13, జనవరి 2021, బుధవారం

ది బుద్ధ కోడ్ - Mystery- detective-thriller

మన బుద్ధ భగవాన్ జన్మించి 2550 సంవత్సరాలైంది.
వేదాల నీడ గాదని బోధి నీడను ఆశ్రయించి జ్ఞాని అయ్యి జ్ఞానబోధ చేసి బోధిసత్వుడై ఆపై బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేసి తధాగతుడైనాడు. 
కాని టిబెటన్ యోగులు,లామాలు గత రెండు వేల సం.రాల నుండి నిత్యము జపించే ఓం-మణి-పద్మ-హుం మంత్రార్ధము ఏమిటి
మణిపద్మం అంటే ఏమిటి
14వ శతాబ్ధము నాటి బుద్ధుడి చేతిలో మణి పట్టుకున్న ఆ మూడు చిత్రాలు లోకానికి ఏమి చెపుతున్నాయి. 
అలాగే 1903-1909 సం.కాలము నాటి లామా ద్యోర్జీ చోగ్యాల్ బృందము హిమాలయాలకి వెళ్ళి మణిశోధన చేసి ఏమి చూశారు.
1912 సం.లో చార్లెస్ బెల్ అను సైనికాధికారి ఈ మణిశోధన చేసి తయారు చేసిన సీక్రెట్212 రిపోర్ట్ ఏమి చెపుతోంది.
అసలు బుద్ధ భగవానుడు ప్రతిపాదించిన కాలచక్ర తంత్రము నిజానికి ఏమి చెపుతోంది. 
రహస్యముగా ధ్యానాలు చేసుకొనే యోగులు,మునులు,లామాలు తెలుసుకొని లోకానికి చెప్పని హిమాలయ రహస్య గ్రామాల వివరాలు ఏమిటి?.
వీళ్ళు నిత్యము పూజించే మణిమంత్ర రహస్యకోడ్ ఏమిటి.. 
ఒక పక్క పోలీసుల వేట... (detective)
మరోపక్క అర్ధముకాని పజిల్స్ (Mystery)
మరోవైపు ఏమి జరుగుతుందో అర్ధము కాని ఉత్కంఠ సన్నీవేశాలతో (thriller)
ఇలాంటి ఇత్యాది విషయాల సమాహారమే ఈ ఆధ్యాత్మిక నవల కధాంశము.

                                                                  ఒక విజ్ఞప్తి
బౌద్ధధర్మ బుద్ధుడు తను అంతిమముగా తెలుసుకున్న మదిసత్యమును లోకానికి ఒక మణిమంత్ర రూపములో అతిగోప్యముగా ఒక మణిపద్మముగా చెప్పడము జరిగింది.అది ఏమిటో మీరు తెలుసుకోవాలంటే ఈ కధాంశమును బుద్ధుడు చెప్పిన ఒక జాతక కథగా చదవండి. ఇందులో చెప్పిన ప్రతి అంశము నా మది నుండి వచ్చిన ఊహలే..కల్పిత పాత్రలే..కల్పితాంశాలే..ఈ కథాంశమును ఒక కథగా చదివి ఆనందించండి.

         Mystery- detective- thriller

                                    ----- పరమహంస పవనానంద

                       copyrights © writer