29 భాగం

 

29

నేను వెంటనే ఒక చెట్టు క్రింద కూర్చొని ధ్యాననిష్ఠలో మూడు రోజులు పైగా కదలకుండా మెదలకుండా ఉండి మనస్సు పొందే శూన్యత భావస్థితి చేరుకున్నాను. కాని ఏదో అలజడి. ఏదో తెలియని అనుమానం. నా మనస్సు పూర్తిగా శూన్యము గావడము లేదు. శూన్య భావన మాత్రమే పొందుతోంది. ఈ భావము గూడ పోవాలి. ఎలా పోతుంది? ఇది ఎలా సాధ్యపడుతుందో నాకు అర్ధముకాలేదు. గురువు దగ్గరికి వెళ్లి నా ధ్యానష్టితి గూర్చి వివరించగానే... ఆయన కళ్లలో నా సాధనాభివృద్ధి గమనించి ఆనందపడుతూ...

"నాయనా. సిద్దా. నీవు నీ లక్ష్యానికి అడుగు దూరములో ఉన్నావు. ప్రపంచం అశాశ్వతం అని ధారణ చెయ్యి. అప్పుడు నీకున్న శూన్యత భావ స్థాయి ప్రభావము తగ్గుతూ వస్తుంది. శూన్యము అంటే శూన్యము గావడము కాదని  తెలుసుకో. అలాగని శూన్యమున్నదని భావము పొందడము గాదని గ్రహించు. శూన్యము అంటే పూర్ణ శూన్యం. పూర్ణత్వం. శూన్యములో ఎరుక శూన్యము, భావ శూన్యము, పదార్ధ శూన్యం, పూర్ణ శూన్యం, సంపూర్ణ శూన్యము అని ఇలా 18 రకాల శూన్యస్థితులను నీవు దాటి మనస్సేలేని స్థితియైన శూన్యమవ్వాలి. అదియే మహానిర్యాణం. అందుకు నీవు కనిపించే ప్రపంచము అసత్యమని.... కనిపించని శూన్యము సత్యమని ధారణ చేస్తుండాలి. అప్పుడు నీ మనస్సులో ఉండే రూపము, గుణము, స్పర్శ, రసం, శబ్దము, బంధాలు, కర్మలు, కర్మశేషాలు, అరిషడ్వార్గాలు, వ్యసనాలు, ఉద్రేకాలు, ఆరాటాలు, పోరాటాలు, ఆవేదనలు, ఆనందాలు, ఆవేశాలు, ఆలోచనలు అన్ని గూడ నెమ్మదినెమ్మదిగా మహా శూన్యములో లయము అవుతాయి.

అప్పుడు నీవు అశాశ్వతమైన ఈ లోకాన్ని దాటి సంపూర్ణ శూన్య అనుభవ అనుభూతి నిచ్చే  అవలోకస్ధితిని చేరుకుంటావు. నిజానికి మనస్సు కాస్త ఏ భావము చేస్తే ఆ ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు కాస్త భావరూపమును ఇస్తుంది. ఇవి కలలు వస్తాయి. అంటే భావము రూపాంతరము చెంది రూపము అంతము గావాలసిన చోట రూపాంతరము చెందుతోందని గ్రహించు. ముందు నీ భావాలు కాస్త అనుభవమవ్వాలి. అప్పుడే నీ కళ్ల ముందు సత్యముగా కన్పించే అసత్య ప్రపంచ రూపాలు కాస్త రూపాంతరము చెంది శూన్యం అవుతాయి. దీనిని దాటితే మహాశూన్యము వస్తుంది. దీనిని దాటితే కాని నీకు గావాలసిన సత్యాన్వేషణ జ్ఞానం అందదు అని హితబోధ చేసి మౌనము వహించారు.

*** *** *** *** *** ***

కులకర్ణికి కాశీక్షేత్రములోని తన అనుచర బృందము నుండి ఫోన్ కాల్ రావడముతో దానిని ఎత్తగానే

సార్.మనవాళ్ళంతా ప్రొఫెసర్ విభూధినాధ్ ఇంటి బయట సివిల్ డ్రస్సులతో కాపలా కాస్తున్నారు.మీరు చెప్పినట్లుగానే రాత్రికి రాత్రే ఆ ఇంటిలోపల మనవాళ్ళు చిన్నపాటి సి.సి కెమెరాలు అలాగే వాయిస్ రిసీవర్ మైకులు అమర్చి వచ్చారు.ఇపుడే నిర్వాణలామా బృందము ఈయనను కలిసి హాల్ లోని సోఫాలో కూర్చోని తన మణి పరిశోధన వివరాలు చెపుతున్నారు.వీటిని మీఫోన్ కి లైవ్ కనెక్ట్ చేస్తున్నామని మీకు ఫోన్ చేశాము.

సరే.మంచిది.ఆ ఇంటి పరిసరాలలో ఎవరైన అనుమానించదగ్గ వ్యక్తులు కనపడ్డారా?”

సార్.ఒక 40సం.లు వ్యక్తి ఈ హాల్ గది యొక్క కిటికి దగ్గర వీళ్ళ మాటలు వినడానికి ప్రయత్నము చేస్తున్నట్లుగా మాకు కనబడుతోంది.మేము ఎంక్వైరి చేస్తే ఆ ఇంటి వాచ్ మేన్ అని ఇక్కడి వాళ్ళు చెబుతున్నారు అనగానే

కులకర్ణి నొసలు ముడిపెడుతూ ఆ ఇంటి వాచ్ మేన్ కి వీళ్ళమాటలు  అంత రహస్యముగా వినవలసిన అవసరము ఏముంది.గదిలో ఒక ప్రక్కన గూర్చుని వినవచ్చుగదా.ఇందులో అనుమానించవలసిన విషయమే ఉంది అనుకుంటూ

ఓయి.ఆ వ్యక్తి చూడటానికి బోడిగుండుతో ఉన్నాడా?కోలముఖముతో తీవ్రమైన చూపుతో ఉన్నాడా?”అనగానే

సార్.మీరు చెప్పినట్లుగానే ఉన్నాడు అనగానే

అయితే నా అంచన ప్రకారము నిజమైతే రెండు హత్యలు చేసిన నరహంతకుడైన అంగుళీమాల అయ్యుంటాడు అని మీరు ఒక పని చేయండి.మీ దగ్గర బుద్ధగయ మ్యూజియము నుండి అలాగే కాశీక్షేత్రము మ్యూజియములోని సి.సి పుటేజి ఉందిగదా.వాటిలో అంగుళీమాల ఒక బౌద్ధ సన్యాసిగా ఉన్నాడు.కాబట్టి మీరు ఈ రెండిటిని చూసి ఆ వ్యక్తి అవునో కాదో నాకు చెప్పండి అనగానే

ఓ.కే సార్.పావుగంటలో మీకు పంపిస్తాము.ఫోన్ కట్ అయింది.

దానితో కులకర్ణి వెంటనే త్రివేదికి ఫోన్ చేసి తన ఆఫీసు చాంబర్ కి రమ్మని చెప్పి ఫోన్ కట్ చేసి కులకర్ణి కాస్త స్నానాదికాలు పూర్తి చేసుకొని తన కారులో ఆఫీసుకి బయలుదేరాడు. 

కులకర్ణి ఆఫీసుకు చేరగానే అక్కడికి త్రివేది వచ్చి ఎదురు చూస్తుండగా వీరిద్దరు కలసి కులకర్ణి వ్యక్తిగత ఆఫీసుగదిలోకి వెళ్ళి తన ఫోన్ ను అక్కడే ఉన్న 65 అంగుళాల టి.వి కి అనుసంధానము చేసి వచ్చి లైవ్ సమాచారము కోసము వీరిద్దరు ఎదురు చూస్తుండగా ప్రొఫెసర్ విభూధినాధ్ అలాగే నిర్వాణలామా బృందము కలిసి మాట్లాడుకుంటున్న దృశ్యము ప్రత్యక్షమైనది.ఆ తరవాత కిటికి బయట 40 సం.లు వ్యక్తి వీరి మాటలు వింటున్న దృశ్యము కనబడింది.ఆ తరవాత సి.బి.ఐ ఆఫీసర్లు కాస్త ఇంటి బయట సివిల్ డ్రస్సులో కారులో కూర్చోని కాపలాకాస్తున్న దృశ్యము కనబడింది.ఈ మూడు దృశ్యాలు కూడ ఒకే మానిటర్ మీద లైవ్ గా కనబడుతున్నాయి.కాని కులకర్ణి దృష్టి మాత్రము కిటికి బయట ఉన్న 40 సం.లు వ్యక్తి మీదనే అనుమాన దృష్టి పడింది.

ఇంతలో కులకర్ణికి ఫోన్ వచ్చి సార్.మీరు చెప్పినట్లుగా ఆయాక్షేత్రాలలోని పుటేజి అనుమానము లేకుండా చూశాము.అందులో ఉన్న వ్యక్తి అలాగే  కిటికి దగ్గర ఉన్న వ్యక్తికి పోలికలు కనబడుతున్నాయి.ఒకవేళ వీడు అంగుళీమాల అయితే మేము ఇక్కడ ఉండి వాళ్ళ సంభాషణలు వినడము కన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడిని బంధిస్తే మంచిది గదా అనగానే

కులకర్ణి వెంటనే ఆ పని అపుడే చేయకండి.అసలు వారంతా దేనిని గూర్చి మాట్లాడుకుంటున్నారో మనకి తెలియాలి.వీడి వలన వాళ్ళకి ఏమైన ప్రమాదము కలిగితే మాత్రము అపుడు మీరంతా ఆ ఇంటిలోపలికి వెళ్ళి వాడిని బంధించండి.అపుడిదాకా మీలో ఎవరు గూడ తొందరపడవద్దు.మనకి వాళ్ళంతా బందీలు గావాలి.చేపలు అన్ని ఒకచోటుకి చేరినాయి.వాటిని జాగ్రత్తగా వలవేసి పట్టుకోవాలి.లేదంటే పారిపోతాయి అనగానే

సరే సార్.మీ ఇష్టము.మీ అనుమతి వచ్చేవరకు మేము ఇక్కడే బయట ఎదురు చూస్తూ ఉంటాము.ఈ లోపల మీరు గూడ లైవ్ దృశ్యాలను చూడండి.మీకు ఏమైన సందేహాలు వస్తే మాకు చెబితే వాటిని మేము ఎంక్వైరి చేసి చెబుతాము అంటూ ఫోన్ కట్ అయినది.

దానితో కులకర్ణి మరియు త్రివేది తమ ఎదురుగా ఉన్న మానిటర్ మీద కనిపించే మూడు దృశ్యాలను   సిగార్ లు వెలిగించుకుంటూ చూస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి