30 భాగం

 

30

నేను నెలరోజుల సమయములో ఈయన చెప్పినట్లుగా చేసి నా హృదయము శూన్యము అయ్యేటట్లుగా సిద్ధిని పొందడము జరిగింది. కాని నా మనస్సులో ప్రశ్నలు అనగా మనిషికి కష్టాలకి కారణాలు ఏమిటి? వీటి నుండి ఎలా విముక్తి పొందుతాడో నాకు తెలియరాలేదు. దానితో ఈ  సాధన అనుభవము నా గమ్యము కాదని అన్పించడం గురువు దగ్గరికి వెళ్లి అడిగితే

"నాయనా. సిద్దా. నీవు కారణం జన్ముడివి. ఇలాంటి సాధన స్థితి పొందటానికి 12 సంవత్సరాలు పడుతుంది. కాని నీవు 30 రోజులలో ఈ స్థితికి చేరుకున్నావు. అది నీ జన్మ సంస్కారము. నేను నీకు ఇంక బోధించడానికి నువ్వు నా దగ్గర చెయ్యడానికి ఏమిలేదు . కాబట్టి ఇకపై నా ఆశ్రమ వారసుడిగా మారి ఈ ఆశ్రమ నిర్వహణలో నాకు సాయంగా ఉంటే నా తదనాంతరము నీవు కులపతివి అవుతావు" అనగానే...

నేను ఎంతో వినయముగా

 "మహాత్మా. మీ ప్రేమ ఆదరాభిమానమునకు కృతజ్ఞుడిని. నేను ఒక క్షత్రియ యువ రాజును. ఆ రాజ్యపదవి మీద వ్యామోహము లేకుండా చేసుకున్నాను. నాకు గావాలసింది నా పూర్ణస్థితి. నా మనస్సులో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు గావాలి. పరిష్కార మార్గాలు గావాలి. నాకు ఇంక ఈ ఆశ్రమములో నా జ్ఞానతృష్ణ తీరదని తెలుసుకున్నాను. నా అన్వేషణ ఇంతడితో ఆగదు.

నా లక్ష్య సాధనలో మీలాంటి గురువుల అనుగ్రహ ఆశీస్సులు నాకు కలిగే విధంగా ఆశీర్వదించి నన్ను ముందుకు సాగిపోవటానికి అనుమతిని ప్రసాదించండి" అనగానే....

ఆయన నాకు ఎన్నో విధాలుగా చెప్పి చూసినా... ఎన్ని ప్రలోభాలు చూపించిన అద్భుత యోగశక్తులు ఇస్తానన్న... నేను ఆ రాత్రికే ఆ ఆశ్రమము నుండి మౌనముగా వెళ్ళిపోయాను.

*** *** *** *** *** ***

విభూధినాధ్ అక్కడున్నవారందరికి అంబేద్కర్ తాను కలిసి చేసిన మణి శోధన వివరాలు చెప్పడము ప్రారంభించాడు.అక్కడున్న నిర్వాణలామా బృందము అలాగే కిటికి బయట ఉన్న వ్యక్తి అలాగే ఇంటి ముందున్న పోలీసుల కాపలా బృందము మరియు బుద్ధగయ క్షేత్రములో ఉన్న కులకర్ణి త్రివేది బృందము అంతా గూడ శ్రద్ధగా వినడము మొదలుపెట్టారు.

విభూధినాధ్ వెంటనే మీలో ఎవరు మణుల రకాలు గూర్చి చెప్పగలరు అనగానే

ఆనందభిక్షువు వెంటనే స్వామి.సహజముగా మణులు అనేవి మూడు రకాల విభాగాలకి చెందినవి. వాటిలో స్వర్గ లోక,పాతాళలోక,మర్త్యలోక మణులు ఉంటాయి.ఇందులో స్వర్గ లోక మణులుగా రుద్రమణి, కౌస్తుభమణి, శమంతకమణి, చింతామణి ఉంటే పాతాళలోక మణులులో నవనాగులు ధరించే వివిధ రకాల నాగమణులు ఉంటాయి.ఇక మర్త్య లోక మణులు అంటే భూలోక మణులు అన్నమాట.ఇందులో పాదరస మణి,పరశువేది మణి,నవరత్నాలు వస్తాయి.

                                                   శ్రీ చక్రము                                                         కాల చక్రము 

మంచిది.బాగానే చెప్పావు.ఇపుడు మీలో ఎవరైన శ్రీ చక్రము అలాగే కాల చక్రము గూర్చి చెప్పగలరా?”

నిర్వాణలామా అందుకొని స్వామి.కాలచక్రమును బుద్ధ భగవానుడు ప్రతిపాదిస్తే అదిగూడ కాలము యొక్క గమనము గూర్చి అలాగే విశ్వ సృష్టి రహస్యము గూర్చి మరియు సాధన స్థాయిలు గూర్చి చెప్పడము జరిగింది.అదే హైందవ ధర్మములో శ్రీ చక్రము గూర్చి చెప్పబడింది.ఇది శ్రీ శంకరాచార్యుడు ప్రతిపాదించారు.ఈయన గూడ ఇందులో విశ్వసృష్టి రహస్యమునే లోకానికి అందించారు అనగానే

మంచిది.బాగానే చెప్పారు.ఇపుడు మీలో దేవతాపుష్పాలు గూర్చి చెప్పగలరా?” అనగానే

బ్రహ్మ కమలము

పారిజాత పుష్పాలు
గంజాయి స్వామి వెంటనే స్వామి.నాకు అంతగా తెలియదు.కాని కొంత సన్యాసుల సహవాసము వలన వీళ్ళు హిమాలయాలలో రెండు రకాల పుష్పాలను చూశారని వాటిని దేవతాపుష్పాలు అంటారని చెప్పగా విన్నాను.అది ఏమిటంటే బ్రహ్మ కమలము మరియు పారిజాత పుష్పాలు.ఇందులో బ్రహ్మకమలము అనేది 12 సం.ల కొకసారి మాత్రమే పూస్తుంది.ఈ పువ్వు విచ్చుకొనేసమయానికి అక్కడికి చాలామంది మునులు మహర్షులు సాధువులు సన్యాసులు వచ్చి దర్శనము చేసుకుంటారని విన్నాను. 

ఇక పారిజాత పుష్పాలు అంటే శ్రీ కృష్ణకాలము నాటివి అని సత్యభామ అలక తీర్చడము కోసము వీటిని ఈయన ఇచ్చినాడని చెబుతారు.అలాగే మహాభారతములో ఈ రెండు పుష్పాలను గూర్చి గూడ ప్రస్తావన ఉంది.ద్రౌపది కోరిక మేర హిమాలయాలనుండి అర్జునుడు కాస్త పారిజాత పుష్పాలు తెస్తే భీముడు కాస్త సౌగంధిక పుష్పాలు అయిన బ్రహ్మకమలాలు తెచ్చినారని ఉన్నదని వీళ్ళు వాళ్ళు చెప్పుకుంటే విన్నాను అనగానే

మంచిది.నువ్వు చెప్పిన సమాచారము అంతా అక్షర సత్యమే.ఇపుడు మీలో ఎవరు 2012 మరియు 2424 సం.లు గూర్చి చెప్పగలరా?”..

జేసి అందుకొని అంకుల్.ఇంటర్ నెట్ లోని సమాచారము ప్రకారము చూస్తే 2012 కి విశ్వము అంతము అవుతుందని గగ్గోలు పెట్టారు.అదే 2424 సం. అయితే శంభల గ్రామములో ఒక క్రొత్త శకము ఆరంభమవుతుందని ఇపుడు ప్రచారము చేస్తున్నారు.ఇందులో ఒకటి అసత్యము అయితే రెండవది ఏమవుతుందో ఎవరికి తెలియదు అనగానే

అంటే మీలో అందరికి గూడ ఎంతో కొంత  ఆధ్యాత్మిక విద్య మీద మంచి పట్టు ఉన్నదని తెలుస్తోంది.ఇక నా పరిశోధన గూర్చి చెపుతాను సావధానముగా వినండి.


ఒక రోజు నేను క్లాసులో బౌద్ధ ధర్మ మంత్రమైన ఓం-మణి-పద్మ-హుం గూర్చి చెబుతుండగా ఒక విద్యార్ధి పైకి లేచి

సార్.ఈ మంత్రము ఏదైన మణికి సూచన లేదా నిజముగానే ఎక్కడైన ఈ మణి అనేది ఉందా?” అని అడగగానే

నేను కాస్త తడబడి మణి అంటే స్ఫటికమణి.స్ఫటికము అంటే పరిశుద్ధమైన వాడు అని అర్ధము.అంటే ప్రతి జీవుడు కూడ స్ఫటికములాగా పరిశుద్ధము అవ్వాలని దీనికి సూచనగా మణి గుర్తు వాడటము జరిగినదని నేను ఏదో నాకు వచ్చినట్లుగా చెప్పాను.

కాని ఆ రోజు నుండి నిజముగానే ఈ మణి అనేది ఎక్కడైన ఉందా?ఉంటే అది ఏ మణి అని తెలుసుకోవాలని అనుకునేవాడిని.ఒకసారి అనుకోకుండా బుద్ధగయలోని బౌద్ధమ్యూజియములో ఆనాటి బుద్ధుడు వాడిన వస్తువులను ప్రదర్శనకి పెడుతున్నారని విని మా పిల్లలతో కలిసి అక్కడికి వెళ్ళడము జరిగింది.అపుడు నాకు ఒక గదిలో అమర్చిన 14 వ శతాబ్దము నాటి భోధిసత్వుడు   అలాగే అవలోకితేశ్వర మరియు క్షితిగర్భ చిత్రాలలో మూడు మణులు పట్టుకొని ఉన్న చిత్రాలు చూడగానే నాలో మళ్ళీ ప్రశ్న మొదలైంది.అంటే నిజముగా ఎక్కడో ఒక చోట మణి అనేది ఉన్నదని నాకు బలముగా అనిపించసాగింది.

ఆ సమయములో అక్కడికి అంబేద్కర్ అనే పురావస్తు శాఖ అధికారి కాస్త ప్రసంగము ఇవ్వడానికి రావడము నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి నాకున్న మణి సందేహము గూర్చి అడగగానే ఆయన వెంటనే

మిత్రమా.నేను గూడ ఎపుడినుంచో ఈ మణి మీద పరిశోధన చేస్తున్నాను.ఈ 14 వ శ|| నాటి చిత్రాల వలనే నాలో మరింత జిఙ్ఞాస పెరిగినది.కాని ఈ మణి అనేది ఎక్కడ ఎలా ఉంది అనే పరిశోధన చేస్తున్నాను.అలాగే నా దగ్గర 1903-1909 సం|| ల కాలములో ద్యోర్జీ లామా బృందము హిమాలయాలలోని రహస్య గ్రామములో ఈ మణి ఉన్నదని దానిని తను చూడటము జరిగినదని వారి ఆత్మకథలో చెప్పడము జరిగినదని..అలాగే ఈ బృంద సభ్యుడైన చార్లెస్ బెల్ అనేవారు అలనాటి విక్టోరియా మహారాణికి ఈ మణి పరిశోధన రిపోర్టును సీక్రెట్స్-212 అనే పేరుతో సమర్పించడము జరిగినదని ఆ రిపోర్టులు నాకు చూపించగానే నాలో అమిత ఆసక్తి కలిగి వాటిని క్షుణ్ణముగా చదవడము ఆరంభించి పూర్తిచేసి వారితో

అయితే మనకి మణి ఉన్నదని తెలుస్తోంది.అది నిజమా గాదా అని పరిశోధన చేయవచ్చు గదా?” అని అన్నపుడు

ఆయన వెంటనే విభూధినాధ్ ఈ మణిశోధనకి మనము హిమాలయాలలోకి వెళ్ళి రహస్య గ్రామము గూర్చి వెతికితే గాని ఆ మణి ఉందో లేదో తెలుస్తుంది.గాకపోతే నా పరిశోధనలో హిమాలయ గురువులను కలిసినపుడు రహస్య గ్రామము అనేది శంభల గ్రామము అని దీని ప్రవేశమునకు అర్హత యోగ్యత ఉండాలని ఎవరుపడితే వాళ్ళు ప్రవేశించలేరని ఈ గ్రామ పరిసరాలలో విషవాయువులు వెదజల్లే పుష్పాలుంటాయని వాటిని తట్టుకొని వెళ్ళాలని ఇందుకోసము అష్ట సిద్ధులు పొందిన పరిశుద్ధుడు మాత్రమే ఈ గ్రామమునకు వెళ్ళి అక్కడ ఉన్న చింతామణి దర్శనము పొందే అవకాశము ఉంటుందని చెప్పారని చెప్పగానే 

సార్.మీరు చెబుతున్న మణి అనేది చింతామణి అనే..


                                                                                            చింతామణి

అవును.ఆ మణి చింతామణి అని అందరు అన్నారు అనగానే

నేను కాస్త ఆనందమునకు గురియై సార్.ఆ మణి కాస్త నిజముగానే చింతామణి అయ్యి ఉండాలి.ఈ మణి గూర్చి బౌద్ధధర్మములో ఒక కధనము ప్రచారములో ఉంది.అది ఏమిటంటే టిబెటన్ రాజు అయిన లాధాతోరి న్యాన్సైన్ కి ఛాతి ఎముక నుండి ఈ మణి తయారు అయినదని ఇది ఆకాశము నుండి ఒక పెట్టెలో ఉండి పడిపోయినదని చెబుతారు.దీనిని కోరికలు తీర్చే రాయిగా ఆరోగ్యము పెంచే రాయిగా ఙ్ఞానము పెంచే రాయిగా ఉపయోగించేవారని తెలుస్తోంది.

నాధ్.నువ్వు చెప్పినది నిజమే.కాని ఇక్కడ చిన్న సమస్య ఉంది.అది ఏమిటంటే హైందవ ధర్మములో ఈ మణి ప్రస్తావన గూడ ఉంది.వాళ్ళ లెక్క ప్రకారము ఈ మణిని విష్ణుమూర్తి,బ్రహ్మదేవుడు,మహాగణపతి,శ్రీ కృష్ణుడు,ఇంద్రుడు ధరిస్తూ ఉంటారని చెప్పడము జరిగింది.అంటే హైందవ ధర్మములో చింతామణి అయిదు రకాలుగా ఉంటే అదే బౌద్ధ ధర్మములో మూడు రకాలుగా ఉంది అనగానే

నేను కాస్త ఆశ్చర్యము చెంది అది ఎలా సాధ్యము.మణి అనేది ఒక్కటే గదా అనగానే..

నాధ్.నేను గూడ ఇన్నాళ్ళు అదే అనుకున్నాను.కాని మణి అనేది ఒకటిగాదని రెండు రకాల చింతామణులు ఉన్నాయని నా పరిశోధనలో తెలుసుకున్నాను.ఇందులో హైందవ ధర్మము ప్రకారము చూస్తే విష్ణువు కాస్త కౌస్తుభమణి అలాగే శ్రీ కృష్ణుడు కాస్త శమంతకమణి అలాగే ఇంద్రుడు కాస్త పరశువేది మణి ధరించారని నా పరిశోధనలో తెలుసుకున్నాను.అలాగే బౌద్ధధర్మములో 14 వ శ||నాటి చిత్రాలలో మనకి వాళ్ళ చేతులలో ఉన్న మణులు నిజానికి మూడు రంగులలో కనబడాలి.కాని ప్రస్తుతము నకలు చిత్రాలను గమనిస్తే ఒక రకమైన మణి వాళ్ళ చేతులలో ఉన్నట్లుగా కనబడుతున్నాయని నేను తెలుసుకున్నాను.అలాగే హైందవ ధర్మములో బ్రహ్మ అలాగే గణపతి మాత్రమే చింతామణి ధరిస్తే బౌద్ధ ధర్మములో భోధిసత్వుడు మాత్రమే చింతామణి ధరించారని నా పరిశోధనలో తెలుసుకున్నాను.

సార్.మరి అయితే అవలోకితేశ్వర మరియు క్షితిగర్భ చేతిలోని మణుల సంగతి ఏమిటి?”

నాధ్.నా అంచనా ప్రకారము చూస్తే ఆ మణుల యొక్క రంగుల బట్టి చూస్తే అది రుద్రమణి అలాగే నాగమణి అయ్యి ఉండాలి అనగానే

సార్.అసలు మణుల రంగుల గూర్చి చెప్పండి అని నేను అడిగేసరికి

నాధ్.చింతామణి రంగు తెలుపుగాను అదే రుద్ర మణి అయితే లేత ఎరుపు లేదా పసుపు లేదా బంగారపు రంగులో అదే నాగమణి అయితే లేత నీలి రంగులో ఉంటాయని రత్నశాస్త్రము చెపుతోంది.ఈ మూడు రంగులబట్టి చూస్తే 14 వ శ||నాటి బుద్ధుడి మూడు మణుల చిత్రాలను చూస్తే వాళ్ళ చేతులలో ఈ మూడు రకాల మణులున్నాయని గ్రహించాను.ఇక్కడ గమ్మత్తైన విషయము మరొకటి ఉన్నది.అది ఏమిటంటే 1903-1909 ద్యోర్జీ లామా కాస్త మణి దర్శనము పొందినది పాదరస చింతామణి.ఇది హిమాలయ గురువులు నిత్యము ఆరాధించే మణి.దీనిని హైందవ ధర్మములో చింతామణి గణపతి అంటారు.అలాగే శంభల గ్రామ వాసులు నిత్యము ఆరాధించే మణియే బ్రహ్మ చింతామణి అన్నమాట.

సార్.అంటే ఈ భూలోకములో రెండు రకాల చింతామణులు ఉన్నాయని అంటారా?” 

నాధ్.అవునని నా పరిశోధన చెబుతోంది.అందులో ఒకటి గణపతి చింతామణి అంటే పాదరస మణి.ఇది హిమాలయ గురువుల ఆధీనములో ఉంటుంది.రెండవ మణి అయితే బ్రహ్మ చింతామణి.ఇది రహస్య గ్రామమైన శంభల గ్రామ వాసుల ఆధీనములో ఉంటుంది.

ఇది ఎలా సాధ్యము అంటారా?




ఎపుడైన డైమండ్ గుర్తును ఒకసారి గుర్తుకు తెచ్చుకో….

రెండు త్రిభుజాలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కలిపితే డైమండ్ గుర్తు వస్తుంది.దీనిని పేకాటలో వాడతాము గదా.అంటే పైన ఉన్న త్రిభుజము యొక్క గుర్తు అనేది బ్రహ్మ చింతామణి సూచన చేస్తే క్రింద ఉన్న త్రిభుజము గుర్తు కాస్త పాదరస చింతామణి సూచన చేస్తోంది.దీనికి నిదర్శనమే ద్యోర్జీ రిపోర్టు ప్రకారము చూస్తే ఆయన బృందము కాస్త భూమిలోపల ఒక త్రిభుజములాగ ఉన్న నిర్మాణము లోపలికి వెళ్ళితే అక్కడ మాకు సప్త ధాతువులతో అది గూడ పాదరస నిర్మాణ శాలిగ్రామ మణి దర్శనమైనదని చెప్పడము జరిగింది.అంటే వీళ్ళు డైమండ్ గుర్తులోని క్రింద త్రిభుజములోకి వెళ్ళినారని చెప్పకనే తెలుస్తున్నది గదా.

అలాగే మీరు ఎపుడైన అమెరికా డాలర్ గమనించారా?.....

దాని వెనుక వైపు ఒక పిరమిడ్ నిర్మాణముండి దానిని పైభాగములో ఒక త్రికోణ భుజముంటుంది.దీని మీద త్రికాలఙ్ఞానమును తెలిపే త్రినేత్ర చిత్రము ఉంటుంది.అంటే ఇది డైమండ్ గుర్తు లోని పై త్రిభుజమును సూచించినట్లే గదా.త్రికాల ఙ్ఞానము బ్రహ్మదేవుడికి ఉంటుంది గదా.అంటే ఈ లెక్కన చూస్తే ఇది బ్రహ్మ చింతామణికి సూచన చేస్తున్నట్లే గదా.

పైగా మీకు గుర్తుందా.సినిమా హీరోయిన్ దేవికారాణి.ఈమె భర్త నికోలస్ రోరిచ్.ఈయన రష్యా దేశస్థుడు.పైగా ఇతను కైలాస పర్వతము మీద ఎన్నో పరిశోధనలు చేసి ఈ పర్వతము రెండు పిరమిడ్ లు కలిసిన ఒక నిర్మాణమని పై పిరమిడ్ లో శంభల నగరముంటే క్రింద పిరమిడ్ లో అగర్తల నగరమున్నదని తన పుస్తకములో ఈ పర్వతమును సిటి ఆఫ్ గాడ్స్ గా అభివర్ణించిన దానిని బట్టి చూస్తే శంభలా నగరములో బ్రహ్మ చింతామణి అలాగే అగర్తల నగరములో పాదరస చింతామణి ఉండే అవకాశమున్నదని నా పరిశోధనలో తెలుసుకున్నాను అనగానే      

 సార్.మరి ఈ రెండు మణులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నారా?” అనగానే

నాధ్.ఈ రెండు మణులు అనగా రెండు త్రికోణాల ప్రాంతము అనేది నా అంచనా ప్రకారము అయితే కైలాస పర్వతము అయ్యి ఉండాలి.కైలాస పర్వతము అడుగు భాగములో పాదరస చింతామణి దర్శనము అయినట్లుగా ద్యోర్జీ రిపోర్టులు చెపుతుంటే అమెరికా డాలర్ మీద ఉన్న గుర్తుని తయారు చేసిన వారు చేసిన పరిశోధనలో కైలాస పర్వతము పైభాగములో ఒక మణి ఉన్నట్లుగా వీళ్ళు తెలుసుకున్నారని నా పరిశోధనలో తెలుసుకున్నాను.


ఢమరుకము - డ్యోర్జీ
పైగా హైందవ ధర్మములో ఢమరుకము నిర్మాణము అనేది గూడ రెండు త్రిభుజాల అనుసంధానము అయితే అదే బౌద్ధధర్మములో గూడ డ్యోర్జీ నిర్మాణము గూడ రెండు త్రిభుజాల అనుసంధానమే గదా.అంటే ఈ లెక్కన చూసిన వీళ్ళ ధర్మాలు అనేవి కైలాస పర్వతము యొక్క రెండు పిరమిడ్ ల నిర్మాణము గూర్చి చెబుతున్నారని మనకి తెలుస్తోంది గదా.బౌద్ధ కాల చక్ర నిర్మాణములో కైలాస పర్వతము యొక్క త్రికోణము గూర్చి చెబితే అదే శ్రీ చక్ర నిర్మాణము అనేది కైలాస పర్వతము యొక్క పైన ఉన్న పిరమిడ్ నిర్మాణము గూర్చి చెబుతోందని తెలుసుకున్నాను.

నేను వెంటనే సార్.అది ఎలా సాధ్యము అనగానే

నాధ్.వీరిలో మొట్టమొదటి వాడు బుద్ధుడు అయితే ఆ తరవాత తరము వాడు శంకరాచార్యుడు గదా.పైగా బుద్ధుడు ప్రతిపాదించిన కాల చక్రములో అంతముగా 16 స్తంభాలు అష్ట దళ పద్మముతో ఉంటే అదే శంకరాచార్యులు ప్రతిపాదించిన శ్రీ చక్రము అనేది  ప్రారంభములోనే 16 పద్మాలు ఆపై అష్ట దళ పద్మాల నిర్మాణముతో మొదలైనట్లుగా మనము గమనించవచ్చును.పైగా మన బుద్ధుడు ప్రతిపాదించిన సింగింగ్ బౌల్ నిర్మాణము అనేది సప్త ధాతువుల నిర్మాణమని లోకవిదితమే గదా.అంటే ఈ లెక్కన చూస్తే సప్త ధాతువులతో తయారు చేయబడిన పాదరస మణి దర్శనము ఈయన చేసి అది ఉండే ప్రాంతమును కాలచక్ర నిర్మాణముగా లోకానికి అందించారు.అలాగే హైందవ ధర్మములో శంకరాచార్యుడు కాస్త కైలాస పర్వతమునకు వెళ్ళి కైలాసనాధుడి అనుగ్రహమును పొంది పంచ స్ఫటిక లింగాలు తెచ్చినారని వాటిని నాలుగు పీఠాలలో అమర్చినారని అయిదవది చిదంబరక్షేత్రములో మోక్షలింగముగా ఉంచినారని వారి చరిత్రలో మనకి తెలుస్తోంది.అలాగే లలితనామ స్తోత్రాలలో మణి ద్వీప వర్ణన చూస్తుంటే 64 దేవతలను చూస్తూ నవ ఆవరణాలు దాటవలసి ఉంటుందని చెప్పడము బట్టి చూస్తుంటే ఈయన దేవతల దగ్గర ఉన్న బ్రహ్మ చింతామణి దర్శనము పొందినట్లుగా నేను గ్రహించాను.

సార్.నాకు ఒక సందేహము.మీ లెక్క ప్రకారము ద్యోర్జీ లామా పాదరస మణి మాత్రమే చూసాడని బ్రహ్మ చింతామణి చూడలేదని చెపుతున్నారు అది ఎలా?”

నాధ్.దీనికి సమాధానము ద్యోర్జీ లామా బృందములోని బ్రిటిష్ సైన్యాధికారి అయిన చార్లెస్ బెల్ 1912 సం.లో విక్టోరియా రాణికి ఇచ్చిన రిపోర్టు యే చెపుతుంది. అది ఎలా అంటావా? రిపోర్టు పేరు సీక్రెట్స్ 212 అంటే 2012 అన్నమాట.ఇపుడు 2424 సం.క్రొత్త శకము ఆరంభమవుతుందని చెపుతున్నారు.దీని ప్రకారము చూస్తే 2012-2424 సం.ల మధ్యకాలములో 412 సం.||లు ఉంటుంది. ఈ లెక్క ప్రకారము చూస్తే 2012 సం||నికి 412 సం|| తీసివేస్తే 1600 సం||రాలు వస్తుంది.

1600+412=2012

2012+412=2424

చార్లెస్ బెల్ - సీక్రెట్స్ 212 రిపోర్టు ప్రకారము ఆయన బృందము 1903-1909 సం||వాడు.1903+412=2315 సం|| వస్తుంది.

ఇపుడు

1600+412=2012

1600-1903=303

2012-1903=109||రాలు

అంటే ద్యోర్జీ లామా బృందము శంభల గ్రామ శకము ఆరంభానికి 109 సం||రాలు ముందుగానే హిమాలయాలలోకి వెళ్ళి బ్రహ్మ చింతామణి చూడవలసిన చోట పాదరస చింతామణి చూడటము జరిగింది.ఆ తరవాత తను తెలుసుకున్న ఈ విషయాన్ని లోకానికి చెప్పడానికి రాబోవు తరాలు ఈ మణి దర్శనము పొందడానికి వీలుగా తన రిపోర్టు పేరు సీక్రెట్స్ 212 అని పెట్టడము జరిగింది.అంటే 1600+412=2012 వస్తుంది.అ తరవాత 2012+412=2424 వస్తుంది. 

అంటే ప్రతి 412 సం||రాలకి శంభల గ్రామము నందు ఒక క్రొత్త శకము ఆరంభమవుతుంది.ఆ సమయములోనే ఎవరైన అర్హత, యోగ్యత ఉన్న వారికి మాత్రమే ఈ గ్రామ ప్రవేశ అవకాశము ఉంటుంది.అదిగూడ 12 సం||రాలు మాత్రమే ఉంటుంది.ఇదియే బ్రహ్మ కమలము విచ్చుకొనే 12 సం||రాల సూచన.అలాగే భూమి మీద ప్రతి జీవుడికి ప్రతి 12 సం|| ఏదో క్రొత్త మార్పును పొందుతుంటాడు. బుద్ధుడు ప్రతిపాదించిన కాలచక్రము ఇదే చెబుతోంది.దీనిని అందరు సాధన ప్రకారము చూస్తారు గాని కాలము ప్రకారముగా చూస్తే అది శంభల గ్రామము తెరుచుకొనే సమయాలు గూర్చి మనకి చెబుతోంది.ఇలా శంభల గ్రామ శకము గూర్చి మనకి బుద్ధుడు కాస్త కాలచక్రములో అంతర్లీనముగా ప్రతిపాదించి ఆ చక్రమునకు కాలచక్రమని చెప్పడము జరిగింది.అంటే శంభల గ్రామ దర్శనమునకు 412 సం||రాలు ఎదురు చూడ వలసి వస్తుందని దీని ప్రతీకగా హిమాలయ గురువులు కాస్త సప్తధాతువులతో పాదరస చింతామణి నిర్మాణమును గావించి ప్రతి సం||12 నెలలకి ఒకసారి మాత్రమే దీనిని దర్శనార్ధముగా కైలాస పర్వతము క్రింద ఒక త్రిభుజాకార నిర్మాణముగా ఉంచడము జరిగింది.అంటే హిమాలయ గురువుల గ్రామానికి 12 నెలలు ఆగితే శంభల గ్రామానికి 412 సం||రాలు ఎదురు చూడాలి అన్నమాట.

1600-412=1188

1148-412=776

776-412=364

364-412=48 సం||

అంటే ప్రతి 48 వ తరానికి మన తరములో ఒక యోగి పుడతాడని నానుడి ఉంది గదా.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి