40 భాగం

 

40

సుజాత, స్వస్తి కలిసి....

మరికొంతమంది తమ స్నేహితులతో కలిసి నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేను తెలుసుకున్న సత్యమును వారికి అర్ధమయ్యే భాషలో అది కూడా ఒక జాతక కథలాగా చెప్పాలని అనుకొని వారికి చెప్పడము మొదలుపెట్టాను.

         నాది కొత్త సాధన మార్గము. నేను తెలుసుకున్న సత్యాన్వేషణ చేసిన విధానము వేరు. పైగా చాలా సున్నితమైంది. అందరికి పనికి వచ్చేది. అవసరమైనది గూడ. మీరు మామిడి పండు తినాలని అనుకున్నారు. అలా అనుకోవడముతో... దాని తియ్యటి రుచి మీకు జ్ఞాపకము వస్తుంది. దానితో మీకు తెలియకుండానే మీ నోరూరుతుంది. అంటే కొత్త ఆవకాయను వేడి వేడి అన్నములో ఎవరైనా కలుపుతుంటే ఆ వచ్చే పచ్చడి వాసనకి మన నోరు ఎలా ఊరుతుందో మీకు తెలియనిది కాదు. ఇలా నోరు ఊరుతుంటే మీరు పండు తిన్నట్లు గాదు కదా. పండు తినాలంటే దాని తొక్క తియ్యాలి. అందులోంచి టెంక తియ్యాలి. ఆ మామిడి గుజ్జును అప్పుడు కాని ఆస్వాదిస్తూ మీరు తినలేరు. ఇలా అన్ని పనులు సక్రమంగా ఎలాంటి విఘ్నాలు లేకుండా జరిగితే కాని మీకు మామిడి రుచి అలాగే తిన్నాను అనే తృప్తి కల్గదుగదా. అంటే మామిడి రుచి ఎలా ఉంటుందో మీకు ముందుగానే ఎరుక గదా. అలాగే 'ఆనందము' అంటే ఏమిటో అది ఎలా ఉంటుందో భావము మీకు ఎరుక గదా. దీనిని శాశ్వత ఆనందస్థితిగా మార్చుకోవడానికి నేను అష్టాంగ యోగము అనే ఎనిమిది నియమాలు మరియు పంచశీల సూత్రాలు ప్రతిపాదించి వాటిని క్రమానుసారంగా నియమానుసారంగా పాటిస్తే చాలు. మీకు శాశ్వత ఆనందస్థితి కలుగుతుంది. అంటే రేపటి గురించి దిగులుండదు. నిన్న జరిగిన దానికి బాధ ఉండదు. ప్రస్తుతము జరుగుతున్న దాని మీద ఆశ, భయము, బాధ, దిగులుండదు. దానితో ఈరోజు అంతా ఎంతో ప్రశాంతముగా, హాయిగా ఆనందముగా గడిచిపోతుంది. ఎందుకంటే మనము చేసే ప్రతి పనినిగూడ చాలా ఎరుకతో, తేలికగా, వివేకబుద్ధితో, ఆనందముగా, ప్రశాంతముగా, తృప్తిగా చేస్తాము. ఇదే నేను కనిపెట్టిన సత్యం. అంటే మనము ఆనందముగా జీవించాలంటే గతచరిత్రను మర్చిపోవాలి. అలాగే భవిష్యత్ గూర్చి ముందుగానే ఏదో ఊహించుకొని కంగారు పడవలసిన అవసరమేలేదు. ప్రస్తుత ఈ రోజులో ఎలా ఉన్నామో ఆలోచించుకొని ఎరుకతో ఉంటేచాలు. ఆనందము దాని అంతట అదే మన అనుభవ అనుభూతిలోనికి వస్తుంది. దీనినే మనస్సు, ధ్యాన, ధ్యానం అంటారు. అంటే ఇలాంటి ఎరుకతో ఉన్న మనిషి తప్పులు చేయలేడు. ఎవరిని బాధించలేడు. ఎవరిని హింసించలేడు. ఎవరిని కష్టపెట్టలేడు. తనుగూడ బాధపడే అవకాశమే ఉండదు గదా. ఇక అప్పుడు పాప-పుణ్యాలు అలాగే కర్మ-జన్మల, కష్ట-నష్టాలకి తావుండదు గదా. తాను ఎవరో ఎరుక  అయినవాడికి ఆనందము తప్ప ఇంక ఏమి ఉండదు. ఏమి కనిపించదు. తెలివి అంటే ఎరుక. అంటే మనం తెలివితో పని చెయ్యాలి. అప్పుడు ఎరుక ఉన్నవానికి తను చేస్తున్న ఆలోచన అలాగే చేస్తున్న పని మరియు ఈ పని ఫలితము ఏమిటో ముందుగానే తెలుస్తుంది. దానికి అది ఎవరికి నష్టము కాని కష్టము కాని బాధకాని ఇబ్బంది కాని ఉండదు. కలిగించదు గదా. తద్వారా మీ హృదయములో ఉన్న మంచితనం అందరికి తెలుస్తుంది. అప్పుడు అందరూ మీ అందరిని ప్రేమించడము మొదలు పెడతారు. మీ అవసరాలు తీరుస్తారు. మీకు అన్నిటియందు తమ సహాయసహకారాలు అందిస్తారు. అలాగే మీరు గూడ ఇలాగే ఇతరుల దగ్గర ప్రవర్తిస్తారు. అందర్ని ప్రేమిస్తూ అందరికి మీ ప్రేమను పంచండి. ప్రేమ అంటే కామ పూరితమైన... స్వార్ధమైన, శారీరక సుఖమైనది నిజమైన ప్రేమ కాదు. ప్రేమ అంటే స్వార్ధము లేనిది. కోరికలేనిది. త్యాగము కోరుకునేది. అని తెలుసుకొని మసలుకోండి. అందరితోనూ ఆనందముగా జీవించండి. అందరి ఆనందములో మీ ఆనందము ఉంటుందని గ్రహించండి. అనగానే

సుజాత వెంటనే...

స్వామి. మీరు తెలుసుకున్న సత్యము సత్యమే అందరు ఆనందముగా జీవిస్తే కష్టనష్టాలకి తావుండదు. ఇలాంటి మంచి జ్ఞానము పొందినవారిని మా భాషలో బుద్ధా అని అంటారు. మిమ్మల్ని అలా అనవచ్చా? అనగానే....

సిద్ధార్థుడికి ఈ పేరు గూడ బాగా నచ్చడముతో ఆనాటి నుండి సిద్ధార్ధ కాస్త బుద్ధ అయినారు. బుద్ధి కాస్త బుద్ధం అయింది. అది కాస్త బౌద్ధం ఎలా అయినదో తర్వాత నేను మీకు చెపుతాను. ఏ చెట్టు క్రింద నాకు జ్ఞానబోధ అయినదో ఆ చెట్టును నాటి నుండి "బోధి వృక్షం" గా నామకరణం చేయడం అయింది.

*** *** *** *** *** ***

నిర్వాణలామా బృందమునకు గావలసిన ఏర్పాట్లు అన్ని కూడ కులకర్ణి చేయడముతో గావలసిన వస్తువులు తీసుకొని జేసి,థామస్ అలాగే నిర్వాణలామా ఈయన భార్య ప్రకృతి మరియు ఆనందభిక్షువు కలిసి మొదట డెహ్రాడూన్ మీదగా ఉత్తరాఖండ్ లో ఉన్న బద్రినాథ్ క్షేత్రానికి బయలుదేరారు.

అపుడు థామస్ కాస్త నిర్వాణలామా కేసి చూస్తూ

లామాజీ.మీ సైన్స్ ప్రయోగము ఎలా పనిచేస్తుందో కొంచెము వివరిస్తారా?” అని అడుగగా

స్వామి.సర్ ఐజాక్ న్యూటన్ కాంతి అనేది కణాల రూపములో ఉంటుందని ప్రతిపాదించాడు.ఆ తరవాత థామస్ యంగ్ జరిపిన ప్రయోగాలలో కాంతి అనేది తరంగాల రూపములో ఉంటుందని కాంతి తరంగ సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించాడు.ఒక పదార్ధమును అతి సూక్ష్మముగా అంటే అణువులు,పరమాణువులు కంటే మూలకాల స్థాయి దాకా వెళ్ళి అది ఎలా తయారు అయినదో అది ఎలా పని చేస్తుందో తెలుసుకోవడమే క్వాంటమ్ మెకానిక్స్ అవుతుంది.

థామస్ యంగ్ తన సైద్ధాంతిక ప్రయోగాలలో భాగముగా కాంతి మొదట కణాల రూపములో మారడము ఆపై తరంగాల రూపముగా మారడము గమనించాడు.అంటే కాంతి ప్రసారమునకు ఆటంకమునకు ఏదైన డిటెక్టర్ ను పెట్టినపుడు అపుడిదాకా తరంగాల కాంతి కాస్త కణాల కాంతిగా మారడము ఆయన గమనించాడు.అంటే కాంతి అనేది తనని ఎవరైన గమనిస్తే ఒకలా ప్రవర్తించడము లేదంటే మామూలుగా మరోలాగా ప్రవర్తించడము ఈయన గమనించి విస్తుపోయాడు.ఇదే విషయాన్ని గమనించిన మిగిలిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యానందము పొందారు.ఇదే గాకుండా ఒకే సమయములో ఒక అణువు అనేక చోట్ల మనుగడ కొనసాగిస్తోందని వివిధ ప్రయోగాల ద్వారా తెలుసుకొని మరింతగా ఆశ్చర్యము చెందారు.అంటే సమాంతర ప్రపంచాలు ఉన్నాయని అదే మల్టిపుల్ వరల్డ్స్ లేదా ప్యారలల్ వరల్డ్స్ సిద్ధాంతమును ఈ ప్రయోగాలు బలపరిచాయి.

ఒకచోట పరమాణువు కణములాగా ఉంటే ఇదే పరమాణువు మరొక చోట కాంతిగా ఉందని షోడింగర్ శాస్త్రవేత్త తన ప్రయోగాల ద్వారా నిరూపించాడు.అంటే ఈయన సిద్ధాంతము ప్రకారము ఒకే పరమాణువు రెండుగా చీలిపోయి సైట్ కి అవతల వైపు తిరిగి కలుస్తుంది అని చెప్పడము జరిగింది.దీనిని బట్టి చూస్తే సమాంతర ప్రపంచాలు ఈ అంతరిక్షములో ఉన్నట్లే గదా.అంటే మనము చూసే ప్రపంచము గాకుండా మనకి తెలియని ప్రపంచము కూడా మనతో పాటు ఉన్నట్లే గదా.నిజానికి శాస్త్రము అలాగే తత్వము అనేది వేరు వేరు కాదు.ఏదైన శాస్త్రపరిశోధన చేసేటపుడు తార్కికంగానే కాదు తాత్వికంగా కూడ మనము ఆలోచించాలి.దానితో విఙ్ఞాన శాస్త్రములో ఏవి శాశ్వత సత్యాలు కావని ఉండవని మనకి తెలుస్తుంది అనగానే...

జేసి వెంటనే లామాజీ.మీరు చెప్పినట్లుగా ఈ ప్రయోగాన్ని తార్కిక ఆలోచన అలాగే తాత్విక ఆలోచనతో చెప్పగలరా?”

జేసి చెప్పవచ్చును.ముందు తాత్విక ఆలోచన గూర్చి చెప్పుకుందాం.అంటే ఒక పరమాణువు ఒక చోట రెండుగా విడిపోయి మరొక చోట కలవడము.ఇదియే శరీరము-ఆత్మ లాగా అన్నమాట.శరీరము నుండి ఆత్మ విడిపోతుంది.ఆత్మ మళ్ళీ శరీరములోకి ప్రవేశిస్తుంది.జననము నుండి మరణము అలాగే మరణము నుండి జననము అన్నమాట.ఇక తార్కిక కారణము గూర్చి అడిగితే నీటిలోని చేపకి అది నీటిలో ఉందని అసలు తెలియదు.దానిని ఎపుడైతే నీటి నుండి బయటకి తీసుకొని వస్తామో అది వేరే యానకములోకి వచ్చినట్లుగా భావించుకొని సతమతమై చివరికి ప్రాణాలు విడుస్తుంది.అంటే అది గుర్తించని నీటిని మనము చూస్తున్నట్లుగా మనం గుర్తించని ప్రపంచము ఆ చేపకి ఇంకోలా కనిపిస్తుందేమోనని తార్కికముగా ఆలోచించండి.మీకే తెలుస్తుంది.అంతెందుకు చివరకి మన అంతరిక్షము పరమశూన్యముగా ఉంటుందని మనము అనుకుంటున్నాము.

నిజానికి అందులో మనకి కనిపించని లేదా అన్నింటిని తనలో ఇముడ్చుకున్నదేమో ఎవరికి ఎరుక.అంటే ఖాళీ ప్రదేశము అయిన శూన్యములో మనకి కనిపించని 18 రకాల ఫీల్డ్స్ తో ఉన్నదని క్వాంటం ఫీల్డ్ థియరీ చెపుతోంది.అంటే ఈ లెక్కన శూన్యము అనేది శూన్యముగా ఖాళీగా లేదన్నమాట గదా.ఈ లెక్కన మనము నివసించే ఈ ప్రపంచములో కూడ మనకి తెలియని అంతరిక్షము లేదా ఏదైనా యానకము ఉండి ఉండవచ్చని నా అనుమానము.ఇందుకోసమే నా ప్రయోగ వస్తువు తయారుచేశాను.

థామస్ వెంటనే లామాజీ.మీరు చెప్పేది బాగానే ఉన్నది.గాకపోతే మీ పరికరము అనేది మీరు చెబుతున్న దానిని బట్టి చూస్తుంటే షోడింగర్ థియరీ ప్రకారము పని చేస్తుంది.ఒకవేళ అలా జరుగకపోతే

స్వామి.ఈ అంతరిక్షములో ఉన్న 18 రకాల ఫీల్డ్స్ ను మనము తొలగించగలిగితే మరో ప్రపంచానికి వెళ్ళవచ్చును లేదా ఆత్మ శరీరాలుండే లోకాలకి వెళ్ళవచ్చును.ఇందులో ఏదో ఒకటి ఖచ్చితముగా జరిగి  తీరుతుంది.ఇదే జరుగుతుందని అయితే నేను ఖచ్చితముగా చెప్పలేను అని అనగానే

జేసి అందుకొని లామాజీ. మీ ప్రయోగ పరికరము ఎలా పనిచేస్తోందని అనగానే

జేసి మీరు ఎపుడైనా బ్లాక్ హోల్స్ గూర్చి విన్నారా? ఇవి రెండు వేరు వేరు ఫీల్డ్స్ కలిపే మార్గమని ఈ విశ్వములో వేల కాంతి స||రాలు గూడ ప్రయాణించి గూడ చేరుకోలేని ప్రాంతాలకు ఈ హోల్స్ ద్వారా ప్రయాణించి చేరుకోవచ్చని మన శాస్త్రవేత్తలు తెలుసుకొని వీటికి కావలసిన సిద్ధాంతాలును తయారు చేశారు.కాని ఈ విశ్వ అంతరిక్షములో ఇవి ఎక్కడ ఎలా ఉన్నాయో తెలుసుకోలేక పోవడము జరిగింది.దానితో ఈ సిద్ధాంతాలు మరుగున పడ్డాయి.నేను కాస్త విఙ్ఞాన శాస్త్రవేత్తతో పాటుగా ఆధ్యాత్మికత శాస్త్రవేత్తను గావడముతో విఙ్ఞాన శాస్త్రాలు అలాగే వేద శాస్త్రాలను రెండిటిని మిళితము చేసి నేను ఒక సరికొత్త విషయమును కనుక్కోవడము జరిగింది.అది ఏమిటంటే ఎత్తైన పర్వతాలు లేదా కొండలపైన  మనకి పాజిటివ్ శక్తి ఉంటుంది.అందుకే మన క్షేత్ర దేవాలయాలు, బౌద్ధ మందిరాలు, బౌద్ధ స్తూపాలు అన్నిగూడ ఎత్తైన ప్రదేశాలలో నిర్మించడము జరిగింది.ఈ పాజిటివ్ శక్తికి ఈ బ్లాక్ హోల్స్ ను గుర్తించడము జరిగింది.ఎక్కడైతే ఈ హోల్స్ ఉన్నాయో వీటి చివరల్లా మరో ప్రపంచము లేదా లోకము తప్పని సరిగా అనుసంధానముగా ఉండే అవకాశాలున్నాయి. యోగపరిభాషలో మనలోని సప్త చక్రాలకి సప్తలోకాలున్నాయని ఈ చక్రాలు గూడ సప్త క్షేత్రాలకి అనుసంధానము చేయడము జరిగింది.అనగాఈ లెక్కన చూస్తే చనిపోయిన వారు ఉండే లోకము పితృలోకము.దీని చక్రము అనాహతము.దీని క్షేత్రము ఉజ్జయిని.ఇది శివాంశ క్షేత్రము గావడము వలన హిమాలయాలు అంతా గూడ శివమయము గావడము అలాగే మనకి శివుడే మృత్యుకారకుడు గావడము ఈ పరికరముతో హిమాలయాలలో ఈ ప్రయోగము చేయాలని నిశ్చయించుకున్నాను.కాని ఇలాంటి శక్తి గూడ బద్రినాథ్ క్షేత్రములో గూడ ఉన్నదని నా పరిశోధనలో తెలుసుకున్నాను.మొదట ఈ పరికరమును ఈ క్షేత్ర పరిసరాల పర్వతాలలో ఒక పాజిటివ్ పర్వతమును ఎంచుకొని దానిపై ఈ పరికరము నుంచి  అతిశక్తివంతమైన నెగెటివ్ శక్తి తో అక్కడున్న    పాజిటివ్ శక్తిపై ప్రయోగించినపుడు దానికి ఆకర్షితమై ఆ పాజిటివ్ శక్తి కాస్త బ్లాక్ హోల్స్ ను అనసంధానించవచ్చును.ఈ హోల్స్ అనుసంధానముకాగానే ఈ హోల్ లొకి 18 సెకన్స్ లోపల మీరు ప్రవేశించగలగాలి.అపుడుదాకా మాత్రమే ఈ పరికరములోని అతిశక్తివంతమైన బ్యాక్టరీలు నెగెటివ్ శక్తిని ప్రసారము చేస్తాయి.నేను ఈ పరికరమును ఆగిపోకుండా చూసుకుటుంటే మీరిద్దరు ఆ హోల్ లోకి ప్రవేశిస్తే ఆపై దానికి అనుసంధానమైన వేరే లోకవాసులున్న లోకానికి వెళతారు.నాకు తెలిసి పితృలోకానికి అదే అనుసంధానము అవుతుందని నా ఆధ్యాత్మికత ధ్యానానుభవము చెబుతోంది.అది నిజమో గాదో నాకు ప్రత్యక్షానుభవము నిదర్శనము అయితే తెలియదు.ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ హోల్ లోకి వెళితే ఈ భూలోకముతో ఉన్న అనుసంధానము తెగిపోయి దాని చివర ఉన్న మరో క్రొత్త లోకముతో అనుసంధానము అవుతారు.ఒకవేళ మీకు ఆ క్రొత్త లోకములోకి వెళ్ళగూడదని లోపలకి వెళ్ళిన తరవాత అనిపిస్తే 36 సెకన్స్ లోపల  తిరిగి ఈ హోల్ నుండి బయటికి రావచ్చును.ఆ సమయము దాటితే నేను కాదు గదా ఆ భగవంతుడు గూడ అలాగే పరమశూన్యము గూడ ఏమి చేయలేదు.అన్ని దీర్ఘముగా ఆలోచించుకొని మీకు మీరే నిర్ణయము తీసుకోండి.లేదా కైలాస పర్వతములోని అగర్తల గ్రామములో ఉన్న పాదరస మణిని ఏమి కోరిక కోరితే అది తీరుస్తుందని ప్రతీతి.కాబట్టి ఒకవేళ మీకు నా సైన్స్ ప్రయోగ పరికరము మీద ఏదైన సందేహముగా ఉంటే ఈ పాదరస చింతామణి ద్వారా పితృలోకానికి వెళ్ళవచ్చును.ఇందులో నాకెలాంటి అభ్యంతరము లేదు అనగానే

జేసి వెంటనే లామాజీ.ఆధ్యాత్మిక శక్తులమీద మాకు అపార నమ్మకమున్నది.కాని వాటి ద్వారా మా కోరిక తీరాలంటే అందుకు మాకు అర్హత,యోగ్యత ఉండి ఎన్నో రకాల యోగమాయలను దాటుకునే వివేక బుద్ధి ఙ్ఞానము మాకు ఉండాలి.అది మా ఇద్దరికి అసాధ్యమనే చెప్పాలి.కాబట్టి మీరు చేసిన ప్రయోగ వస్తువు ద్వారా మేము మా నాన్న దగ్గరికి వెళ్ళతామని నమ్మకము ఉంది.కాని ఈ ప్రయోగానికి మీరు ఎందుకు బద్రీనాథ్ క్షేత్రాన్ని ఎంచుకున్నారు అనగానే

ఎందుకంటే మహాభారత కధనం ప్రకారము పంచపాండవులలో ధర్మరాజు కాస్త ఒక కుక్కతో కలసి ఈ పర్వత ప్రాంతము నుండి స్వర్గారోహణ చేశారు గదా.అది నిజమేనని నా పరిశోధనలో తెలిసింది. అని చెప్పి నిర్వాణలామా మౌనము వహించాడు.

దానితో ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు జరుగబోయే సైన్స్ ప్రయోగము గూర్చి మాట్లాడుకోవటము ప్రారంభించారు.

ఇంతలో ఆనందభిక్షువుకి సందేహము వచ్చి లామాజీ.మీరు తరవాత క్షేత్రముగా ఖాట్మాండ్ క్షేత్రమును ఎందుకు ఎంచుకున్నారు అనగానే

నిర్వాణలామా చిరునవ్వు నవ్వి తన చేతి సంచిలోంచి చివరకు కాలయంత్రములో దొరికిన ఆఖరి ఆధారమైన మణి పద్మ బాక్స్ ను తెరచి అందులో ఉన్న రూట్ మ్యాప్ వెనుకే

సహస్ర పద్మ మణి-చింతామణి-కైలాస పర్వతము

హృదయ పద్మ మణి-రుద్ర మణి-మణికైలాసం

కంఠమణి-నాగమణి-పశుపతినాధ్

అని రాసి ఉండటము గమనించి ఆనందభిక్షువు మౌనము వహించి ధ్యానము చేసుకోవడము ఆరంభించాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి