50 భాగం

 

50

4 . ప్రతి ఒక్కరిలో బుద్ధం, ధర్మం, సంఘం ఉన్నాయని తెలుసుకోండి. జ్ఞానం పొందడమే బుద్ధం. ధర్మము కలిగి ఉండడమే ధర్మం. ఈ ధర్మ రక్షణయే సంఘ రక్షణ అవుతుంది.

5 . ధ్యాన  లక్ష్యం పూర్ణ శూన్యస్థితిని పొందడమే .

6 . ప్రపంచం మారదు. మనమే మారాలి. మన దృష్టిలో మరియు అవగాహనలో మార్పురావాలి. మన మనస్సు మారితే ప్రపంచం మారినట్లే.

7 . శ్వాసపైన, మనస్సుపైన, శూన్యంపైన ధారణ చెయ్యాలి.

8. బాహ్యధ్యానాలలో చైతన్యం ఉంటుంది. అదే అంతర హృదయ ధ్యానములో ధ్యాన నిమగ్నమవుతుంది. అపుడే సర్వం ధ్యానమయం జగమంతా ధ్యానమయం

9 . ముందు శరీరం ఆపై మనస్సు ఆపై బుద్ధి మీద ధారణ చేస్తే పూర్ణ శూన్య స్థితికి చేరుకోగలము.

10 . లోభం, భయం, ఆశ, క్రోధం, అసూయ వాటికి కారణం అజ్ఞానం అని తెలుసుకో.

11 . ప్రపంచములోని వస్తు అశాశ్వతత్వాన్ని గుర్తించ కలిగితే `విముక్తి పొందవచ్చునని అజ్ఞానమాయలో చిక్కుకోకపోవడమే విముక్తియని తెలుసుకోండి.

12 . అజ్ఞానం తొలగించుకోకుండా మానసిక బలహీనతల్ని అధిగమించకుండా ఎవరు గూడ భవసాగరాన్ని దాటలేరు తద్వారా విముక్తి పొందలేరని తెలుసుకోండి.

13 . భ్రమలు, భ్రాంతులు, అజ్ఞానం, ఆశలు, భయాలు, లోభత్వము, క్రోధము, ద్వేషము, అసూయ, వాంఛలు లేనివాడే బుద్ధుడని తెలుసుకోండి.

14 . ఇతర ప్రాణుల్ని రక్షించడం మానవ ధర్మం ఇదియే అహింస అవుతుంది.

15 . మన హృదయాలు నిస్వార్ధ ప్రేమతో నింపితే బాధలుండవు. సుఖముంటుంది.

16 . పరస్త్రిని లేదా పరపురుషుడిని ఆశించడం పెద్ద తప్పు. వివాహ స్త్రీలు లేదా పురుషులు తప్పనిసరిగా పాతివ్రత్య ధర్మమును పాటించాలి

17 . కొన్ని అభిప్రాయాలకి, కొన్ని నియమాలకి, కొన్ని సిద్ధాంతాలకి, కొన్ని సాంప్రదాయాలకి కట్టుబడి ఉండటము ఆధ్యాత్మిక జీవితంలో పెద్ద అవరోధం.

18 . జ్ఞానానికి కులాలు, మతాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు అనేవి అడ్డురావు.

19 . చనిపోవడం అంటే నశించడం కాదని... ఏది నశించదని... మరణముతో దేనికది విడిపోతుంది తప్ప నశించదని... మరల జన్మించినపుడు మరణములో విడిపోయిన సప్తధాతువులు కలిసి ఒక రూపముగా ఏర్పడతాయని తెలుసుకోండి.

20 . మంచి సాధన స్థితిలో ఉన్నవారికి పగ, ద్వేషము, ప్రతీకారాలు, అహంకారం, గర్వము, మదముండవు.

*** *** *** *** *** ***

గురువులకే మహా గురువైన విశ్వగురువు శ్రీ దత్తాత్రేయ స్వామి అదే శ్రీ మహాచౌహాన్ దర్శన భాగ్యముతో నిర్వాణలామా బృందము అమిత ఉత్సాహముతో తక్లాకోట్ దగ్గర ఉన్న మాట్లాడే విగ్రహమూర్తి అయిన ఖోజార్ నాథ్ ఆలయానికి వీరంతా చేరుకున్నారు.

లోపల వీళ్ళకి సుమారుగా అయిదు అడుగుల సింహసనము మీద నాలుగు వెండి విగ్రహమూర్తులు ఎనిమిది అడుగుల ఎత్తు ఉండి నిల్చోని ఉన్నట్లుగా కనిపించాయి. వీటిని చూసిన నిర్వాణలామా మిగిలిన వారితో చూడండి.ఈ విగ్రహాలలో మధ్యలో ఉన్న విగ్రహమూర్తి మాట్లాడే ఖోజార్ నాథ్.ఈయన ప్రక్కన ఏడు అడుగుల ఎత్తులో ఉండి పసుపురంగు ముఖముతో ఉన్న విగ్రహమూర్తి మంజుఘోషుడు గాక ఈయనకి కుడివైపు ఉన్న ఏడు అడుగుల ఎత్తుండి శ్వేతరంగు ముఖముతో ఉన్న విగ్రహమూర్తి అవలోకితేశ్వరుడైతే ఇక ఖోజార్ నాథ్ కి ఎడమవైపు ఏడు అడుగుల ఎత్తు ఉండి నీలిరంగు ముఖము ఉన్న విగ్రహమూర్తి వజ్రపాణి విగ్రహము అంటూ..అవును..మీరు ఒక విషయము గమనించారా? ఖోజార్ నాథ్ కి ప్రక్కనే ఉన్న ఈ మూడు విగ్రహాల ముఖాలు వరుసగా పసుపు,తెలుపు,నీలిరంగు ఉన్నాయి గదా.మనము వెతికే చింతామణి తెలుపు,నాగమణి లేతనీలముగా,రుద్రమణి పసుపు లేదా బంగారపు రంగులోనే ఉంటాయి.అంటే ఈ విగ్రహముఖ రంగులతో మణులు రంగులు ఎలా ఉంటాయో లోకానికి తెలియచేసినారు అన్నమాట అంటుండగా

ప్రకృతి వెంటనే స్వామి.. మాట్లాడే ఖోజార్ నాథ్ విగ్రహమూర్తి గూర్చి చెప్పండి?” అనగానే

ప్రకృతి..హైందవధర్మము ప్రకారం చూస్తే ఈయన మహాకాలుడు.ఈయన కోసము విశ్వకర్మ ఇక్కడ ఒక దేవాలయము కట్టించాడని అలాగే రహస్యగ్రామాలకి దారి చూపటానికి మనకి గంధర్వుడు,యక్షుడు ఉంటారని సూచనగా ఈ రెండు విగ్రహాలు కూడ ఈయన తయారు చేసి పెట్టాడని పురాణగాథ చెపుతోంది.అదే బౌద్ధధర్మము ప్రకారము చూస్తే ఈయన జాంబ్యంగ్ బుద్ధుడిగా కొలువడము జరుగుతోంది.వీరి గాథ ప్రకారము అయితే పూర్వము ఒక వృద్ద లామాకి ఒక శిష్యుడు ఉండేవాడు.ఇతను రాత్రిపూట దగ్గరలో ఉన్న కన్నాలీ నది నుండి నీళ్ళు తెచ్చే అలవాటు ఉంది.ఆ సమయములో ఈ నది ఒడ్డున ఇసుక తిన్నెల మీద ఒక కాంతిపుంజము పడుతూ ఉండటము ఇది పగటిపూట కనిపించకపోవడము ఇతను గమనించి తన గురువుకి చెప్పగానే అయితే నువ్వు ఆ కాంతిపుంజము కనిపించినచోట రాళ్ళను ఒక గుట్టగా పెట్టు అని చెప్పిగానే ఇతను ఆ రాత్రి ఇలాగే చెయ్యగానే మరుసటి ఉదయము కల్లా ఈ రాళ్ళు కాస్త ఒక పెద్దరాయిగా మారిపోయిన విషయము ఇతను గమనించి గురువుకి చెపితే కంగారుపడకు.ఆ కాంతిపుంజము జాంబ్యంగ్ ఆత్మరూపమని అది అలా ఏర్పడటానికి ఏదో మనకి తెలియని మర్మరహస్యముండి ఉండాలి.దీనికి కాలమే సమాధానము చెపుతోంది అని వివరించాడు.

ఇది ఇలా ఉంటే ఆ రాజ్యమును పరిపాలించే రాజు దగ్గరికి ఏడుగురు సన్యాసులు వచ్చి తాము తెచ్చిన ఏడు సంచుల వెండి నాణెముల మూటలను ఈ రాజు కిస్తూ "రాజా.మళ్ళీ మీ దగ్గరికి ఏడు సం.రాల లోపు వస్తాము.ఒకవేళ మేము రాకపోతే ఈ నాణెములను మీ కోరిక మేర వినియోగించుకోవచ్చును అని చెప్పి వెళ్ళిపోయారు.ఇలా వీళ్ళు తొమ్మిది సం.రాల రాకపోతే ఈ రాజు వీటిని ఒక శిల్పికి ఇస్తూ ఒక దేవతవిగ్రహమును తయారు చెయ్యమని ఆజ్ఞ ఇవ్వడముతో..ఈ శిల్పి ఈ వెండినాణెలను కరిగించి ఒక పోతగా పోస్తుండానే ఉన్నట్టుండి ఈ వెండిపోత కాస్త జాంబ్యంగ్ విగ్రహముగా తనంతట అదే రూపాంతరము చెందిన విషయము తెలుసుకున్న రాజు వెంటనే ఇలా మారిన విగ్రహమును కార్డుంగ్ ప్రాంతములో ప్రతిష్టించాలని ఒక రథములో ఎక్కించుకొని అటువైపుగా బయలుదేరుతుండగా..సరిగ్గా ఈ రథము కాస్త అపుడుకే జాంబ్యంగ్ ఆత్మ నిర్మిత రాయి దగ్గరికి రాగానే ఈ ఆత్మరాయి నుండి ఖోర్-ఛాక్ అని పలికింది.అనగా నేనిక్కడకి వచ్చాను.ఇక్కడే ఉంటాను అని ఈ మాటలకి అర్ధం.దానితో ఈ రథము ఆగిపోవడము..ఆపై ఈ ఆత్మరాయి నుండి ఒక మెరుపుకాంతి ఈ వెండి విగ్రహములోనికి వెళ్ళిపోవడము ఏకకాలములో జరిగింది.

నేనిక్కడకు వచ్చాను-ఇక్కడే ఉంటాను మొదటి మాట అయితే ఆ తర్వాత మాప్ ఛూ అనగా నది పొంగుతుంది అని..ఆ తర్వాత ఓరీ మహా పాపాత్ముడా అని ఆ తర్వాత నాకు సాష్టాంగ నమస్కారము చేస్తే మీకు సంతానప్రాప్తియని ఆ తర్వాత మంత్రించిన కాగిత పక్షి యంత్రము ఉంచాడు తీసివేయండి అని ఆ తర్వాత తన పోయిన పద్మం స్ధానే కొత్త పద్మం పెట్టమని కోరడము జరిగింది. ఇలా ఈ విగ్రహము ఇపుడిదాకా 6 సార్లు మాట్లాడింది.ఇక 7 సార్లు అనగా మొత్తము 13 సార్లు మాట్లాడము పూర్తి అయితే ఈ విశ్వానికి విశ్వప్రళయము వస్తోందని బౌద్ధ ఇతిహాసాలు చెపుతున్నాయి అనగానే

ఆనందభిక్షువు వెంటనే గురూజీ.అంటే ఈ దేవాలయము హైందవ-బౌద్ధ ధర్మ మిళిత దేవాలయము అన్నమాట అనగానే అవునని నిర్వాణలామా సమాధానము చెపుతూ అక్కడ దేవాలయ గోడలకి ఉన్న కుడ్యచిత్రాలను చూస్తుంటే అతడికి ఒక పులిని బంధించి తీసుకొని వెళ్ళుతున్న బలిష్టుడి కుడ్యచిత్రము మీద దృష్టి పెట్టి చూస్తోంటే

ఆనందభిక్షువు వెంటనే గురూజీ.ఆ చిత్రములో ఏముంది అనగానే

మిత్రమా…. ఈ కుడ్యచిత్రము చూస్తూంటే నాకు కాలచక్రములో గోపురాలను మోసే బలిష్టు వ్యక్తి గుర్తుకు వచ్చాడు.అంటే ఈ చిత్రము ఇక్కడ ఉంది అంటే మనము మనకి తెలియకుండానే రెండు పురాలు అనగా మంచుపులి దర్శనం,మహాచౌహన్ దర్శనం బట్టి మనము రెండు పురాలు దాటి ఈ బలిష్టు వ్యక్తి మనకి దర్శనమైతే మూడవపురము అలాగే దేవతపుప్పాల వనాలు దర్శనమైతే నాలుగువ పురమును చేరుకున్నట్లే అన్నమాట.ఈ లెక్కన కాలచక్రములోని 16 స్తంభాలలో నాలుగు స్తంభాలలో నల్లటి కత్తులు అనేవి జంతువుల రాకను అలాగే మరో నాలుగు స్తంభాలలో ధర్మచక్రములు ఉంటే ఇవి మహాచౌహన్ దర్శనానికి సంకేతము అయితే మిగిలిన ఎనిమిది స్తంభాలలోని నాలుగు తెల్లని పద్మాలు,నాలుగు ఎరుపు రత్నాలు బట్టి చూస్తే ఇందులో తెల్లని పద్మాలు అయితే దేవత పుష్పాలు అనుకుంటే ఇక రత్నాలు అనేవి ఇవి ఉన్న రహస్యగ్రామాలకి మనము చేరుకున్నట్లే.ఇపుడు మనకి బలిష్టుడు అలాగే దేవతపుష్పాల వనాల దర్శనమైతే మనము మణుల దగ్గరికి చేరుకున్నట్లే అంటూ అయిన మనకి ఈ  ఖోజార్ నాథ్ అనుగ్రహము ఇంక లభించలేదు గదా.లభించి ఉంటే ఆయన చేతినుండి మనకి బంగారు మణిపద్మము వచ్చేది కదా.ఇది వచ్చేవరకు మనము ఎదురుచూడక తప్పదు అంటూ నిర్వాణలామా మరియు ప్రకృతి మాత్రమే గుడి నుండి బయటికిరాగా

ఆనందభిక్షువు బయటికి రాకపోయేసరికి నిర్వాణలామాలో ఏదో అనుమానభయము మొదలు అవ్వడముతో లోపలకి వెళ్ళేసరికి ఆనందభిక్షువు లోపలే ఉండి ఖోజార్ నాథ్  విగ్రహమూర్తి చేతిలో ఉన్న బంగారుపద్మము కేసి తదేకముగా చూస్తూ ఏదో తెలియని తన్మయత్వమును పొందుతూ

స్వామి..మేమంతా నీ అనుగ్రహము కోసము ఇక్కడి దాకా వచ్చాము.కాని నీ అనుగ్రహ ఫలమైన నీ చేతిలోని బంగారు పద్మము మాకు అనుగ్రహించి ఇవ్వాలి గదా.పైగా నువ్వు సజీవమూర్తివని..మాట్లాడతావని మా గురూజీ నాతో చెప్పారు.కాని నిన్ను చూస్తోంటే అలా అనిపించడము లేదు.మీ మణిపద్యము లేకపోతే మేము ముందుకి వెళ్ళలేము.దాంతో మాకు ఎపుడికి చింతామణి తీర్ధము లభించదు.ఇది అందకపోతే మా గురుమాత ఆరోగ్యము కుదటపడదు.తద్వారా ఆమె శూన్యతభావము దాటలేక తీవ్రమైన ఉన్మాదస్ధితిలో భౌతిక మరణము అకారణముగా పొందవలసి ఉంటుంది.ఇదింతా జరగకుండా ఉండాలంటే నీ బంగారు పద్మము గావాలి.కాని అది నీవు మాకు ఇచ్చేటట్లుగా లేవు.కాబట్టి ఈ పద్మమును నేనే తీసుకుంటాను అంటూ

ఏదో తెలియని ఆవేశ ఉన్మాదములో అనుకోనివిధంగా అనుకోకుండా ఖోజార్ నాథ్ విగ్రహము చేతిలో ఉన్న బంగారు మణిపద్మము ఇతను బలవంతముగా లాక్కుతున్న దృశ్యమును చూసిన

నిర్వాణలామా వెంటనే మిత్రమా..ఆగు..నీవు అలా చెయ్యకూడదు.ఆయన అనుగ్రహమును పొందవలసిన చోట ఆగ్రహమును పొందుతావు.ఆగు.నీవు చేస్తున్న పని మంచిది గాదు.విశ్వానికి అనర్ధము అంటున్నగూడ ఈ మాటలు విని గూడ ఆనందభిక్షువు పట్టించుకొనే స్ధితిలో చేసేపని ఆపే స్ధితిని అపుడికే దాటిపోయి అతి ఉన్మాదస్ధితిలో ఈ విగ్రహము చేతిలో ఉన్న పద్మమును బలవంతముగా పెకలించడము

దానితో ఈ విగ్రహమూర్తి కాస్త ఇంతడితో నీ ఆయువు తీరింది అనగానే ఈ మాటలు విన్న ఆనందభిక్షువు ఆనందపడుతూ గిల్లాగిల్లాడుతూ ఈ విగ్రహము ముందే రక్తము కక్కుకొని నేల ఒరిగి చేతిలో పద్మమును పట్టుకొని తనవైపు వస్తున్న నిర్వాణలామా వైపు ఆనందచూపు చూస్తూండగా.. నిర్వాణలామా అక్కడికి చేరుకొని ఇతని తలను చేతిలో తీసుకొని కొన ఊపిరితో ఉన్న ఆనందభిక్షువుతో

మిత్రమా.ఎంత పని చేశావు మా కోసము ఎంత పెద్ద పొరబాటు చేశావు.నీకు గుర్తు లేదా?మనకి దొరికిన కాలచక్రయంత్రములోని దేవతాపుష్పాలు ఆయనికి సమర్పిస్తే ఆయన అనుగ్రహమును పొందవచ్చును గదా.ఇది నేను మనమంతా భిక్ష పూర్తిచేసుకొని వచ్చి చేద్దామని అనుకొనే లోపలే నువ్వు తొందరపడి ఈ అవివేక పని చేశావు.మాకు దూరమయ్యే పరిస్ధితిని తెచ్చుకొన్నావు అని అంటూండగానే

నన్ను క్షమించండి అంటూ సైగ చేస్తూ ఆనందభిక్షువు ప్రాణాలు గాలిలోనికి వదిలేశాడు.

దానితో ఇతని చేతిలో ఉన్న పద్మము నేలమీద పడేలోపులే అది గాలిలో ఎగురుకుంటూ మళ్ళీ యధావిధిగా ఈ విగ్రహమూర్తి చేతికి చేరడము  చేసేదేమి లేక ఆనందభిక్షువు శవమును ఈ ఆలయము నుండి వైర్యాగ్యభావముతో మౌనముగా తీసుకొని  వస్తొంటే ఇది చూసిన ప్రకృతి తన మనస్సులో మనిషితో బయటికి రావాలసినవాడు శవముతో వస్తూండేసరికి ఏదో తెలియని ఆందోళతో నిర్వాణలామాను సమీపించి శవముగా మారిన తన కుమారుడుతో సమానమైన ఆనందభిక్షువు శవమును చూస్తూ అసలు ఏమి జరిగినదో నిర్వాణలామా చెపుతూంటే స్మశానవైరాగ్యముగా అదోలా చూస్తూండగా

ఇంతలో అక్కడికి కొంతమంది టిబెట్ లామాలు వచ్చి స్వామి.మీ చేతిలో ఉన్న బౌద్ద సన్యాసి శవమును మాకు ఇవ్వండి.ఇక్కడ మంచు పర్వతాలలో శవ దహనము చెయ్యడానికి అవకాశముండదు గదా.  అందుకని మేము ఈ శవమును ముక్కలు ముక్కలుగా కోసి ఆకలిగా ఉన్న మూగజీవాలైన గ్రద్దలకి,రాబందులకి,రేచు కుక్కలకి ఆహారముగా వేస్తాము అనేసరికి నిర్వాణలామా ఏమాత్రము కాదనకుండా వారికి ఈ శవమును అప్పగించి

అక్కడే ఉన్న ప్రకృతిని తీసుకొని

లోపలకి ఖోజార్ నాధ్ విగ్రహము ముందు ప్రకృతిని ఉంచి..తన చేతి సంచి లోంచి కాలచక్రయంత్రములో ఉన్న రెండు దేవతాపుష్పాలను ప్రకృతి చేతికిస్తూ స్వామికి సమర్పించమనగానే ఆమె అలా చెయ్యగానే నిర్వాణలామా ఆవేశము పొందుతూ

స్వామి.నువ్వు ఈ విధముగా నా మిత్రుడు మీద ఆగ్రహించినందుకు ఎలాంటి కోపము అలాగే బాధ లేదు.ఈ విధముగా ఒక జీవికి విముక్తి కల్గించావు.పైగా వాడి శవముగూడ వృధా కాకుండా ఆకలిగా ఉన్న జీవులకి ఆహారముగా అవుతోంది.ఆహారజీవిగా పుట్టి ఆహారము కోసము ఆలమటించి ఆహారముగా మారిపోయాడు.ఇక నీ ముందున్న ఈమెను ఏమి చేస్తావో నీ ఇష్టం..ఆమెను అనుగ్రహిస్తావో లేదా ఆగ్రహిస్తావో నీ చేతులలోనే ఉంది.ఏది జరిగిన అంతా మన మంచికే అనుకుంటున్నాను అనగానే

ఉన్నట్టుండి ….  

ఈ విగ్రహా పాదాల మధ్య మణి కాంతికిరణాలు బయటికి ప్రసరిస్తూండగా అందులోంచి సుగంధభరితమైన సువాసనాలను వెదజల్లుతూ బంగారపు రంగుతో మెరిసిపోతున్న ఒక మణిపద్మము కాస్త గాలిలో తేలియాడుతూ నిర్వాణలామా చేతికి రావడము దీనిని అందుకొని వీరిద్ధరు ఈయనకి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ ఆలయము నుండి బయటికి వచ్చి అటునుండి తమ చేతిలో ఉన్న రూట్ మ్యాప్ ఆధారముగా కైలాస పర్వతము వైపు బయలుదేరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి