44
అలాగే
అపుడిదాక మా సంఘములో, స్త్రీలకి ప్రవేశము
లేదు. కాని మా తల్లి అయిన గౌతమిమాత అలాగే నా భార్య యశోధర అభ్యర్ధన మేర వీరిద్దరిని
ప్రప్రధమముగా మా సంఘములో స్త్రీ సభ్యత్వమును ఇస్తూ 'ధర్మదీక్ష'
వారికి ఇచ్చి ఆనాటి నుండి స్త్రీ మూర్తులను సంఘములో తీసుకోవడము
ఆరంభించాను. కానీ ఇలాంటి దీక్ష తీసుకున్న ఒక స్త్రీ సన్యాసిని 'శుభ' ను చూచి ఒక కామాంధుడు ఈమె ఒంటరిగా భిక్షకి
వెళ్లినపుడు వేధించేవాడు. అవహేళనముగా.... అసందర్భ మాటలతో అవమానించేవాడు. అయిన ఈమె
చాలా ఓర్పుగా నిష్ఠగా ఉండేది.
ఒకసారి
నా దగ్గరకి వచ్చి
“తనను ఈ కామాంధుడి నుండి రక్షించమని వేడుకుంది. అపుడు నేను కాస్త ఆమెతో
"అమ్మా. తల్లి. ఇప్పుడు నేను ఉన్నాను. రక్షిస్తాను. ఒకవేళ వాడు నేను లేని
సమయములో వస్తే ఏమి చేస్తావో అది ఇపుడు వాడికి చెయ్యి. వాడికి బుద్ధి వస్తుంది. నీ
సమస్యకి నీకు నీవే పరిష్కారము వెతుక్కుంటే నీ జ్ఞాన విశ్లేషణ శక్తి పెరుగుతుంది.” అనగానే....
ఈమె
యధావిధిగా భిక్షకి వెళ్లితే అంతే విధిగా వాడు ఈమెను తన కామ కోరిక తీర్చమని
వేధించడము ప్రారంభించాడు. అపుడు ఈమె ఎంతో సౌమ్యముగా "నేను నీ కోరిక
తీర్చాలంటే నాలో నీకు బాగా నచ్చినది ఏదో చెప్పు" అనగానే
వాడు
వెంటనే...
"నీ కళ్లు బాగా నచ్చుతాయి. ఆ కళ్లు ఎపుడు ప్రశాంతవదనముగా ఉంటాయి. అవి
కవ్వింపు చూపులతో... శృంగారభరితముగా ఉంటే ఎలా ఉంటాయో చూడాలని ఉంది" అనగానే...
"అయితే ఆ కళ్లుయే నీకిస్తాను." శీలం కోల్పోవడం కన్న కళ్లు పోగొట్టుకోవడం
మంచిది అంటూ తన చేతి సంచిలోంచి
తెచ్చుకున్న చురకత్తితో కంటి మీద గాయము చేసుకొనేసరికి వాడిలో భయము మొదలై...
"అమ్మా.నన్ను క్షమించు. నువ్వు నా తల్లితో సమానము. ఇలా నీ కళ్లు నాకు
ఇవ్వడానికి వెనుకాడ లేదంటే నీవు నీ సాధనలో ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నావో తెలిసింది.
నీ ప్రేమ చూపులను నా కామ చూపులతో బాధించాను. నన్ను క్షమించు తల్లి "
అనగానే...
అప్పుడు
'శుభ' వాడితో....
“కామంతో కళ్లు మూసుకుపోయి పాపాలు చెయ్యకండి.అఘాయిత్యాలకు వడిగట్టకండి. మీ
కామానికి అభం శుభం తెలియని ఆడవారిని బలిపెట్టకండి. మీ మాటలతో బాధించకండి. వారిని
సాటి మనుష్యులుగా గుర్తించి బ్రతకనివ్వండి. మీ కామ కోరికలు తీర్చే కామ పశువుగా
చూడకండి.” అంటూ వాడికి బుద్ధి చెప్పి వచ్చేసింది.
“శుభ” బుద్ధి కుశలత నాకు బాగా నచ్చింది.
దానితో
ఆరోజు నుండి సన్యాసినులు ఒంటరిగా ప్రయాణము చెయ్యరాదని అలాగే ఒంటరిగా భిక్షకి వెళ్లరాదని
ఒకరిద్దరు తోడుగా ఉండాలని నియమాలు పెడుతూ ఆనాటి నుండి సన్యాసినులని,
భిక్షిణులుగా, ఉపాసికలుగా పిలువడము
ప్రారంభించాము.
***
*** *** *** *** ***
ఖాట్మాండ్
ఇది
నేపాల్ దేశ రాజధాని.
ఈ
ప్రాంతములోనే మహాశివుడి అష్ట మూర్తులలో అనగా సూర్యుడు,
చంద్రుడు, భూమి, ఆకాశము,
నీరు, అగ్ని, వాయువు
మరియు యజమాని అనే అష్టమూర్తులలోని అష్ట మూర్తియైన యజమాని లింగము కాస్త పశుపతినాధ్
లింగముగా భాగమతి నది తీరములో ప్రసిద్ధి దేవాలయముగా పూజలు అందుకుంటుంది.ఖాత్ అంటే
కొయ్య అని మండు అంటే దేవాలయమని… చెట్టుకలపతో ఖాట్మాండులోని
కాష్ఠమండప దేవాలయము నిర్మించడము వలన ఈ ప్రాంతమునకు ఖాట్మాండు అని పేరు వచ్చినదని
జింక యొక్క కొమ్ము యొక్క రూపమే ఈ శివలింగమని అంటారు అని నిర్వాణలామా చెప్పుతూ
పశుపతినాధ్ ఆలయములోకి అందరు ప్రవేశించారు.
అక్కడ
వీరికి నాలుగు వైపుల నాలుగు ముఖాలతో ఆకాశము వైపున పంచ ముఖముతో ఉన్న మూడు అడుగుల
శివలింగమూర్తిని దర్శించుకోవడము జరిగింది.ఇదియే పశుపతినాధ్ శివలింగమని ఒకపుడు
ఇక్కడ ఆదిలో పరశువేది మణి ఈ లింగములో ఉండేదని ఇది ఇనుమును కాస్త బంగారముగా
మార్చేదని కాని ప్రస్తుత లింగములో ఈ మణి ఉన్న దాఖలాలు అలాగే సాక్ష్యాధారాలు లేవని నిర్వాణలామా చెపుతూ బయటికి వచ్చారు.ఆ
ప్రక్కనే ఉన్న మత్స్యేంద్రనాధ్ ఆలయ దర్శనమునకు వీరంతా బయలుదేరారు.నిజానికి ఈయన ఒక
బౌద్ధ సన్యాసి.కాని హైందవ ధర్మస్థులు వీరిని నవనాధులలో మొదటివారైన
మత్స్యేంద్రనాధుడిగా పూజలు చేస్తారు.నిజానికి ఖాట్మాండ్ లోని శివాలయము అనేది బౌద్ధ
దేవాలయము.కాలక్రమేణా హైందవ ధర్మ,బౌద్ధ ధర్మస్థులు తమ
ధర్మాలను అనుసరించి గొడవలు పడకుండా ఎవరి ధర్మానుసారము సంప్రదాయము ప్రకారము ఎవరికి
వారే పూజలు చేసుకుంటున్నారు.ఈ మత్స్యేంద్రనాధ్ నేపాలి రాజ వంశానికి కులదైవము
అన్నమాట.ఎలా అంటే క్రీ.శ.347 కాలములో నేపాల్ లో 12 సం||రాలు పాటు ఘోరమైన క్షామము వచ్చింది.అప్పటి నేపాల్ రాజైన రాజా నరేంద్రదాసు
అస్సాములో మహాత్ముడైన బౌద్ధసన్యాసి ఉన్నారని ఆయనకి వాన సిద్ధి యోగమున్నదని ఎవరో
చెప్పగా విని అక్కడికి వెళ్ళి ఈయనను తీసుకొని వచ్చిన 12
రోజులకెల్లా తీవ్రమైన వర్షాలు పడటముతో ఈయనకి గుర్తుగా మత్స్యేంద్రనాధ్ దేవాలయము
కట్టించడము అలాగే వైశాఖ శుద్ద పాడ్యమి రోజున ఈయనకు బ్రహ్మోత్సవము చేయడము ఈ సమయములో
త్రిమూర్తులు సకల దేవతలు సూక్ష్మ శరీరాలతో ఈయనను దర్శించుకోవడానికి వచ్చేవారని
ప్రచారమున్నదని ఒకసారి ఇలాగే మాయారూపములో కల్పవృక్ష దేవత వచ్చినపుడు ఒక ముని
దానిని పట్టుకొని ఇక్కడే ఉన్న జంబూద్వీపములో ప్రతిష్టించడము చేసినాడని ఈ చెట్టు
నుంచి వచ్చే జామ పండ్లు తినడానికి హిమాలయ యోగులు బౌద్ధ ధర్మ సన్యాసులు
ఎదురుచూస్తుంటారని ఈ కాయలు తిన్నవారికి ఆరు నెలలపాటు ఆకలి,నిద్ర
లాంటి సమస్యలుండవని చెపుతుండగా ఈ ఆలయము నుండి అందరు బయటికి వచ్చినారు.ఆ తరవాత
పశుపతినాధ ఆలయము పరిసరాలలో ఉన్న పంచ దేవాలయాల దర్శనానికి వీరంతా వెళ్ళడము
జరిగింది.
అందులో
ఉన్న వాసుకి సర్ప దేవాలయమును చూడగానే ఆనందభిక్షువుకి అసలు విషయము అర్ధమై
“గురూజీ.వాసుకి సర్పము యొక్క మణి పేరుయే నాగమణి గదా.అందుకే ఇక్కడికి
మమ్మల్ని తీసుకొని వచ్చినారు కదా” అనగానే
నిర్వాణలామా
అందుకొని అవును.నీ అంచనా కరక్టే.అందుకే మనము ఈ క్షేత్ర దర్శనమునకు రావడము
జరిగింది.నిజానికి పాము పుట్టలు అనేవి భూమి యొక్క నోరులని ఇవి పాతాళలోకానికి
దారులు చూపుతాయని నాగశాస్త్రము చెబుతోంది”.అనగానే
ఆనందభిక్షువు
వెంటనే “గురూజీ.నిజముగానే నాగలోకమున్నదా?”అనగానే
“మిత్రమా ఆనందభిక్షువు.ఎందుకు లేదు.ఖచ్చితముగా పాతాళలోకములో సప్త
లోకాలున్నాయి.వీటిలో 12 రకాల దేవత నాగ జాతులు ఆవాసము
చేస్తుంటాయి.అనగా అనంత, వాసుకి, శంఖ,
పద్మ, కంబాల, కర్కోటక,
అశ్వతర,ధృతరాష్ట్ర,శంఖపాల,కాళీయ,తక్షక మరియు పింగళ అనే 12 నాగ దేవతలుంటారు.వీరిలో అనంత సర్పం కాస్త తూర్పు దిక్కును,తక్షక సర్పం పశ్చిమ దిక్కును,వాసుకి సర్పం ఉత్తర
దిక్కును,శంఖపాల సర్పం దక్షిణ దిక్కును,పద్మ సర్పం ఈశాన్య దిక్కును,కర్కోటక సర్పం ఆగ్నేయ
దిక్కును,క్రౌండ సర్పం వాయువ్య దిక్కును,ఆదిశెషుడు నైరుతి దిక్కును మోస్తుంటాయని హైందవ పురాణాల ప్రకారము
తెలుస్తోంది.అలాగే విష్ణు,పద్మ,వాయు
పురాణాల ప్రకారము చూస్తే భూమి ఉపరితలము నుండి క్రిందకి 70
వేల యోజనాల దూరములో పాతాళ లోకాలున్నాయని చెప్పడము జరిగింది.అనగా అతల,వితల,సుతల,తలాతల మహాతల,
రసాతల,పాతాళ లోకాలు అన్నమాట.ఇందులో పాతాళ
లోకమునే నాగలోకమంటారు.ఈ లోకమునకు అధిపతి మీరు ఇపుడు చూస్తున్న దేవాలయములోని వాసుకి
అనే నాగరాజు అన్నమాట.ఇక్కడ అనేక దేవతాసర్పాలు ఆవాసము చేస్తుంటాయి.విచిత్రము
ఏమిటంటే ఈ లోకమునకు సూర్యుడి వెలుతురు పడదు.అందువలన ఈ సర్పాల యొక్క కంఠములోపల ఉన్న
నాగమణుల కాంతియే ఈ లోకాన్ని పట్టపగలుగా మార్చివేస్తుంది”.
ప్రకృతి
వెంటనే స్వా”మి.ఇక్కడున్న వాసుకి సర్పదేవాలయము అనేది
పాతాళ లోకమునకు దారి తీస్తుందా?”
“అవును ప్రకృతి.ఆదిలో ఈ అవకాశము ఉండేది.ఈ లోకము నుంచి సర్ప దేవతలు,నాగ దేవతలు వచ్చి మనుష్యులతో సత్ సంబంధాలు పెట్టుకొని ఙ్ఞాన విఙ్ఞాన బోధలు
చేసేవారు.ఇలాంటివారికి చెందినవారే పతంజలి మహర్షి.ఈయన చూడటానికి మనిషి తలతో మిగిలిన
శరీరము అంతా పాముగా ఉంటుందని మనలో చాలామందికి తెలియదు.తొలినాళ్ళలో మానవుడి తొలి
దైవము సర్పమే.అందుకే మనకి అన్ని చోట్ల సర్ప ఆరాధన కనబడుతుంది. రాను రాను
మనుష్యులలో దైవత్వము తగ్గి రాక్షసత్వమనే స్వార్ధము పెరిగిపోవడముతో ఈ పాతాళళోకము
నుండి వీరందరు రావడము తగ్గించివేశారు. ఇలా హిమాలయాలో మాత్రమే ఈ ప్రాంతము నుండి
పాతాళలోకమునకు దారి ఉంటే అదే కాశీ క్షేత్రములో శేష్న అనే బావి నుండి పాతాళలోకానికి
మార్గమున్నదని అఘోరులు చెప్పగా ఇది నిజమా కాదా యని సర్ప శాస్త్రఙ్ఞుడు అయిన
షేర్మన్ A మింటన్ అనేవారు ఈ బావి మీద అనేక పరిశోధన ప్రయోగాలు
చేసి ఈ వార్త అబద్ధము గాదని ఈ బావిలోపల దాదాపుగా 40 మెట్లు
ఉన్నాయని… ఈ మెట్ల గుండా తాను లోపలకి వెళ్ళితే అక్కడ ఒక
వృత్తాకారములో ఒక నీటి గుంట ఉన్నదని… ఈ గుంటపైన ఒక పెద్ద
రాతి తలుపు ఉన్నదని… కాని ఈ తలుపు పైన అతిభయంకరమైన అనేకమనేక
త్రాచుపాములు వందలకొద్ది ఉన్నాయని…. అవి తన మీదకి దాడి
చేస్తాయేమోనని భయముతో వెనుతిరిగి వచ్చానని… ఒకవేళ ఈ తలుపు
తీయగలిగితే దీని గుండా పాతాళ లోకానికి వెళ్ళవచ్చునని తాను రాసిన వెనోమస్
రెప్టయిల్స్ (పాకే విషపూరిత జీవులు) అనే గ్రంధములో చెప్పడము జరిగింది. అంతెందుకు పాతాళలోకమునకు ఖచ్చితముగా
ఏదో ఒక చోట మార్గము ఉండి తీరుతుందని నమ్మిన నాటి జర్మనీ నియంత హిట్లర్ ఈ లోకానికి
వెళ్ళడానికి తన దేశ శాస్త్రవేత్తలచే ప్రయోగాలు చేయిస్తే అంటార్కిటికా (దక్షిణ దృవము) ప్రాంతములోని ఒక
గుంట ద్వారా క్రిందకి వెళ్ళితే పాతాళలోకము చేరుకోవచ్చునని వీళ్ళ ప్రయోగాల ద్వారా
తెలిస్తే తమ సైన్యములో కొంతమందిని అక్కడికి పంపించగా లోపలకి వెళ్ళినవారు తిరిగి రాలేదు. అనగానే
ఆనందభిక్షువు
వెంటనే “గురూజీ.లోపలకి వెళ్ళిన వాళ్ళు ఏమైనారు?”
“మిత్రమా.పాతాళలోకాలలో మొట్టమొదట వచ్చే అతల లోకములో వీళ్ళు బంధించబడ్డారు. ఎందుకంటే
ఈ లోక స్త్రీలకు విపరీతమైన కామవాంఛ ఉంటుంది.దీనిని తీర్చుకోవడానికి పొరబాటున ఈ
లోకములోకి అడుగుపెట్టిన మానవులకి కామము అధికము చేసే గంజాయి ద్రవము త్రాగిస్తారు.
దానితో 36 వేలమందిని సుఖపెట్టే శక్తి సామర్ధ్యాలు ఈ
మానవుడికి ఉంటాయి.ఎపుడైతే ఈ గంజాయి ప్రభావము తగ్గిపోతుందో అపుడు ఈ మానవుడు
తీవ్రమైన చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఈ సమయములో కొన్ని స్త్రీ
సర్పాలు ఇలాంటివారిని మ్రింగేసి ఆకలి తీర్చుకుంటాయి.
అలాగే
మన దేశములోని కేరళలోని మలబార్ ప్రాంతములో నివశించే ప్రజల అభిప్రాయ ప్రకారము ఈ
లోకము నుండి పురుష నాగరాజులు భూమి మీదకి వచ్చి వీళ్ళు ఎవరినైన ఇష్ట పడితే వారిని వివాహము చేసుకొని వారితో
శారీరక సుఖము అనుభవించేదాకా వదలిపెట్టవని కలలో రావడము ఇళ్ళల్లోకి రావడము చేస్తూ
భయపెడుతూ తమ వారిని వశము చేసుకొని వివాహము చేసుకొని సర్వసుఖాలు అనుభవించి ఆమె
శరీరమును విషపూరితము చేసి చంపేసి వెళ్ళిపోతాయి.అది కొన్ని పాముల జాతుల వలన తమ జాతి
స్త్రీలు కాస్త గర్భము దాల్చి పాము అంశ పిల్లలను సంతానము పొందుతారని వీరే రాబోవు
కాలములో నాగ కన్యలుగా గుర్తించబడతారని వీరి శరీరము నుండి నిరంతరము మొగలిపువ్వు
వాసనలు వస్తుంటాయని కళ్ళు మాత్రము లేత నీలి రంగులో ఉంటాయని అమావాస్య పౌర్ణమి
రోజులలో విపరీతమైన కామ భావాలు కలిగి ఉంటారని ఈ లక్షణాలు ద్వారానే తమకు పుట్టిన
అమ్మాయిలలో ఎవరు నాగ కన్యలో తెలుసుకుంటారని అలాగే బెంగాలి ప్రాంతములోని దేవ
వైద్యుడైన ధన్వంతరి శిష్యుల వంశము సంతాలి ప్రాంతములో సంతాలి గిరిజన జాతిగా
ఉంటుందని వీరికి గూడ నాగకన్యలు పుడతారని
వీరంతా ఆజన్మ బ్రహ్మచారిణిగా ఉంటూ నిత్యము శివారాధన చేస్తూ మరణము
పొందుతారని వీరినే నాగదేవతలుగా తరవాతి తరము వారు పూజలు చేస్తారని” నిర్వాణలామా చెప్పేసరికి
ఆనందభిక్షువు
వెంటనే “గురూజీ.అసలు నిజముగా నాగమణి ఉందా?”
“మిత్రమా.నిజానికి కనిపించే అన్ని పాములు దేవతా నాగ జాతి నాగపాములు
కావు.అలాగే మనము నిత్యము చూసే సర్ప మణులు అన్నిగూడ నాగమణులు కాదని మనము తెలుసుకోవాలి.పాతాళలోకములో
అదే నాగలోకములో ఉన్న నాగ సర్ప జాతులకి మాత్రమే ఉండే మణియే నిజమైన నాగమణి
అవుతుంది.నాగమణి అనేది లేత నీలిరంగులో ఉంటుంది.విషము గూడ లేత నీలి రంగులో
ఉంటుంది.విషము అనేది చాలా ఘాటైన విషవాయువు వాసన కలిగి ఉంటుంది.శ్వేతనాగులకి ఉండే
మణి తెల్లని రంగులో ఉంటే పసుపు రంగులో ఉండే నాగులకి పసుపు రంగు లేదా బంగారపు వర్ణ
మణి ఉంటుంది. ఇవి మణి జాతి మణులు అవుతాయి గాని నాగమణి కాదు.నిజమైన నాగమణి అనేది
లేత నీలి రంగులో ఉండి వడ్లగింజ పరిమాణములో ఉంటుంది.పైగా అదే జీవ నాగమణి అయితే ఈ
మణిలో మెలిక తిరిగియున్న పాము చారిక ఉంటుంది.పైగా ఈ మణికి కామరూప విద్యను
ప్రదర్శించే సిద్ధి ఉంటుంది.
అనగా
ఈ మణి యున్న పాముకి ఎపుడు గావాలంటే అపుడు మనుష్య రూపములోకి మారగలదు.ఏ వ్యక్తి
రూపము గావాలంటే ఆ వ్యక్తి రూపముకు మార్చుకోగలదు.అదే మామూలు మణులకి ఈ విద్యను
ప్రదర్శించదు.అలాగే నాగమణి అనేది సహజముగా అందరు పాముల తలల మీద ఉంటాయని
అనుకుంటారు.నేను గూడ అలాగే అనుకున్నాను.నా పరిశోధనలో అది తప్పుయని… నాగమణి అనేది పాము యొక్క కంఠములో ఉంటుందని హైందవ ధర్మములో ఆదియోగి
పరమేశ్వరుడు కాస్త నాగపాములను తన కంఠమునకు అందుకే నాగాభరణాలుగా అమర్చుకున్నారని
నేను తెలుసుకున్నాను.అంతెందుకు.మీకు ప్రత్యక్ష దర్శనము గావాలంటే మీకే చూపిస్తాను
అంటూ భాగమతి నది తీరము వైపు అందరిని బయలుదేరతీశాడు.
కొన్ని
గంటలు అయిన తరవాత అక్కడ ఉన్న పొదలు నుండి ఒక భయంకరమైన త్రాచుపాము ఒకటి బయటికి
వచ్చి ఈ నదిలోని నీటిని త్రాగడానికి బయలుదేరుతూ అది చుట్టుప్రక్కల పడగ ఎత్తి ఎవరు
చూడటము లేదని గమనించి తన గొంతులో ఉన్న ఉమ్మిని నోటిలోనికి తెప్పించుకొని ఒక గుంతలో
దానిని ఉమ్మి నీళ్ళూ త్రాగి వచ్చిన తరవాత ఈ ఉమ్మిని తిరిగి మింగడము రహస్యముగా
మరోపొద నుండి నిర్వాణలామా బృందము గమనించి ఆశ్చర్యానందమునకు గురి అయినారు.ఈ పాము
అక్కడ నుండి వెళ్ళిపోయిన తరవాత నిర్వాణలామా వెంటనే “ఇపుడు
మీరు చూశారు గదా.ఈ ఉమ్మి అనేది స్వాతి నక్షత్రము రోజున పాము నోటిలో పడే తొలి వాన
చినుకుయే ఈ ఉమ్మి అన్నమాట.అపుడు ఈ పాము కాస్త దాదాపు 20సం||రాలు పాటు మానవుడికి కనబడకుండా ఎవరిని కాటు వేయకుండా ఈ ఉమ్మిని
దాచుకోగలిగితే అది కాస్త విషముగా మారి ఆపై నాగమణిగా రూపాంతరము చెందుతుంది.దానితో
ఇది కాస్త దేవతాసర్పము అవుతుంది.ఈ మణి సహాయముతో తనకు గావలసిన ఇష్ట కామ్య రూపముతో
సంచారము చేస్తుంది.అంటే స్వాతి నక్షత్రము రోజున వాన చినుకు కాస్త ముత్యపు చిప్పలో
పడితే అది ఎలా అయితే ముత్యము అవుతుందో అలా పాము నోటిలో పడిన వాన చినుకు కాస్తా
నాగమణిగా మారుతుంది అన్నమాట.దానితో దీని ఆయుష్షు 20 సం||రాల నుండి 500 సం||రాల దాకా
అవుతుంది.”
ప్రకృతి
వెంటనే “స్వామి.మరి పాములు ఆడించేవాళ్ళ చేతులలో ఏవో రాళ్ళుంటాయని వాటిని నాగమణి అంటారు గదా.మరి అవి ఏమిటి?”అనగానే
“ప్రకృతి.అవి నాగమణులు గావు.వాటిని సర్ప శిలలు అలాగే సర్ప ముత్యాలు
అంటారు.అంటే పాము యొక్క విష గ్రంధుల నుండి ఏర్పడే చింతగింజ ఆకార పరిమాణములో ఉండే
నల్లని రాయిని పాములవాళ్ళు బయటికి తీస్తారు.వీటిని సర్ప శిలలు అంటారు.అలాగే మరి
కొన్ని పాము జాతుల తోకలకి ముత్యాలు ఏర్పడతాయి.వీటిని సర్ప ముత్యాలు అంటారు.ఈ
రెండిటికి పాము విషమును అలాగే తేలు విషమును హరించివేస్తాయని అలనాటి దేవ వైద్యుడైన
ధన్వంతరీ నుండి వీటిమీద పరిశోధన చేసిన ఇరాన్ దేశానికి చెందిన కాజ్విని సర్ప
శాస్త్రవేత్త అనుభవాలు నిజమేనని చెపుతున్నాయి.ఎలా అంటే పాముకాటు వేసిన వ్యక్తికి
కాటు పడిన చోట వీటిని ఉంచితే అవి అక్కడ అతుక్కుపోతాయి.ఎపుడైతే ఇవి విషమును
పూర్తిగా తీసుకుంటాయో ఆ మరుక్షణము ఇవి క్రిందపడతాయి.అపుడు వీటిని పాలలో లేదా గోరు
వెచ్చని నీటిలో వేస్తే బుడగలు వేస్తూ ఇవి కాస్త నీలి రంగులోకి మారతాయి.అపుడు ఈ
రాళ్ళు శుద్ధి అయ్యి విషరహితం అవుతాయి.దానిని బట్టి ఈ సర్ప శిలలే నిజమైన నాగమణి యని లోకానికి పాములవాళ్ళు మోసము
చేసి లక్షలకి లక్షలు గుంజుతారు.నమ్మకమున్నవాడిని నమ్మించి మోసము చేయడములో
మానవుడిని మించినవాడు మరొకడు ఉండడు.నమ్మేవాడు ఉన్నంతవరకు వీళ్ళ వ్యాపారానికి ఢోకా ఉండదు అనగానే
ఆనందభిక్షువు
వెంటనే “గురూజీ.ఈ సర్ప శిలలు ఎలా ఏర్పడతాయి” అనగానే
“మిత్రమా.చైనాకి సంబంధించిన ఒక ప్రాచీన గ్రంధము ప్రకారము ఈ సర్ప శిలలు
అనేవి సర్పాలకి అనుకూల వాతావరణ పరిస్థితులు లేనపుడు ఇవి భూమి అడుగుభాగమునకు
చేరుకొని నిద్రాణ స్థితిలోనికి వెళ్ళేముందు ఇవి అక్కడున్న పచ్చటి మట్టిని మింగి
దానిని అంగిట్లో ఉంచుకొని గాలిని గూడ పీల్చుకోలేని దీర్ఘకాల నిద్రాణస్థితి అంటే
సమాధి స్థితిని 12 నెలలు నుండి 18
నెలలు పాటు పొందుతాయి.తమకి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు భూమి మీద ఉన్నపుడు భూమి
అడుగు భాగము నుండి భూమి పైభాగమునకు చేరి తమ అంగిట్లో దాచి ఉంచుకున్న మట్టి ఉండలు
కాస్త సర్పము నోట్లో చింతగింజ ఆకార నల్లటి రాయిగా మారిపోతాయి.వీటిని పాములవాళ్ళు
సేకరించి తమ అంగిటిలో వీటిని ఉంచుకొని మనముందు సర్పము చేత కాటు వేయించుకుంటారు.అపుడికే
సర్పశిల నోటిలో ఉండటము వలన పాముకాటు విషము వీరికి ఎక్కదు అని మీరు ఈ పాటికే
తెలుసుకొని ఉంటారు”.
ప్రకృతి
వెంటనే “స్వామి.అయితే ఈ ప్రాంతములో మీరు నిజమైన నాగమణి ఉన్నదని అనుకుంటున్నారా?”
“ప్రకృతి.నువ్వు ఎపుడైన శివాలయములో వాసుకి సర్ప దేవాలయము ఉండటం చూశావా?
లేదు గదా.కాని ఈ పశుపతినాధ్ దేవాలయములో వాసుకి సర్ప దేవాలయము ఉండటము
బట్టి ఖచ్చితముగా ఇక్కడ జీవ నాగమణి ఉండే అవకాశాలున్నాయి.పైగా పాతాళలోక సొరంగ
మార్గము గూడ ఉండటము బట్టి చూస్తుంటే నాగలోక నాగమణి ఉండే అవకాశాలున్నాయి” అనగానే
ఆనందభిక్షువు
వెంటనే “గురూజీ.ఈ మణులు ఏమిటి?అసలు సాధనకి అలాగే వీటికున్న
సంబంధము ఏమిటో నాకైతే అర్ధము కావడము లేదు” అనగానే
“మిత్రమా.ఇది అర్ధము అయితే మూల విశ్వ రహస్యము ఏమిటో మనకి
తెలుస్తోంది.సాధనలో మనకి మూలాధార, స్వాధిష్టాన,మణిపూరక,అనాహత,విశుద్ధ,
ఆఙ్ఞా ,కర్మ, గుణ,
కాల, బ్రహ్మ, సహస్ర,హృదయ,బ్రహ్మాండ అనే 13
యోగచక్రాలు ఉంటాయి గదా.మనలో కుండలిని శక్తి అనేది పాము ప్రతీక.ఈ శక్తి ప్రవాహము ఈ
చక్రాలలో ఒక పాము పాకినట్లుగా ప్రాకుతూ అన్ని చక్రాలలో ప్రవహిస్తుందని లోకవిదితమే
గదా.పాము అనేది ఊపిరితిత్తులతో శ్వాస జరపకుండా గుండెతో శ్వాసక్రియ జరిపే జీవియని
మనిషి తరవాత అంతటి తెలివితేటలున్న జీవి ఇదేయని అన్ని ధర్మాలలో ఇది గమనించి వీటిని
లోకపూజ్యుడిని చేశాయి.సాధనలో మనకి అంతిమముగా అతి చిన్న దివ్యజ్యోతి బిందువు
కనబడుతుందని లోక విదితమేగదా.ఈ బిందువునే పరంజ్యోతి అని,జ్యోతిదర్శనం
అని,ఆత్మ అని,అణువు అని,బ్రహ్మాండ అణువు,పిండి రేణువు అని ఇలా పలురకాలుగా
యోగులు భావించుకున్నారు.ఇది సహస్ర చక్రములో కనిపించే బిందువని కొంతమంది నిజ
యోగులకి తెలుసు.అది అపుడు లేత పసుపు లేదా బంగారపు వర్ణములో మెరుస్తూ కనబడుతుంది.ఈ
కాంతిని దాటితే మనకి హృదయములో తెల్లని రంగు కాంతియున్న బిందు దర్శనము అవుతుంది.ఈ కాంతిని గూడ దాటితే
మనకి బ్రహ్మ రంధ్రము వద్ద లేత ఎరుపు కాంతి బిందువు కనబడుతుంది.ఈ కాంతిని దాటితే
మనకి లేత నీలి రంగు కాంతి కనబడుతుంది.అంటే సహస్ర,హృదయ,బ్రహ్మరంధ్రాల వద్ద ఉన్న ఈ బిందువులకి మూడు రంగుల కాంతి వర్ణాలకి కారకము
మన కంఠములోని థైరాయిడ్ గ్రంధిలోని బిందువే మూల బిందువని నా పరిశోధనలో
తెలుసుకున్నాను.అంటే సహస్ర చక్రములో ఉండే బిందువును(పిట్యూటరి గ్రంధి)దీనినే పాదరస
చింతామణి గాను,హృదయ చక్రములో ఉండే బిందువును(హృదయ గ్రంధి)
దానిని రుద్రమణిగాను, బ్రహ్మరంధ్రము వద్ద ఉన్న
బిందువును(బ్రహ్మరంధ్ర గ్రంధి) దీనిని బ్రహ్మ చింతామణిగాను, అదే
కంఠమునందు ఉండే మూల బిందువును (థైరాయిడ్ గ్రంధి)దీనిని నాగమణిగా నేను గుర్తించడము
జరిగింది. నువ్వు ఎపుడైన దీపారాధనను చూస్తే లేత పసుపు,లేత
తెలుపు,లేత ఎరుపు,మూలముగా ఆఖరున లేత
నీలి రంగు కనబడతాయి.అంటే ఈ లెక్కన చూస్తే మనకి కనిపించే ఈ మూడు బిందువుల
దర్శనానికి మూల బిందువు అనేది మన కంఠములోని థైరాయిడ్ గ్రంధియేనని ఇదియే శరీర
నాగమణియని నా పరిశోధనలో తెలుసుకున్నాను.ఎందుకంటే నాగపాము యొక్క కంఠములోనే లేత నీలి
రంగు నాగమణి ఉంటుంది.
అంటే
సాధనలో మనకి అంతిమముగా కనిపించే రేణు బిందువులో మనకి నిజానికి 18ఫీల్డ్స్ ఉంటాయి.ఇది ఎలా అంటే పరమశూన్యములో ఉండే విద్యుత్ అయస్కాంత
తరంగాలలో 18 రకాల ఫీల్డ్స్ ఉంటాయని క్వాంటమ్ థియరీ చెపుతోంది గదా.అలాగే హైందవ ధర్మము ప్రకారము చూస్తే మహాభారతములో
కురుక్షేత్ర సంగ్రామము అనేది 18 రోజులపాటు జరగడము 18 మంది యోధులు చనిపోవడము,18 మంది మాత్రమే మిగలడము,అలాగే భగవద్గీత 18 అధ్యాయాలు ఉండటము బట్టి చూస్తే
ఇది గూడ క్వాంటమ్ థియరీ సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉంది గదా.అలాగే కైలాస పర్వతము
లోపల ఉన్న అగర్తల,శంభల గ్రామాలు గూడ 18 నిర్మాణాల అంతస్తుల మధ్యనే అంటే అగర్తల 9 అంతస్తుల
నిర్మాణమని భూస్తర శ్రీ చక్రము చెప్పితే అలాగే శంభల గ్రామము అనేది గూడ తొమ్మిది
అంతస్తుల నిర్మాణము అని మేరు శ్రీ చక్రము చెపుతోంది.దానితో నేను కాస్త సాధనలో
అంతిమముగా మనకి పరమశూన్యము నందు చిన్నపాటి మెరుపుకాంతి ప్రజ్వలనగా కనిపించే
రేణువుకి విభూధిరేణువుగా నామకరణం చేసి ఇందులో ఉన్న 18 ఫీల్డ్స్
ఏమిటో తెలుసుకొని పరిశోధన గావించాను. అపుడు ఇందులో నాకు 18 ఫీల్డ్స్ ఉండినట్లుగా ధ్యానానుభవము అయినది.
అపుడు
ఏమి అయ్యి ఉంటాయని విచారణ చేస్తే మనము చేసే కర్మకి 18 మంది
కర్మప్రదాతలు సాక్ష్యాలుంటారని తెలుసుకున్నాను.వారే నాలుగు వేదాల ఙ్ఞాన దేవతలు(4)
పంచభూతాలు(5) సూర్య,చంద్ర,పగలు,రాత్రి,రెండుసంధ్యాకాలాలు(6)
ధర్మము,అంతరాత్మ,యమ
ధర్మరాజు(3) అనగా 4+5+6+3=18 ఉంటారని
హైందవ ధర్మములోని కర్మ సిద్ధాంతము చెప్పడము తెలుసుకున్నాను.ఎటు చూసిన రేణువులో 18
ఫీల్డ్స్ ఉంటాయని నాకు అర్ధమైనది.ఆఖరి ఫీల్డ్ గా మనకి ధర్మ
గుణముంటుంది.మనము ధర్మముగా ఉంటే పరమాత్మ అవుతామని పునఃజన్మ,పునః
కర్మ,పునఃశరీర,పునః మరణము లేని
నిర్వాణస్థితిని పొందుతామని అదే ధర్మము తప్పితే పైన చెప్పిన వాటికి పునః జన్మలు
ఎత్తి యమధర్మరాజు చేతిలో కష్టనష్టాలు పడతామని నేను గ్రహించాను.అలాగే ఈ రేణువు
యొక్క కాంతి ప్రవేశమునకు కారకమైన మూలమైనది నాగమణి యని ఇదియే రేణువు బిందువుగా
అందరికి ఆఖరున వివిధరకాల వర్ణాలతో అనగా లేత ఎరుపు,లేత పసుపు,లేత తెలుపు చివరికి లేత నీలి రంగు ఇస్తోందని ఇది ఒక జీవ నాగమణి గావడము వలన ఈ మణి లోపల
పాము చారిక ఉండుట వలన ఈ మణికి ఉన్న ఇష్ట కామ్య సిద్ధి వలన ఈ పాము అనేది వివిధ రకాల
84 లక్షల జీవ జాతులుగా,36 కోట్ల
దైవాలుగా, మూడు
కోట్ల త్రిమూర్తులుగా, కోటి పరమాత్మలుగా, అండ పిండ బ్రహ్మాండాల లోకాలను తన స్వప్న శరీరాలతో నిజములాంటి కలతో… కలలాంటి నిజముతో కనిపించేది అంతా అసత్యముగా కనిపించనిది సత్యముగా భ్రమ,భ్రాంతి,మాయ,మోహ,వ్యామోహ, ఆశ, భయము, ఆనంద,ఆలోచన,సంకల్ప,స్పందనలు కలిగిస్తోందని నిజానికి ఈ పాము అనేది లేదని అది పాములాంటి
చారికయని ఇన్నాళ్ళు మనమంతా త్రాడును చూసి పాముయని భ్రమ,భ్రాంతి,మాయ,అఙ్ఞానములో ఉన్నామని నేను తెలుసుకొనేసరికి అంటే
మన పూర్వీక మహర్షులు కుండలినీ శక్తిని ఒక పాముతో పోల్చడము జరిగినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి