16 భాగం

 

16

అసలు 'సత్యం' ఒక్కటే అయినప్పుడు ఇన్ని మతాలెందుకు? ఇన్ని ధర్మాలెందుకు? ఇన్ని ఆచార సాంప్రదాయాలెందుకు? ఇన్ని కులాలెందుకు? అనేదే నా ప్రశ్న. మతాలకు అతీతమైనదే 'మానవత్వం' అనేదే నా అభిమతం. కులాలకి అతీతమైనదే  'మానవకులం' అనేది నా అభిమానం. పంచభూతాలకి లేని కుల,మత పిచ్చి.... వాటితో పుట్టి పెరిగే మనకెందుకో ఒకసారి ఆలోచించు. ఒక మతమెక్కువ. మరో మతము తక్కువా? ఎలా అవుతుంది. అన్ని మత ధర్మాలు ఒకే 'సత్యము'ను  చెపుతున్నప్పుడు ఈ తారతమ్యాలెందుకు? ఎవరి మతము వారికి ఎక్కువ. అంతేకాని ఇతరుల అభిమతాలను, మతాలను, కులాలను తక్కువ చేసి చూడటం, మాట్లాడటం, బాధించడం, వేధించడము  ఎందుకో? ఒక్కసారి ఆలోచించండి. నా మనోవేదన  మీకు అర్థమవుతుంది.

ఎవరి మత ధర్మాలను వాళ్లు గౌరవించండి.పాటించండి. ఆచరించండి. మత మార్పిడులు చేసుకోకండి. మత ధర్మాలను మంట కలపకండి.

అలాగే యజ్ఞ యాగాలు, హోమాలు, పూజల క్రతువులలో జంతుబలి ఇవ్వడము నిరసించాను. వ్యతిరేకించాను పెద్ద ఉద్యమమే చేపట్టాను.వాటికి బదులుగా వీటిని చేసేవారిని బలిదానము చేస్తే ఫలితాలు బాగా వస్తాయని, అని ప్రశ్నించేసరికి ఎవరుగూడ సమాధానం ఇచ్చేవారు గాదు. దానితో జంతు బలి కార్యక్రమాలు కనుమరుగు అయ్యే విధంగా నా హిత బోధ అలాగే ధర్మబోధ చెయ్యాలని నా మనస్సు పరి పరివిధాలుగా ఆవేదన పడుతూండేది. పురిటి గది నుంచి వల్లకాటి వరకు పురోహితుల మంత్రాలకు ఎలాంటి ప్రయోజనాలు లేవని... అలాగే పవిత్ర గ్రంధాలు చదవడము వలన ఎలాంటి ప్రయోజనము లేదని అలాగే మత ధర్మాలు మత నియమాలు పాటించడము  వలన సంస్కారము కలుగదని జ్ఞానము అబ్బదని నేను తెలుసుకున్నాను. దానితో శబ్ద పాండిత్యము కన్న అనుభవ పాండిత్యము మిన్నయని గ్రహించాను. దానితో ధ్యానము మాత్రమే సత్యము వైపు నడిపిస్తుందని.... ధ్యానం గురించి  అనుభవజ్ఞుల అనుభవాల ద్వారా తెలుసుకున్నాను.

*** *** *** *** *** ***

జేసి యధావిధిగా తన కారును వీళ్లు నివాసముండే కాకా హోటల్ దగ్గర ఆపేసరికి ఈ హోటల్ కి ఎదురుగా పోలీసులు తన ఆఫీసర్ లు ఉండేసరికి జేసికి విషయము అర్ధమై తాము ఉన్న చోటు గూడ తెలుసుకున్నారని గ్రహించి  కారును వాళ్లు గమనించకుండా నేర్పుగా ఓర్పుగా అక్కడ నుంచి తప్పించి మరో కాక హోటల్ వైపు దారితీసింది.

కళ్ళు తెరిచిన నిర్వాణలామా వెంటనే జేసి.మనము ఎక్కడికి వెళ్ళుతున్నాము?మనము ఉన్న కాకా హోటల్ కి కాదా?”

లామాజీ.మనము ఉన్నచోటు మన పోలీసుల బాబాయిలకి తెలిసిపోయింది.వాళ్లకి తెలియకుండా తప్పించుకొని మరో హోటల్ వైపుకి వెళ్లుతున్నాను అనగానే

జేసి. ఆ హోటల్ ఈ హోటల్ ఎందుకు?మీ నాన్న గది లాకర్ ఉన్న హోటల్ వైపుకి కారును పోనివ్వవచ్చుగదా. పోలీసులకి ఈ విషయము తెలుసుకొనే లోపుల మనము ఆ లాకర్లో ఏముందో తెలుసుకోవాలి.అక్కడ గూడ పోలీసు నిఘా పెట్టే లోపుల మనము జాగ్రత్త పడితే మంచిది గదా అనగానే

లామాజీ.మీ ఆలోచన నాకు నచ్చింది.ఒక అరగంట కారు ప్రయాణము చేస్తే మనము మా నాన్నగారు ఉన్న హోటల్ కి చేరుకోవచ్చును.అది ఎక్కడ ఉన్నదో పోలీసులు తెలుసుకొనే లోపల మన పని కానిచ్చుకొని రావచ్చును అంటూ అమిత ఉత్సాహముతో అమిత వేగముగా ఆ హోటల్ కి కారు పోనిచ్చింది.

ఇలా వీరందరు హోటల్ కి వెళ్లుతున్న సమయములో అనుకోని విధముగా ఇబ్బందిగా ఆనందభిక్షువుకి మూత్రవిసర్జన సమస్య వచ్చినది.దానితో కారును ప్రక్కన ఆపమని జేసిని అడిగితే వెంటనే ఆమె కారు ఆపినది.దానితో రోడ్డు ప్రక్కనే ఉన్న పొదలలో ప్రకృతి కార్యమును పూర్తి చేసుకొని

ఆనంద భిక్షువు వస్తుండగా..

పొదల మధ్యలో స్పృహ తప్పి పడియున్న ఒక వ్యక్తి కనిపించేసరికి భయము వేసి కారు దగ్గర ఉన్న తమ వారిని పేర్లు పెట్టి పిలువగా గబా గబా నిర్వాణలామా అలాగే జేసి కాస్త ఆనందభిక్షువు ఉన్న  చోటుకి వచ్చి చూస్తే అక్కడ మూలుగుతూ ఉన్న వ్యక్తి పడిపోవడము గమనించిన వీరిద్దరు గూడ భయాందోళనతో ఆ వ్యక్తిని సమీపించి ముక్కు దగ్గర వ్రేలు పెట్టి చూడగా శ్వాస ఆడుతోందని తెలుసుకొని తన చేతిలో ఉన్న మంచినీళ్లను నిర్వాణలామా కాస్త ఈ అపరిచిత వ్యక్తి మీద చల్లేసరికి వాడికి స్పృహ వచ్చి మాట్లాడలేని స్థితిలో ఉండటముతో తనకి నీళ్లు గావాలని సైగ చేయడముతో త్రాగడానికి నీళ్లు ఇవ్వగానే

నీళ్లు తాగి కళ్ళు తెరిచి స్వామి. నా ప్రాణాలు కాపాడు.అలాగే నన్ను పోలీసులు తరుముతున్నారు.వాళ్ల నుంచి నన్ను రక్షించండి. మీ మేలును ఈ జన్మలో మర్చిపోలేను అంటూ స్పృహ తప్పేసరికి వీళ్లకి ఏమి చేయాలో అర్ధముగాక చూస్తూ చూస్తూ రోడ్డుమీద అనాధ శవములాగా ఇతడిని వదలిపెట్టడము ఇష్టము లేక తమతో పాటు ఇతనిని గూడ తమ కారులో ఎక్కించుకొని అంబేద్కర్ బస చేసిన హోటల్ కి వెళ్ళారు.

హోటల్ లోపలికి నిర్వాణలామా అలాగే జేసి మాత్రమే వెళ్లారు.మిగిలిన ఆనందభిక్షువు అలాగే అపరిచిత వ్యక్తి కారులోనే బయట ఉండిపోయారు.అక్కడ ఉన్న హోటల్ సిబ్బందికి తమ చేతిలో ఉన్న లాకర్ కీ చూపించగానే

ఓ.ఇదా.అంబేద్కర్ సార్ ది గదా. ఆయన మీకు ఎలా తెలుసు?” అనగానే

జేసి అందుకొని నేను ఆయన కూతురుని అనగానే..

అవునా. అయితే ఈ పుస్తకములో సంతకము అలాగే మీ ప్రస్తుత అడ్రెస్సు వివరాలు ఫోన్ నెంబరు రాయండి.ఈ లోపల ఆ లాకర్ లో ఉన్న వాటిని మీ దగ్గరికి తీసుకొని వస్తాను అంటూ ఒక సిబ్బంది కాస్త ఆ లాకర్ కీ తీసుకొని లోపలికి వెళ్లడముతో ఈ లోపల జేసి కాస్త తప్పుడు సమాచారమును పుస్తకములో నింపడము ప్రారంభించినది.

ఈ లోపల నిర్వాణలామా అక్కడున్న వస్తువులను పరిశీలించి చూస్తుండగా అక్కడ గోడల మీద అనుమానితుల ఫోటోలలో తమ ముగ్గురి ఫోటోలు పెట్టి ఉండటము గమనించి

వెనువెంటనే జేసి దగ్గరకి వచ్చి కను సైగ ద్వారా ఫోటోలను చూపించగా జేసికి అసలు విషయము అర్ధమై అంటే ఈ లెక్కన ఈ క్షేత్రములో అన్ని హోటల్స్ యందు తమ ఫోటోలను అనుమానితులుగా చేర్చి ఉంటారని గ్రహించి లోపలికి సిబ్బంది రాక కోసము చాలా ఇబ్బందిగా చూడసాగింది.

ఈ లోపల ఆ హోటల్ మేనేజర్ గారికి వీళ్ల ముఖాలను ఎక్కడో చూసినట్లు ఉన్నదని అనుకొని గోడ మీద ఉన్న అనుమానితుల ఫోటోలకేసి  చూస్తూ అవును. నిజమే.నిన్న రాత్రి పోలీసులు తమ హోటల్ కి వచ్చి ముగ్గురి అనుమానితుల ఫోటోలు అతికించమని ఒకవేళ వస్తే తమకి సమాచారము ఇవ్వమని చెప్పిన విషయము గుర్తుకురాగానే పోలీసులకి వీళ్లు వచ్చిన విషయము చెప్పాలని ఫోన్ దగ్గరకి వెళ్లుతుండగా..

ఇది గమనించిన జేసిలో మరింత ఆందోళన పెరగగా

ఇంతలో లాకర్ కీ  తీసుకొని లోపలికి వెళ్లిన  సిబ్బంది ఒక ఐరన్ బాక్స్ ను తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టి పెట్టగానే నిర్వాణలామా దానిని అందుకొని ఈ బాక్స్ ను తీసుకొని హుటాహుటిగా ఈ హోటల్ నుండి వీరిద్దరు కంగారు కంగారుగా బయటికి వస్తుండేసరికి

ఇది గమనించిన ఆ హోటల్ మేనేజర్ వెనుక నుంచి సార్.మేడం.మీరు ఎక్కడికి వెళ్ళుతున్నారు?మీ కోసము పోలీసులు వస్తున్నారు.కాసేపు ఆగండి అంటూండగానే

తమ దగ్గరిలో పోలీసు జీప్ హారన్ లు వినిపించేసరికి వీరిద్దరు ఏ మాత్రము ఆలోచన చేయకుండా అక్కడే ఉన్న తమ కారులో ఎక్కి తన స్వంత ఇంటివైపుకి శరవేగముతో జేసి కాస్త కారును పోనిచ్చసాగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి