరియు అవలోకితేశ్వరి అన్నమాట.ఇక నాగమణి అంటే మన శరీరములోని కంఠములోని  థైరాయిడ్ గ్రంధియే శరీర నాగమణి అవుతుంది.నిజానికి నాగపాముల తలమీద నాగమణి ఉండదు.దాని కంఠ భాగములో ఈ మణి ఉంటుంది.పైగా స్వాతి నక్షత్రము రోజున దేవతా సర్పము అయి ఉండి 100 సం||ఆయుష్ ఉన్న నాగపాము నోటిలోకి వర్షపు నీటి చుక్క చేరితే దానిలోని విషము కాస్త నీలిరంగుమణిగా మారి అదే నాగమణిగా దాని కంఠమునందు ఏర్పడుతుందని నాగశాస్త్రము చెబుతోంది.అంటే ముత్యము ఎలా అయితే ఏర్పడుతుందో అలా ఈ నాగమణి గూడ ఏర్పడుతుందని నేను తెలుసుకున్నాను.

సార్.అసలు ఈ మూడు మణులకి సాధనకి గల సంబంధము ఏమిటి?”

నాధ్.యోగపరిభాషలో చెప్పాలంటే శాశ్వత మరణము అనగా మహానిర్వాణము చెందాలంటే ఈ మూడు మణుల సాధన స్థాయిని సాధకుడు పొందాలి అని నా పరిశోధనలో తెలుసుకున్నాను.అంటే చింతామణి శిల ఎనిమిది రకాల కోరికలు తీరుస్తుంది.ఇందులో మృత్యుజయం అనగా శాశ్వత మరణ అవస్థను తీర్చే కోరిక గూడ ఒకటి.ఈ కోరికను ఎవరైతే కోరుకుంటారో  వారికి రుద్రమణి ఉన్నచోటుకి వైపుకి దారి చూపుతుంది.ఇక్కడ శివైక్యము చెందకుండా ఇష్టకామ మాయ దాటిన వారికి నాగమణి ప్రాంతము వైపుకి దారి చూపడము జరుగుతుంది.అక్కడ ఈ మణి వలన మహామృత్యువును సాధకుడు పొందుతాడు అన్నమాట.యోగపరిభాషలో చెప్పాలంటే మొదట సహస్ర చక్రము అనగా మెదడులోని చింతామణి యైన పిట్యుటరి గ్రంధి విబేదనము చెందాలి.అపుడు అందులోంచి 36 తత్వాలు ఉన్న మనస్సు బయటికి వస్తుంది.అది ఇన్నాళ్ళుగా బంధించబడి ఉంటుంది.ఇపుడు దానికి బంధవిముక్తి కలుగుతుంది.ఇది కాస్త హృదయచక్రములోని అష్టదళపద్మములో ఉండే హృదయగ్రంధి అనే రుద్రమణికి చేరుతుంది.ఇక్కడున్న అష్ట మాయలను గూడ మనస్సు దాటవలసి ఉంటుంది.ఇక్కడే మన బుద్ధుడు మాయలో పడ్డాడు.అనగా కోరికలే కష్టాలకి కారణమని తెలుసుకొని కోరికలేని సమాజము చూడాలనే ఇష్ట కోరికతో మళ్ళీ ధ్యానము చేయడము ప్రారంభించాడు.అంటే ఇష్ట కోరిక మాయ ప్రభావము ఎలాంటిదో మనము ఊహించుకోవచ్చును. ఇలా ఈ చక్రమునందు ఉన్న అష్ట ఇష్ట కోరికల మాయలుంటాయని బుద్ధుడు కాస్త తన కాలచక్ర నిర్మాణములో అస్టదళ పద్మము ఉంచి అందులో అష్ట బిందువులు ఉంచడము జరిగినది.ఎవరికైతే మనస్సు ఈ అష్ట మాయలు దాటుతుందో అపుడు కంఠములోని థైరాయిడ్ గ్రంధి అనగా నాగమణికి మన మనస్సు చేరుతుంది.థైరాయిడ్ గ్రంధియే శరీరములోని హార్మోన్స్ ని కంట్రోలు చేస్తుంది.మనస్సు నిశ్చల స్థితి లేదా అనిశ్చల స్థితి పొందాలన్న అనేది ఈ థైరాయిడ్ గ్రంధి మీదనే ఆధారపడి ఉంటుంది.బౌద్ధధర్మము ప్రకారము అయితే శూన్యతభావ స్థితి అనగా అనిశ్చల స్థితి అలాగే పూర్ణ శూన్య స్థితి అనగా నిశ్చల స్థితి అనేది థైరాయిడ్ గ్రంధియైన నాగమణి ఇస్తుంది.గాకపోతే మెదడులోని పిట్యుటరి గ్రంధి నుండి అమృతము కారుతుంది.ఈ అమృత బిందువులు కాస్త కొండ నాలిక ప్రాంతమునకు చేరుతాయి. ఈ బిందువులను అందుకోవడానికి సాధకుడు తన నాలుకను వెనక్కి మడిచి కొండనాలికను తాకించే    ప్రకియ అదే ఖేచరీ ప్రక్రియ సాధన చేయాల్చి ఉంటుంది.ఈ అమృత బిందువులు సేవించిన వారంతా అమరత్వమును పొంది శంభల గ్రామవాసులుగా అంటే శరీరములేని స్థితి,మరణము లేని స్థితి,జనన మరణాలు లేని స్థితి పునఃజన్మ లేని స్థితి పొందుతారు.అంటే వీరికి ఏ రూపము ఉండదు.కాని భావ ఆలోచనలకు తగ్గట్లుగా రూపాంతరము చెందుతారు అన్నమాట.ఈ స్థితి గూడ వద్దు నిశ్చల స్థితిలో ఉండాలంటే ఈ అమృత బిందువులు కాస్త విషపూరితమవ్వాలి.ఈ పని థైరాయిడ్ గ్రంధియైన శరీర నాగమణి చేస్తుంది.కొండనాలుక నుంచి వచ్చే అమృత బిందువులు సాధకుడూ సేవించకపోతే అవికాస్త థైరాయిడ్ గ్రంధికి చేరి అవి విషపూరితముగా అనగా భౌతిక మృత్యువుకే మహా మృత్యువును ఇచ్చే మృత్యుంజయ స్థితికి ఈ బిందువులు విషముగా మారతాయి.ఈ విషము కాస్త సాధకుడు పంటికి చేరతాయి.ఆపై చెవికి అటుపై కన్నుకి చేరి ఆపై మెదడు భాగానికి చేరి ఆఖరికి హృదయమునకు చేరి అన్నింటిని విషపూరితముగా  మారుస్తాయి.దానితో అక్కడున్న మనస్సు గూడ విషమయము అయ్యి బ్రహ్మ రంధ్రము వద్ద ఉండే చితాగ్నిలో మనస్సు గూడ శాశ్వత మరణమును పొందుతుంది.దానితో మనస్సు లేని స్థితి అలాగే భావము లేని స్థితి సాధకుడు పొందుతాడు.అందుకే హైందవ ధర్మములో దశేంద్రియాలు అనగా పంచ కర్మేంద్రియాలు అనగా కన్ను,ముక్కు,చెవి,నోరు,చర్మముగా అలాగే పంచ ఙ్ఞానేంద్రియాలు అనగా చూడటం,వాసన,వినడం,రుచి,స్పర్శ అనే దశేంద్రియాలు ఉంటే అదే బౌద్ధ ధర్మములో వీటికి తోడుగా మనస్సు అలాగే భావము అనే రెండు ఇంద్రియాలు కలిసి మొత్తము ద్వాదశేంద్రియాలుగా చెప్పడము జరిగినది.ఇలాంటి మనస్సు,భావము లేని స్థితిని ఎవరైతే పొందుతారో అనగా పూర్ణ శూన్య స్థితికి చేరుకుంటారో వారి శరీరము కాస్త నాగమణి(థైరాయిడ్ గ్రంధి)విష ప్రభావము వలన నీలిరంగుగా మారిపోతుంది.మన బుద్ధుడు అన్ని తెలిసిన గూడ కుంచె భక్తుడు తనకి విష పదార్ధమును పెడుతున్న గూడ నవ్వుతూ స్వీకరించాడు.కారణము ఇదే.  తను శాశ్వత మరణమును అనగా మహానిర్వాణమును పొందాలని అనుకున్నాడు.అందుకు తన శరీరము విషపూరితమవ్వాలని తెలుసుకున్నాడు.అందుకే ఈ విషయాన్ని కాలచక్ర నిర్మాణములో అంతములో నీలిరంగు డ్యోర్జిని పెట్టి లోకానికి చెప్పనట్లుగా చెప్పడము చేశాడు.అదేవిధముగా హైందవ ధర్మములో గూడ సాగర మధనములో వచ్చే హాలాహలమును మహా శివుడు త్రాగగానే దానిని అమ్మవారు తన చేతులతో కంఠమునందు నిల్పి ఉంచినట్లుగా చెపుతారు గదా.ఆనాటి నుండి ఆయన నీలి కంఠుడైనాడని లోకవిదితమే గదా.ఇలా మన బుద్ధుడు గూడ కుంద భక్తుడు ఇచ్చిన విష ఆహారమును సేవించి నీలిశరీరధారిగా అయినాడు అన్నమాట.వీరిద్దరుగూడ మహామృత్యుంజయులైనారు.ఇలా ప్రతి సాధకుడు పొందవలసిన అంతిమ సాధన స్థితియే ఇది అన్నమాట. దీనికి ప్రకృతి ఇలా ఈ మూడు మణులను సాక్ష్యముగా ఉంచింది.

సార్.నాకు ఒక సందేహము.మీరు చెప్పిన లెక్క ప్రకారము విషము సేవించి చనిపోయిన ప్రతివాడు మహామృత్యువు పొందినవాడేనా?” 

నాధ్.అదే నిజమైతే అందరు ఈ పాటికి విషము లేదా పాముకాటు వేయించుకొని సాధకులు చనిపోయేవారు గదా.ఇంక సాధనలు చేయవలసిన అవసరమే ఉండేది కాదు గదా.ఇలా చనిపోతే అది ఆత్మహత్యతో సమానము అవుతుంది.ఆత్మహత్య అంటే కోరికతో మరణము పొందినట్లే అవుతుంది.కోరిక ఉంటే కర్మ ఉంటుంది.కర్మ ఉంది అంటే జన్మ ఉన్నట్లే.ఈ కర్మ నివారణ కోసము మళ్ళీ పునః జన్మలు ఎత్తవలసి ఉంటుంది.మనకి కర్మ లేని జన్మ కావాలి అంటే మన శరీర మూడు మణులు అనగా పిట్యుటరి గ్రంధి,హృదయ గ్రంధి,థైరాయిడ్ గ్రంధి ఒకదాని తరవాత మరొకటి నెమ్మది నెమ్మదిగా విషమయం అవుతూ నాశనమవుతూ రావాలి.అపుడే కోరిక,కర్మ,జన్మ లేని స్థితి అదేపూర్ణ శూన్య స్థితిని సాధకుడు పొందుతాడు.లేదంటే విషము సేవించి చనిపోయినవాడు కాస్త కోరిక జన్మ ఎత్తుతాడు.మన బుద్ధుడిలో అలాగే మహాశివుడిలో ఈ మూడు గ్రంధుల విబేదనము జరిగినదని అనుభవ అనుభూతి పొందిన తరవాతనే ఒకరు విష పదార్ధమును మరొకరు హాలాహలమును సేవించి శరీరమును విషమయముగా అనగా లేత నీలిరంగుగా మార్చుకున్నారు.మహా మృత్యుజయం పొందినారు.అనగా నిర్వాణ స్థితిని పొందినారు.అంటే ఈ లెక్కన చూస్తే శరీరమును సాధనతో విషమయముగా చేసుకున్నవారు పూర్ణ శూన్య స్థితిని పొందితే శరీరములోనికి విషమును ఎక్కించుకున్నవారు పునఃజన్మ ఇచ్చే శూన్యభావ స్థితిని పొందుతారని పైగా ఆత్మహత్య అనేది హింస క్రిందకే వస్తుందని మన బుద్ధుడు చెప్పారు గదా.ఇదే విషయాన్ని హైందవ ధర్మములో మహాశివుడు నిరూపించి చూపిస్తే మన బౌద్ధధర్మములో బుద్ధుడు చేసి నిరూపించాడు.

సార్.ఇంకా ఏమిటి?మీ పరిశోధన పూర్తి అయినది గదా.మరి హిమాలయాలకి వెళ్ళి ఈ మణులను ప్రత్యక్ష దర్శనము చేసుకోవచ్చు గదా అనగానే

నాధ్.అక్కడే నాకు చిక్కు సమస్య వచ్చింది.అది ఏమిటంటే కాలచక్ర నిర్మాణము అంతముగా రెండు రంగుల ద్యోర్జాలను బుద్ధుడు ఉంచారు గదా.ఇవి రెండు పద్మాలకి సూచనయని అందులో ఒకటి బ్రహ్మ కమలమైతే రెండవది పారిజాత పుష్పమని ఈ రెండు గూడ హిమాలయాలలో పూచే దేవతాపుష్పాలని వీటికి యతీశ్వరులు, నాగా సాధువులు, బౌద్ధ సన్యాసులు, హిమాలయ యోగులు, గురువులు తమ సూక్ష్మ శరీరాలతో కాపలా కాస్తుంటారని నా పరిశోధనలో తెలుసుకున్నాను.గాకపోతే ద్యోర్జీ లామా ఈ రెండు పుష్పాలను సేకరించి బుద్ధగయలోని ఒక గదిలో అంతర్గతముగా భూగర్భ గదిలో దాచి ఉంచినారని అలాగే ఉందో లేదో తెలియని శంభల గ్రామము యొక్క రూట్ మ్యాప్ ను గూడ తాళపత్రాలమీద గీసి దాచి ఉంచినారని తెలిసింది.ఈ పుష్పాలను తీసుకొని మాట్లాడే విగ్రహమూర్తికి సమర్పిస్తే ఆయన అనుగ్రహమును పొందితే వారు ప్రసాదించే బంగారు మణి పద్మము స్వీకరిస్తే అపుడు మనకి ఈ రెండు రకాల మణుల దర్శనానికి అర్హత,యోగ్యత కలుగుతుందని నేను తెలుసుకున్నాను.

సార్.మరి ఈ పుష్పాలు ఎక్కడ ఉన్నాయో మీరు తెలుసుకున్నారా?”

నాధ్.ప్రస్తుతము నా పరిశోధన అదే చేస్తున్నాను.ఈ పుష్పాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ద్యోర్జీ లామా ఇదిగో కోడ్ భాషలో ఈ మణి బాక్స్ లో ఉంచాడు.దీనిని తెరవడానికి పాస్ వర్డ్ రూపములో కంటకము-147 అని రాసి ఉంది.కాని ఎన్నో విధాలుగా ఈ కోడ్ ని ఉపయోగించి  చూసిన ఈ బాక్స్ తెరవలేకపోయాను.పైగా ఈ బాక్స్ పైన ఉన్న 14వ శ|| నాటి బుద్ధుడి చిత్రాలను బట్టి చూస్తుంటే ఇపుడు మీరు చూస్తున్న మూడు చిత్రాల గదిలోనే ద్యోర్జీ లామా దాచి ఉంచిన పుష్పాలు అలాగే శంభల గ్రామము రూట్ మ్యాప్ ఉండి ఉండవచ్చని నేను అనుకుంటున్నాను.ఈ గది అంతా కూలంకుషముగా చూసిననుగూడ అవి ఇక్కడ ఉన్న సూచనలు నాకు కనిపించడములేదు.పోని ఈ బాక్స్ ని పగలగొడితే ఇందులో ఉంచిన రసాయనాల అమరిక వలన ఇందులో ఉన్న ఆధార రహస్యము పోతుందని నా అనుమానము.దానితో నా మణి పరిశోధన అడుగు దూరములో ఆగిపోయినట్లుగా ఉంది అనగానే

ఆయన చేతిలో ఉన్న మణి కోడ్ భాష బాక్స్ ను అందుకొని మీరు తెచ్చిన కోడ్ లాగానే ఆయన కోడ్ ను ఎన్నోసార్లు రకరకాలుగా ప్రయత్నించి విఫలమైనాము.

పైగా ఈయన పరిశోధనలో వివిధ బౌద్ధ ధర్మ గ్రంథాలు చదవగా అందులో ఒక బౌద్ధ గ్రంథములో ఒక చోట ద్యోర్జీ లామా దాచిన దేవతా పుష్పాలను ఒక రహస్య కోడ్ పద్మ బాక్స్ లో ఉంచినారని అదిగూడ కాలచక్ర నిర్మాణ కోటలో రహస్యముగా ఉంచారని..ఈ రహస్య బాక్స్ కి  కోడ్ గా ఒక డైమండ్ గుర్తు అలాగే త్రికోణ గుర్తు ఉంచారని తెలుసుకున్నారు.కాని మాకు దొరికిన మొదటి మణి బాక్స్ తెరుచుకొంటేగాని పుష్పాల బాక్స్ ఎక్కడ ఉన్నదో తెలియదు.అందువలన మణిశోధనకి మేమిద్దరముగా ఒక పద్మాకార కీ స్టోన్ గాను మరొకటి మణి ఆకార కీ స్టోన్ గాను విభజించి రాబోవు తరాల వారికి ఇది అందించాలని అనుకొని అలాగే చేశాము.కాని అనుకోని విధముగా అంబేద్కర్ హత్య గావించబడతాడని నేను ఊహించలేదు.ఆయన చనిపోతూ ఈ రెండు రకాల కీ లను అలాగే మణి పద్మ బాక్స్ కోడ్ ను అనగా డైమండ్ గుర్తు అలాగే త్రికోణ గుర్తును తన గుండెల మీద గీసుకొని చనిపోయారని మీరు చెబుతున్న దానిని బట్టి నాకు తెలుస్తున్నది అంటూ విభూధినాధ్ ముగించాడు.

జేసి వెంటనే అంకుల్.నాకు ఒక సందేహము.ఇంతకి మాట్లాడే విగ్రహమూర్తి గూర్చి చెప్పలేదుఅనగానే

అమ్మాయి.ఆ విగ్రహము పేరు ఖోజార్నాధుడు.హిమాలయాలలో ఈ విగ్రహమూర్తి ఉంటుంది.హైదవ ధర్మములో ఈయనను మహాకాలుడని పిలుస్తారు.అదే బౌద్ధధర్మములో అయితే ఖోజార్ నాథ్ గా కొలుస్తారు.ఈ విగ్రహము మొత్తము 13 సార్లు మాట్లాడుతుందని ఇపుడికి 6సార్లు మాట్లాడినదని బౌద్ధ ధర్మ గ్రంథాలు చెప్పగా నేను చదివాను.అపుడు నిర్వణలామా తన మనస్సులో అంటే ద్యోర్జీ లామా దాచి ఉంచిన దేవతా పుష్పాలు అలాగే మణులు ఉన్న రూట్ మ్యాప్ మనకి తెలియాలంటే మణికోడ్ బాక్స్ ను తెరవక తప్పదని గ్రహించాడు.

ఇంతలో జేసి వెంటనే అంకుల్.మీ చేతిలో ఉన్న మణి కోడ్ బాక్స్ ను నాకు ఇవ్వండి.దీనిని తెరవడానికి నా ప్రయత్నము నేను చేస్తాను అనగానే

అమ్మాయి.దీనిని అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే తీసేటట్లుగా అలాగే పద్మ కోడ్ బాక్స్ ను యోగ్యత ఉన్న వ్యక్తి తీసేటట్లుగా ఈ రెండు బాక్స్ ల నిర్మాణము జరిగినట్లుగా నాకు అనిపిస్తోంది.మీలో ఎవరికి ఈ మణి శోధన చేసే అర్హత ఉందో పరీక్షించుకోండి.నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అంటూ

ఈ మణి బాక్స్ ను జేసి చేతికి ఇచ్చి ఆయన మంచినీళ్ళు త్రాగడానికి ప్రక్కగదికి వెళ్ళాడు.నిర్వాణలామా బృందము ఒక్కొక్కరిగా ఈ పాస్ వర్డ్ ని రకరకాలుగా ఉపయోగించిన ఎలాంటి ప్రయోజనము కనిపించలేదు.దానితో అందరిలోను తెలియని ఆందోళన మొదలైంది.విభూధినాధ్,అంబేద్కర్ ఆగిపోయినట్లుగా తాముగూడ ఈ మణి శోధనలో అడుగు దూరములో ఆగిపోతామని నిర్వాణలామా బృందముకు సందేహము పట్టుకుంది.

కిటికి బయట ఉన్నవ్యక్తి అయిన అంగుళీమాల తన చేతిలో ఉన్న ఫోన్ తో తన గురువైన దేవదత్తకి ఫోన్ చేసి

గురూజీ.మీరు చెప్పినట్లుగానే ప్రొఫెసర్ విభూధినాధ్ ఇంటి అడ్రస్సు తెలుసుకొని అక్కడ కాపలా కాసినాను.మర్నాడు ఇక్కడికి నిర్వాణలామా బృందము వచ్చి విభూధినాధ్ తో మాట్లాడటము మొదలుపెట్టారు. ఈయన గూడ మణి శోధన చేశాడని ఇవి ఒక మణి కాదని రెండు చింతామణులున్నాయని ఇందులో పద్మాకార కీ స్టోన్ కాస్త కైలాస పర్వతము యొక్క అడుగున ఉన్న పాదరస చింతామణి దగ్గరికి తీసుకొని వెళితే మణి కీ స్టోన్ అనేది కైలాస పర్వతము యొక్క పై భాగమున బ్రహ్మ చింతామణి దగ్గరికి తీసుకొని వెళ్ళుతుందని ఈ మణులు దగ్గరికి వెళ్ళాలంటే మనకి దేవతా పుష్పాలు అయిన బ్రహ్మ కమలము మరియు పారిజాత పుష్పములుండాలని అలాగే కైలాస పర్వతములో ఇవి ఉండే ప్రాంతాల మ్యాప్ ఉన్న ఒక మణి పద్మ బాక్స్ లో రహస్యముగా దాచి ఉంచారని ఇది బుద్ధగయలో ఉందని ఈ బాక్స్ దగ్గరికి వెళ్ళాలంటే దీనికి దారి చూపే మణి బాక్స్ ను తెరవాల్చి ఉంటుందని వీళ్ళకి దొరికిన పాస్ వర్డ్ తో ఎన్ని విధాలుగా ప్రయత్నించిన వాళ్ళు దానిని తెరవలేక పోతున్నారని ఇపుడు నన్ను ఏమి చేయమంటారు?” అని అనగానే

అంగుళీ.నువ్వు చాటుగా వెళ్ళి ఆ ప్రొఫెసర్ ను బెదరించు.భయపెట్టు.దానితో నిర్వాణలామా తన తెలివితో ఈ మణి బాక్స్ కోడ్ ను సాల్వ్ చేస్తాడు.అందులో ఉన్న ఆధారమును తీసుకొని బుద్ధగయకి వచ్చేయి.అక్కడ నేను నిన్ను ప్రత్యక్షముగా చూడటానికి వస్తాను అనగానే అంగుళీమాల ఆనందము పట్టలేక

స్వామీజీ.గురూజీ.మీరు స్వయముగా నన్ను చూడటానికి నన్ను కలవడానికి వస్తారా.నా జన్మ ధన్యమైనది.ఈ జన్మకి ఇంతకంటే విలువైన మణి మరొకటి లేదు.మీ రాక మరియు మీ స్వదర్శనమే  నాకు మణిపద్మముతో సమానము.గురుదేవా.ధన్యోస్మి.నా జీవితము చరితార్ధమైనది.మీరు చెప్పినట్లుగా చేస్తాను అంటూ ఫోన్ కట్ చేశాడు.

ఇంతలో నీళ్ళు తాగుతున్న విభూధినాధ్ కి కిటికి దగ్గర ఎవరో వ్యక్తి తచ్చట్లాడుతున్నట్లుగా అనిపించి  ఎవరది అని బిగ్గరగా అరిచేసరికి 

ఎదురుగా 40 సం.||రాల వ్యక్తి ఒక తుపాకి ఈయన కణతకి గురిపెడుతూ

స్వామి విభూదినాథ్.మీరు మా గురువుగారైన దేవదత్త అడిగిన మణిశోధన వివరాలు చెప్పలేని కారణముగా మిమ్మల్ని చంపి..మీ స్ధానములో మా గురువుగారు వస్తారు.ఈ ఏర్పాట్లు నన్ను చెయ్యమన్నారు అంటూ ప్రొఫెసరునికి తుపాకి గురి పెడుతూ

హాల్ లోకి రావడముతో నిర్వాణలామా ఒక్కసారిగా బిత్తరపోయినారు.ఇదే అదనుగా ఈ దృశ్యాలు చూస్తున్న బయట ఉన్న సి.బి.ఐ ఆఫీసర్ లు గూడ అలర్ట్ అయ్యి ఇంటిలోనికి ప్రవేశించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి