28 భాగం

 

28

దానితో నాకు ఒక భిక్షాపాత్రను చేతికిచ్చి భిక్షాటనకి వెళ్లి ఎలా భిక్ష అడగాలో... ఎట్లా వెళ్లాలో కొంతమంది నాకు హితబోధ చేసారు. మొట్ట మొదటిసారిగా ఆహారము కోసము భిక్షాటనకి నేను వెళ్లు తుండేసరికి నా మనస్సు నాకు ఎదురు తిరగడము మొదలు పెట్టింది. చక్కగా బంగారు పళ్లెములో పంచభక్షాలు భోజనాలు వదిలి భిక్ష పాత్ర చేత పట్టుకుని భుక్తి కోసము భిక్ష అడగడము సిగ్గుగా, అవమానముగా, ఏదో తెలియని భయము నాలో మొదలవ్వడము గమనించాను. ఇవన్నీ గూడ మనస్సు చేసే మనో మాయలని నాకు అన్పించి వాటిని నిగ్రహించుకొని భిక్షకి వెళ్ళాను. నా రాజఠీవిని చూసి అందరు భిక్ష వెయ్యడము నా భిక్ష పాత్ర నిండి పోవడముతో.... ఆశ్రమానికి తిరిగి వచ్చి... నాకు గావలసిన ఆహారమును ఉంచుకొని మిగిలిన ఆహారమును నా తోటి సాధకులకు పంచిపెట్టి గురు బోధ చేసినట్లుగా నాలోంచి గత జ్ఞాపక ఆలోచనలు తగ్గించుకొనే ప్రయత్నముగా ధ్యానమునకు కూర్చున్నాను. ఎందుకంటే నేను వచ్చినది తిండి కోసము కాదు.... జ్ఞాన భిక్ష పొందడము కోసమని నా మనస్సుకి సమాధానాలు ఇస్తూ... శ్వాస మీద దృష్టి పెట్టాను.

             అనతికాలములో నాలో గత జ్ఞాపక ఆలోచనలు 80 % శాతము పూర్తిగా నివారించుకొన్నాను. కాని నా తల్లిదండ్రులు, నా భార్య, పిల్లాడి జ్ఞాపక ఆలోచనలు నన్ను వదిలి పెట్టలేకపోయినాయి. వాటిని ఎలా నిగ్రహించుకోవాలో నాకు అర్ధము కాలేదు. దానితో నా సమస్యకి పరిష్కారం ఏదైనా దొరుకుతుందేమోనని గురువు దగ్గరికి వెళ్లి నా బాధ చెప్పుకున్నాను. ఆయన ఇదంతా విని....

నాయనా. ధ్యానములో ఇలాంటివి ఆటంకాలుగా రావడము సహజమే. ధ్యానమును ఎప్పుడు ఒక పనిగా చెయ్యకు. చేసే ప్రతిపనిని ధ్యానముగా చెయ్యి. నీవు బలవంతముగా ఆలోచనలు చేయడము
 వలన నీ మనస్సు నీకు ఎదురు తిరుగుతుంది. మనస్సు ఒక ఆవులాంటిది. ఆవుకి ఎలా అయితే తన ఇష్టమైన మేత వేస్తూ మచ్చిక చేసుకొని మన మాట వినేటట్లుగా దానిని ఎలా వశ పరుచుకొంటామో.... అలాగే మనస్సును గూడ మనము ఆధీనము చేసుకోవాలి. ధ్యానములో దాని ఆలోచనలు అది చేస్తుంది. మన నిగ్రహశక్తితో దానిని ఆలోచనలు తగ్గిస్తూ.... శూన్యత భావ స్థితికి చేరుకోవాలి. అంటే ఒక చేతిరుమాలులోని ప్రోగులు ఒక్కొక్కటిగా తీసుకొని పోతుంటే ఎలా అయితే రుమాలు ఆకారము కాస్త నిరాకారమవుతుందో అలా మనస్సుగూడ తన యదార్ధ స్థితియైన రూపం లేని స్థితి చేరుకోవాలి. అంటే రూపములేని మనస్సు రూపమున్న వస్తువుల మీద ప్రేమ,మోహ,వ్యామోహాలలో పడి మనకి భావము,ఆలోచన,సంకల్పము,ఆశ,భయము,ఆనందము కల్గిస్తుంది. వాటిని మన ఇంద్రియాలు అదుపులో ఉంచుకుంటే మనస్సు కాస్త శూన్యము అవుతుంది. ఇదే నిజమైన ధ్యానరహస్యం. ఆ తర్వాత విముక్తి పధమైన మహా నిర్యాణము పైన ధారణ చేస్తే అదియే శాశ్వత విముక్తి అవుతుంది. ఈ విధంగా సాధన చేసుకో. నీ జన్మ చరితార్ధము చేసుకో. ఈ జన్మ వృధా కానియ్యకుండా చేసుకో. పునఃజన్మ లేకుండా చేసుకో అని హితబోధ చేసి యధావిధిగా తను ధ్యాననిష్ఠలోనికి వెళ్లిపోయారు.

*** *** *** *** *** ***

నిర్వాణలామా బృందము కాశీక్షేత్రము చేరుకొని విభూధినాధ్ ఉండే ప్రాంత వివరాలు తెలుసుకొని ఆ ఇంటికి బయలుదేరి వెళ్ళారు.ఇల్లు చూస్తుంటే బయటి నుంచి పాడుబడిన బూత్ బంగ్లాలా కనిపించింది. అయిన వీళ్లంతా ఈ ఇంటిముందున్న గేట్ దగ్గరికి వచ్చేసరికి 40 సం. ల లోపల వయస్సు ఉండి బోడి గుండుతో ఉన్న ఒక వ్యక్తి ఈ గేట్ దగ్గరకి వచ్చి తలుపు తీయగానే వీళ్లంతాగూడ యధావిధిగా లోపలికి వెళ్లారు.

అక్కడ ఎదురుగా ఉన్న చిరిగిపోయిన సోఫా ఒకటి స్వాగతము ఇచ్చింది.దానిమీద వీరంతా కూర్చోగానే నోటిలో సిగార్ పెట్టుకొని ఒక వృద్ధ శాస్త్రవేత్తలాగా తేజస్సుతో కూడిన ముఖముతో హుందాగా ఒక వ్యక్తి మెట్లు దిగుతూ క్రిందకి రావడంతో

జేసి నిలబడి అంకుల్.బాగున్నారా?నేను జేసిని.అంబేద్కర్ కూతురిని అనగానే

జేసి.బాగున్నావా?నిన్ను చాలా చిన్నపుడు చూశాను.ఇపుడు చాలా  పెద్దదానివి అయినావు.ఏమి చేస్తున్నావు?మీ నాన్నకి లాగా పురావస్తు శాఖలో పనిచేస్తున్నావా?”

లేదు అంకుల్.నేను సి.బి.ఐ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను.ఈ మధ్యనే నాన్న గారు హత్య గావించబడి చనిపోయారు అనగానే

ఈ మాట విన్న ప్రొఫెసర్ ఒక్కసారిగా అక్కడే ఉన్న సోఫా మీద కూర్చొని ఉండిపోయాడు.

కొద్దిసేపటికి తేరుకొని

కంగారుపడకండి.ఏదైన హఠాత్ సంఘటన కాని సన్నిహితుల బాధాకరమైన విషయాలు తెలియగానే నా గుండె 18 సెకన్స్ పాటు పనిచెయ్యదు. సారీ.మీరందరిని ఇబ్బందిపెట్టినందుకు.అవును మీరంతా ఎవరు?” అనగానే

జేసి వెంటనే కలిపించుకొని అన్ని వివరాలు పొల్లుపోకుండా ఉన్నది ఉన్నట్లుగా ప్రొఫెసర్ కి చెప్పగానే

అంటే వాడి ప్రాణాలు పోతాయని మా ఇద్దరికి తెలుసు.మరి పరిశోధన చేసి తెలుసుకున్న విషయాలు అలాంటివి.మీకు నా పేరుతో పాటుగా మరి ఏదైన ఆధారముగాని పాస్ వర్డ్ గాని ఉన్నదా?” అనగానే  

నిర్వాణలామా అందుకొని కంటకము 147 అని ఉంది.బహుశా అది మీరు అడిగే పాస్ వర్డ్ అయ్యి ఉంటుంది అనగానే

లామాజీ.మేము గూడ అది పాస్ వర్డ్ అనుకున్నాము.కాని అది పనిచేయడము లేదు.అది తెలిస్తే గాని మేము చేసిన మణి శోధనలోని తప్పు ఏమిటో మాకు తెలిసేది.మేము ఈ మణి శోధనను ఒక అడుగు దూరముదాక పరిశోధించి మాకు గావలసిన పాస్ వర్డ్ దొరకక దొరికిన ఈ పాస్ వర్డ్ పనిచేయక మేము ముందుకి వెళ్ళలేకపోయాము.ఆ మణి ఎక్కడున్నదో అక్కడికి ఎలా వెళ్లాలో తెలుసుకున్నాము గాని మేమిద్దరము ప్రత్యక్షముగా అక్కడికి వెళ్లి ఆ మణిని చూడలేకపోయాము.అదే బాధ మా ఇద్దరిలో మిగిలిపోయినది.మీకు అయిన క్రొత్త పాస్ వర్డ్ దొరికినది ఏమో అనుకున్నాను.అందులో మనవాడు పాత పాస్ వర్డ్ పెట్టినాడు గదా.మాకు లాగానే మీరు గూడ అడుగు దూరములో ఈ మణిశోధనలో ఆగిపోతారు.మీకు గూడ అదే బాధ మిగిలిపోతుంది అని బాధగా చెప్పేసరికి  

అంకుల్.మీరు చేసిన ఈ మణి శోధన అన్ని వివరాలు పూసగుచ్చినట్లుగా మాకు చెప్పండి.ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి ఎరుక.మీరు చేప్పే విషయాలలో మాలో ఎవరికైన పాస్ వర్డ్ దొరకవచ్చుననే ఆశతో అడుగుతున్నాను అనగానే

జేసి.నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పడానికి నాకు అభ్యంతరములేదు.కాని మాకులాగా మీరంతా డిప్రెషన్ లోకి వెళ్ళగూడదు.మాకు ఈ షాక్ నుండి తేరుకోవడానికి కొన్ని సం.రాలు పైన పట్టినది.అయిన మీరు ఇంత ఇదిగా అడుగుతున్నారు గదా.అసలు ఈ మణి శోధన ఎలా ఆరంభమై ఎలా ఎక్కడ ఆగినదో నాకు గుర్తున్నంతవరకు చెపుతాను.అందరు సావధానముగా వినండి.మీకు ఏమైన సందేహాలు వస్తే అడగండి.అపుడే మేము చేసిన తప్పు ఏమిటో మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండే వీలుంటుంది అంటూ చెప్పడము ప్రారంభించినాడు.

ఈ విషయాలు అన్ని గూడ ఈ గదికి ఉన్న కిటికి అవతలివైపు ఒక 40 సం.లు వ్యక్తి అతి రహస్యముగా తన చెవిలో ఉన్న బ్లూ టూత్ ద్వారా వింటున్నారని వీళ్ళు ఎవరు గ్రహించలేదు.గ్రహించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

జరిగేది జరుగక మానదు.జరగనిది ఎన్నటికి జరుగదు గదా.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి