20
ఇతనిని
దాటుకుంటూ ముందుకి వెళ్లుతుండగా....
చిన్న పాప శవము ఎదురైంది.ఆ
పాపలో ఎలాంటి చలనము లేకపోయేసరికి అప్పడిదాకా ఉన్న ప్రాణస్థితి ఎటు పోయినదో నాకు
అర్థముకాలేదు. అలాగే జీవుడు ఎప్పుడికైనా శవము గాక తప్పదని ఈ సంఘటన ద్వారా
తెలుసుకున్నాను. ఈ పాప శవానికి అంతిమ అంత్యక్రియలు సంస్కారాలు చేస్తున్నారని
తెలుసుకున్నాను. ఇది ఎలా చేస్తారో దగ్గర ఉండి చూడాలని నేను అలాగే చెన్ను అక్కడే
ఉండిపోయాము. ఇంతలో పురోహితుడు ఒకరు వచ్చి ఏవో మంత్రాలు చదువుతూ శవమును నది తీరానికి తీసుకొని వచ్చి ఈ
శవానికి నది స్నానము చేయించాడు. ఇలా స్నానం చేయిస్తే జన్మ పాపాలు నశిస్తాయని
పురోహితుడు నమ్మకముగా చెప్పేసరికి ఆ మాటలు విన్న నాకు ఆవేదన మొదలై.... గంగా
స్నానము వలన ఈ శవానికున్న పాపాలు ఎలా తొలుగుతాయో చేయించిన పురోహితుడికి అలాగే ఈ
తంతు చేసిన తల్లిదండ్రులకి మరియు ఈ తంతు చూస్తున్న బంధుమిత్రులకి ఏమీ తెలియదని
నాకు అర్థమైంది.
దానితో
నా ప్రక్కనే ఉన్న చెన్నుతో...
“చెన్నా..... గంగాస్నానముతో పాపాలు నశిస్తాయని నీవు నమ్ముతున్నావా?”
“రాజకుమారా. తప్పకుండా నమ్ముతాను. లేకపోతే చాలా మంది ప్రజలు ఎందుకు గంగానది
స్నానము చేస్తారు?”
“చెన్నా. అయితే ఆ గంగ నీటిలో జీవించే జలచరాలకి మనుష్యులకంటే ఈపాటికి ఎక్కువ
పుణ్యఫలాలు ఉండి ఉండాలి గదా?”
“రాజకుమారా. ఆ విషయాలు నాకు తెలియదు కాని నది స్నానము
వలన మనస్సుశుద్ధి అలాగే శరీరశుద్ధి అవుతాయని ఖచ్చితంగా చెప్పగలను.”
“చెన్నా. నువ్వు చెప్పింది నిజమే. శరీర మురికి పోతుంది కాని పాపాలు పోవు” అంటూ......
ఏది
పాపము... ఏది పుణ్యమో ఎలా తెలుస్తుందో అనుకుంటూ.... ఇంక నా గుఱ్ఱమును ముందుకి పోనియ్యలేక అంతఃపురము వైపు బయలుదేరాము.
***
*** *** *** *** ***
జేసి
శరవేగముతో కారును నడుపుతూ
“నిర్వాణలామాజీ.ఏమి ఆలోచిస్తున్నారు?మరి ర్యాపిడ్
గేమ్ ఆడుతున్నారా?మణి పరిశోధనకి ముందుకి వెళ్ళుతున్నారా?”
“జేసి.అందులో అడిగే ఎనిమిది
ప్రశ్నలు దేనికి సంబంధించినవో మనకి తెలియదు.పైగా లోకవిరుద్ధము ప్రతి ప్రశ్నకి ఒక
సమాధానమునకు బదులుగా మూడు సమాధానాలు అదిగూడ ఒక నిమిషములో చెప్పాలి.దానిని గూర్చి
ఆలోచన చేస్తున్నాను.”
“లామాజీ.మా నాన్న గారు ఈ ప్రాజెక్టుకి ది బుద్ధ కోడ్ అని పేరు పెట్టారు
గదా.దీనిని బట్టి చూస్తే ఈ ఆధారములో అడిగే ఎనిమిది ప్రశ్నలు ఖచ్చితముగా బౌద్ధ
ధర్మమునకు లేదా బుద్ధ భగవానుడి జీవిత చరిత్రకు సంబంధించినవే అయ్యి ఉంటాయి.ఆ
విషయములో మీరు ఆలోచించనవసరము లేదు” అనగానే
“జేసి.ఒకవేళ నీ ఆలోచన తప్పు అయ్యి అవి వేరే ప్రశ్నలు అయితే వాటికి నేను
సమాధానము చెప్పకపోతే నా వలన మీ నాన్నగారి మణి శోధన ప్రాజెక్ట్ డీకోడ్ సర్వనాశనము
అవుతుంది.ఎందుకు రిస్క్ తీసుకోవడము అని ఆలోచిస్తున్నాను.”
“లామాజీ.ఒకవేళ నా ఆలోచన సరియైనది అయితే మీరు మణిశోధన చేసే మహత్తర అవకాశమును
కోల్పోయినవారు అవుతారు గదా.అది ఆలోచించండి”
“జేసి.ఏమి చేయాలో ఏమి ఆలోచించాలో నాకైతే అర్ధము గావడము లేదు.ఒకవేళ నీ ఆలోచన
సరియైనదైతే ఈ ఎనిమిది ప్రశ్నలు కాస్త బౌద్ధ ధర్మమునకు సంబంధించినవి అయితే వాటికి
ఖచ్చితముగా సరియైన సమాధానాలు ఇవ్వగలను.”కాని..
“లామాజీ.కాని ఎందుకు.నీటిలో మునిగినవాడికి చలి భయమెందుకు.తెగించినవాడికి
తెడ్డె గతియే కదా.అనవసరమైన ఆలోచనలు చేయకండి.ఏది జరిగిన మన మంచికే అనుకొని ముందుకు
సాగండి.”అనగానే
నిర్వాణలామా
వెంటనే..”మిత్రమా.ఆనందభిక్షువు.ఏమి చేయమంటావు?ముందుకి
వెళ్ళమంటావా లేదా ఆగిపొమ్మంటావా” అనగానే..
“గురూజీ.మీరు ఎపుడు నాతో అంటూ ఉంటారుగదా.అదే సాధన సాధ్యతే సర్వం సాధ్యం
అని..బుద్ధ భగవానుడిని తలచుకొని ఓంమణి-పద్మ-హుం అని గురు మంత్రమును తల్చుకొంటూ
ముందుకు సాగిపోండి.ఏది ఏమి జరిగిన ఆయన అనుగ్రహమునకే వదిలేద్దాము.నారు పోసినవాడు
నీరు పోయడా” అనగానే..
“సరే మీరు నా వెనుక ఉన్నారు.ఆ దైవము నాలో ఉంది.ఏమి జరుగుతుందో చూద్దాం” అంటూ
నిర్వాణలామా
తన ముందున్న కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న యెస్ అనే బటన్ నొక్కగానే మొదటి ప్రశ్న
కనబడినది.అది ఏమిటంటే
ఙ్ఞాన
మార్గములో
ప్రాపంచిక
ప్రలోభాలకు
లోను
కాకూడదు..బంధాలలో
చిక్కుపడిపోగూడదు..
8/R:
8/I:
8/A:
టైమర్
స్టార్ట్ అయినది.
ఈ
ప్రశ్న చదవగానే నిర్వాణలామా నొసలు ముడిపడ్డాయి.అసలు ప్రశ్నయే అర్ధము కాలేదు.దానికి
తోడు సమాధానాల క్లూసు క్రిందగా 8/R,8/I,8/A అని
ఉంది.ఇది దేనికి సంకేతమో అర్ధముగాలేదు.ఒక ప్రక్క టైమర్ లోని టైము పరుగులు పెట్టడము
మొదలుపెట్టినది.అంతేవేగముగా నిర్వాణలామా ఆలోచనలు పరిగెత్తాయి.ఈ ప్రశ్న చూసిన
జేసికి అలాగే ఆనందభిక్షువుకి ఆందోళన మొదలైనది.ఈ ప్రశ్న విన్న కళ్ళు మూసుకొనియున్న
అపరిచిత వ్యక్తిలో ముఖము మీద నెమ్మదిగా చెమట బిందువులు ఏర్పడసాగాయి.
టైమర్
సమయము అప్పటికే ఒక నిమిషము అయిపోయింది.కొద్దిసేపటి తరవాత రెండవ నిమిషము అయిపోయింది.
అయిన
నిర్వాణలామా సమాధానము చెప్పకుండా కళ్ళు మూసుకొని దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు.ఏదైన
మాట్లాడితే అది తమ వాయిస్ ను సమాధానముగా తీసుకుంటే మొదటికే మోసము వస్తుందని జేసి
అలాగే ఆనందభిక్షువు ఆందోళనపడుతూ మౌనముగానే కంగారుపడుతున్నారు.మూడవ నిమిషము గూడ అయిపోయింది.కాని
సమాధానము చెప్పలేదు.ఈ లెక్కన ఒక ప్రశ్నకే మూడు నిమిషాలు పడితే ఇంక మిగిలిన
ప్రశ్నలకి ఇంక ఎన్ని నిమిషాలు పడుతుంది.అంటే ఎనిమిది నిమిషాలలో ఇది పూర్తి చేయడము
అసాధ్యము అనే ఆలోచనకే ఆనందభిక్షువుకి ప్రకృతి కార్యములో ఒకటి మొదలైనది.టెన్షన్
ఆపుకోలేక ఏమి మాట్లాడలేక మౌనవేదనతో కళ్ళు మూసుకున్నాడు.జేసి అయితే డ్రైవింగ్ మీద
దృష్టి పెట్టలేక నిర్వాణలామా వంక అయోమయముగా చూస్తున్నది.
ఇంతలో
నిర్వాణలామా మెరుపుకాంతితో కళ్ళు తెరుస్తూ మౌనముగా ఉండమని వీరిద్దరికి సైగ చేస్తూ
పరిగెత్తే టైమింగ్ గూర్చి ఆలోచించకుండా
దీని
సమాధానముగా మంచిపని..జంట చేపలు.. మత్స్యావతారము
అనగానే..
రెండవ
ప్రశ్నలోనికి వెళ్ళిపోయాడు. అది చూస్తే.
మనిషి..
కోపానికి
అలాగే ద్వేషానికి
దరిద్రం
స్వార్ధం కారణం
వీటి
వలన ఆలోచనలు
ప్రతికూలం
మారతాయి..
ఈసారి
సమాధానాలు ఆర్డర్ మారినదని నిర్వాణలామా గ్రహించాడు.
గుప్తనిధి
పాత్ర-కూర్మ అవతారం-మంచి దృష్టి
అని
వాయిస్ సమాధానాలు చెప్పగానే
మూడవ
ప్రశ్న కనపడింది.
జనన
మరణాలకు
కారణం
అఙ్ఞానం..
ఆత్మ
సంస్కారం
కలుగడమే
ఙ్ఞానం ..
వరాహ
అవతారం-మంచి జీవితం-కమలం
అని
సమాధానము చెప్పగానే
టైమర్
సమయము 5ని.అయినదని వాయిస్ లో పెద్దగా చెప్పింది.వాయిస్ ప్రశ్నలకి దీనికి
నిర్వాణలామా చెప్పే వాయిస్ సమాధానాలు వింటున్న బౌద్ధ ధర్మములో పి.హిచ్.డి చేసిన
ఆనందభిక్షువునే ఆలోచనలో పడివేశాయి.అసలు బౌద్ధ ధర్మము గూర్చి తెలియని జేసిలో ఏదో
తెలియని ఉత్సాహము మొదలై వేగంగా కారును నడపసాగింది.
నాలుగవ
ప్రశ్న:
మనం
ధ్యానము చేసేది
మనకోసము
గాదు..
ధ్యానము
వలన పొందే ఙ్ఞానము
ఇతరులకి
అందించాలి
దీనికి
సమాధానముగా ధ్వజపటం-నారసింహ-మంచి సమాధి అనగానే
అయిదవ
ప్రశ్న:
నిరాడంబరంగా
కోరికల్ని
అవసరాలకు
పరిమితం
చేస్తూ జీవించడం వల్ల
శాంతి,ఆనందము కలుగుతాయి.
వామన-గొడుగు-మంచి
సంకల్పమని సమాధానాలు చెప్పగానే
ఆరవ
ప్రశ్న:
సాధనను
నిర్లక్ష్యం
చెయ్యరాదు.
తీవ్ర
సాధన...
వలన
లక్ష్యాన్ని చేరగలరు.
దీని
సమాధానముగా
శంఖం-పరశురామ-మంచి
వ్యాయామము అనగానే
ఏడవ
ప్రశ్న:
ఏ
ఒక ధర్మము శాశ్వతముగాదు.
అన్ని
ధర్మాలు అశాశ్వతాలే.
కాని..
ధర్మం
మరువకూడదు.
దీనికి
సమాధానముగా
శ్రీరామ-మంచి
ఙ్ఞానము-ధర్మ చక్రము అని చెప్పగానే
టైమర్
సమయము ఇక 18 సెకన్స్ మాత్రమే ఉన్నదని వాయిస్ తో
చెప్పగానే అక్కడున్న అందరిలో టెన్షన్ మొదలైంది. 8 వ
ప్రశ్నకోసము నిర్వాణలామా ఎదురు చూస్తుండగా దీనిని సమయములోపల సమాధానము చెప్పలేకపోతే
ఇపుడు పడిన కస్టము అంతా గంగపాలు అవుతుందని మిగిలిన ముగ్గురిలో తీవ్రమైన ఆందోళనకి
గురి అవుతుండగా
మీ
8వ ప్రశ్న:
అవసరాలు
పెరిగే కొద్ది
ఆశలు
పెరుగుతాయి.
కోరికలు
పెరిగేకొద్ది
కష్టాలు
బాధలు పెరుగుతాయి.
దీనికి
కారణము
అత్యాశ.
దీనికి
సమాధానము కోసము నిర్వాణలామా కొన్ని సెకన్స్ సమయము తీసుకున్నాడు.దానితో
టైమర్
లోని 18 సెకన్స్ కాస్త
8..
7..
6..
5..
4..
3..
అంటూండగా
దీనికి
సమాధానముగా
మంచి
సమాధి-శ్రీకృష్ణ-చిక్కుముడి అని చెప్పిచెప్పగానే..
మేము
అడిగిన ర్యాపిడ్ ఆటలోని అన్ని ప్రశ్నలకి సరియైన సమాధానాలు అనుకున్న సమయము లోపల
చెప్పారు.కాని మా బోనస్ ప్రశ్నకి సమాధానము చెప్పగలిగితే మణి కీ స్టోన్ కి
సంబంధించిన ఆధారము ఇవ్వబడుతుందని వచ్చిన స్క్రీన్ చూడగానే అందరిలో మళ్ళీ ఆందోళన
మొదలైంది.
మా
చివరి ప్రశ్న:
8+5=8+9
యెస్
ఆర్ నో అనగానే
ఇది
విన్న జేసి,ఆనందభిక్షువు తమ మనస్సులో ఇది యెస్ ఎలా
అవుతుంది
8+5=13
8+9=17
గదా.అంటే
దీని సమాధానము నో కదా అనుకోగానే నిర్వాణలామా ఏమాత్రము ఆలోచించకుండా యెస్ అనగానే
మీరు విజయము సాధించారు.
మీ
ఆధారము అంటూ
కంటకము
147
విభూధినాధ్
మహా
స్మశానములో
ఎదురుచూస్తున్నాడు.
అని
కనబడేసరికి నిర్వాణలామా వెంటనే దీనిని తన చేతిలోని పేపర్ మీద నింపేశాడు.కొన్ని
సెకన్స్ లో ఈ సాఫ్ట్ వేర్ కి వైరస్ సోకినట్లు ఇందులో ఉన్న ఆధారాలు నాశనము
అవుతున్నట్లుగా మెసేజీలు మీద మెసేజీలు వస్తూండగానే శాశ్వతముగా సిస్టము పని
చేయకుండా ఆగిపోయింది.దానితో వీరందరు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ
ర్యాపిడ్ ప్రశ్నల గేమ్ ను విజయవంతముగా పూర్తి అయినందుకు నిర్వాణలామా కాస్త బుద్ధ
భగవానునికి కృతఙ్ఞత చెప్పుకున్నాడు.
కొన్ని నిమిషాల దాకా ఎవరు గూడ ఒకరినొకరు చూసుకోలేదు.మాట్లాడుకోలేదు.
అందరి
ఆందోళనలు నెమ్మదిగా తగ్గిన తరవాత విశ్రాంతి స్థితికి వస్తూ
ఆనందభిక్షువు
వెంటనే
“గురూజీ.మీరు చెప్పిన మూడు సమాధానాలు అలాగే ప్రశ్నలకి గల సంబంధము ఏమిటో ఒక
పట్టాన అర్ధము కాలేదు” అనగానే
“మిత్రమా.ఏమిలేదు.మనల్ని అయోమయానికి గురిచేయడానికి మూడు క్లూసులు అనగా 8/R,8/I,8/A
అని చెప్పడము జరిగింది.ఇందులో 8/R అంటే
బుద్ధుడు చెప్పిన అష్టాంగ
నియమాలు. నియమాలు అంటే ఇంగ్లీష్ లో రూల్స్ కదా.ఇవి ఎనిమిది నియమాలు గావడంతో దీనికి
సంకేతము 8/R
అని క్లూ ఇవ్వడము జరిగింది.ఇక 8/I అంటే అష్ట మంగళ వస్తువులు.ఇవి ఎనిమిది అలాగే
వస్తువు అంటే ఇంగ్లీష్ లో ఐటమ్ (Items) గదా అనగానే
జేసి
వెంటనే “అయితే 8/A అంటే విష్ణు మూర్తి దశావతారాలు అయ్యి
ఉండాలి.ఎందుకంటే బుద్ధుడు తొమ్మిదో అవతారము. ముందు ఎనిమిది అవతారాలు అలాగే A
అంటే అవతారము అయ్యి ఉండాలి” అనగానే
నిర్వాణలామా
సంతోషముతో చప్పట్లు కొట్టి “అవును” అని చెప్పడము జరిగింది.ఇలా ఈ ఎనిమిది ప్రశ్నలకి మూడు సమాధానాలు అనగా
అష్టాంగ నియమాలు,అష్ట మంగళ వస్తువులు,అష్ట
అవతారాలు ఆధారముగా నేను చెప్పడము జరిగింది.అష్టాంగ నియమాలు అనగా దృష్టి,సంకల్పం,వాక్,పని,జీవితం,వ్యాయామం,ఙ్ఞానం,ధ్యానం అలాగే పంచశీల సూత్రాలు అనగా జీవహింస,దొంగతనం,అసత్యం,వ్యభిచారం,మత్తు
పదార్ధాల సేవనం అలాగే అష్ట మంగళ వస్తువులు అనగా శంఖం,కమలము,గొడుగు,జంట చేపలు,చిక్కుముడి,ధర్మ చక్రము,నిధిపాత్ర, ధ్వజ
పటము అలాగే విష్ణుమూర్థి అస్ట అవతారాలు వరుసగా మత్స్య,వరాహ,నరసింహ, వామన, పరశురామ,
శ్రీరామ, శ్రీ కృష్ణ ఇలా వీటి ఆధారముగా ఈ
ఎనిమిది ప్రశ్నలకి సమాధానాలు చెప్పడము జరిగింది.అది ఎలాగో..అది ఎలాగో 7 వ ప్రశ్నకి సమాధానము మీకు ఉదాహరణకి చెబుతాను.
ఏ
ధర్మం శాశ్వతం కాదు.
అన్ని
ధర్మాలు అశాశ్వతాలే.
ధర్మం
మరువగూడదు.
అని
అడిగినపుడు నా సమాధానముగా ఈ పంక్తి అంతా గూడ ధర్మము మీదనే ఉన్నది.అంటే అష్ట మంగళ
వస్తువులలో ధర్మ సంకేతముగా ధర్మ చక్రము అని గ్రహించాను.అలాగే అష్టాంగ నియమాలలో
మంచి ఙ్ఞానము అంటే ధర్మము మరవకూడదని చెపుతోంది.ఇక దశావతారాలలో ధర్మ గుణముకు
ప్రతీకగా శ్రీరామ జీవితమే ఉంటుంది.ఎందుకంటే 16 గుణాల
గుణవంతుడు కదా.అపుడు నా సమాధానాలుగా వీటినే చెప్పడం జరిగింది అనగానే
జేసి
వెంటనే “లామాజీ.మరి ఆఖరి లెక్కల ప్రశ్నకి సమాధానము నో గదా”
అనగానే
ఆనందభిక్షువు
అందుకొని
“జేసి.నేను గూడ నో అనుకున్నాను.ఇపుడు గురూజీ చెప్పిన వివరాలు ప్రకారము
బట్టి చూస్తుంటే అది యెస్ అనటమే సరియైన సమాధానము.ఎలా అంటారా..
8+5=8+9
8+5 అనేవి 8 అష్టాంగ నియమాలు, 5
పంచశీల సూత్రాలు
8+9 అనేవి 8 అనేది అష్ట మంగళ వస్తువులు,9 అనేది విష్ణుమూర్తి నవ అవతారాలు అయ్యి ఉండాలి అనగానే నిర్వాణలామా
ఆనందముగా చప్పట్లు కొడుతుండగా
జేసి
వెంటనే “లామాజీ.ఇపుడు మన తరవాత పని ఏమిటి?” అనగానే
“జేసి.మనకి వచ్చిన ఆధార శ్లోకము ప్రకారము చూస్తే మహాకాశీ క్షేత్రానికి
వెళ్ళవలసి ఉంటుంది.
“లామాజీ.అది ఎలాగు.”
“జేసి.ఈ ప్రపంచములో మహాస్మశాన క్షేత్రముగా కాశీక్షేత్రమునకే పేరు
ఉన్నది.పైగా అక్కడి దేవుడి పేరు విశ్వనాధ్.ఇక్కడ ఇచ్చిన పేరు విభూధినాధ్.ఈ
రెండిటిలో “వి” అక్షరము అలాగే ” నాధ్” లు కలుస్తున్నాయి.
“లామాజీ.అయితే మన కారు నా ఇంటిలో పెట్టి రాత్రికి ఏదైన కంటైనర్ ట్రక్కు ఎక్కి
ఎవరికంటా పడకుండా మనము కాశీ క్షేత్రానికి చేరుకోవాలి.”
“జేసి.ఆ వివరాలు నాకు తెలియవు.నీ ప్లాన్ ప్రకారము నీవు చేయి.వాటిని మాకు
చెబితే మేము అలాగే చేస్తాము. ఆధారాల విశ్లేషణ మేము చూసుకుంటే ఆధారాలు ఉన్న చోటుకి
మనము క్షేమముగా చేరే విధముగా చూసుకోవడము మీ బాధ్యత” అనగానే
“లామాజీ.అయితే ఇందులో నా శ్రమ ఉంచినందుకు నాకు విలువ ఇచ్చినందుకు
కృతఙ్ఞతరాలుని” అంటూండగా
అపుడిదాకా
కళ్ళు మూసుకొని అన్ని పిల్లిలాగా వింటున్న అపరిచిత వ్యక్తి అపుడే స్పృహలోకి
వచ్చినట్లుగా ఏమి విననట్లుగా నెమ్మదిగా బాధగా కళ్ళు తెరుస్తూ
“స్వామి.నేను ఎక్కడ ఉన్నాను.నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళుతున్నారు.నన్ను
పోలీసుల నుండి రక్షించారా?” అనగానే
ఆనందభిక్షువు
వెంటనే వాడితో “స్వామి.కంగారుపడకండి.మా సమక్షములో మీరు
క్షేమముగానే ఉన్నారు.కాని పోలీసుల బాబాయిలు మమ్మల్ని గూడ ఇపుడుకి గూడ వెంబడిస్తూనే
ఉన్నారు.ఇంతకు మీరెవరు?” అనగానే
“స్వామి.నా పేరు గంజాయి స్వామి.”
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి