15 భాగం

 

15

వేదాలు చదవడమే జ్ఞానమా? సంస్కృతము చదవడమే జ్ఞానమా? అసలు వేదాలకి, జ్ఞానానికి ఏమైనా సంబంధమున్నదా? లేదు గదా. చదువు రాక పోయినా జ్ఞానమును పొందవచ్చును గదా. ఏ చెట్టు క్రిందో ఏ పుట్ట క్రింద కూర్చున్న వాడికి జ్ఞానము అందకుండా పోతుందా? ఒకసారి ఆలోచించండి. వేదాలు బ్రాహ్మణులు మాత్రమే చదవాలా ? ఇతరులు ఎందుకు చదవకూడదు అనేది నా ప్రశ్న. నా ఆవేదన. ఇలా వీళ్లు వేదాల జ్ఞానము పొందడముతో.... పొందని వారంతా ద్వితీయ పౌరులుగా వీరి క్రింద బ్రతకవలసి వస్తోంది గదా. ప్రతిదానికి వేదాలను ప్రమాణముగా చూపి సామాన్యులను ఇబ్బంది పెట్టడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించండి.

           నా కాలములో ఇలా బ్రాహ్మణాధిక్యత మతము  చాలా మెండుగా ఉండేది. ఇందులో పైగా ఎన్నో శాఖలు ఉండేవి. ఆచార వ్యవహారాలు వేరు. ఆచార గురువులు వేరు. సాంప్రదాయాలు వేరు. ఒక్కొక్క గురువుది ఒకొక్క సిద్ధాంతము. ఒక్కొక్క కులపతిది ఒక  మతము. ఎవరి అభిమతము బట్టి మతముండేది.  ఎవరి ధర్మము వారిది.

*** *** *** *** *** ***

రాత్రిపూట నిర్వాణలామా బృందము కాస్త మ్యూజియమునకు ఎందుకు వచ్చారో తెలుసుకోవాలని హుటాహుటిగా త్రివేది అలాగే కులకర్ణి కాస్త ఉదయము కల్లా తమ బలగాలతో మ్యూజియమునకు చేరుకొని అంబేద్కర్ శవము వున్న గది దగ్గరకు వెళ్లారు.

గదిలో శవము వద్ద ఎలాంటి మార్పులు జరకపోవడము గమనించిన కులకర్ణి

త్రివేదితో ..త్రివేది.పోలీసు జాగిలాలను రప్పించి శోధించు. మనకి వీళ్ళు ఎందుకు వచ్చినారో తెలుస్తుంది అనగానే

త్రివేది వెంటనే జాగిలాల అధికారికి ఫోన్ చేసి రెండు జాగిలాలను ఈ శవమున్న గదికి తీసుకొని రాగా అవి కాస్త ఆ శవము చుట్టూ కాసేపు తచ్చట్లాడి గది బయటికి వెళ్లి నిచ్చెన తీసుకున్న చోటకి వచ్చి అక్కడ నుండి తిరిగి గదిలోనికి వచ్చి సీలింగ్ కేసి అరవడము మొదలుపెట్టాయి.దానితో కులకర్ణికి   ఏదో అనుమానము వచ్చి సీలింగ్ కేసి చూడగా అక్కడ ఏమి కనిపించకపోయేసరికి అసలు ఇవి ఎందుకు అరుస్తున్నాయో అర్ధముగాక తన చేతిలో కాలుతూ ఉన్న సిగారును నోటిలో పెట్టుకుంటూ ఇంక ఇవి ఏమేమి చేస్తాయో గమనించసాగాడు.కొంతసేపు అలా అరిచిన జాగిలాలు వెంటనే అక్కడ ఉన్న బుద్ధుడి మూడు చిత్రాల వద్దకి వెళ్లి మళ్లీ అరవడముతో కులకర్ణి వెంటనే ఈ చిత్రపటాల దగ్గరికి వెళ్లి వాటిని నిశిత  దృష్టితో ఆసాంతము పరిశీలించి చూసిన ఎలాంటి ఫలితము కనిపించలేదు గాకపోతే ఈ చిత్రాల క్రిందగా బో-అ-కృ అనే అచ్చు ముద్రలు కనిపించేసరికి తన చేతిలోని సిగారును అందులో పెట్టి బటన్ నొక్కినట్లుగా నొక్కిన గూడ ఏమి జరగకపోయేసరికి జాగిలాల వలన ఏమి తెలియడములేదని వాటిని పంపించివేసి

అక్కడే ఉన్న త్రివేది కేసి చూస్తూ త్రివేది.ఈ కేసు ఆషామాషీగా లేదు.ఇందులో దేవదత్త హస్తము గూడ ఉన్నదని నిన్ననే మాకు సమాచారము అందినది.పైగా వీడి చేతిలో నరహంతకుడైన అంగుళీమాల అనే మహాయాన బౌద్ధ సన్యాసి ఉన్నాడని వాడు బొటనవ్రేళ్లు సేకరించే సైకో కిల్లర్ అని వీరిద్దరు కలసి ఈ ఆపరేషన్ లో ఉన్నారంటే ఖచ్చితంగా అంబేద్కర్ మరణము వెనుక మర్మ రహస్యముగా దేశ లేదా దైవ రహస్యము ఏదో ఉండి ఉండాలి అనగానే..

సార్.మనము వీరిద్దరి పట్టుకోలేమా?”

త్రివేది.వీళ్లని పట్టుకోవడానికి దాదాపు ప్రపంచ దేశాలన్ని గూడ ఎదురు చూస్తున్నాయి.దేవదత్త ఎపుడు ఎక్కడ ఏ దేశములో ఏ ప్రాంతములో ఏ రూపములో ఎలా ఉంటాడో ఇపుడిదాకా ఎవరికి తెలియదు.కాని అంగుళీమాల రూపురేఖలు వాడి ప్రవర్తన వివరాలు మనవాళ్ళు తెలుసుకున్నారు.దానితో వీడిని పట్టుకుంటే వీడిని నడిపించే ఆ పెద్ద మనిషి మనకు దొరుకుతాడు.మొన్న నిర్వాణలామా బృందము సంభాషణలు విన్నదానిని బట్టి చూస్తే నిర్వాణలామాకి అంగుళీమాల ఎలా ఉంటాడో ఖచ్చితంగా తెలుసు అని మాకు తెలిసింది.  గాకపోతే మనకు చిక్కడు దొరకుడు లాగా వీళ్లు అంతా మనతో ఆడుకుంటున్నారు.కాని మన నిఘా నేత్రాల నుంచి వీళ్లు ఎక్కడ ఉన్న తప్పించుకోలేరని వాళ్లకు తెలియడము లేదు అంటూ..

ఇంతలో..

తన చేతిలోని ఫోన్ మ్రోగేసరికి కులకర్ణి ఎత్తి..అవతలి వాళ్ళు చెబుతున్న వివరాలను ఒక కాగితము మీద రాసుకొని ఫోన్ కట్ చేసి …..

త్రివేది.నిర్వాణలామా బృందము ఆవాసము చేస్తున్న కాకా హోటల్ అడ్రసు వివరాలు ఇపుడే అందాయి.మన వాళ్లను మా వాళ్లని అక్కడికి పంపించు.వాళ్లు ఏ క్షణమైన అక్కడికి చేరుకొనే అవకాశముంది.ఏలాగైనా వీళ్లను పట్టుకొంటే అసలు నేరస్తులను పట్టుకొనే అవకాశము మనకి కలుగుతుంది.అలాగే అంబేద్కర్ శవమును ఇక్కడి నుంచి తీయించి మార్చురిలో భద్రపర్చు అంటూ

శరవేగముతో గది నుండి బయటికి వీరిద్దరు వచ్చి తమ వాహనాలను ఎక్కుతూ సహచర పోలీసులకి గూఢాచారి అధికారులకి కాకా హోటల్ అడ్రస్సు చెప్పే పనిలో వీరిద్దరు పడ్డారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి