18
నేను
కాస్త పద్మాసనము వేసుకొని ధ్యాన నిమగ్నుడనై ధారణశక్తితో నా దృష్టిని నా హృదయము మీద
పెట్టి యశోధర సంకల్పము తీరే విధంగా నా మనస్సు లీనము చేశాను. ఎందుకంటే ఇలా చేస్తే
ఇష్ట కామ్యా సిద్ధి కలుగుతుందని నా ధ్యానానుభవము ద్వారా తెలుసుకున్నాను. ఇంతలో
నాకు ధ్యానమునందు నవ్వుతున్న బాలయోగిలాగా యశోధర కనబోయే మగబిడ్డ రూపము నా మనోదృష్టి
యందు కనిపించిన కొన్ని క్షణాలకే......
మా అమ్మ గౌతమి గది నుండి బయటికి వచ్చి "మగ
బిడ్డ జననం. తల్లి- బిడ్డ క్షేమం" అని
చెప్పి లోపలికి వెళ్ళింది.
నాలో
అంటే తన సంకల్పానికి ఒక
ప్రతిబంధకమేర్పడినదని..... అదే
యశోధర సంకల్పము నెరవేరినదని నాకు లీలగా అన్పించగా... ఎందుకో తెలియదు... నాలో స్పందన
మొదలై "రాహుల్" జన్మించాడు అని అన్నాను. ఇదే వాడికి నామకరణం అయింది.
పొత్తిళ్లలోని
బాబుని నా చేతులలోకి తీసుకొనగానే....
తన
చిన్ననాటి తన రూపమే ఇప్పుడు తన ప్రతిబింబముగా ఈ పుత్రోదయము రూపములో కలిగినదని...
కళ్లు తెరవని మహా యోగి లాగా నాకు కనిపించసాగాడు. దానితో గోపా వైపు నోటమాట రాక
చేతిని స్పృశించి బాబును యశోధర ప్రక్కలో ఉంచి
ఏకాంతముగా గడపటానికి నాకు ఇష్టమైన తోటలోనికి ప్రవేశించాను.
"ఇంక నాకు సెలవా దేవి" అని గోపాతో ఎలా చెప్పాలనే ఆలోచనతో…..
***
*** *** *** *** ***
జేసి
తన కారును పోలీసుల చేజింగ్ నుంచి అలాగే తన శాఖ అధికారుల నుంచి తప్పించుకొని తన
సొంత ఇంటి వైపు వెళ్లుతుండగా
ఇది
గమనించిన నిర్వాణలామా వెంటనే
“జేసి.ఏమి చేస్తున్నావు?అన్ని చోట్ల మన పోలీసు
బాబాయిలు ఉంటే మీ ఇంటి దగ్గర ఉండరా?”అనగానే
“లామాజీ.ఉంటారని నాకు తెలుసు.మీకు తెలియని విషయము ఏమిటంటే ఈ ఇంటి లోపల 1000
అడుగుల లోతున మా నాన్నగారు నా వృత్తిరీత్యా రక్షణ కోసము ఒక
భూగృహమును ఆధునిక టెక్నాలజితో కట్టించారు.ఆ ఇంటి డోరు నా అనుమతితో నా వాయిస్ తో
మాత్రమే తెరచుకుంటుంది.అదిగూడ నా చేతిలో ఉన్న ఫోన్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.ఇపుడు
నడుపుతున్న కారు గూడ జేమ్స్
బాండ్ సినిమాలలో వాడే కారు లాంటిదే. ఇది గూడ అత్యాధునిక టెక్నాలజితో
తయారుచేయబడినది.కాని ఈ కారుకున్న శాటిలైట్ జి.పి.ఎస్.టెక్నాలజీ వలన మా బాస్
కులకర్ణి నా కారు ఎక్కడ ఉన్నదో తెలుసుకుంటూ
అటు పోలీసులకి ఇటు నా ఆఫీసు అధికారులకి సూచనలు ఇస్తూ మనల్ని
వెంబడిస్తున్నట్లుగా చేస్తున్నారని నా అనుమానము.అందుకే ఈ కారు మా ఇంటి రహస్య
భూగృహము యందు దాచిపెట్టి ఈ పరిశోధన అయిన తరవాత దీనిని బయటికి తీయాలని మా
ఇంటివైపుకు వెళ్లుతున్నాను.ఆ ఇంటికి వెళ్లాలంటే ఇంక ఎనిమిది గంటలు పైన
పడుతుంది.ఈలోగా మా నాన్నగారి లాకర్ నుంచితెచ్చిన ఐరన్ బాక్స్ సంగతి చూడండి.అందులో
మనకి ఏమైన ఆధారము దొరుకుతుందేమోనని చూడండి” అనగానే
“జేసి.మన కారులో అపరిచిత వ్యక్తి ఉన్నాడని మర్చిపోయావా?”అనగానే
“సారి.ఆ విషయము మర్చిపోయి యధాలాపముగా అనేశాను.ఇంతకి ఆ వ్యక్తి వివరాలు
అడిగి తెలుసుకోండి” అనగానే
ఆనందభిక్షువు ఆ స్పృహతప్పి పడిపోయిన అపరిచిత
వ్యక్తిని ఎంత తట్టి లేపిన లేవలేకపోయేసరికి గంజాయి బాగా పట్టేసి ఉండి ఉంటాడు
అనుకొని ఇదే విషయాన్ని బయటికి అనేసరికి జేసికి అలాగే నిర్వాణలామాకి నవ్వు
ఆగలేదు.
జేసి
వెంటనే..”లామాజీ.ఈ క్రొత్త వ్యక్తి వలన మనకి ప్రమాదము లేదుగదా.ఆధారము ఏమిటో
తెలుసుకొనే ప్రయత్నము చెయ్యండి” అనగానే
నిర్వాణలామా
వెంటనే హోటల్ నుండి తెచ్చిన లాకర్ బాక్స్ లోని ఐరన్ బాక్స్ ను తెరవగానే అందులో 12
inches కంప్యూటర్ స్క్రీన్స్ అలాగే qwerty కీ
పాడ్ ఉండేసరికి ఆశ్చర్యమేసినది.తను తెలుసుకున్న రహస్యమును కోడ్ చెయ్యడానికి ఆధునిక
టెక్నాలజీ వస్తువులను ఉపయోగించిన అంబేద్కర్ తెలివితేటలకి నిర్వాణలామా తన
మనస్సులోనే అభినందనలు చెప్పుకున్నాడు.ఈ సిస్టముకి ఉన్న పవర్ బటన్ నొక్కగానే
సిస్టము ఆన్ అయింది.
“వెల్కం టు
ది బుద్ధకోడ్” (WELCOME TO THE BUDDHA CODE)
అనే
స్క్రీన్ కనిపించి మాయమై
“పాస్ వర్డ్ టైపు చెయ్యండి” అనే స్క్రీన్ వచ్చేసరికి
నిర్వాణలామా కంగారుపడ్డాడు.
వెంటనే
జేసికేసి చూడగానే “లామాజీ.నాకు ఆ పాస్ వర్డ్
ఏమిటో తెలియదు.నేను ఎపుడు గూడ ఈ సిస్టమును మా నాన్న ఉపయోగించడము చూడలేదు.ఆయన ఎపుడు
గూడ పాస్ వర్డ్ గూర్చి చెప్పినట్టు లేదు” అనగానే..
ఆనందభిక్షువుకి
ఏమి జరుగుతుందేమోనని ఆందోళన మొదలైంది.
నిర్వాణలామా
వెంటనే “జేసి.కంగారుపడకు.నీవు కంగారుపడి నన్ను కంగారుపెట్టకు.నన్ను ఆలోచించుకోనీ” అనగానే
కొన్ని
క్షణాలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి …
“జేసి.మీ నాన్నగారి లాకర్ కీ వెనక కంటకము 477 అనే
అక్షరాలు ఉన్నాయి గదా” అనగానే
“లామాజీ.అవును.అవే అక్షరాలు ఉన్నాయి.కొంపదీసి ఈ అక్షరాలే దీని పాస్ వర్డ్
కాదుగదా” అనగానే
నిర్వాణలామా
వెంటనే ఈ అక్షరాలను కీ పాడ్ ద్వారా కొట్టగానే “సక్సెస్” స్క్రీన్ వచ్చేసరికి అందరూ ఆనందిస్తుండగా
మరో
స్క్రీన్ వచ్చి …
గమనిక:ఇది
ఒక ప్రశ్నల ర్యాపిడ్ గేమ్ .ఈ ఆటలో మీకు ఎనిమిది
ప్రశ్నలు ఇవ్వబడతాయి.ఎనిమిది నిమిషాలు మాత్రమే సమయము ఉంటుంది.ప్రతి ప్రశ్నకి మీ
వాయిస్ తో మూడు సమాధానాలు చెప్పవలసి ఉంటుంది.ఇలా ఎనిమిది ప్రశ్నలకి 24 సమాధానాలు ఎనిమిది నిమిషాలలో ఇవ్వవలసి ఉంటుంది.అపుడే మణి కీ స్టోన్
వివరాలు మీకు అందించబడతాయి.లేనిచో ఈ సిస్టము సాఫ్ట్ వేర్ నాశనమవుతుంది.ధైర్యము
చేయలేనిచో ఇక్కడనుండి వెనక్కి వెళ్ళిపోవచ్చు.ధైర్యము చేసేవారు యస్ అని మీ వాయిస్
తో చెబితే ర్యాపిడ్ గేమ్ మొదలు అవుతుంది అన్న సమాచారము చదివిన నిర్వాణలామా ఆలోచనలో
పడితే ఆనందభిక్షువు అలాగే జేసి ఆందోళనలో పడ్డారు.
ఇదంతాగూడ
స్పృహ వచ్చినగూడ స్పృహ రానట్టుగా నటిస్తున్న అపరిచిత వ్యక్తి గూడ అన్ని వింటూ తన బిపిని
పెంచుకుంటున్నాడని ఏ మాత్రము ఆ ముగ్గురు ఊహించలేకపోయారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి