52 భాగం

 

52

41 . బద్ధకం, సోమరితనం, నిర్లక్ష్యం, విషయవాంఛలు సాధన ప్రగతికి నిరోధకాలు.

42 . జనన మరణాలకు కారణం అజ్ఞానం. ఆత్మసంస్కారం కలుగడమే జ్ఞానం.

43 . మనిషి కోపానికి ద్వేషానికి కారణం దరిద్రం, స్వార్ధం అని  తెలుసుకోండి.

44 . జ్ఞాన మార్గ ప్రయాణంలో ప్రాపంచిక ప్రలోభాలకు లోను కాకూడదు.

45 . మనం ధ్యానం చేసేది మన కోసమే కాదు. మన ధ్యాన జ్ఞానం ఇతరులను జ్ఞానం వైపు మళ్లించే విధంగా కావాలి. ఉండాలి. ఇక నా ఆఖరి జ్ఞానబోధ పూర్తీయింది.మీలో ఏమైనా సందేహలుంటే అడగండి అనగానే

అనంతరం కాలాములు అనే పెద్దలు లేచి ‘‘భగవాన్‌ మీరు చెప్పింది బాగానే ఉంది. మీలాగే ఎందరో శ్రమణులు ఇక్కడ ఉన్నారు. ఎవరి విధానం వారు చెబుతున్నారు. దీనిలో ఏది సరైనదో, మేము దేన్ని ఆచరించాలో మాకేమీ పాలుపోవడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి?’’ అని అడిగారు.

నేను వెంటనే వారితో ‘‘కాలాములారా. కలవరపడకండి. మీ సమస్యకు పరిష్కారం మీ చేతుల్లోనే ఉంటుంది’’ అనగానే

‘‘అయితే, భగవాన్‌. మేము దేన్ని నమ్మాలో, దేన్ని విడవాలో సెలవియ్యండి’’ అని కోరారు.

‘‘కాలాములారా. ఏ విషయాన్నయినా సరే... ‘ఇది తరతరాలుగా వస్తోంది కాబట్టి నమ్మాలి’ అని నమ్మకండి. ‘ఎన్నెన్నో గురు పరంపరలుగా దీని బోధన జరుగుతోంది కాబట్టి నమ్మాలి’ అని నమ్మకండి. ‘ఈ సిద్ధాంతం చెప్పేవాడు చాలా గౌరవనీయుడు, గొప్పవాడు. కాబట్టి దీన్ని నమ్మి తీరాలి’ అని నమ్మకండి ‘ఈ విషయం ఒక గొప్ప గ్రంథంలో ఉంది. ఆ గ్రంథం చాలా పవిత్రమైనదిగా పరిగణన పొందుతోంది. కాబట్టి నమ్మాల్సిందే.’ అని నమ్మకండి. ‘ఈ విషయం చెప్పినవాడు చాలా అనర్గళంగా చెప్పాడు. అతని కంఠం గంభీరంగా ఉంది. మధురంగా ఉంది. అతను చాలా అందగాడు. స్ఫురద్రూపి. అలాంటి వాడు చెప్పాడు కాబట్టి నమ్మాలి’ అని నమ్మకండి. కాలాములారా. జ్ఞానం మాత్రమే నిజమైనది. దాన్ని మీకు మీరుగా సాధించుకోవాల్సిందే. నిజాన్ని ఎప్పుడూ సందేశాల ద్వారానో, ప్రవచనాల ద్వారానో నిగ్గు తేల్చుకోలేం. జీవితానుభవం ద్వారానే అది సాధ్యం. కాబట్టి, ఎవరు ఏమి చెప్పినా మీరు మీ జీవితాచరణ ద్వారా ఏది నిజమైనదో, ఏది నమ్మదగినదో నిర్ణయించుకోండి’ అని అన్నాను.

నేను చెప్పిన సమాధానం విని అందరి మనసులు కుదుటపడ్డాయి. కానీ ఒక యువకుడు లేచి ‘‘భగవాన్‌. మరి మీరు చెప్పే సందేశాల్ని?’’ అని అడిగాడు.

‘‘నేను చెప్పినదైనా సరే. మీ అనుభవానికి అందితేనే స్వీకరించండి’’ అని అన్నాను.

భగవాన్‌..బహుశా వేల సంవత్సరాల తాత్త్విక చరిత్రలో ఇలా చెప్పిన మరొక జ్ఞాన సింధువును ఈ నింగీ నేలా, నీరూ నిప్పూ, గాలీ చూడనే లేదు. అంటూ ఆ యువకుడు నాకు ప్రణమిల్లాడు.

*** *** *** *** *** ***

నిర్వాణలామా తన చుట్టూ పరిసరాలను ఒకసారిగా పరిశీలించి చూస్తూ... ఇప్పుడు మనము ఎవరెస్టు శిఖరానికి వాయువ్య దిశలో ఉన్నాము. నాకు తెలిసి ఈ దిక్కుగా మనము అర మైళ్లు వెళ్ళితే మనకి గావలసిన మనము అనుకున్న స్పటిక పర్వతము వస్తుంది. అని చెప్పగానే ప్రకృతికి ఆనందమేసింది. ఇక్కడ నుండి వీళ్లు 13 రోజులపాటు అనేక అవాంతరాలు , వింతలు , విశేషాలు దాటుకుంటూ... ఈ చోటుకి చేరుకున్నారు. ఇంతలో నిర్వాణ లామా చిరునవ్వు నవ్వుతూ " అదిగో అల్లదిగో మనకు గావలసిన మంచులాంటి స్పటిక పర్వతము అయిన మన కైలాస పర్వతము" అనగానే....

ప్రకృతి ఆసక్తిగా అటువైపుచూడగా...  హిమాలయపర్వతాలు... అష్టాదశ పద్మాకారములో మణి పద్మములాగా... ఒక మంచు పర్వతము లీలగా వీళ్లకి కనబడింది. దానితో

ప్రకృతి ఎంతో తన్మయత్వముగా అతిసమీపముగా ఈ కైలాస పర్వతము కేసి నమస్కారభక్తితో చూస్తూండగా ఆమెకి ఈ పర్వతము గూర్చి తెలుసుకోవాలని అనిపించి

స్వామి.ఈ కైలాస పర్వత విశేషాలు గూర్చి చెప్పగలరా?”

ప్రకృతి..ఈ కైలాస పర్వతము చూడటానికి ఒక పిరమిడ్ నిర్మాణములాగా కనపడుతుంది.అలాగే ఈ పర్వతమును ఎవరైనా నిశిత దృష్టితో చూస్తే మనకి ఈ పర్వతశిఖరము మీద ఎద్దు ముక్కురంధ్రాలు,చెవుల ఆకారము కనపడుతుంది.దీనికి కారణము మహాభారతములో ఒక కధ  చెపుతుంది.అది ఏమిటంటే పంచపాండవులు హిమాలయలకి వచ్చి సదాశివుడి జాడ తెలుసుకోవాలని విశ్వప్రయత్నాలు చెయ్యడము ప్రారంభించారు.ఈ విషయము తెలుసుకున్న సదాశివుడు వెంటనే ఒక పెద్ద ఎద్దుగా మారి అక్కడ ఉన్న పశువుల మందలో కలిసిపోవడము భీముడు గమనించి తన శరీరమును అమాంతముగా భారీగా పెంచి తన రెండు కాళ్ళను రెండు పర్వతాలమీద ఉంచి తన పంగాలో అక్కడ ఉన్న పశువుల మందను తొలమని మిగిలిన వాళ్ళకి చెప్పగానే వాళ్ళు చెయ్యగానే ఒక మానవుడి కాళ్ళ సందులోంచి వెళ్ళడము ఇష్టములేక ఆ పెద్ద ఎద్దు ఉన్నచోటులోనే భూమిలోనికి చొచ్చుకొని పోవడము ఆరంభించి తల కాస్త కైలాస పర్వతముగానే దీని మూపురము అనేది కేదార్ నాథ్ గా ప్రసిద్ధి గాంచినదని పురాణగాథ.అలాగే ఈ పర్వతమును చూసే శివుడికి చిహ్నముగా శివలింగమును ఉంచిఉంటారని అనిపిస్తుంది.ఈ పర్వత తూర్పుముఖము స్ఫటిక నిర్మితమని..పడమర ముఖము మాణిక్య నిర్మితమని..ఉత్తర ముఖము అయితే స్వర్ణ నిర్మితమని..అదే దక్షిణముఖము అయితే నీలమణి నిర్మితమని..అదేవిధముగా కాలానుసారముగా మనకి ఈ పర్వతము ఈ నాలుగు రంగులలో కనపడుతూ అందరిని ఆశ్చర్యానందాలకు గురిచేస్తుంది.అలాగే ఈ శిఖరముపైన మనకి మృందగం,గంట,తాళం,శంఖం అనే ఈ నాలుగు నాదాలు వినబడుతుంటాయి.ఈ శిఖరము మీద మనకి ఎన్నో దివ్యశక్తులు ఇచ్చే మొక్కలు అనగా అమరత్వమును,త్రికాలజ్ఞానము,సంజీవిని,పరశువేది వేరు ఇలా ఎన్నో ఉన్నాయని మన వృద్ధ లామాల పరిశోధనలో తెలుసుకున్నారు.పైగా ఈ పాదాల చెంతన నరవానర రూపములో అనగా వానరయతిగా భగవాన్ హనుమ రక్షకుడిగా ఉంటారని వీళ్ళు ధ్యానానుభవాలు పొందారు.అంతెందుకు మన బౌద్ధధర్మ గ్రంథాలు ప్రకారము ఈ పర్వతము మీద మన భగవాన్ అవలోకితేశ్వరుడు తనకి సంబంధించిన 500 దేవతలు చొప్పున 990 వరుసలలో  కూర్చుంటారని వచనము. ఈ పర్వత నాలుగు ముఖాలను నిశిత దృష్టితో చూస్తే మనకి ఎద్దు,ఏనుగు,సింహము,గుర్రం ముఖాలుగా కనపడతాయి.పైగా ఇక్కడి వాతావరణము మిగిలిన చోట్ల కన్నా భిన్నముగా ఉంటుంది.అందువలన ఇక్కడున్న వారికి వేరే ప్రాంతాలలో ఉండేవారికి ఒకరోజులో పెరిగే గోర్లు,వెంట్రుకలు,వృద్దాప్యం ఇక్కడ ఉన్నవారికి ఒక గంటలో పెరుగుతుందని మన శాస్త్రవేత్తలు పరిశోధనలో తెలుసుకున్నారు.ఇలాగే నా పరిశోధనలో ఈ పర్వతము గూర్చి ఎన్నో నిగూఢ రహస్యాలను తెలుసుకున్నాను.అది ఏమిటంటే భూమిని కేంద్రముగా తీసుకొని ఈ శాన్య మూలకి ఈ అక్షాంశ రేఖను గీస్తే మనకి ఈ కైలాస పర్వతము వస్తుంది.దీని ఆధారముగా వాస్తుశాస్ర్తములో ఈశాన్యదిక్కులో ఈశ్వరుడు ఉంటారని మన పూర్వీకమహర్షులు చెప్పడము జరిగింది.అలాగే ఈ పర్వతము ఉన్న చోటు నుండి కిందకి భూకేంద్రముగా మీదగా ఒక సరళరేఖను గీస్తే భూమికి రెండవవైపు మనకి ఈస్ర్టన్ ఐలాండ్ వస్తుంది.అలాగే ఈ పర్వతము నుండి ఈజిప్షియన్ పిరిమిడ్లు వరకు ఒక సరళ రేఖ గీచిన అంతే విచిత్రముగా మనకి రెండో వైపు ఈస్ర్టన్ ఐలాండ్ వస్తుంది.అంటే కైలాస పర్వతము నుంచి ఈ పిరమిడ్లు మధ్య దూరము అలాగే ఈ పర్వతము నుంచి ఈస్ర్టన్ ఐలాండ్  మధ్యదూరంలో నాలుగో వంతు ఉంటుంది.అలాగే ఈస్ర్టన్ ఐలాండ్ నుండి మెక్సికన్ పిరమిడ్లు మీదుగా ఒక వలయాన్ని గీస్తే అది అంతే విచిత్రముగా ఈ కైలాస పర్వతము వస్తుంది.ఇపుడు ఈ రెండింటి మధ్యదూరము కొలిస్తే కైలాస పర్వతము నుంచి ఈజిప్షియన్ పిరమిడ్ల మధ్యదూరము అలాగే మెక్సికన్ పిరమిడ్ల నుంచి ఈస్ర్టన్ ఐలాండ్ మధ్యదూరము సమానము అవుతుందని నేను తెలుసుకొని ఆశ్చర్యచెందాను.అలాగే కైలాస పర్వతము నుండి స్టోనెంజ్ కలుపుతూ ఒక వలయమును గీస్తే అదిగూడ ఈస్ర్టన్ ఐలాండ్ ను సూచిస్తుంది.అంటే ఈ పర్వతము నుంచి స్టోనెంజ్ వరకు గల దూరము మరియు ఈ కైలాస పర్వతము నుంచి ఈస్ర్టన్ ఐలాండ్ వరకు గల దూరములోనాలుగో వంతు ఉంటుంది.అలాగే కైలాస పర్వతము నుంచి స్టోనెంజ్ మీదుగా ఈస్ర్టన్ ఐలాండ్ వరకు సాగుతున్న వలయము మీద ఈస్ర్టన్ ఐలాండ్ ప్రాంతములోని మూడోవంతు దూరంలో ఒక చుక్క పెడితే అక్కడ మనకి బెర్ముడా ట్రయాంగిల్ కనపడుతుంది.అంటే దీనికి అలాగే మన కైలాస పర్వతమునకు మనకి తెలియని మర్మమున్నదని నాకు అనిపించి మరింత లోతుగా పరిశోధన చేస్తే దిమ్మతిరిగే విషయాలు తెలిసినాయి.అది ఏమిటంటే మన కైలాస పర్వతము ఎత్తు 6714 మీటర్లులని లోకవిదితమే గదా.సరిగ్గా ఇదే కొలత మనకి అనగా 6714 కి.మీలుగా కైలాస పర్వతము నుంచి స్టోనెంజ్ వరకు ఉంటుంది.అలాగే స్టోనెంజ్ నుండి బెర్ముడాట్రయాంగిల్ వరకు ఉన్న దూరము కూడ 6714 కి.మీ. అయితే ఈ ట్రయాంగిల్ నుండి ఈస్ర్టన్ ఐలాండ్ వరకు ఉన్న దూరము గూద 6714 కి.మీ.లు.అలాగే ఉత్తర ధృవము నుంచి మన కైలాస పర్వతము వరకు ఉన్న దూరము గూడ 6714 కి.మీ.లు అంటే ఈ లెక్కన చూస్తే కైలాస పర్వతము ఎత్తు మీటర్లులలో ఉన్నదే మిగిలినవి అదే కొలత కి.మీలుగా నిర్మాణాలు నిర్మించి ఉండటము బట్టి చూస్తే మన పూర్వీక మహర్షులకి ఎంతటి అనుభవ గణితశాస్ర్తము మీద పట్టు ఉన్నదో మనకి తెలుస్తోందో గదా.ఇంతటి టెక్నాలజీని వీళ్ళు ఈ పర్వతములో అగర్తల,శంభల గ్రామాలను రెండు పిరమిడ్లు నిర్మాణముగా చేసి దాచి ఉంచారని నా పరిశోధనలో తెలుసుకున్నాను.  అంతెందుకు ఋగ్వేద కాలము నాటి వేదజ్ఞానము నుండి ఇపుడున్న ఆత్యాధునిక టెక్నాలజీకి కొన్ని లక్షల కోట్ల సం..రాల అడ్వాన్స్ టెక్నాలజీ వీళ్ళు ఈ గ్రామాలలో ఉంచినారని నేను తెలుసుకొన్నాను. నాకు ఆశ్చర్యానందాలు కల్గినాయి. అనగానే..

స్వామి మణిపద్మము అంటే స్ఫటిక మణి అని అన్నారుగదా.నిజానికి మన బౌద్ధలామాలు స్ఫటికముతో చేసిన వస్తువులకి ఎందుకు ప్రాముఖ్యతనిచ్చారు?”అనగానే

నిర్వాణలామా వెంటనే "ప్రకృతి.జలము అనేది మనస్సుకి సంకేతము.ఎందుకంటే ఇది గూడ మనస్సు లాగా జలము గూడ చంచలమైనది గదా.అదే జలము నుండి పుట్టిన స్ఫటికము మాత్రము నిశ్చలమైనది పైగా తన నుండి కాంతిని అటు నుంచి ఇటు ప్రసరింపచేసుకొనే నిర్మలమైనది.అందుకే మన మనస్సుగూడ స్ఫటికములాగా నిర్మలముగా,నిశ్చలముగా ఉండాలని లోకానికి తెలియచెయ్యటానికి స్ఫటిక నిర్మిత జపమాలలు,పూసలు,శివలింగాలు,శ్రీచక్రాలు నిర్మించిప్రజలకి అందుబాటులో ఉంచారు.అంతే కాకుండా స్ఫటికానికి కాంతిప్రసార గుణమే కాకుండా వీటికి విద్యుత్ అయస్కాంత శక్తులు ఉన్నాయని ఈ నాటి శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.అలాగే వీటిని నిత్యము ధరించడము వలన మనలో ఉన్న అధికవేడిని ఇవి తీసుకొని మనకి చల్లదనమును ఇస్తాయి మరియు మనలో ఉన్న అతి చల్లదనమును ఇవి గ్రహించి అవి మనకి వేడిని ఇస్తాయి.ఈ గుణము మనకి నవరత్నాలలో,నవమణులలో కనిపించదు.అందువల్లన స్ఫటికముతో చేసిన దైవికవస్తువుల వాడకము వలన మనలోని నెగెటివ్ శక్తి తగ్గి పాజిటివ్ శక్తి పెరిగి మానవుడు కాస్త మాధవుడవ్వక తప్పదని మనపూర్వీక మహర్షులు తెలుసుకొని స్ఫటికవస్తువులకి ప్రాముఖ్యతనిచ్చారు అనగానే

స్వామి.స్ఫటికమునకు అలాగే గాజుకి తేడాలు ఏమిటి?అలాగే నిజమైన స్ఫటికమును గుర్తించడము ఎలా అనగానే...

ప్రకృతి ఈ రెండు చూడటానికి దూరము నుంచి ఒకలాగానే కనపడతాయి.కాని వీటిలో స్ఫటికమును గుర్తించాలంటే ముందు ఈ రెండు స్ఫటికాలను తీసుకొని చీకటి ప్రాంతములో వీటిని ఒకదానితో మరొకటిని రాపిడి చెయ్యగానే మనకి మెరుపుకాంతి అలాగే తేలికపాటి నిప్పురవ్వలు కనపడతాయి.అలాగే నిజ స్ఫటికాలు రెండు రాగినాణెలు మధ్య ఉంచినట్లయితే సవ్యదిశలో తిరుగుతాయి.ఆ తర్వాత నిజస్ఫటికాలు మనము తాకగానే చల్లదన స్పర్శానందమును కల్గిస్తాయి.కాని వ్యాపారులు తెలివిమీరి తడిపిన పత్తిలో గాజువస్తువులను ఉంచి వాటినే నిజస్ఫటికాలుగా అనుకొని మనము వీటిని తాకగానే మనకి చల్లదన అనుభూతి కల్గి ఈ గాజువస్తువులను స్ఫటిక వస్తువులుగా మోసము చేసి అమ్ముతున్నారు.

ప్రకృతి వెంటనే స్వామి.నిజముగా ఈ కైలాస పర్వతములో సదాశివుడు ఉన్నారా? అనగానే

ప్రకృతి..నీకు తెలుసు గదా.నేను ఈ ధర్మదీక్ష తీసుకోకముందు పవన్ గా ఒక పర్వతారోహకుడిగా ఉండేవాడిని గదా.ఎలాగైన కైలాస పర్వతము ఎక్కాలని పరితపించేవాడినని నీకు తెలుసు గదా.కాని నా అనుభవాలు నీకు తెలిసే లోపుల నీవు కోమాలోనికి వెళ్ళిపోయావు.ఇపుడు నీకు తెలివి ఉన్నది కాబట్టి నా కైలాస పర్వతానుభవాలు చెప్పుతాను.జాగ్రత్తగా విను.

నేను ఒక ఒక పర్వతారోహుడిగా కైలాస పర్వతమును ఎక్కాలని అనుకుంటున్నాను. కానీ దానికి గావలసిన అనుమతులు దొరకడము లేదు. ఎందుకంటే ఈ పర్వతమును ఎక్కడానికి ప్రయత్నించిన వారందరిలో కొందరు కొండ ఎక్కకుండానే ఎక్కకూడదని నిశ్చయించుకొని వెను తిరిగితే అదే మరి కొందరు అయితే కొంతమేర ఈ పర్వతమును ఎక్కి మంచు తుఫానులో చిక్కుకొని ప్రాణాలు వదలడము జరిగింది. దీనితో ఈ పర్వతము మీద ఉన్న అదృశ్య శక్తి ఏమిటో తెలుసుకోవాలని చైనా మరియు రష్యా దేశాల యుద్ధ విమానాలను ఈ పర్వతము మీదకి పంపితే....అవి ఏమి అయినాయో ఇప్పుడిదాకా జాడలేదు. దానితో ఈ పర్వతము మీదకి  ఎక్కడానికి చైనా ప్రభుత్వము అనుమతిని ఇవ్వడము లేదు. కేవలము కైలాస పర్వత దర్శనము, గిరి ప్రదక్షిణం, మానస సరోవర దర్శన భాగ్యమునకు మాత్రమే అనుమతిని ఇస్తుంది.

దానితో నాకు రాను రాను ఈ పర్వతము మీద ఉన్న అదృశ్య శక్తి ఏమిటో తెలుసుకోవాలని....... అలాంటిది ఏమీలేదని.....ఇది గూడ ఒక మామూలు పర్వతమేనని తాను ఎక్కి నిరూపించాలని ఆరాట తపన తాపత్రయాలు రాను రాను నాలో బలంగా నాటుకున్నాయి. ఈ పర్వతారోహణ అనుమతి కోసము గత 12  సంవత్సరాల నుండి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. ఇతడే ఊహించని విధంగా ఈ పర్వతమును ఎక్కడానికి అనుమతి లభించినది. దానితో నేను ఎగిరిగంతేశాను.ఎలాగైనా ఈ పర్వత రహస్యమును చేధించి లోకానికి తన అనుభవ సత్యాలను చెప్పాలని నేపాల్ ప్రాంతములోని ఖాట్మండ్ కి చేరుకున్నాను. ఆ తర్వాత నేపాల్ మరియు టిబెట్ సరి హద్దుల్లో ఉన్న కొడారి పట్నానికి నేను చేరుకున్నాను. ఆ తర్వాత చైనా భూభాగములో ఉన్న ఝుంగ్మూ పట్నానికి చేరుకున్నాను. ఆ తర్వాత దీనికి 35 కి.మీ దూరమున్న న్యాలమ్ పట్నమునకు చేరుకున్నాను. ఆ తర్వాత 230 కి.మీ ప్రయాణించి సాగా పట్నానికి చేరుకున్నాను. ఆ తర్వాత ప్రయాంగ్, ఆపై దార్చెన్ ఆపై చిట్టచివరికి కైలాస పర్వతము వద్దకి చేరుకున్నాను. ఈ పర్వతమునకు 22 కి.మీ దూరములో వేసిన టెంట్ లలో ఇతను విశ్రాంతి తీసుకుంటూ తన చేతిలో ఉన్న బైనాక్యూలర్ తో ఈ పర్వత రూపు రేఖలను చూస్తూ దక్షిణము వైపు నుండి ఈ పర్వతమును ఎక్కాలని నిశ్చయించుకొని మర్నాడు పర్వతమును ఎక్కడానికి గావలసిన సామగ్రితో ఒక బ్యాగ్ ను భుజము మీద పెట్టుకొని ఈ పర్వత దక్షిణ భాగము వైపుకి చేరుకున్నాను. యధావిధిగా అన్ని పర్వతాలు ఎక్కిన మాదిరిగానే ఈ పర్వతమును ఎక్కడము ప్రారంభించాను. ఎప్పుడైతే నేను ఎక్కడము మొదలు పెట్టినానో....ఈ పర్వత పరిసర వాతావరణములో అనుకోని విధముగా మార్పులు రావడము మొదలైంది. అప్పుడిదాకా ఎండగా ఉన్న ఈ ప్రాంతము అంతా ఒక్కసారిగా మేఘాయుతమై విపరీతముగా వర్షము పడటము మొదలయ్యేసరికి  ఆశ్చర్యానందాలు నాకు కలిగాయి. దానితో ఆరోజు నేను పర్వతమును ఎక్కలేక పోయినాను. ఇలా వరుసగా వారము రోజుల పాటు ఏకధాటిగా వర్షాలు పడటముతో నేను కాస్త పర్వతమును ఎక్కలేకపోయాను . దానితో నాకు విపరీతమైన కోపావేశాలు,అసహనం కలిగాయి. ఎలాగైనా ఈ పర్వత రహస్య ఛేదన చేయాలని బలంగా నిశ్చయించుకున్నాను.

                   ఆ తర్వాత వర్షాలు తగ్గడముతో మళ్ళీ ఈ పర్వతమును ఎక్కడానికి నేను ప్రయత్నించాను. ఒక 18 అడుగులు ఎక్కినానో లేదో వెంటనే ఈ పర్వతము చుట్టు అందాకా లేని మేఘాలు కమ్ముకొని రావడము అంతా చీకటిగా మారిపోవడము దానితో దారీతెన్నూ కనిపించకపోయేసరికి పర్వతము ఎక్కడము చాలా కష్టమని అనిపించి ఎక్కడము నేను ఆపుకోవాల్సి వచ్చింది. దానితో తన రెండవ ప్రయత్నము గూడ విఫలమవ్వడముతో నాలో నిరుత్సాహమునకు బదులుగా ఉత్సాహముగా ఎలాగైనా ఈ పర్వతా రోహణ చెయ్యాలని మనో సంకల్పము ఎక్కువైంది. కొన్ని గంటల తర్వాత ఈ మేఘాలు తొలిగిపోవడముతో నేను మళ్ళీ ఈ పర్వతము ఎక్కడము ప్రారంభించాను. కొద్ది సేపటికి ఈ పర్వతము మీద ఉన్న మంచులో ఏవో కదలికలు ఏర్పడడము నేను గమనించాను. దానితో ఈ పర్వతము యొక్క ఎగువ భాగము చూసేసరికి మంచుతుఫాన్ వచ్చే సూచనలు కన్పించడముతో ప్రాణ భయంతో అక్కడ నుండి క్రిందికి దిగాను. మహా అయితే 36 అడుగులు మించి ఎక్కలేదు. దానితో తన మూడవ ప్రయత్నము గూడ విఫలమయినదని నేను గ్రహించాను. ఇలా గాదనుకొని మర్నాడు మళ్ళీ నేను ఈ పర్వతమును ఎక్కడము ప్రారంభించాను. కొంతదూరము సాఫీగానే నా ప్రయాణము సాగింది. అనుకొని విధముగా ఒక మూడున్నర అడుగుల పాదముద్రలు ఆ మంచులో గుర్తులుగా కనబడసాగాయి. మానవుడు అడుగులు ఒక అడుగు మించి ఉండదు. ఇక్కడేమో ఏకముగా మూడున్నర అడుగుల పాదముద్రలు కనిపించేసరికి నాలో తెలియని భయము మొదలైంది. కొంపతీసి ఈ పాదముద్రలు యతివి అయ్యుండాలి. ఎందుకంటే హిమాలయ పర్వత పరిసరాలలో అతిపెద్ద కొండముచ్చు వంటి ఆకారాలతో సుమారుగా 18  అడుగుల ఎత్తు ఉన్న యతీశ్వరులు సంచారము చేస్తూ ఉంటారని  నేను వివిధ పుస్తక గ్రంధాలలో చదవడము జరిగింది. మరికొంత మంది మాత్రము యతులు లేరని, ఇలాంటి పాద ముద్రలు మంచు ఎలుగుబంటికి చెందినవని......రెండు లేదా మూడు పాదముద్రలు కలిసి ఒక పాద ముద్రగా మనకి కనిపించడము జరుగుతోందని చెప్పిన పుస్తకాలు  నేను చదవాను. కానీ  నేను ఎప్పుడు గూడ యతిని ప్రత్యక్షంగా చూడలేదు. దానితో నాలో ప్రాణ భయము తగ్గి మనోధైర్యముతో ఈ పాదముద్ర గుర్తులు వెళ్లిన వైపుకి నా ప్రమేయము లేకుండానే నేను ప్రయాణించసాగాను.

         కొంతదూరము వెళ్లిన తర్వాత అక్కడున్న గుబురు పొదల నుండి ఒక్కసారిగా అతి పెద్ద కొండముచ్చు ముఖముతో......ఒంటినిండా తెల్లని బొచ్చుతో.........సుమారుగా 12 అడుగుల ఎత్తులో ఉన్న ఆకారము ఇతని మీదకి ఉరికినట్లుగా బెదిరించి.....వడివడిగా ముందుకి సాగిపోయి క్షణాలలో అదృశ్యమవ్వడము ఏకకాలములో జరిగిపోయింది. నాకు అది జంతువా లేదా మనిషో అర్థమయ్యేలోపులే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కొంతదూరము ముందుకి వెళ్లి అదృశ్యమయింది. దాని నడక వేగానికి కంటిచూపు అందుకోలేదని తెలుసుకొని యతులున్నారని నిశ్చయించుకొని నా ప్రయాణము ముందుకి కొనసాగిస్తుండగా........ అనుకోని అవాంతరముగా ఈ పర్వతము చుట్టూ మేఘాలు కమ్ముకొని వస్తున్నాయని నేను గ్రహించి......ఇలాంటి సమయాలలో పర్వతము ఎక్కలేమని తెలుసుకొని వెనుతిరిగి క్రిందకి వచ్చేశాను. ఇలా నా నాలుగవ ప్రయత్నము గూడ విఫల మయింది.

 

ఇలా గాదనుకొని మానవ ప్రయత్నాలలో ఈ పర్వతము ఎక్కలేమని నేను గ్రహించి ఈ పర్వతము ఎక్కడానికి ఏదైన అతీంద్రియ శక్తి సహాయముతో ఎక్కాలని నిశ్చయించుకొని అక్కడున్న లామాలు ఉండే ఆశ్రమాలకు బయలుదేరాను. అక్కడికి వెళ్లి అక్కడున్న లామాలను కలిసిన తర్వాత నాకు ఒక క్రొత్త విషయము తెలిసింది. అది ఏమిటంటే మిలారేపా అను సుప్రసిద్ధ టిబెట్ యోగి తాను సంపాదించిన అతీంద్రియ శక్తులతో కైలాస పర్వతము పైకి ఎక్కకుండా గాలిలో ప్రయాణిస్తూ ఆకాశ మార్గమున ఈ పర్వతాగ్రమునకు చేరుకొని ఒక పందెములో గెలిచి ఈ పర్వతమును బౌద్ధమత కేంద్ర స్థానముగా పొందారని అక్కడున్న లామా చెప్పేసరికి నాకు విపరీతమైన ఆశ్చర్యానందమునకు గురి అయ్యాను. ఈ పందెము వివరాలు తెలుసుకోవాలని ఆసక్తితో మిలారేపా గూర్చి చెప్పిన లామాను అడిగేసరికి అయన కాస్త ఆనందముగా మిలారేపా గూర్చి చెప్పడము ప్రారంభించాడు.

              మిలారేపా 11 వ శతాబ్ధికి చెందిన వ్యక్తియని......అచంచల దీక్షతో తన జీవిత కాలము అంతాగూడ చైతన్యవంతమైన బుద్ధత్వాన్ని సమగ్రంగా సాధించిన మహానుభావుడు. ఈయన బక్కపలచగా ఉండి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం కట్టుకొనేవాడని.....అందుకే 'రేపా' అని పేరు వచ్చినదని......రేపా అంటే నూలువస్త్రం ధరించేవాడని అర్ధము ఉన్నదని చెప్పడము జరిగింది. తల్లి కోరిక మేర చిన్న వయస్సులోనే మిలారేపా కాస్త మంత్ర విద్యలను నేర్చుకోవడము అభ్యాసము చేశాడు. ఈయన గురువు పేరు మార్పా. ఈయన 17 సంవత్సరాలు భారతదేశములో ఉండి సకల మంత్రశాస్త్రాలు నేర్చుకొని గొప్ప తాంత్రిక యోగిగా మారి టిబెట్ కి చేరుకున్నారు. గొప్ప మంత్రవేత్తగా ఖ్యాతి పొందారు. గాకపోతే ఈ ప్రాంతములో బౌద్ధ మతము ప్రచారము గాకముందు భోన్ పా మతముండేది . ఇందులో ప్రధానముగా అతీంద్రియ శక్తుల సాధన విధి విధానాలే ఉండేవి. దానితో మిలారేపా గూడ ఈ మత విధానాలలో చెప్పబడిన అన్నిరకాల అతీంద్రియ శక్తులను తన గురువు ద్వారా అభ్యాసము చేస్తూ కేవలము ఈ మంత్రసిద్ధి కోసము ఓ దురదగొండి జాతి మొక్కతో పులుసు చేసుకొని దానిని మాత్రమే ఆహారముగా స్వీకరించేవాడు. దానితో ఈయన శరీరము ఆకు పచ్చటి ఛాయతో మెరుస్తూ ఉండేది. ఇలా ఈయన ఈ పులుసును తన జీవితాంతము స్వీకరించాడు.

               గురువు కోరికమేర బౌద్ధమత ప్రచార కర్తగా మారారు. అప్పుడికే ప్రచారములో ఉన్న భోన్ పా మతారాధకులను, మత ప్రచారకులను తన అతీంద్రియ శక్తులతో ఓడిస్తూ వారిని బౌధ్ధమతారాధకులుగా మారుస్తూ వస్తున్న విధానములో భోన్ పా మతములో అతీంద్రియ శక్తులు పొందిన ఛున్ అను మంత్రవాదిని మిలారేపా ఎదుర్కోవలసి వచ్చింది. ఎందుకంటే కైలాస పర్వతము అనేది భోన్ పాల పవిత్ర స్థలమని ఛున్ వాదన అయితే ఈ పర్వతము బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రంగా అవతరిస్తుందని బుద్ధుడు చెప్పిన జోస్యాలను ప్రస్తావిస్తూ అది తమకే చెందుతుందని మిలారేపా వాదించాడు. చివరికి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవటానికి మంత్ర శక్తులతో పరీక్ష పెట్టుకోవాలని.... ఇందులో ఎవరు జయం పొందుతారో......వారి మతమునకు ఈ పర్వతము చెందుతుందని ఛున్ సూచించడముతో ఇందుకు మిలారేపా అంగీకరించడముతో వీరిద్దరి మధ్య మంత్రశక్తుల పోటీ జరిగింది.

                  ఛున్ వెంటనే మానస సరోవరమునకు ఒక వైపు ఒక కాలు పెట్టి....మరొక కాలును ఈ సరోవరమునకు మరొక వైపు పెట్టి.... సరోవరము అంతా తన రెండు కాళ్ళ పంగలో ఇముడ్చినట్లుగా చేసేసరికి అక్కడున్న వారందరు ఆశ్చర్యం చెందుతూండగా......మిలారేపా కాస్త చిరునవ్వు నవ్వుతూ సరోవరము అంతా తన శరీరమంతా విస్తరింప చేస్తూ కమ్మేసి..... ఈ సరస్సును తన బొటన వ్రేలి అంచు మీద నిలిపేసరికి ఛున్ ఓడిపోయాడు. ఆ తర్వాత కైలాస పర్వత శిఖరాగ్రమును ఎవరు ముందుగా ఎక్కుతారో పరీక్ష పెట్టుకున్నారు. ఛున్ వెంటనే తన మాంత్రిక డోలు మీద కూర్చొని శర వేగముతో ఎగురుకుంటూ పర్వతమును ఎక్కుతూ ఉంటే మిలారేపా మాత్రము శాంతముగా ధ్యానస్థితిలో కూర్చొని మంత్ర సాధన చేస్తుండగా ఒక విచిత్ర సంఘటన జరిగింది. అది ఏమిటంటే కొంతదూరము పైకి వెళ్లిన ఛున్ అనుకోకుండా ఒక చోట ఆగిపోయాడు. పైకి వెళ్ళటానికి ఇతను ఎన్ని ప్రయత్నాలు చేసిన గూడ ముందుకి వెళ్లలేక పోయాడు. కారణము ధ్యానములో ఉన్న మిలారేపా తన ధ్యాన శక్తితో ఇతడు పైకి ఎక్కకుండా ఆపి వెయ్యడము చేశాడు. ఆ తర్వాత మిలారేపా శరవేగముతో ఆకాశ మార్గములో ఈ పర్వత శిఖరాగ్రము వద్ద ప్రత్యక్ష మయ్యేసరికి ఛున్ నిశ్చేష్టుడై భయపడ్డాడు. దానితో ఒక్కసారిగా తన మాంత్రిక డోలుతో సహా పై నుండి క్రిందకి పెద్ద శబ్దము చేస్తూ ఈడోలు జారడముతో ఈ పర్వత దక్షిణ ముఖము మీద నిలువుగా ఒక పెద్ద గీత ఏర్పడినదని.....ఈ విధంగా ఈ పరీక్షలో మిలారేపా విజయము సాధించడము వలన ఆనాటి నుండి ఈ పర్వతము కాస్త బౌద్ధమత కేంద్ర స్థానమైనదని లామా చెపుతూ, డోల్మాలా పర్వతానికి తూర్పున ఉన్న ఓ నున్నటి గండశిల మీద ఇప్పుడికి నొక్కులు, గుంటలున్నాయని......ఇవి వీరిద్దరి పాద ముద్ర గుర్తులని అలాగే  జుతుల్ పుక్ గొంసా అనే గుహలో మిలారేపా ధ్యానము చేసిన గుహయని.....ఈ గుహ లోపుల విలక్షణమైన భంగిమ కూర్చున్న అనగా తన కుడి చేతిని తన కుడిచెవి వెనకాల పెట్టి.... అశరీరవాణి వింటున్నలాగా ఉండే మిలారేపా విగ్రహమున్నదని లామా చెప్పడముతో

పవన్ లో అంటే కైలాస పర్వతము చుట్టున్న ప్రాంతాలలో అతీంద్రియ శక్తులున్నప్పుడు.....ఏకముగా కైలాసపర్వతములో అతీంద్రియ శక్తి ఉండకుండా పోతుందా. ఖచ్చితంగా అతీంద్రియ శక్తి దీనికి ఉన్నదని అర్ధమవుతోంది. కాబట్టి ఈ పర్వతము ఎక్కడము అనేది మానవులకి అదే మానవ ప్రయత్నముతో సాధ్యపడదని నేను గ్రహించాను. గాకపోతే ఈ కైలాస పర్వతము మీద ఏముంది అలాగే ఈ పర్వతములో ఏముంది తెలుసుకోవాలనే కోరిక నాలో మొదలైంది. అప్పుడు అక్కడున్న లామాను ఇదే విషయము గూర్చి అడిగితే ఆయన వెంటనే "ఈ పర్వతము లోపల ఏముంది అని తెలుసుకొనే ప్రయత్నాలు లామాలు ఏనాడు ప్రయత్నించరని..... ఇది వారికి చాలా పవిత్రమైన స్థలమని......గాకపోతే ఇక్కడికి దగ్గరలో భారతదేశము నుండి 12  సంవత్సరాల క్రితము ఒక గుప్త యోగి అయిన పరమహంస పవనానంద అను యోగి వచ్చినారని.....ఆయన అనుగ్రహమును పొందితే తప్పకుండా ఈ పర్వత రహస్యము తెలిసే అవకాశాలుంటాయని చెప్పడముతో తెగించినవాడికి తెడ్డేగతి అన్నట్లుగా నాకు దొరికిన ఈ అవకాశము వదిలిపెట్టకుండా పరమహంసను కలవటానికి లామా చెప్పిన గుహ వైపు బయలుదేరాను.

          ఇలా కొంత దూరము నడిచాడో లేదో నన్ను కొంతమంది మిలట్రీ పోలీసులు చుట్టుముట్టి గన్ లు ఎక్కుపెట్టేసరికి నేను ఏమాత్రము భయపడకుండా గుప్త యోగిని కలవటానికి వెళ్తున్నానని చెప్పేసరికి నేను చెప్పిన మాటలు నిజమా గాదాయని అనుకొని తెలుసుకోవటానికి నాతో ఒక పోలీస్ అధికారిని ఈ గుహ దాకా పంపించడము జరిగింది. దాదాపుగా 3 కి.మీ దూరము వీరిద్దరూ ప్రయాణించి లామా చెప్పిన గుప్తయోగి గుహ ప్రాంతమునకు చేరుకున్నాము. గుహ లోపలకి వెళ్లి చూస్తే ధ్యాన నిష్ఠలో  ఉన్న అతి పలుచని శరీరముతో .....మాంసము లేని శరీరముతో.... ఎముకల గూడు లాగా ఉన్న ఒక యోగి కనిపించాడు. అప్పుడికే ఈ గుహలో పడుతున్న సూర్యకాంతితో ఈయన సూర్యో పాసనను చేస్తున్నాడు. అనుకోకుండా దీనికి మిలట్రీ పోలీస్ అధికారి అడ్డుగా వచ్చేసరికి గుప్తయోగి ఏమాత్రము కళ్ళు తెరువకుండా "అడ్డు తప్పుకో. కాంతికి అడ్డురాకు" అని హుంకరించేసరికి ఆ అధికారికి కోపము వచ్చి వెంటనే గన్ ఎక్కుపెట్టి "ఎవడివ్రా నీవు. ఇక్కడ నువ్వు ఏమి చేస్తున్నావు. భక్తి పేరుతో గంజాయి అమ్ముతున్నావా? నిన్ను కలవటానికి వీడు వచ్చాడు అంటే నీవు ఏదో చేస్తున్నావు. కళ్ళు తెరువు. లేదంటే కాల్చి పారేస్తాను" అనేసరికి ఆ గుప్తయోగి ఏమాత్రము భయపడకుండా కళ్ళు గూడ తెరువకుండా పెద్దగా నవ్వేసరికి ఆ పోలీసు అధికారికి ఎక్కడ కాలాలో అక్కడ కాలి గన్ ఎక్కుపెట్టి కాల్చడము ప్రారంభించాడు. ఆ గుప్తయోగి శరీరములోనికి బుల్లెట్లు వెళుతున్న కూడా ఏమి కాలేదు. అప్పుడు ఆయన నవ్వడము ఆపి "నేను భౌతికశరీరము వదిలి ఎన్నో సంవత్సరాలు అయింది. ఇప్పుడు నీవు చూస్తున్నది నా సూక్ష్మ శరీరం. దీనికి చావులేదు." అనగానే అంటే "నువ్వు దెయ్యానివా" అని భయపడి ఆ పోలీస్ అధికారి అక్కడ నుండి బయటికి పారిపోయాడు.

                    అప్పుడు గుప్తయోగి కళ్ళు తెరిచి నా వంక చూస్తూ "ఏమిరా. కైలాస పర్వతములో ఏముందో చూడాలని నా దగ్గరికి వచ్చావా? చచ్చినవాడితో చచ్చేవాళ్లతో ఏమిపనిరా. ఎటూ చచ్చేముందు ఈ పర్వతము సంగతి చూసి చావు. అంటూ ఎక్కడో సుమారుగా 48 కి.మీ దూరములో ఉన్న కైలాస పర్వతము తన కళ్ళముందర ఉన్నట్లుగా నాకు అనుభూతి పొందసాగాను.. ఆ తర్వాత కొద్దిసేపటికి అనకొండ సినిమాలో ఉండే నల్లటి కింగ్ కోబ్రా లాంటి నాగుపాము ఈ పర్వతమును చుట్టుకొని ఉండి కాపలా కాస్తున్నట్లుగా కనిపించసాగింది. అంటే ఇదియే రుద్రనాగు అని గ్రహించాను. ఇది కాస్త తన ఉఛ్వాస, నిశ్వాస వలన అక్కడ మేఘాలు ఈ పర్వతమును చుట్టుకుంటున్నాయి, విడిపోతున్నాయి. పైగా ఈ మేఘాలలోకి వెళ్లిన ఏ వస్తువులు తిరిగి కనిపించకపోవడము నేను గమనించాను. కొద్దిసేపు తర్వాత తెల్లని బొచ్చుతో......కొండముచ్చు తలతో ఒక యతీశ్వరుడు అతి వేగముతో ఈ పర్వతము ఎక్కడము చూశాను. కొద్దిసేపటికి ఈ పర్వతము పై అంచుకి కొంత దూరములో ఏదో ద్వారమున్నట్లుగా ......దీని దగ్గరికి ఈ యతి చేరుకొనేసరికి ఈ మంచుద్వారము తెరుచుకోవడము నేను గమనించాను. ఈ ద్వారము లోపల అంతర్గత గుహ మార్గమున్నట్లుగా తెలుసుకున్నాను. ఇలా సుమారుగా 5 కి.మీ దూరము నడిచిన తర్వాత ఈ గుహలోపల ఎదురుగా మంచుతో కప్పబడిన శివలింగాకారము కనబడింది. కొద్దిసేపటికి ఈ మంచు అంతా ముక్కలు ముక్కలుగా రాలి పడిపోతుండగా....... ఆఙ్ఞా చక్ర ముద్రలో  ధ్యానము చేస్తున్న ఒక అభయ హస్త రూపము లీలగా కనిపించేసరికి......ఈ దృశ్యము కాస్త అదృశ్యమైనది. దానితోనేను కాస్త అక్కడున్న గుప్తయోగికి నమస్కారము చేసి సాక్షాత్తు కైలాస పర్వతములో ఉన్న కైలాసనాధుడిని తన మనో నేత్రమునందు సాక్షాత్కరింప చేసిన గుప్తయోగికి మనస్సులోనే కృతజ్ఞతలు చెప్పుకొని ఆ గుహ నుండి బయటికి వచ్చి నేను  అక్కడ నుండి బయలుదేరాను. ఇది నేను స్వయంగా పొందిన కైలాస పర్వత స్వానుభవ వివరాలు అంటూ నిర్వాణ లామా చెపుతూండేసరికి

పరిసరాలలో ఉన్నట్టుండి మార్పులు రావడము మొదలైంది.చెట్ల మీద ఉన్న పక్షులు దేనినో చూసి భయపడుతున్నట్లుగా విపరీతముగా గోల చెయ్యడము మరోవైపు మంచు దుప్పిలు,కస్తూరిమృగాలు,గొర్రెలు దేనిదో రాక వాసనను కనిపెట్టి బెదిరి పారిపోవడము నిర్వాణలామా గమనించి తన మనస్సులో శంక మొదలై విపరీతముగా తన మనస్సు ఆందోళనకి గురి అవుతోందని గ్రహించి ఏదో ప్రమాదము తమని వెతుకుంటూ వస్తోందని అనుకోనేలోపులే...

హఠాత్తు పరిణామముగా 18 అడుగుల ఎత్తు ఉండి ఓంటినిండా తెల్లని దట్టమైన బొచ్చుతో ఒక పెద్దసైజు గొరిల్లా ముఖముతో పిల్లి కళ్ళతో ఉన్న నర వానరము దగ్గరికి వస్తూండగా..అంతే వేగముగా ఈ పరిసరాలు అంతా గూడ సుగంధభరిత పరిమళాలతో అనగా సౌగంధిక పుష్పాలు వాసన రావడముతో..ఈ పువ్వుల సువాసన మత్తులోనికి వీరిద్దరు జోగుతూండగా పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ పెద్దపెద్ద అరుపులతో అరుస్తూ వీళ్ళని దాటుకుంటూ ఈ నరవానరము శరవేగముతో దాటుకుంటూ వెళ్ళిపోయింది.ఇది వేసిన అడుగున్నర పాదముద్రలను చూసిన నిర్వాణలామా వెంటనే ఈ నరవానరము ఏవరో గాదని కైలాస పర్వత పాద పీఠభాగమున నిత్య రక్షకుడైన వీర హనుమ యతీశ్వరుడని గ్రహించి ఇదే విషయాన్ని ప్రకృతికి చెప్పగానే వీరిద్దరు ఈయన వెళ్ళిన వైపు నమస్కారభక్తితో స్వామి..మా ఇద్దరిని ఈ విధంగా అనుగ్రహించినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అని చెప్పి స్వస్వరూపముతో ఇంతకముందు దర్శనమిచ్చిన సప్తచిరంజీవులలో ఒకరైన ఆశ్వద్ధామ మహర్షి చూపించిన సొరంగమార్గము వైపు వీళ్ళు బయలుదేరారు.

దానితో వీరు ఈ పర్వతము దగ్గరికి వెళ్లి చూడగా.... చూడటానికి ఇది ఒక ముక్కోణాకారముతో ఉన్న గూడ నిజానికి నలు చదరపు పీఠము పైన నాలుగు త్రిభుజాల నిర్మాణముతో...ఒక పిరమిడ్ ఆకార నిర్మాణముగా ఉంది.అక్కడున్న ఒక శిలాఫలకమును చూస్తే.... ఇది 13 ఎకరాల విస్తర్ణములో... 120  అడుగుల ఎత్తున్న వేదిక మీద... భూమికి 2 , 160 అడుగుల ఎత్తున నిర్మించినట్లుగా తెలుసుకున్నారు. ఇంతలో వీరిద్దరికి ఉత్తర ముఖము మీద చిన్న సూది బెజ్జం వంటి రంధ్ర నిర్మాణము కనబడింది. ప్రకృతి ఆసక్తి గమనించిన నిర్వాణ లామా వెంటనే ' ఆకాశము కేసి చూపిస్తూ.... ధృవ నక్షత్రము ఏ దిక్కులో ఉందో... ఈ రంధ్రము చెపుతుంది. తద్వారా సప్త ఋషుల మండలము మనకి కనబడుతుంది. ఆ తర్వాత నిర్వాణలామా ప్రకృతికేసి చూస్తూ " ప్రకృతి. కనిపించే రంధ్రము క్రింద వంద అడుగుల లోతుకి దిగువ మెట్లు కనిపిస్తాయి. అక్కడకి వెళ్ళితే మనకి మంచుతో ఉన్న ఒక ద్వార బంధనము కనబడుతుంది. కాని ద్వారము తెరవటానికి సంవత్సరములో ఒక రోజు మాత్రమే అవకాశముంటుంది. అదిగూడ సూర్యుడు మేషరాశియందు ప్రవేశించే రోజు... అది పౌర్ణమిరోజు గావాలి. ప్రస్తుత ఈరోజు ఘడియలు నడుస్తున్నాయి అంటూ

తీరా ఈ సొరంగ మార్గము దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వీళ్ళకి ఒక ద్వారబంధనము కనపడినది.పైగా ఇది దట్టమైన మంచుతో కప్పబడి మంచు ద్వారములాగా కనపడేసరికి ఈ మంచు తొలగించడము మానవమాత్రుడి సాధ్యముకాదని కేవలము సూర్యకాంతికిరణాలు వలనే ఈ మంచు కరుగుతుందని నిర్వాణలామా గ్రహించి ప్రకృతితో ఒక సుముహర్త కాలములో ఇక్కడ పడే సూర్యకాంతి కిరణాల వలనే ఈ ద్వారబంధనము తెరుచుకునేటట్లుగా ఏర్పాటు చేశారని అది గూడ కాలగమనంలో మన భూమి తిరిగే ఉత్తర,దక్షిణ దిశ ప్రతి 72 సంవత్సరాలకి ఒక డిగ్రీ చొప్పున పెరుగుతూ ఎపుడైతే ఇది 72 డిగ్రీలకి చేరుకుంటుందో ఆ సమయములో సూర్యుడు కాస్త మేషరాశికి చేరుకుంటాడు.ఈ రాశికి అధిపతి కుజగ్రహము గావడము ఈయన అగ్నితత్వము కలిగి ఉండుటవలన ఈ అధిక వేడిమి యొక్క సూర్యకాంతికిరణాలకి ఈ మంచు ద్వారము కరుగుతుందని కాలచక్ర తంతులో ఉన్నదని..ఇపుడు మరో గంటలో ఈ సుముహర్త ఘడియలు ప్రారంభమవుతాయని చెప్పి అపుడిదాకా వీరిద్దరు ఓం-మణి-పద్మ-హుం అను మణిమంత్రమును జపముగా చేసుకోసాగారు.అనుకున్న సమయానికి ఈ మంచు ద్వారబంధనము మీద అధిక వేడి సూర్యకిరణాలు పడిన సుమారు 5 గంటలు దాకా ఈ మంచు కరగటానికి సమయము తీసుకుంది.అపుడిదాకా వీరిద్దరు జపము చేస్తూనే ఉన్నారు.ఎపుడైతే మంచు పూర్తిగా కరిగి ఉక్కుతో చేసిన ద్వారము కనిపించి దానికున్న బంధనమును నిర్వాణలామా తన ఆయుధచేతులతో తొలగించి ద్వారము తెరిచి లోపలకి వెళ్ళగానే యదావిధిగా ఈ ద్వారము మూసుకొనిపోవడము జరిగింది.మళ్ళీ ఇది తెరుచుకోవాలంటే సూర్యుడు కాస్త మేషరాశికి రావలంటే మరో  ఒక సం. పడుతుందని అనుకుంటూ వీరిద్దరు లోపలికి వెళ్లారు.

లోపలికి వీళ్ళు కొంతదూరము పోయిన తర్వాత వీరికి టీ జంక్షన్ వచ్చింది.ఎటు వెళ్ళాలో..ఎటు వెళ్ళితే ఏమి వస్తుందో అర్ధము అవ్వక ఏమి చెయ్యాలో అని అనుకుంటూ బుద్ధ భగవానునిని తలుచుకుంటూ మణిమంత్రము చేసుకుంటూ ఉండేసరికి వీరికి ఈ జంక్షన్ మధ్యలో ఒక కాంతిపుంజము గాలిలోంచి ఏర్పడి అది కాస్త మానవమాత్రుడిగా మారి

స్వామి.కంగారుపడకండి.నేను ఒక శాపగ్రస్త గంధర్వుడిని.నా వేణుగానముతో గంధర్వలోకమును మెప్పించేవాడిని.ఒకరోజు అనుకోకుండా గానసభలో నా శృతి తప్పినది.దానితో మా రాజు నన్ను ఈ అగర్తల గ్రామమునకు దారి చూపే వ్యక్తిగా ఉండమని నాకు శాశ్వత శాపమిచ్చాడు.దానితో ఇలా ఏకాంతముగా ఒంటరిగా కూర్చుని వేణుగానమును అభ్యాసము చేస్తున్నాను.అలాగే ఈ దారిగుండా వచ్చేవారికి అసలు దారి చూపిస్తూ ముందుకి తీసుకొని వెళ్తాను.మీరు ఒకవేళ ఆ దారిగుండా వెళ్ళితే సరాసరిగా కైలాస పర్వతము దగ్గరికి మళ్ళీ వెళ్ళేవాళ్ళు.అదే ఈ దారిగుండా వెళ్ళితే మీకు గావాలసిన పాదరసచింతామణి ఉండే అగర్తల గ్రామము వస్తుంది.నిజానికి నేను ఈ మణికి నిత్యపూజారిని అన్నమాట.ఈ మణి దగ్గరికి మనము వెళ్ళాలంటే శ్రీ చక్ర నవనిర్మాణ అడుగు త్రికోణము దగ్గరికి వెళ్ళాలి.అక్కడ ఈ నవావరణాలు దాటుకుంటూ అడుగుభాగానికి చేరుకుంటే గాని మనకి పాదరస చింతామణి దర్శనము గాదు.అర్హత,యోగ్యత ఉన్నవారికి మాత్రమే ఈ మణి దర్శనము అవుతుంది.అంతే గాని నేను మీ వెంట ఉన్నంతమాత్రమున ఇది జరుగదని తెలుసుకోండి.అలాగే ఈ నవావరణాలను దాటడానికి మనము ఏన్నో మాయలు,మర్మాలు దాటవలసి ఉంటుందని గ్రహించండి.నేను కేవలము మీ వెంట ఒక సాక్షిభూతుడిగా ఉండి మార్గము చూపిస్తాను.కాని ఆ మార్గములో వచ్చే మాయలను మీ వివేకబుద్ధితో దాటవలసి ఉంటుంది.ఇందులో నేను ఎలాంటి సహాయము మీకు చెయ్యను.ఒకవేళ మీకు ఇపుడే భయము కలిగితే ఆ దారి నుండి వెళ్ళితే యధావిదిగా కైలాస పర్వత భూభాగమునకు క్షేమముగా చేరుకుంటారు అనగానే

నిర్వాణలామా వెంటనే స్వామి..మాకు ఏలాంటి ఆశ కాని మృత్యుభయము లేవు. మాకు మీ సహాయముగా మౌనముగా మాకు గావాల్సిన పాదరసచింతామణి దర్శనమార్గము చూపించండి.అక్కడికి వెళ్ళటానికి వచ్చే అన్ని ఆవాంతరాలు మా బుద్దులతో దాటుకుంటాము.లేదంటే దారిలోనే మా ప్రాణాలు వదిలి వేస్తాము అనగానే

సరే..మీరిద్దరు ఇంత మనో సంకల్పముతో నిశ్చయించుకొని వచ్చినపుడు నా వంతు సహాయము నేను చేస్తాను అంటూ వీరిద్దరిని ఎదురుగా కనిపించే దారి వైపుకి తీసుకొని వెళ్ళాడు.

వంద అడుగులు దిగి లోపలికి వెళ్లగా... అక్కడ ఎవరో వెలిగించియున్న కాగడాల వెలుతురు స్వాగతము పలికింది. లోపల వైపు ఎన్నో సంవత్సరాల నుండి యోగసాధన నిష్ఠలో ఉన్న యోగులు , సాధువులు , లామాలు ఇలా ఆశ్చర్యముగా... వింతగా కేవలము 18 మంది కనిపించేసరికి.... అంటే వీరంతా జీవసమాధి చెందిన వారని వీరిద్దరు గ్రహించి  ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి ఈ ద్వారము గుండా లోపలకి ప్రయాణిస్తుండగా... గంధర్వుడు వెంటనే... ఉత్తర ద్వారము వైపు వెళ్ళితే నాలుగు రోజులలో కైలాస పర్వతమునకు వెళ్లవచ్చును. అదే ఈశాన్యం దిక్కుగా వెళ్ళితే  శ్రీచక్రం ఉన్న స్పటికపు ఆలయమునకు వెళ్లవచ్చును. ఇప్పుడు మనము ఈ ఆలయము వైపుకి వెళ్లుతున్నాము అని చెప్పి ముందుకి సాగారు. సొరంగం లోపల విపరీతమైన చలిగా ఉంది. కాని ఆశ్చర్యముగా చీకటి లేకపోవడము వీరిద్దరు గమనించారు. కారణము ఈ గుహకి కిటికీల లాంటి రంధ్రాలు ఏర్పర్చబడ్డాయి. సరిగ్గా కొలతల ప్రకారము ఎక్కడైతే సూర్య కిరణాలు పడతాయో.... సరిగ్గా ఆ ప్రాంతములో అంతర్గత గుహయందు ఈ కిటికీల నిర్మాణము చేసిన భారతీయ యోగుల జ్ఞానానికి వీరిద్దరు మనస్సులోనే జోహార్లు చెప్పుకున్నారు. భూమిపై ఉన్న ధృవ నక్షత్ర కాంతి ఒక చోట ఈ అంతర్గత గుహ యందు ఉన్న చిన్న మంచు ఫలకము  మీద పడుతూ ఉండటము ఈ ముగ్గురు గమనించారు. వెంటనే గంధర్వుడు ఏమాత్రము ఆలోచించకుండా ఈ శిలను తాకగానే... అది పెద్ద శబ్దము చేస్తూ ఒకవైపు ఉన్న స్పటికగోడ తెరుచుకొంది.  లోపలివైపు వెళ్లగా... స్పటిక మందిరములోని 2 వ అంతస్థుకి చేరుకున్నామని వీళ్లు గ్రహించారు. గాకపోతే అక్కడ ఒక త్రిభుజాకారముగా అడుగుకి పోయే ముక్కోణపు హాలులోకి క్రిందకి  వెళ్ళటానికి దిగుడు బావిలాగా మెట్లు ఉన్నాయి. అంటే బయట ఉన్న వరండా త్రిభుజాకారముగా పిరమిడ్ ఆకారముగా ఉంటే లోపల ఉన్న వరండా తలక్రిందులుగా ఉన్న త్రిభుజాకారపు త్రికోణములాగా ఉన్నదని వీళ్లు గమనించారు. పైగా ఇది దాదాపుగా 13 మెట్లు ఉన్నాయి. పైగా ఈ 13 మెట్ల క్రిందకి ఎలా దిగాలో 13 బాణపు గుర్తులు సూచనగా ఉండటము బట్టి చూస్తే ఇది ఎంతటి ప్రమాదకరమైన ప్రాంతమనో చెప్పకనే తెలుస్తుంది అని వీరిద్దరు అనుకున్నారు.

            ఇక ఇంత దూరము వచ్చిన తర్వాత పోయే ప్రాణాల గూర్చి ఆలోచనలు చేస్తే ఏమి లాభముండదని ఒక్కొక్క మెట్టు దిగడము ప్రారంభించారు. ఇది ఆశ్చర్యముగా ఒక ప్రదిక్షిణము పూర్తి చేస్తే కాని మళ్లీ దాని క్రింద ఉన్న తర్వాత మెట్టుకి దారి కనిపించడము వీళ్లకి ఆశ్చర్యము వేసింది. ఇలా ఉన్న 13  ప్రదిక్షిణాల మెట్లు దిగి వీరంతా బిందు స్థానానికి అడుగు భాగానికి చేరుకున్నారు. అక్కడ వాళ్లకి నలుపలకల గది వంటి నిర్మాణము కనబడింది. ఈ గదిలోనికి వెళ్లిన వీళ్లకి దక్షిణ ముఖముగా వెళ్లే ద్వారము తెరుచుకొని ఉండటము గమనించి లోపలకి వెళ్లితే....

అక్కడ వీళ్లకి ఒక సొరంగ మార్గము కనిపించింది. ఈ సొరంగ మార్గము గుండా వీళ్లు వెళ్లుతుంటే వేడి వేడి సెగలు పొగలతో ఉన్న వేడినీటి బుగ్గలు కనిపించాయి. అంటే అర్హత , యోగ్యత పరీక్షలు మొదలైనాయని వీరిద్దరు నెమ్మదిగా గ్రహించారు. అప్పుడు ఈ విషయము గమనించిన గంధర్వుడు వెంటనే "నాయనలారా. ఇక్కడి దాకా ఎవరైనా సంకల్ప సిద్ధి బలముతో రాగలుగుతారు. కాని ఇక్కడ నుండి మొదలై ప్రయాణము అంతాగూడ మనకి యోగ పరీక్షలు లాంటివే. మనకి అర్హత , యోగ్యత లేకపోతే వాటి వలన మనకి ప్రమాదాలు జరగవచ్చును. అందరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ముందుకి నా వెంట నా వెనుక రండి" అంటూ ముందుకి పోసాగారు. కాని ఈ వేడి బుగ్గల వేడిమి వీరిద్దరి శరీరాలు తట్టుకోలేని పరిస్థితిగా ఉంటే అదే గంధర్వుడు మాత్రము ఏమాత్రము ఎలాంటి బాధలేని వాడిలాగా తాపీగా ముందుకి పోతూ ఉండటము వీరిద్దరు గమనించారు.

ఇలా వీళ్లు వేడి నీటి పుష్కరిణి దాటుకొని పోతూండగా... గంధపు వాసన విపరీతంగా రావడము మొదలైంది. వెంటనే గంధర్వుడు తన చేతి లోంచి ఏదో ఒక మూలికను బయటికి తీసి దానిని వీళ్లకి ఇస్తూ ఇది ముక్కు దగ్గర పెట్టుకోండి. మీకు గంధపు వాసన సోకదు. ఇది దానిని హరిస్తుంది. ఒకవేళ నేను చెప్పినట్లుగా చెయ్యకపోతే ఈ వాసనకి మీరు కోమాలోనికి వెళ్లి క్షణాలలో చనిపోతారు అని చెపుతూ ముందుకి సాగారు. ఇలా వీళ్లు సుమారుగా ఇలాంటి 18 రకాల యోగపరీక్షలు ఎదుర్కొన్నారు.   ఆ తర్వాత వీరు సొరంగ మార్గము అటు వైపుకి క్షేమముగా వీరంతా చేరుకున్నారు. అప్పుడు గంధర్వుడు అక్కడ ద్వార బంధముండటము గమనించి అక్కడ ఉన్న ఒక బుద్ధుడి బొమ్మతో ఉన్న మీటలాంటి స్పటిక ఫలకను తమతో వచ్చిన గంధర్వుడు ఈ మీటను నొక్కగానే.. ఈ ద్వారము తెరుచుకుంది.

అప్పుడు వీళ్లకి కళ్లుజిగేలుమంటూ ఏడురంగుల  దివ్య తేజస్సుతో వెలుగుతున్న స్పటిక గోడ వంటి గది కనిపించింది. ఈ గది లోపల గంధపు చెక్కతో చేసిన ఒక పెద్ద భోషాణము వీళ్లకి కన్పించింది. దీనిని తెరిచి చూస్తే ఎరుపు , తెలుపు రంగులు ఉన్న సిల్కు గుడ్డలతో చుట్టియున్న 18 తాళ పత్రాల గ్రంధాలు వీళ్లకి కనిపించాయి.  ఈ తాళపత్ర గ్రంధాలను చూడగా... అందులో ఏడు తెలుపు వస్త్రముతో...ఆరు ఎరుపు వస్త్రముతో ఉండటము గమనించి ఆశ్చర్యము చెందారు. అప్పుడు గంధర్వుడు వెంటనే " నాయనా. ఈ ఏడు గ్రంధాలు కలియుగము ప్రారంభం నుంచి శ్రీ కృష్ణుడు అవతారము చాలించినపుడు నుండి మొదలై 21 వ శతాబ్ది వరకు రచించబడి ఉంటుంది. మిగిలిన ఆరు తాళపత్ర గ్రంధాలలో రానున్న 5000 వేల  జరగబోయే భవిష్యత్తు చెప్పబడుతుంది. ఇందులో అందరి జాతకము, పుట్టుక , చావులు , వేలిముద్ర గుర్తులతో, పేరులో వచ్చే అక్షరాలతో సహా... అంతాగూడ లిఖించబడి ఉంటుంది. ప్రపంచ దేశాల స్థితిగతులు , యుద్ధాలు , వ్యాపారాలు , కరువులు , జననష్టాలు , భూకంపాలు , సిద్ధపురుషుల అవతారాలు ఇలా ప్రతీది  లిఖించబడి ఉంటుంది. ఆది నుండి అంతము వరకు జరిగే ప్రతి మిల్లి సెకండ్స్ ఈ గ్రంధములో చెప్పినట్లుగా జరుగుతుంది. అనగానే...

ప్రకృతి వెంటనే "స్వామి. అయితే భూమ్మీద జరిగే ఉపద్రవాలు ముందే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చుగదా.

వెంటనే గంధర్వుడు అందుకొని "అమ్మా. ఈ గ్రంధాలు సిద్ధ పురుషులు తమ త్రినేత్రముతో చూసి రాసిన భవిష్యాలే. ఇది చదవటానికి తప్ప జాగ్రత్త పడటానికి ఏమి ఉండదు. భవిష్యత్ లో జరగబోయే సంఘటనలను ముందుగా చెప్పి వాటికి మనల్ని సిద్ధపడేటట్లుగా చెయ్యడానికి ఈ గ్రంధాల రచన చెయ్యడము జరిగింది. జరిగేది జరుగుతుంది. జరగనిది ఎన్నడికి జరుగదు. అందుకే ఈ పురాణ సంహిత భవిష్య గ్రంధము నరమానవుడి కంట పడకుండా ఉండటానికి , అలాగే ఏవైతే బ్రహ్మ  జ్ఞాన రహస్యాలు , దేవ రహస్యాలు  స్వార్ధ పరుల చేతిలో పడకూడదని... ఈ గ్రంధము చుట్టూ 18 మంది సిద్ధ గురువులు ఎల్లప్పుడు వారి సూక్ష్మ శరీరాలతో కాపలా కాస్తూ... తమ మనోనేత్ర కాంతి దృష్టితో చూడగానే... ఈ గ్రంధము మాయమై హారతి కర్పూరము లాగా గాలిలో హరించుకొని పోతుంది. దీనిని ఎవరికి ఎప్పుడు ఏ సమయములో లభించాలో వాళ్లు లభించే సమయానికి వాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రంధము కాస్త నీటి ఆవిరి నుంచి వడగండ్లు గడ్డకట్టి నట్లుగా ఈ రహస్య గ్రంధము సాక్షాత్కరించి కనబడుతుంది. ఇలా నాకు తెలిసి వేదవ్యాసుడికి , శ్రీ శంకరాచార్యుడికి ఈ గ్రంధాలు కనిపించినాయని వినికిడి. అంటూండగా...

వీరిద్దరికి రక్త ప్రసరణ వేగముగా కొట్టుకోవడము గమనించిన

గంధర్వుడు "నాయనలారా. మనము ఉన్న గదిలో అతిశక్తివంతమైన అతినీల లోహిత కిరణాలను 18 ప్రక్కల నుండి ప్రసారము అయ్యేటట్లుగా అమర్చారు. ఇక్కడ మనము 48 నిమిషాలకి మించి ఉండలేము. ఆపై ఉంటే రక్త ప్రసరణ ఆగిపోయి గుండె కొట్టుకోవడము నిలిచిపోయి శ్వాస ఆగిపోయే ప్రమాదము ఉంది అంటూండగా... భోషాణములోని గ్రంధము వీళ్ల కళ్ల ముందరే నీటి ఆవిరిగా మారిపోవడము గమనించి ఆశ్చర్యము చెందుతూండగా వారికి ఈ గదికి ఉన్న ద్వారము తెరుచుకుంది.

అప్పుడు వీళ్లకి శ్రీచక్ర అడుగున భాగములో ఉన్న బిందు స్థానమునకు వచ్చినట్లుగా అన్పించింది. ఎందుకంటే అక్కడ అడుగుభాగమున అష్టదళ పద్మము ఒకటి కనబడుతోంది. ఈ పద్మ కేంద్రములో ఒక వజ్ర నిర్మిత పీఠమున్నట్లుగా వీళ్లు గమనించారు. ఈ పీఠము మధ్య భాగములో ఒక గుండ్రటి పంపర  పనసకాయ సైజులో గోళము వంటి పాదరసములాగా దివ్యకాంతితో మెరిసిపోతూ కోటి సూర్య చంద్రుల కాంతితో కళ్లు కన్పించనంత దివ్య తేజస్సుతో మెరిసిపోతున్న ఒక దివ్య సాలగ్రామ శిల ఒకటి వీళ్లకి కనిపించింది. పైగా ఇది దాని అంతటే అదే తన చుట్టు తాను తిరుగుతూ ఓంకార నాదము హోరు చేస్తుంది. దీనిని చూస్తున్న గంధర్వుడు ఎంతో తన్మయత్వము చెందుతూ

"అదియే....అదియే... అతి దివ్యమైన మణి అయిన పాదరసచింతామణి శిల...

జీవించి నడిచే ప్రాణమున్న శిల...

రాబోవు కాలములో శంబల ప్రభువు దగ్గర ఉండే అతి మహిమాన్వితమైన శిల...

దీనిని చూడడమనేది 1000 కోట్ల జన్మల పుణ్య ఫలమే... అంటూండగా...

ఈ పాదరసచింతామణి శిల... గాలిలో తేలుతూ.... గంధర్వుడు చేతికి చేరింది. అప్పుడు వీరిద్దరు దీనిని పరిశీలించి చూడగా... ఇది ఒక ప్రక్క అర్ధ చంద్రాకారములో ముఖము అనగా రెండు పెదవులు తెరచియున్న ద్వారము ఉంది. పైగా ఇది తన అంతట తానే తిరుగుతున్న ప్రతిసారి వివిధ రంగుల కాంతులను విరజిమ్ముతోంది. ఒకసారి ఎరుపుగాను మరొకసారి ముత్యపు రంగులో... ఇంకొకసారి నీలములో... మరొకసారి బంగారపు కాంతితో, ఆకుపచ్చగాను, ఇలా నవగ్రహాలకి ఉండే నవరంగులతో ఈ సజీవ శిల ఉన్నదని వీరిద్దరు గమనించి దానిని తాకి తాకగానే... సృహ తప్పిపోగానే..ఆ గంధర్వుడు వెంటనే వీరిని తన మంత్రశక్తితో సృహ తెప్పించి..

నాయనులారా..పంచామృత మణితీర్ధమును సేవించండి అనగానే వీరిద్దరు సేవించగానే ఏదో తెలియని అలౌకిక ఆనందస్ధితిని అనుభవిస్తూండగా..

ప్రకృతి వెంటనే అక్కడున్న నిర్వాణలామాతో స్వామి...ఇపుడు నా మనస్సు శాంతిని కోరుకుంటోంది.ఎంతో హాయిగా 1000 ఏనుగుల భారము తగ్గినట్లుగా అనిపిస్తోంది.నాలో ఏలాంటి శూన్యతభావ స్ధితి లేదు.కాని మనస్సుకి అతీతమైన ఆనందస్ధితిని పొందుతున్నాను అని నాకు అనిపిస్తోంది.ఇక నాకు మీ బంధనము నుండి విముక్తి కలిగించండి.నేను శివైక్యం చెందాలని అనుకుంటున్నాను అంటూ అక్కడే ఉన్న పాదరస చింతామణిని మరొకసారి ప్రకృతి తాకుతూ దానితో

ఓ మణి పద్మమా..నాకు ఇహపర భోగభాగ్యాలు అనుభవించాలని లేదు.సంసారతాపత్రయాలు గూడ లేవు.కాని శాశ్వత ఆనందస్ధితి అదే పరిపూర్ణ శాంతిని పొందాలని అనుకుంటున్నాను.ఈ మన:శాంతి శాశ్వతముగా అనుభవించేలాగా నన్ను దీవించు అంటూండగానే

అక్కడే ఉన్న గంధర్వుడు వెంటనే అమ్మా..ఈ పాదరస చింతామణి ఒకే ఒక ఇష్టకోరికను మాత్రమే తీరుస్తుంది.ఆరోగ్యమును ప్రసాదిస్తుంది.దీర్ఘావును ప్రసాదిస్తుంది.మంచి జ్ఞానము ప్రసాదిస్తుంది.అదే శంభలా గ్రామములో ఉండే బ్రహ్మచింతామణి అయితే అష్టకోరికలను అష్టదిక్కుల ప్రకారము తీరుస్తుంది.కాబట్టి ఇక్కడున్న పాదరస మణికి నీ ఇష్టకోరిక ఏమిటో చెప్పు..అది క్షణాలలో నెరవేరుస్తుంది అనగానే

ప్రకృతి వెంటనే ఈ మణిపద్మము కేసి చూస్తూ..

ఓ మణిపద్మమా..నా చిరకాల వాంఛ మణికైలాష్ పర్వతమెక్కి శివైక్యం చెందాలని పాము అవతారములో ఎన్నో ప్రయత్నములు చేసి విఫలము చెంది..ఇపుడికి ఆ పర్వతము మీద నా పాము నిర్జీవ శరీరము అలాగే ఉంది.మా శివయ్యకి ఇష్టమైన నాగాభరణమైన నీలిరంగు నాగపాముగా నా ఆత్మశక్తిని ఆ నిర్జీవ పాము శరీరములోనికి ప్రవేశింప చేసి నన్ను ఆ శివయ్య కంఠమున నాగాభరణముగా ఆలకరింప చేసి నాకు శివైక్యం ప్రసాదించు..ఇదియే నా ఇష్టకోరిక అనగానే..

ఉన్నట్టుండి

ఈ పాదరస చింతామణి నుండి ఒక నీలిరంగు దివ్యకాంతి ప్రసారము బయటికి వచ్చి అది కాస్త అక్కడే ఉన్న ప్రకృతి మీద మెరుపు కాంతిలాగా పడిపడగానే ఈ కాంతి ప్రసారము కాస్త ఈశాన్యదిక్కు వైపుకి ప్రసరించిగానే ఈ కాంతి మాయం అయింది.దీనితోపాటుగా అదేవిధంగా ప్రకృతి మాయమవ్వడము చూసిన మిగిలిన ఇద్దరు పెద్దగా ఆశ్చర్యచెందకపోగా

గంధర్వుడు వెంటనే నిర్వాణలామా..మీ భార్య అనుకున్న ఇష్టకోరికను తీర్చుకోవడానికి తన ఆత్మశక్తితో ఆ పర్వతము మీద నిర్జీవముగా పడిఉన్న పాము శరీరములోనికి ప్రవేశించింది.ఈమె పామురూపములో ఈ పర్వతము ఎక్కడము ఆరంభించింది.ఈ ప్రకృతిపాము మహాశివుడి కంఠమునకు చేరేలోపుల నీవు శంభల గ్రామములో ఉన్న బ్రహ్మచింతామణి దర్శనము పొందాలి.లేకపోతే ఈ ద్వారబంధనము మూసుకొనిపోతుంది.ఇది తెరవాలంటే 412 సం.రాలు నువ్వు ఆత్మశరీరముతో ఈ నగరములో ఉండి ఎదురుచూడాలి.అదిగో..అక్కడ ఉన్న స్తంభము వంటి నిర్మాణమే ఈ పిరమిడ్ పంచముఖము..దీనిలోపుల ఉన్న మెట్లు ఎక్కి శంభలా గ్రామ ప్రధాన ద్వారము దగ్గరికి చేరుకుంటావు.అక్కడ నీకు సహాయము చెయ్యడానికి శాపగ్రస్త యక్షుడు ఉంటాడు అని అంటూండగానే..నిర్వాణలామా ఏమాత్రము ఆలోచించకుండా కనీసము తన సహచరి ప్రకృతి గూర్చి బాధపడకుండా ఈ స్తంభ నిర్మాణము వైపుశరవేగముగా వెళ్ళి అందులో ఉన్న మెట్లు ఎక్కి శంభలా గ్రామము వైపు ఏదో మనోసంకల్పసిద్ధి కోసము బయలుదేరాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి