53
“ఎంత జ్ఞానం పొందిన మహాత్ముడైనా భౌతికంగా మరణించక తప్పదు. మరణానికి ముందు
బాధపడక తప్పదు. అదే ధ్యానులు, జ్ఞానులు అయితే తక్కువ బాధపడతారు.
బాధను బాధగా విలపించరు. బాధపడరు.మరణ బాధను నిర్లక్ష్యం చేస్తారు. అంటే జ్ఞాని తన
శారీరకమైన బాధను శరీరానికి మాత్రమే ఇచ్చి... మనస్సును శాంతింప చేసుకుంటాడు. భయపడడు.
బాధపడడు. అయ్యో అనడు. అంటే మరణము మీద సదవగాహన ఏర్పడితే అనారోగ్యం, ముసలితనం, మృత్యువు, మృత్యుభయం
బాధించవు. అంటే శరీరం గురించి మరణ బాధల్ని గురించి ఆలోచన అంటే ప్రమిదలోని నూనె,
వతి లాంటిది. ఇందులో వత్తి అనేది శరీరమయితే మరణ బాధ అగ్ని అయితే
దీనిని వెలిగిస్తూ బాధ పెడుతుంది. మనస్సు అనేది జ్ఞానము పొందిన నూనె అన్నమాట.
నెమ్మది నెమ్మదిగా ప్రమిద నూనె ఎలా అయితే అయిపోతుందో అలా ఈ శరీరము నుండి మనస్సు
మాయం అవుతుంది.నేను ఈ నాలుగు గోడల మధ్య చనిపోదలచలేదు. విశాల వినీల గగనాల క్రింద
విశ్రమిస్తాను. అక్కడే నేను నిర్యాణం చెందుతాను. రాబోవు మూడు నెలలలో ఈ తథాగతుడు
మహా నిర్యాణం చెందపోతున్నాడు. ఎవరు గూడ అజ్ఞానముతో బాధపడకండి. విచారించకండి. మరణము
గూడ జీవితములో ఒక భాగముగా శాశ్వత విశ్రాంతియని గ్రహించండి”
అని చెప్పి మౌనము వహించాను.
దానితో
మేమంతా 'కుసినార' బయలుదేరి
అక్కడున్న నా ప్రియభక్తుడైన 'కుంద' భక్తుడు
అతి భక్తితో నా కోసము మంచిగంధం, పుప్పొడి, పుట్టగొడుగులతో స్వయంగా వంట చేసి నాకు పెట్టాడు. దాని పేరు 'సుకర మార్గవం'. కాని అది కాస్త పొరబాటుగా విషంగా మారింది. ఆ విషయం అతనికి తెలియదు. నాకు
తెలిసింది. దానితో నేను వాడితో "నాయనా.కుందా. నీవు నామీద ప్రేమతో చేసిన ఈ
వంటకము విషముగా మారినది.ఇది మిగిలిన వాళ్లకి వడ్డించకు. దీనిని నేలలో గుంట తవ్వి
అందులో దీనిని పూడ్చి ఈ గుంటను మూసివెయ్యి. అని హెచ్చరించి అలా చేయించాను. అంటే
వీడి ప్రేమ విషమించింది” అని నేను గ్రహించాను.
ఆ రాత్రి నేను కాస్త
సాల్వవనం చేరేసరికి నాకు విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. తట్టుకోలేక మెలికలు
తిరిగిపోతున్నాను. నిద్రపట్టలేదు. దానితో నేను కాస్త ఒక చెట్టు నీడన విశ్రమించాను.
నా ప్రియ శిష్యుడైన ఆనందుని పిలిచి వాడితో "నాయనా. ఆనందభిక్షువు. కుంద ఇంట్లో
చేసిన భిక్షయే ఈ తథాగతుడి ఆఖరి భిక్ష. అతను పెట్టిన ఆహారములో విషమున్నదని ప్రజలు
అతడిని నిందిస్తారు. అది అతని తప్పుగాదు. నా మీద ఉన్న అతి భక్తి,
అతి ప్రేమ వలన నాకు క్రొత్త రకము వంటకము చెయ్యాలని ప్రయత్న లోపముఅది
కాస్త విషముగా మారినదని తెలుసుకోలేకపోయాడు. ఈ తథాగతుడికి రెండు భిక్షలు బాగా
గుర్తుకు ఉండిపోతాయి. జ్ఞానోదయం పొందిన రోజు సుజాత పెట్టిన భోజనము మొదటిదిగా ,
నిర్వాణం చెందడానికి ముందు చేసిన నిన్నటి 'కుంద'
భిక్ష ఆఖరి భోజనం. అంటూ తలను ఉత్తరదిశగా ఉంచి పడుకున్నాను. ఇది నా
ఆఖరి రాత్రియని... తథాగతుడు నిర్యాణం చెందుతున్నాడని అందరికి తెలిసి నా చుట్టు
అందరు వలయ వలయాలుగా కూర్చొని మణి మంత్రము చేస్తున్నారు.
***
*** *** *** *** ***
ఇలా
స్తంభము
నిర్మాణ నుండి బయటికి నిర్వాణలామా వచ్చి చూస్తే పిరమిడ్ పై భాగమునకు చేరుటకు మళ్లీ
9 నిర్మాణ మెట్ల విధానము కనిపించింది.అంటే ఇపుడు తను కైలాస పర్వతము లోపల
మధ్య భాగములో ఉన్నానని గ్రహించటానికి అట్టే సమయము పట్టలేదు.ఇపుడు ఈ నిర్మాణ మెట్ల దాటివెళ్ళితే
కానీ పై భాగములో ఉన్న శంభల గ్రామ దర్శనము కాదని తెలుసుకొని అక్కడున్న మోక్ష
ద్వారబంధనం దగ్గరికి చేరుకొని అక్కడ కాపలా కాస్తున్న వారికి తను వచ్చిన పని
చెప్పగానే ఈ నగర ప్రవేశమునకు సెకీరు దేవత అనుమతి ఉండాలని వారు అని ఈమె అనుమతి
కోసము కాపలాదారిలో ఒకరు లోపలకి వెళ్లి సెకీరు దేవతను వెంటపెట్టుకొని రావడం
జరిగింది. దానితో ఈమె వచ్చి నిర్వాణలామాను తదేకంగా చూసి ప్రశ్నలు అడగడము
ప్రారభించింది.
1.చచ్చినా ప్రాణము ఉండేది ఏది?
చితాభస్మం (బూడిద గా మారిన చచ్చిన వాడి
ప్రాణశక్తి ఉంటుంది)
2.
ప్రాణం ఉన్న కదల లేనిది ఏది?
గ్రుడ్డు
3.అన్నం పెడితే బ్రతుకుతుంది
నీళ్లు త్రాగితే చస్తుంది అది ఏది?
అగ్నిహోత్రము (హోమములో నెయ్యి వేస్తే మండుతుంది.
అదే నీళ్లు పోస్తే ఆరిపోతుంది కదా)
4.
దేనిని పలికితే అది పోతుంది?
శాంతి
5.ఎప్పుడు పలికిన అది తప్పు గానే ఉంటుంది?
తప్పు అనే పదము
6.మానవ స్పర్శ లేని జలము ఏది?
కొబ్బరికాయలో ఉండే నీళ్లు
7.మాయ అంటే ఏమిటి?
మోహ,వ్యామోహము
కల్గించేది.
8.భూమిని సృష్టించటానికి పూర్వము ఎవరున్నారు?
పంచభూతాలు, కాలం,
ఈశ్వరుడు, శూన్యం,పరమ
శూన్యం
9.మనిషికి మిత్రుడు అలాగే శత్రువు ఎవరు?
అతని ఇంద్రియాలే
10.లోకులకు అర్థము కానిది తెలియనిది ఏది?
స్త్రీ మనస్సు ,స్త్రీ
చరిత్ర
11.జన్మించిన వారెవరు?
తిరిగి జన్మించవలసిన అవసరం లేని వారు
12.చనిపోయిన వారు ఎవరు?
తిరిగి
రావలసిన అవసరం లేని వారు
13.దుఃఖమునకు మూలము ఏది?
మాయ
14.ఏది తెలిసిన తరువాత మరేమీ తెలుసుకోనక్కరలేదు?
స్వస్వరూప జ్ఞానం
15.చంచలమైనవి ఏవి?
మనస్సు ,ధనము,
బలము, ఆయువు
16.చేయకూడని పని ఏది?
పాపకార్యాలు
17.
ఆకారము లేని వాడిని ఎలా తెలుసుకోవాలి?
ఆకారం లేని మనస్సు,
బుద్ధి, అహంకారం, మాయ….
గాలి ఎలా తెలుసుకున్నామో అలా
18.మహామృత్యువు అంటే ఏమిటి?
నేను ఆత్మ అని మరచిపోవుట
అనగానే
వెంటనే సెకీరు ఈ మోక్ష ద్వారం నుండి నిర్వాణలామా లోపలికి పంపించడానికి అనుమతి
ఇవ్వటం జరిగింది.
అపుడు
మోక్ష ద్వారము తెరవగానే ఎదురుగా
ఒక
యక్షుడు కనిపించి నిర్వాణలామా తో
“స్వామి ..నేను ఒక యక్షుడుని.నా పేరు సువర్ణ యక్ష. సర్వ సంపదలకు అధిపతి
అయిన కుబేరుడి యొక్క యక్షుడుని. ఆయన శాపము కారణముగా ఈ నగర ప్రవేశ అర్హత, యోగ్యత ఉన్నవారికి ఈ నగర విశేషాలు వివరిస్తూ వారికి కావాలసిన పనులు చేస్తూ
వారి అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెపుతూ వారు ఎందుకు వచ్చినారో తెలుసుకొని వారికి
కావలిసినవి ఇచ్చి ఈ నగరమునుండి బయటికి పంపించేదాకా నాదే బాధ్యత అంటూ...
నిర్వాణా..మీరు
బ్రహ్మ చింతామణి దర్శనార్ధం ఇక్కడికి వచ్చారని నాకు తెలిసింది. ఇపుడిదాకా ఇక్కడికి
వచ్చినవారంతా మాకున్న ఆత్యాధునిక
టెక్నాలజీ జ్ఞానము పొంది ఆ జ్ఞానముతో భూలోక వింతలు చేసినవారిని నేను
ఇపుడుదాకా చూశాను. ఇపుడి వరకు ఎవరు కూడా
బ్రహ్మ చింతామణి గురించి అడిగిన వాళ్లే
లేరు. ఎందుకంటే ఇలాంటి మణి ఒకటి ఉన్నదని కేవలము 18 మందికి మాత్రమే తెలుసు. అలాంటి ఈ మణి దర్శనార్ధం మీరు వచ్చినారంటే ఆ 18 మందిలో మీరు ఒకరు అయ్యిఉంటారు. శాపము పొంది మళ్ళీ శాప విముక్తి పొందడము
కోసము ఈ మణి దర్శనార్ధం వచ్చారని నాకు
అనిపిస్తోంది” అనగానే
“యక్షా . నీ జ్ఞాన సందేహము నిజమే.
నాకు కలిగిన శాపము కారణముగా నా సాధన శక్తితో 1000 మంది నుండి
948 ఆపై 683 ఆపై 477 ఆపై 272 ఆపై 19 ఆపై 9 ఆపై 7 స్ధానానికి అదే తిరిగి 18 మందికి మాత్రమే మణి దర్శనం చేసుకొనేవారిలో నేను 7వ
స్ధానానికి ఇపుడు వచ్చాను. ఆదిలో 18 మందిలో నేను ఒక్కడినే.
కాని అపుడు ఏదో తెలియని తప్పు చెయ్యడము వలన నాకు శాపము ఇచ్చి ఈ నగర బహిష్కరణ చేసి 108 కోట్ల సంవత్సరాలుపాటు భూలోకము నందు చిరంజీవి తత్త్వముతో పునఃజన్మలు
ఎత్తుతూ నా సాధనాశక్తితో ఈ కర్మజన్మలు తగ్గించుకుంటూ ఇలా నీ ముందుకి రావడము జరిగింది.
“అనగానే
యక్షుడు
వెంటనే “స్వామి… అంటే మీరు శాపము పొందిన శంభల యోగి అన్నమాట
అంటూ స్వామి… నన్ను క్షమించండి. మీరు మానవ జన్మలో ఉండేసరికి
నేను గుర్తుపట్టలేకపోయాను మీ కోసమే ఎదురుచూస్తున్నాను. శాపము
పొందిన శంభల యోగికి సేవలు చేస్తే నాకున్న శాపము నుండి విముక్తి కలిగి నా పదవి నాకు
తిరిగి వస్తుందని కుబేర స్వామి చెప్పారు” అనగానే
నిర్వాణలామా వెంటనే “యక్షా .ఇక
నీకు ఆయనతో పని ఉండదు. ఆయనకు సేవ చేసే అవకాశము లేదు. ఎందుకంటే ఆయనతోపాటు ఇక్కడ
ఎక్కడ ఎవరు ఉండరు” అనగానే
యక్షుడికి
విషయము అర్ధముగాక అయోమయముగా చూస్తుంటే
నిర్వాణలామా
వెంటనే “యక్షా.నీకు వివరించేంత సమయము అలాగే అవకాశము లేదు.
నాకు కేవలము 18 నిమిషాలు మాత్రమే సమయము ఉంది. ఈ లోపుగా నేను
బ్రహ్మ చింతామణి దర్శనం పొందాలని అగర్తల గ్రామవాసి గంధర్వుడు నాకు చెప్పి
పంపించాడు. లేకపోతే అక్కడున్న ద్వారము మూసుకొని పోయి 412
సంవత్సరాలకి కాని మళ్ళీ తెరుచుకోదు” అనగానే ఇలా వీళ్ళు
నడుచుకుంటూ ఒకచోటుకి రాగానే
ఎదురుగా
సువిశాలముగా కొన్ని లక్షల మైళ్ళు పరిధిగా ఉన్న మూడు మెట్లు ఉండి నాలుగు వైపుల
నాలుగు గాలిగోపురాలుండి నలుచదురుగా ఉన్న ఒక నిర్మాణము కనపడింది.దీనికి ఉన్న మెట్లు
ఎక్కగానే ఎదురుగా ఈ నిర్మాణమునకు మధ్యభాగములో ఒక మేరు పర్వతము లాంటి పిరమిడ్
నిర్మాణము దివ్యమైన కాంతులతో మెరుస్తూ కనపడినది.ఆకాశమును తాకే అంతటి సుమారుగా 120 కి పైగా ఉన్న దివ్య భవన పుర సముదాయాలు కనిపించాయి.పైగా ఇవి ఆరు వరుస నిర్మాణాలలో
ఉన్నట్లుగా మొదట 16 పురాలు,ఆపై 8,5,3,1 ఇలా పురాల నిర్మాణాలు ఉన్నట్లుగా పైగా ఈ పుర భవన నిర్మాణాలలో క్రింద
ఉన్నవి ఇనుము,ఉక్కు నిర్మాణాలుగా ఉంటే..ఆపైవి వెండి,ఆపైవి బంగారము,ఆపైవి నవ రత్న ఖచిత నిర్మాణాలు
కనిపించాయి.వీటికి క్రింద నుండి పైకి వెళ్ళడానికి దీని చుట్టు ఎనిమిది మార్గాలు
ఉన్నట్లుగా గమనించాడు.పైగా ఈ నిర్మాణ ఆఖరి పురములో ఒక పనసకాయ పరిమాణములో ఉన్న ఒక
దివ్య మణి తనంతగా తాను తిరుగుతూ సప్త కాంతులు వెదజల్లుతూ ఈ నగర నిర్మాణమునకు
కాంతిని ప్రసారము చేస్తున్నట్లుగా గమనించాడు.పైగా ఈ మణికాంతి నుండి ఒక రంగు ఒక మార్గము
ఉన్న పురాల మీద మార్పు లేని కాంతిని
ప్రసారము చేస్తుందని..అపుడు అక్కడున్న వారు వెలుతురు లోకములో ఉండి పనులు
చేసుకుంటున్నారని..మిగిలిన పురాలలో ఈ కాంతి పడకపోవడము వలన ఆ పురములో ఉన్నవాళ్ళు
అంతా కొంతమంది నిద్రావస్ధలో ఉంటే మరికొంతమంది సమాధిస్ధితిలో ఉన్నట్లుగా
గమనిస్తూ..ఇది చూడటానికి అచ్చంగా శ్రీ
మేరు శ్రీ చక్రము లాగా ఉన్నదని అనుకొనేలోపలే
అక్కడే
ఉన్న యక్షుడు "స్వామి...ఈ గ్రామమే
శంభల గ్రామము.ఇది చూడటానికి ఒకే నగరములాగా కనిపించినప్పుడికి ఇందులో నాలుగు యుగాల
వాళ్ళు ఆవాసము చేస్తుంటారు.ఆ కనిపించే 16 పురాలు
అనగా నాలుగు యుగాలకి నాలుగు పాదాల చొప్పున 16 యుగ పాదాలలో ఈ
నాలుగు యుగ మనుష్యులు ఆవాసము చేస్తూంటారు.ఎవరి లోకము వారిది.ఎవరి ప్రపంచము
వారిది.ఒక యుగమనుష్యులకి మరో యుగ మనుష్యులకి ఎలాంటి సంబంధ భాంధవ్యాలుండవు.నిజానికి
ఇక్కడ నాలుగు యుగపు వాళ్ళు ఉన్నారని వాళ్ళకే తెలియదు.ఎందుకంటే ఈ పురాలకి సంబంధించి
వారి వారి దారులుంటాయి.అంటే మొత్తము మీద ఎనిమిది దారులు ఈ పురాలలో ఉన్నప్పడికి
ఇందులో ఒక రహస్య పుర దారి ఈ పురాలను కలుపుతూ ఆఖరిగా ఉన్న మెరుస్తూ కనపడుతున్న మణి
దగ్గరికి తీసుకొని వెళ్ళుతుంది.ఆ మణియే బ్రహ్మచింతామణి.మిగిలిన ఏడు దారులు ఎక్కడో
ఒకచోట ఆగిపోతాయి.ఈ దారులు చూడడానికి పద్మవ్యూహములాగా ఉంటుంది.దారి తప్పితే
ఉన్నచోటునే నిరంతరముగా తిరుగుతూనే ఉంటాము.ఈ పురాలన్నింటిని కలిపే మోక్షమార్గ దారి
మాత్రము 18 శంభల యోగులకి వెళ్ళటానికి అర్హత,యోగ్యత ఉంది.అందులో మీరు ఒకరని నాకు తెలిసింది.మీ వలన నేను ఈ రోజు ఈ దారి
గుండా వెళ్ళుతూ అన్ని పురవాసులను చూస్తూ పైకి అనగా ఆ మణి ప్రాంతమునకు
వెళ్ళుతున్నాము.కాని మనము వీళ్ళలలో ఎవరిని పలకరించడానికి ప్రయత్నించకూడదు.
ఇక్కడున్న ఈ యుగవాసులు ఎవరి యుగమునకు తగ్గట్లుగా ఆ యుగపు లక్షణాలతో,అలంకారాలతో,అలవాట్లులతో,వృత్తులతో
ఉంటారు.ఎవరి లోక ఆలోచన భావ సంకల్ప,స్పందన,ఆశ,భయ,ఆనంద,మాయలతో ఉంటారు.వీళ్ళని మనము సాక్షిభూతముగా చూసుకుంటూ వీళ్ళని దాటుకుంటూ
వెళ్ళితే కాని చివరి పురము నందు ఉన్న నవనిర్మాణ శ్రీచక్ర స్ఫటిక భవనమునకు
చేరుకోలేము.ఒకవేళ మీరు వీరిలో ఎవరికైనా స్పందిస్తే ఆ యుగము దగ్గర ఆగిపోతారు.నేను
వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను.ఎందుకంటే ఈ నాలుగు యుగాలలో మీ కుటుంబ బంధు మిత్రుల
సభ్యులు ఖచ్చితముగా కనపడతారు.వారిని చూసిన గూడ మీరు ఆగకూడదు.అది గుర్తుంచుకోండి.ఈ
నాలుగు యుగపురాలు పైన తిరిగే బ్రహ్మచింతామణి కాలభ్రమణములో తిరుగుతుంటాయి.ఇది
అష్టదిక్కులలో సప్తకాంతులను విరజిమ్ముతూ ఉంటుంది.ఈ మణికాంతి ఇక్కడున్న అష్టకోణాలలో
.. అష్టదిక్కులలో.. ఏ దిక్కులోని ఏ కోణము మీద పడుతుందో ఆ యుగము ప్రస్తుతానికి
నడుస్తుంది అన్నమాట.ఈ నడిచే యుగ భ్రమణము విశ్వములో ఉన్న 1800
భూలోకాల మీద అలాగే 36 కోట్లున్న దైవలోకాలలో,మూడు కోట్లు ఉన్న త్రిలోకాలలో..ఒక కోటి ఉన్న కారణలోకాలలో ఈ కాల ప్రమాణము
నడుస్తోంది.అనగా ఈ మణికాంతి ఉన్న దిక్కులో 412 నిమిషాలు
మాత్రమే స్ధిరముగా ఉంటుంది.అదే ఈ గ్రామములో 412 సం.
సమానము.అదే భూలోకములో 4 లక్షల సం.లతో సమానము.ప్రస్తుతానికి ఈ
మణి నుండి నీలిరంగు కాంతి ప్రసారము అవుతోంది.అంటే కలియుగములో మనము ఉన్నాము.అదే
బంగారపు లేదా పసుపు రంగు కాంతి అయితే మనము సత్యయుగములో అదే తెలుపు కాంతి అయితే
త్రేతాయుగములో,అదే ఎరుపు కాంతి అయితే ద్వాపర యుగములో మనము
ఉన్నట్లు అన్నమాట.ఇలా కలియుగము పూర్తికాగానే మళ్ళీ మొదటి సత్యయుగము మొదల
అవుతుంది.ఇలా ఇపుడుకి ఎన్నో యుగాలు వచ్చినవే తిరుగుతున్నాయి.జరిగిన రామాయణాలు,
మహాభారతాలు,భాగవతాలు మనము చూస్తున్నాము
అన్నమాట.అదే ఈ మణి కాంతి లేత నీలిరంగుగా మారితే యుగ ప్రళయమునకు సూచన అన్నమాట.అపుడు
72 నిమిషాలు పాటు మణి కాలభ్రమణము ఆగిపోతుంది.అపుడు జరిగే యుగ
ప్రళయధాటికి ఈ ఆగిపోయిన ఈ మణి తిరగడము ఆరంభిస్తుంది.అంటే ఈ మణి భ్రమణము ఆగిపోతే ఈ
విశ్వ కాలచక్రము ఆగిపోతుంది అన్నమాట.అపుడు తిరిగే ఈ విశ్వము శాశ్వతముగా
అచేతనస్ధితిలో నిశ్చలముగా ఉండి శూన్యమయ్యే ప్రమాదముంది.అందుకని ఈ మణి భ్రమణము
ఆగకుండా నిత్యము తిరుగుతూ ఉండే విధముగా చూసుకోవటానికి 18
మంది శంభల యోగగురువులకి ఈ బాధ్యతను అప్పగించారు.
మనము
ప్రస్తుతానికి కలియుగపురము నందు అడుగుపెడుతున్నాము.ఈ నాలుగు పాద పురాలకి గుర్తుగా
ఒక నల్లని కత్తి జెండా చిహ్నముగా ఉంది. అటు చూడండి అనగానే ఈ యుగ ద్వారము పైన ఉన్న
జెండా మీద ఒక నల్లని కత్తి కనపడింది.ఈ ద్వారములోనికి అడుగుపెట్టిన నిర్వాణలామా
మాత్రము నిశిత దృష్టితో ఈ కలిపురవాసులను గమనిస్తూండగా తనలాంటి ఆకారమున మనుష్యులు
కనిపించేసరికి ఇతనికి ఆశ్చర్యమేసింది.పైన తన భార్యలాంటివాళ్ళు,తన కుటుంబ,బంధు,మిత్రులు
లాంటివాళ్ళు భూలోకములో వీరంతా ఎలా ఉన్నారో ఈ లోకములో అలాగే కవల పిల్లలుగా
కనపడేసరికి నిర్వాణలామాకి అమిత ఆనందఆశ్చర్యమేసింది.తనలాంటివాళ్ళు సుమారుగా 36 మంది ఉన్నారని లెక్కవేస్తూ ముందుకి వెళ్ళుతూండగా ఆత్యాధునిక టెక్నాలజీ
వస్తువులు అనగా ఫ్లయింగ్ కారులు వాడుతున్న పిల్లలు కనిపించారు.ఒక పిల్లవాడిలోతన
చిన్ననాటి రూపరేఖలు కనిపించడము గమనించి మౌనముగా ముందుకి వెళ్ళగా 8 డి నుండి 44 డి ఉన్న టెక్నాలజీ ఉన్న వస్తువులను
వాడుతున్న యువత కనపడింది.మనస్సులోని భావాలోచనలకి తగ్గట్లుగా పనిచేసే వస్తువులు
వాడుతున్న స్త్రీమూర్తులు కనిపించారు.తలలు మార్చే వైద్య టెక్నాలజీ వాడుతున్న
వైద్యులు అలాగే స్త్రీ,పురుష సంయోగము లేకుండా సంతానము పొంది
నెలలుపాటు గర్భాలు మోయ్యకుండా రోజులుపాటు మోసి కంటున్న స్త్రీమూర్తులు
కనిపించారు.నిత్య ఆహారమును టాబ్లెట్ల్ రూపములో తీసుకుంటున్నవారు,రేడియేషన్ తట్టుకోలేక విచిత్ర దుస్తులు ధరించేవారు,ప్రతి
చిన్న విషయానికి యంత్రాలమీదఆధారపడుతున్నవారు,గుట్టుగా ఉండే
సంసారము రట్టుగా మారుతున్న పట్టించుకొని ప్రజలను చూస్తూ..వస్త్రాలు
భారమని..దానికన్న నగ్నత్వమే మిన్న యని ప్రవర్తించే యువత,సంసారమే
భవసాగరమని క్షణాలలో కలిసిపోయి నిమిషాలలో విడిపోయే ప్రేమజంటలు,వివాహ జంటలు కనిపించారు.సంతానమును కని సాకలేమని పెంపుడు జంతువులని తన
కన్నబిడ్డలుగా భావించి తమ చనుపాలు పడుతున్న స్త్రీమూర్తులు చూసేసరికి
నిర్వాణలామాకి ఏమి అనుకోవాలో అర్ధముకాలేదు.క్షణాలలో ప్రపంచమంతా గూడ తన గదిలో ఎక్కడ
గావాలంటే అక్కడ కనపడే టెక్నాలజీని వాడుతున్న యువత,రోబోలు
కాస్త మానవప్రపంచమును శాసించేస్ధాయిలో ఉన్న యంత్రప్రపంచము కనపడసాగింది. ఆ
తర్వాత మూడో ప్రపంచ యుద్ధసన్నివేశాలు కనిపించడం మొదలాయి. రష్యా,అమెరికా దేశాలు ఒక కూటమిగా ఏర్పడి చైనాతో మూడవ ప్రపంచయుద్ధము చేసే
దృశ్యము..అలాగే చైనా గావాలని ఈ యుద్దానికి రష్యాతో కాలుదువ్వే దృశ్యము..రష్యా
యొక్క ధృవ ప్రాంతము మీద అకారణ దాడి చెయ్యడము దానితో రష్యాకి, చైనాకి మధ్య విభేదాలు ఏర్పడి యుద్దానికి దారితీయ్యడముతో రష్యాకి అమెరికా
అండముగా ఉండటము అలాగే చైనాకి మద్ధతుగా అరబ్బుల దేశాలు ఉండే దృశ్యాలు కనిపించాయి. ఇక
తటస్ధ దేశాలు కొరియా,జపాన్ కి మద్ధతుగా భారతదేశము
ఉన్న దృశ్యాలు కనిపించడము ఆపై ఈ మూడు కూటలు కలిసి ఒకదానితో మరొకటి యుద్ధం
చేసుకోవడము ఇందులో తటస్ధ దేశమైన భారతదేశము ఇందులో జయం పొందే దృశ్యాలు కనిపించడము
అలాగే ఈ యుద్ధములో మూడింట రెండు వంతులు జనభా చనిపోయిన యుద్ధకాండ దృశ్యాలు చూసినగూడ
నిర్వాణలామా ఏమాత్రము స్పందించకుండా మౌనముగా… ఇలా ఈ కలియుగ
వింత ప్రపంచ దృశ్యాలు త్వరలో భూమి మీద కనపడతాయి అనుకుంటూ ముందుకి ప్రయాణించగా
ఎదురెరుగా
వెండినిర్మిత మహాద్వారము దానిమీద ఉన్న జెండాకి ఎరుపు రత్నము గుర్తుగా
కనిపించేసరికి అంటే తాము ద్వాపరయుగములోనికి అడుగుపెడుతున్నామని నిర్వాణలామా
అనుకొనేలోపుల ఆవుల అరుపులు,వేణుగానము వినిపించేసరికి
ఇంతటి చక్కటి పల్లెటూరు వాతావరణమును చూసి ఎన్నో యుగాలు అయిందని అనుకుంటూ ముందుకి
పోతూండగా ఒకవైపు శ్రీకృష్ణదేవాలయాలు,పూజలు,భజనలు,మరోవైపు ఆవుపాలు పితకడాలు,ఆవుపేడ గొబ్బెమ్మలు,ఆవుపాల పదార్ధాలు,ఆవులను మేపేవారు,ఎద్దులతో వ్యవసాయము చేసేవారు ఇలాంటి
మహత్తర దృశ్యాలకి మైమరిచిపోతూ ముందుకి సాగుతూండగా..12 నుండి 18 అడుగుల ఎత్తున్న స్త్రీ, పురుషులు కనిపించడము
మొదలుపెట్టారు.విచిత్రము ఏమిటంటే తనలాంటి వ్యక్తులు ఈ యుగములో కనిపించేసరికి
నిర్వాణలామా ఆశ్చర్యచెందుతూ..వీరి వయస్సు 500 సం.రాలు పైన
ఉన్నట్లుగా కనపడతున్నారు.వీళ్ళు ఆయుష్షు సుమారు 500 నుండి 1000 సం.రాలు దాకా ఉండవచ్చును అనుకుంటూ ముందుకు వెళ్ళగా శ్రీకృష్ణుడి జనన
దృశ్యాలు,భాగవత కధ దృశ్యాలు,ఆపై
మహాభారత దృశ్యాలు,భగవద్గీత బోధ దృశ్యాలు,కురుక్షేత్ర యుద్ధ దృశ్యాలు ఒక సినిమా దృశ్యాలులాగా ఒకదాని తర్వాత మరొకటి
అన్నట్లుగా కనిపిస్తుంటే వీటిని సాక్షిభూతముగా చూసుకుంటూ ముందుకి వెళ్లగా
ఎదురుగా
బంగారముతో చేసిన ఒక పెద్ద సింహద్వారము కనిపించడము దానిమీద ఉన్న జెండా మీద పసుపు
ధర్మచక్రము కనిపించగానే తాము త్రేతయుగపురములోనికి ప్రవేశించినట్లుగా తెలుసుకొని
ముందుకి బయలుదేరారు.యుద్ధవిద్యలు,విలువిద్యలు నేర్చుకుంటున్న
యువకులు,వేదాలు వల్లిస్తున్నవారు, సంస్కృతభాషను
మాట్లాడుతున్నవారు కనిపించడము మొదలుపెట్టారు.వీళ్ళు సుమారుగా 18 అడుగుల నుండి 24 అడుగుల దాకా ఎత్తు ఉన్నారని,వీళ్ళ వయస్సు సుమారుగా 1000 సం.రాలు పైన ఉంటుందని
అలాగే వీరి ఆయుష్షు గూడ 1000 సం.నుండి 10 వేల సం.రాలు దాకా ఉండవచ్చునని ..పైగా ఈ యుగపు మనుష్యులలో తనలాంటి
పోలికలున్నవారున్నారని అనుకుంటూ ముందుకి వెళ్ళగా శ్రీరామ జనన దృశ్యాలు,రావణ దృశ్యాలు,రామరావణ యుద్ధకాండ దృశ్యాలు,శ్రీరామ సరయునదిలో నిర్యాణ దృశ్యాలు,వీర హనుమ
చిరంజీవుడిగా కైలాస పర్వత పీఠభాగములో నర వానర యతీశ్వరుడి రూపము లీలా దృశ్యాలను
చూసుకుంటూ ముందుకి వెళ్లగా
ఎదురుగా
నవరత్న ఖచిత మహాద్వారము దర్శనమివ్వడము దీనిపైన ఉన్న జెండా గుర్తుగా ఒక తెల్లని
పద్మము కనిపించడముతో అంటే తాము సత్యయుగపురములోనికి అడుగుపెట్టామని గ్రహించి
ముందుకి వెళ్లగా ఆశ్రమజీవితవాసులు,హోమాలు,యాగాలు,యజ్ఞాలు చేసేవారు,నారవస్త్రాలు
ధరించినవారు, ధ్యానాలు,జప తపాలు
చేస్తున్నవారు, వేదాలు, పురాణ, ఇతిహాసాలు, భవిష్యాలు వ్రాస్తున్నవారు కనపడుతూండగా
వీరిని దాటివెళ్ళగా సుమారుగా 32 అడుగులు ఎత్తున్న స్త్రీ,పురుషులు పైగా వీరి వయస్సు పది వేల సం.రాల పైన ఉన్నట్లుగా అలాగే వీరి
ఆయుష్షు గూడ 10 వేల సం.నుండి 10 లక్షల
సం.రాలు దాకా ఉండవచ్చునని ..పైగా ఈ యుగపు మనుష్యులలో తనలాంటి
పోలికలున్నవారున్నారని అనుకుంటూ ముందుకి వెళ్ళగా ఆదియోగి పరమేశ్వరుడి జీవిత
దృశ్యాలు, పరమేశ్వరీతో వివాహదృశ్యాలు, అరణ్యాలలో
ధ్యాన దృశ్యాలు, దక్షయజ్ఞదృశ్యాలు, రాక్షసులకి
వరాలు,రాక్షస సంహార దృశ్యాలు,క్షీరసాగరమధన
దృశ్యాలు,అందులోంచి వచ్చిన హాలాహాలము సేవించి తనువు చాలించిన
దృశ్యాలు వరుసగా కనపడుతూ అదృశ్యమయి ఎదురుగా
శంభల
గ్రామ మధ్యలో ఉన్న శంభల గ్రామ మొట్టమొదటి రాజు సుచేంద్రుడు కట్టించిన తొమ్మిది
అంతస్తుల స్ఫటిక శ్రీ మేరు చక్ర భవనము వీరికి నెమ్మదిగా కనిపించడము ఆరంభమైంది.అంటే
ఇపుడిదాకా అదృశ్యముగా ఉండే ఈ భవనము సదృశ్యమవ్వడము ఆరంభమైందని నిర్వాణలామా గ్రహించి
మౌనముగా ఉన్నాడు. ఈ భవనమును నిర్వాణలామాకి చూపిస్తూ..
"స్వామి.ఇందులో
నవ అంతస్తుల నవగ్రహ నవరత్నకోటలుంటాయి.వీటిని దాటుకుంటూ మీరు లోపలకి వెళ్ళితే అక్కడ
మీకు షట్కోణములో బ్రహ్మచింతామణి దర్శనమిస్తుంది.ఒకటి గుర్తు పెట్టుకొండి.ఈ మణి
మనకి అష్టదిక్కులలో ఉన్న అష్టకోరికలు తీరుస్తుంది. అనగా తూర్పు దిక్కునరాజసం,పడమరలో పాశానుబంధం, ఉత్తరలో ఐశ్వర్యం, దక్షిణములో మృత్యుభయనాశనం,ఆగ్నేయములో రోగ వినాశనం,నైరుతిలో రాక్షస సంహరము,వాయువ్యలో సుస్ధిరం,ఈశాన్యములో మృత్యుజయము అనే అష్టదిక్కుల అష్టకోరికలుంటాయని..వీటిలో మీకు ఏ
కోరిక సిద్దించాలని ఈ మణి దర్శనానికి వచ్చారో” అనగానే
నిర్వాణలామా
వెంటనే...
“నేను అయితే ఈశాన్యములోని మహామృత్యుజయము పొందాలని అనుకుంటున్నాను.అది గూడ
కేవలము 18 నిమిషాలలో అక్కడికి చేరుకోవాలి” అనగానే
యక్షుడు
వెంటనే “స్వామి.. అంత ఖచ్చితముగా 18
నిమిషాలు మాత్రమే సమయము పడుతుందని ఎలా చెపుతున్నారు” అనగానే
“యక్షా . నా భార్య ఆత్మ శక్తి అనేది మణి కైలాష్ పర్వతం మీద మీరంతా కలిసి
శిలగా మార్చిన పాకే పాము లోనికి ప్రవేశించినట్లుగా చేశాను. అది కాస్త అక్కడున్న
అవలోకితీశ్వరుడు మెడలోనికి చేరితే ఆయన కంఠములో ఉన్న నాగమణి విషగ్రంథి యైన కాలకూట
విషమునకు ఈ శక్తి చేరుతుంది. ఇపుడు దాకా ఈ నాగమణిలో పాముచారిక లాగా
నిర్జీవంగా పడియున్న దీనికి ప్రాణశక్తి వచ్చినట్లే అవుతుంది. దానితో ఈ నాగమణి
విస్ఫోటనము అవుతుంది. అపుడు ఈ విశ్వమే విస్ఫోటనము అవ్వడము మొదలు అవుతుంది.
యక్షుడు
వెంటనే అంటే “నువ్వు..నువ్వు విశ్వము వినాశనము
కోరుకొన్న 1000 మందిలో అలాగే 18 మందిలో
ఒక్కడివి నీవే గదా.అందుకే నీకు శాపము నిచ్చి నీకు సహాయ సహకారాలు అందించిన మణి
కైలాష్ పర్వతమును ఎక్కే నీలిపామును నిర్జీవము చేసి శిలగా మార్చాము గదా. అంటే నీ
బుద్ధి మార్చుకోకుండా విశ్వసృష్టి వినాశానికి మళ్ళీ వస్తావా?నీ
సంగతి ఇలా కాదు” అంటుండగానే
యక్షుడు
వెంటనే తన చేతిలో ఉన్న మహాశంఖమును ఊదేసరికి అక్కడఉన్న 123 దైవాల యొక్క 36వేల మంది పరివారం అంతా ఒకచోట
సమావేశము అయ్యి యక్షుడు ద్వారా అసలు విషయము అనగా శాపము పొందిన శంభల యోగి ఈ నగర ప్రవేశము చేశాడని తెలుసుకొని అది ఎలా సాధ్యపడినదో అర్ధముకాక
మరోవైపు మణి కైలాష్ పర్వతమెక్కుతున్న ప్రకృతి నాగుపామును ఎలా ఆపాలో అర్ధముకాక తలలు
పట్టుకున్నారు.
ఇదే
అదనుగా నిర్వాణలామా ఏమాత్రము ఆలోచించకుండా, బెదరకుండా, భయపడకుండా, బాధపడకుండా,
ఆశపడకుండా, స్పందించకుండా ఈ నవనిర్మాణ సోపానములోని మొదటి
నిర్మాణములోని లోపలికి వెళ్ళడము యక్షుడు గమనించి మిగిలిన వారితో ఆవేశముగా
“ఇక అంతా అయిపోయింది.వాడు అనుకున్నంత పనిచేస్తాడు.శ్రీ మేరు చక్ర నవావరణ
నిర్మాణములోనికి గూడ ప్రవేశించాడు.ఇటువైపు మణికైలాష్ పర్వతము ఎక్కే ప్రకృతిపామును
ఏమి చెయ్యలేము.అలాగే ఇటు ఇలా లోపలికి వెళ్ళినవాడిని ఆపలేము.ఇక అందరు గూడ
మహామృత్యువైన శాశ్వత మృత్యువైన అనగా స్ధూల,సూక్ష్మ,కారణ,సంకల్ప,ఆకాశ,ఆత్మ,మనస్సు అనే సప్త శరీరాలు లేని స్ధితిని
..జననమరణాలు లేని స్ధితిని...కర్మజన్మలు లేని స్ధితిని...పాపపుణ్యాలు లేని
జన్మలస్ధితిని...కర్మనివారణ యోగజన్మలు లేని స్ధితిని...స్పందన,కోరిక,సంకల్పము లేని జన్మలస్ధితిని...అనగా
పూర్ణశూన్యస్ధితిని అందరు ఈ విశ్వములో ఉన్న అండ,పిండ,బ్రహ్మండ లోకాలలో ఉండే 84లక్షల జీవజాతులు,36 కోట్ల దైవజాతులు,ఒక కోటి ఆత్మజాతి ఇలా అందరుగూడ
శూన్యస్ధితిని పొంది పరమశూన్యమునందు లయము చెందకతప్పదు.ఎపుడైతే మణికైలాష్
పర్వతములోని ప్రకృతిపాము కాస్త అక్కడున్న అవలోకితేశ్వరుడి మెడకి చేరుతుందో ఆ
క్షణమే ఈ విశ్వ వినాశనము మొదలు అవుతుందని ఇంతముందే నాకు నిర్వాణలామా చెప్పాడు” అంటూ చెప్పేసరికి...
ఈ
యక్షగుంపులోంచి ఒక వృద్ధ యక్షుడు లేచి
“అసలు వీడు మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాడు?అయిన వీడు
ఇలాంటి ప్రయత్నములు ఎన్నో ఇపుడికి చేశాడు కదా.వాటిని మనము మన ఆలోచన,భావ సంకల్ప బలముతో తిప్పికొట్టాము గదా.అందరు ధైర్యముగా ఉండండి.మనకి ఏమి
కాదు.మనము నమ్ముకున్న దైవాలకి ఏమి కాదు.మనమంతా వివిధ శరీరాలతో సుఖభోగాలు
అనుభవిస్తూ మన భావాల వలన భూలోకవాసులు పడే కష్టాలను చూసి మనము ఆనందమును
అనుభవిద్దాం.మీరు భయపడి మమ్మల్ని భయపెట్టకండి” అనగానే...
వెంటనే
నిర్వాణలామాను చూసిన యక్షుడు అందుకొని..”స్వామి.నిర్వాణలామా
స్ధానము 1000పైన ఉన్నపుడు మనము ఏమి చేసిన చెల్లింది.ఇపుడు
ఆయన స్ధానము ఏకముగా 7వ స్ధానమైంది.అంటే 18మంది శంభలయోగులలో..18మంది సిద్ధయోగులలో..18మంది హిమాలయగురువులలో..18మంది సిద్దదైవాలలో ఇలా
విశ్వములో ప్రతి18వ వంతులో ఈయనకి 7వంతు
ఇచ్చినట్లే..ఉన్నట్లే అన్నమాటగదా.ఇలా ఏటుచూసిన 18 మందిలో ఈయన
స్ధానము 7వ స్ధానమైంది.ఏడు స్ధానము అంటే కేతు గ్రహస్ధానమని
లోకవిదితమే కదా.ఇదియే సకల దైవ,జీవ కోటికి అంతెందుకు ఈ
విశ్వానికి మోక్షమిచ్చే యోగము ఈ కేతు గ్రహానికి ఉన్నదని జ్యోతిష్యము
చెపుతోంది.జన్మలగ్నములో ఈ గ్రహసంచారమును బట్టి జీవుడు నుండి దైవము దాకా మోక్షజన్మ
అవునో కాదో తెలుసుకొనే అవకాశమున్నది.ఇలాంటి పూర్ణ మోక్షమిచ్చే కేతు గ్రహస్ధానానికి
మనకి తెలియకుండానే శాపము పొందిన పవన్ శంభల యోగి కాస్త నిర్వాణలామాగా మానవజన్మ
ఎత్తి తన సాధనశక్తితో తన స్ధానాలను మెరుగుపరుచుకొని ఇలా తిరిగి వస్తాడని మనలో ఎవరు
గూడ ఊహించి ఉండరు.కలలో గూడ అనుకొని ఉండరు” అనగానే..
ఇది
విన్న వృద్ద లామా వెంటనే “అయితే ఇతని స్ధానము 7వ స్ధానము పైగా కేతు గ్రహస్ధానము గావడముతో మనము ఏవరు ఏమి
చెయ్యలేము.సాక్షాత్తు మన ఆది దైవమైన అవలోకితేశ్వరుడు గూడ ఏమిచెయ్యలేడు. వాడికున్న
విశ్వానికి శాశ్వతమరణ సంకల్పబలము ముందు అందరుగూడ తలవంచకతప్పదు. హనుమంతుడు ముందు
కుప్పిగంతులు వెయ్యడము అనవసరము.వాడు ఈసారి అన్నిగూడ చాలా పధకము ప్రకారము చేసుకొని
మనదగ్గరికి వచ్చాడు” అనగానే
ఈ
గుంపులోంచి ఒక యువ యక్షుడు శరవేగముతో పైకి లేచి “లేదు.లేదు.మనకి
ఇంక వాడిని ఆపే అవకాశాలున్నాయి.అది ఏమిటంటే మణికైలాష్ పర్వతమెక్కే ప్రకృతిపామును
తిరిగి మన శక్తితో ఎక్కనీయ్యకుండా చేస్తే అంటే దానికి అవాంతరాలు కలిగిస్తే అపుడు
వీటిని దాటలేక ఏలా దాటాలో అర్ధమవ్వక అనుకున్న సంకల్పము తీరలేక తలను బండకేసి
బాదుకొని దాని అంతట అదే చనిపోయేటట్లుగా చేస్తే ఆ పాము చనిపోతే తిరిగి నిర్వాణలామా
ఏమిచెయ్యలేడు కదా” అనగానే
“అవును..అవును..ఇది నిజమే.ఈ ఆలోచన బాగుంది.ఇలా చెయ్యవచ్చును.మనము
నిర్వాణలామాను ఏమి చెయ్యలేము కాని వీడి భార్య అయిన ప్రకృతిపామును ఏదైన
చెయ్యవచ్చును గదా.దానితో మనమంతా బ్రతికి వెయ్యవచ్చు గదా”
అంటూ అందరు గూడ హర్షధ్వానాలు చేసుకుంటూ
మణికైలాష్
పర్వతము మీద కోటి గణదేవతలకి ఈ ప్రకృతిపాము గురించి చెప్పడానికి ఈ సలహా ఇచ్చిన యువ
యక్షుడు ఆనందముగా ఆకాశయానము చేస్తూ మణికైలాష్ పర్వతము వైపు బయలుదేరాడు.ఇది ఎంతవరకు
విజయము అవుతుందో అని వృద్ధ యక్షులు ఆలోచనలో పడ్డారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి