22 భాగం

 

22

స్వామి. మీ పట్ల నాకు సంపూర్ణ విశ్వాసము ఉంది. మీరు ఏదైనా అనుకున్నారంటే దానిని సాధించేదాకా నిద్రపోరని నాకు తెలుసు. ఈ సంపదలు, సంసారమును, ప్రపంచమును, రాజభోగాలను మీరు ఒక్క క్షణములో వదిలిపెట్టగల గుండెనిబ్బరం మీకుందని నాకు తెలుసు. అనగానే....

గోపా. నీవు చాలా ధైర్యవంతురాలివి. నీకు ఇలాంటి పరితాపము పనికిరాదు. నీ సహకారము నాకు గావాలి. ఎందుకంటే నువ్వు నా అర్థ శరీరము. నా అర్ధాంగివి. నీవు తప్ప నన్ను ఇంకెవరు అర్థము  చేసుకుంటారు. నేను దూరంగా వెళ్లినా నీలోనే ఉంటాను. నీతోనే ఉంటాను అనగానే.....

యశోధర కాస్త నా మనస్సులోని మనోభావాలను చదవసాగింది. అంటే ఈయన తన సంకల్ప సిద్ధి కోసము అనుభవ పాండిత్యజ్ఞానము పొందుటకు ధ్యానసిద్ధుడైన తపస్విగా ఏకాంతముగా.....ఒంటరిగా వెళ్లి మారాలని అనుకుంటున్నారని నేను చెప్పకపోయినా  ఇట్టే గ్రహించింది. పైగా నేను అనుకున్నది సాధించగల కారణజన్మ సమర్థుడని ఆమె నమ్మకం. ఆమె వాస్తవంగా ఇది గ్రహించిన ప్రస్తుత పరిస్థితుల గూర్చి ఆలోచించడం  మొదలు పెట్టింది. బ్రహ్మజ్ఞానము పొందడము అలాగే ఆత్మసాక్షాత్కార అనుభవ అనుభూతులు పొందడము అనేది ఒక రోజులో, ఒక రాత్రిలో జరిగే పనికాదు. దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికి తెలియదు. మరి అన్ని సంవత్సరాల పాటు ఈయన విరహ వేదనను, మనోవేదనలు, వైఫల్యాలు, అవమానాలు, సన్మానాలు ఎన్నింటినో తను ఒంటరిగా.... నెలల వయస్సు కొడుకుతో మాత్రమే భరించవలసి ఉంటుందని ఈమె గ్రహించి....

"స్వామి. మీ ప్రయాణము ఎప్పుడు?" అని మాత్రమే అడిగింది.

దానికి నేను వెంటనే "గోపా. ఈ రాత్రికి. గమ్యము తెలియని ప్రయాణమునకు వెళ్లుతున్నాను. నా గుండెలోని బాధను తగ్గించుకోగానే నీ దగ్గరకి మళ్లి వస్తాను. అప్పుడిదాకా నీవు ఒంటరిగా.... ఏకాంతముగా" అని నేను ఏదో అనబోతుండగా..... గోపా వచ్చి తన బిగి కౌగిలిలో నన్ను బంధించి మౌన వేదన పడసాగింది. సమయము ఎలా గడిచినదో నాకు తెలియదు.

                 నాన్నగారి నుండి పిలుపు వచ్చేసరికి మేమిద్దరము ఈ లోకమునకు వచ్చి నేను కాస్త మా నాన్నగారి దగ్గరికి బయలుదేరినాను.

*** *** *** *** *** ***

కులకర్ణి అలాగే త్రివేది కలిసి జేసి ఉండే ఇంటికి చేరుకున్నారు.బయట ఉన్న అధికారులు ఇంక జేసి కారు ఇంటికి రాలేదని చెప్పడముతో చేసేది ఏమి లేక ఖాళీగా ఉండలేక వీరిద్దరు ఈమె ఇంటి లోపలికి ఏమైన ఆధారాలు దొరుకుతాయేమోనని వెళ్ళి అక్కడున్న అన్ని గదులను తమ నిశిత దృష్టితో పరిశీలించి శోధించి వెతుకుతుండగా వీరికి ఒక చీకటి గది కనబడినది.ఆ గదిలోపలకి వెళ్ళి లైట్ వేసి చూస్తే జేసి విచారించిన కేసు వివరాలు వాటికి సంబంధించిన ఫోటోలు గోడకి అమర్చి ఉన్నాయి.అంటే కేసులు విచారించేటపుడు పోలీసులు లేదా సి.బి.ఐ. ఆఫీసర్లు అంతాగూడ తమకి దొరికిన ఆధారాలను గోడకి ఉన్న బోర్డులకు అతికిస్తూ వాటిని విచారణలో విశ్లేషిస్తూ ముందుకి సాగుతారు.కాని కులకర్ణి దృష్టి ఈ గోడకి ఉన్న బోర్డు మీద ఉన్నచోట ఆగిపోయి నొసలు ముడివేస్తూ చిన్నగా విజిల్ వేస్తూ అక్కడికి వెళ్ళి చూడగా ఎదురుగా   ది బుద్ధ కోడ్ అన్న స్టిక్కర్ క్రింద ఏదో డైమండ్ ఆకార తాళం చెవి ఫోటో ఉన్నట్లుగా గమనించాడు.ఏదో సందేహము వచ్చి తన చేతిలోని ఫోన్ లోంచి అంబేద్కర్ చేతిలో ఉన్న తాళం చెవి గమనిస్తే అది పద్మాకారముగా ఉంటే ఇది మాత్రము డైమండ్ ఆకారముగా ఉండేసరికి అంటే వీళ్ళకి ఈ తాళం చెవి దొరికి ఉండాలి.దీనికోసము వీళ్ళు రాత్రిపూట మ్యూజియముకు వచ్చి ఉండాలి.అంటే ఇక్కడ పద్మాకార తాళం చెవి  ఫోటో లేదు అంటే వీళ్ళకి ఈ తాళం చెవి  కనిపించలేదు అన్నమాట.లేదా వీళ్ళు వచ్చే లోపల ఆ తాళం చెవి ని మాయం చేసి ఉంటారు.ఎవరు చేసి ఉంటారు.అంటే ఈ లెక్కన అంబేద్కర్ శవము దగ్గర డైమండ్ తాళం చెవి  అలాగే పద్మ తాళం చెవి  ఉండి ఉండాలి.పద్మ తాళం చెవి  తన ఎడమ చేతిలో ఉన్నట్లుగా ఫోటోలు చెపుతున్నాయి.మరి డైమండ్ తాళం చెవి  ఎక్కడ ఉన్నదని వీళ్ళు ఎలా తెలుసుకున్నారు.

అలాగే పద్మ తాళం చెవి  ఎవరు ఎత్తుకొని వెళ్ళారు అనే సందేహము రావడంతో చచ్చిన అంబేద్కర్ శవము యొక్క కళ్ళమీద దృష్టి యధాలాపముగా పడేసరికి

ఆ కళ్ళలో ఒక కన్ను  మాత్రమే తెరచుకొని ఉన్నట్లుగా కనిపించేసరికి ఏదో ఒక సందేహము వచ్చి ఆ కన్నును విపరీతముగా జూమ్ చేసి చూడగా కంటిలోపల డైమండ్ గుర్తు ఉన్న తాళం చెవి  కనబడేసరికి

అంటే గది సీలింగ్ పై ఈ తాళం చెవి ని ఉంచి దానిని తెరిచి ఉన్న కన్నుతో చూస్తూ ఇతను చనిపోయి ఉంటాడు.ఈ విషయము నిర్వాణలామా వివేకబుద్ధితో తెలుసుకొని ఈ తాళం చెవిని తీసుకొని వెళ్ళి ఉండి ఉంటాడు అనుకుంటూ అంటే శవము దగ్గర పోలీసు జాగిలాలు గది సీలింగ్ వైపు చూసి ఎందుకు అరచినాయో కులకర్ణికి అర్ధమై….

మనుష్యులు కన్న కుక్కలు నయము అన్నమాట.వీటికున్న గ్రహణశక్తి ముందు మనుష్యుల శక్తి ఏపాటిది అనుకుంటూ  

ఆ గది నుండి బయటకి వస్తూ

త్రివేది.చచ్చిన అంబేద్కర్ శవమును మేము దర్శించుకోవడానికి వచ్చేముందు ఎవరైనా అక్కడికి వచ్చారా?” అనగానే

 త్రివేది కొద్దిసేపు అలోచించి సార్.ఎవరో ఒక బౌద్ధ సన్యాసి అక్కడికి వచ్చి చివరిసారిగా ఈయన శవమునకు నమస్కారము చేసుకుంటానని చెప్పి లోపలకి వెళ్ళాడు అనగానే   

త్రివేది. అలా వెళ్ళిన వాడే సన్యాసి రూపములో వచ్చిన అంగుళీమాల నరహంతకుడు.అదే దేవదత్త తొత్తుగాడు.వాడే అంబేద్కర్ చేతి నుండి పద్మ తాళం చెవి  తాళం చెవిని దొంగిలించాడు.ఈ విషయాలు అక్కడ కాపలా కాస్తున్న మనవాళ్ళకి తెలియదు.మరి వాళ్ళు అక్కడ ఉండి ఏమి చేస్తున్నారో వాళ్ళకే తెలియదు.ఒక నరహంతకుడిని చేతులారా విడిచిపెట్టారు.ఆయన ప్రాణాలు అడ్డుపెట్టి కష్టపడి దాచి ఉంచిన రహస్యమును ఒక దేశద్రోహి చేతికి వెళ్ళే విధముగా మనమే చేశాము.సిగ్గుచేటు.రక్షించవలసిన మనమే ఇలా చేస్తే ఎలా?

సార్.ఇంతకి ఏమైంది?”

త్రివేది.నిజానికి అంబేద్కర్ తన పరిశోధనను రెండు భాగాలుగా చేసి రెండు తాళం చెవులుగా వాటిని ఆధారాలుగా చేశాడు.ఒక తాళం చెవిని అదే పద్మాకార తాళం చెవిని ఎడమ చేతిలో పెట్టుకుంటే మరో తాళం చెవిని అదే డైమండ్ తాళం చెవిని సీలింగ్ కి అంటించి చనిపోయాడు.ఈ వివరాలు మనము తెలుసుకోలేకపోయాము.మనకన్నా ముందుగానే మన శత్రువులలో దేవదత్త తెలుసుకొని పద్మ తాళం తీసుకొని వెళితే నిర్వాణలామా కాస్త మణి తాళం చెవి  తాళం చెవిని తీసుకొని వెళ్ళిపోయిన తరవాత ఇపుడు మనము తెలుసుకొంటున్నాము.

సార్.అయితే ఇపుడు ఏమి చేయాలి?.

త్రివేది.చేయడానికి ఏముంది.అధారాలను దొంగల చేతులలో, దేశద్రోహుల చేతిలో ఉంచాము.వాళ్ళు దొరికేదాకా లేదా వాళ్ళు మనకి దొరికించుకొనే విధముగా ఆలోచనలు చేయడము తప్ప ఏమి చేయలేము.ఎటూ జేసి మేడమ్ తన ఇంటికేసి వస్తోందని అన్నారు గదా.ఆమెను పట్టుకొని విచారణ చేస్తే వాళ్ళ పరిశోధన వివరాలతో మనకి ఏమైన అధారాలు దొరుకుతాయేమోనని ఎదురు చూడాలి

అనుకుంటూ ఇంటి బయటికి వచ్చి తమ కారులో కూర్చొని సిగార్ వెలిగించి ఎదురు చూస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి