32 భాగం

 

32

ఈ ప్రాంతములో ఉన్న ఉద్రక మహర్షి ఆశ్రమానికి నేను చేరుకున్నాను. సుమారుగా ఈయనకి 75 సంవత్సరాల వయస్సు ఉంటుంది. నాకు ఈయన ప్రాధమిక పాఠాలుగా ఆసనాలు అలాగే ధ్యాన ప్రక్రియ విధానము నేర్పించారు. గాకపోతే నా రోజుల ధ్యాన నిష్ఠను చూసిన ఆయన ఆశ్చర్యానందము పొందుతూ ఇతను ధ్యానానుభవాలులో 80 % పొందినానని గ్రహించి నా దగ్గరికి వచ్చి కలిసి నా తొలి గురువు వద్ద నేను పొందిన సాధనానుభవాలన్నింటిని తెలుసుకొని సిద్ధా. మంచిది. కాని సాధనలో నువ్వు చేసిన తప్పు ఏమిటంటే ప్రపంచము అశాశ్వతమని ధారణ చేశావు. బాగానే ఉంది. కాని సాధన చేసే సాధకుడి పరిస్థితి ఏమిటి? సాధకుడికి తాను ఉన్నాననే స్పృహ నిత్యము ఉండనే ఉంటుంది గదా. స్పృహ ఉంది అంటే జ్ఞాన చైతన్యమంటుంది గదా. మరి అలాంటప్పుడు నువ్వు పూర్తిగా శూన్యత
స్థితి పొందినట్లు కాదుగదా. అంటే స్పృహ ఉన్నంత కాలము శూన్యం కాదు. దానిని పూర్తిగా పూర్ణస్థితి శూన్యం పొందినట్లు కాదుగదా. ఈ లెక్కన చుస్తే భౌతిక, చేతన, అచేతన స్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి నువ్వు భౌతిక స్థితిని పొందావు. కాని చేతన, అచేతన స్థితులను పొందడము కష్టము. ఎందుకంటే చేతనములో అచేతనస్థితి అలాగే అచేతన స్థితిలో చేతన స్థితి ఉంటాయి. ఈ రెండు స్థితులు దాటినప్పుడే సాధకుడు పూర్ణ శూన్యస్థితి పొందగలడు.కనుక ఈ పూర్ణ శూన్యము పొందడము నా అభిప్రాయం ప్రకారము అసాధ్యం అని అనుకుంటున్నాను అనగానే....

వెను వెంటనే గురూజీ. రాతికి అలాగే కొయ్యకి అచేతనస్థితి ఉంటుంది గదా అనగానే...

సిద్ధా. ఈ ప్రకృతిలో చేతన,అచేతనస్థితి, భౌతిక పదార్ధాలున్నాయి. కొయ్యకి, రాతికి చలనము ఉండకపోవచ్చు కాని వాటిని విభజించుకుంటూ పోతే వాటిలో సూక్ష్మంగా చైతన్య శక్తి ఉంటుంది. దీని వలన మనకి గావాలసిన విగ్రహమూర్తులను శిల్పులు తయారు చెయ్యగలుగుతున్నారు. మనలాంటి జీవులలో చైతన్యశక్తి ఉండనే ఉంటుంది. మనము భౌతిక స్పృహ లేకుండా అచేతన సమాధి స్థితి పొందిన గూడ మనలో అంతర్గతముగా సూక్ష్మముగా చైతన్యశక్తి ఉండనే ఉంటుంది. ఈ లెక్కన ప్రకృతిలో ఏది పూర్తిగా జడ పదార్ధాలు కావు అలాగే పూర్ణ చైతన్యాలు కావు అనగానే....

గురూజీ. నేను ధ్యానము చేసి ఈ విషయము రూఢీ చేసుకుంటాను. దానితో నేను కాస్త చేతన అచేతన స్థితుల గూర్చి ధారణ చెయ్యసాగాను.

కాని చైతన్యస్థితి అనుభవాలను దాటకలిగాను కాని అచేతనస్థితిని నా దేహము పొందలేకపోయింది. అప్పుడు దేహము అశాశ్వతము అని ధారణ చెయ్యసాగాను. కాని కొన్ని క్షణాలు మాత్రమే నా దేహము అచేతనములోనికి వెళ్లి ఏదో కారణము వలన వెనక్కి వచ్చి చైతన్యమవుతోంది.

దీని కారణము తెలుసుకోవాలని గురువు దగ్గరికి వెళ్ళితే

నా సాధన ప్రతిభకి ఆశ్చర్యము పొందుతూ...

నాయనా. సిద్ధా. నీ సాధన మార్గం వేరు. మా సాధన మార్గం వేరు. మాది అంతా చైతన్య సిద్ధి సాధనయే అంతిమస్థితి. కాని నీ సాధనా మార్గము చేతన అచేతన స్థితికి అతీతమైన స్థితి. అది పొందడము ఎలాగో నాకు తెలియని స్థితి అనగానే...

గురూజీ. మీ అభిమానాన్ని ఆశీస్సులుగా స్వీకరిస్తాను. నా మార్గములో ముందుకి వెళ్లనియ్యండి. ఇంక నాకు సెలవు ఇప్పించండి అని ఆయన అనుమతి తీసుకొని

ఈ ఆశ్రమమునకు వీడ్కోలుచెపుతూ ముందుకి సాగుతుండగా... నాలో అంతరమధనము మొదలైంది. అది ఏమిటంటే సమాధిస్థితిలో వందల సంవత్సరాల పాటు జడముగా అచేతనస్థితిలో ఉండి ఏమి ప్రయోజనము? మనిషి మనుగడకి ఉపయోగించని ధ్యానము వలన వారికి తప్ప ఎవరికి ఉపయోగముండదు గదా. భూలోకములో కష్టాలు, బాధలు అనుభవించి సమాధిలో సాధన చేసి స్వర్గములో సుఖపడాలన్న కోరిక ఉండటం ఎంతవరకు సమంజసము? ఇలాంటి తపస్సుసిద్ధి వలన మనుష్యులకి ఏమి ఉపయోగం? సుఖాలు ఆశించడం అలాగే స్వర్గం ఆశించడం రెండూ గూడ సమానమే గదా అని నాకు అన్పించసాగింది. మనుష్యుల కష్టాలు తొలిగే మార్గము చెప్పే సద్గురువులు ఇంకా ఎవరూ ఉండరని.... ఎవరుగూడ దీనిని తెలుసుకోలేరని... దానితో నేను ఎవరి బోధనలు అలాగే ఎవరి సాధనా విధానాలు అవసరము లేదని నాకు నేనే గురువు అని మనో నిశ్చయము చేసుకొని డాంగసిరి పర్వత శ్రేణుల వైపు నా ప్రయాణం కొనసాగించాను.

డాంగసిరి పర్వత శ్రేణులలో నా అభ్యాసమునకు అనువైన ఒక గుహను ఎంచుకొని ధ్యానము చెయ్యడము ఆరంభించాను. ధ్యానము చేస్తుండగా నాకు నా తొలి గురువైన అలారకలామ జ్ఞానబోధ అనగా ప్రపంచము అశాశ్వతము అనే ధారణ ప్రక్రియ గుర్తుకు వచ్చింది. ఇందులో నేను ఉన్నాను అనే స్పృహ ఉంది. దానితో ఇది అసంపూర్ణ సాధనయని... రెండవ మలి గురువైన ఉద్రక మహర్షి జ్ఞానబోధ అనగా దేహం అశాశ్వతం అనే ధారణ, సాధన గుర్తుకు వచ్చింది. కాని ఇందులో చేతన అచేతన స్థితులున్నాయి. దానితో ఇది కూడా అసంపూర్ణ సాధనయని తెలుసుకున్నాను. ఇక దానితో ఈ రెండు ధారణలు అనగా ప్రపంచము అశాశ్వతము- దేహ జీవితం అశాశ్వతము అని నిద్రాహారాలు మాని సాధన ధారణ చెయ్యడము ప్రారంభించాను. కొన్ని రోజుల పాటు సాధన బాగానే సాగింది. సాధన ధ్యాన దీక్షలో యుండగా ప్రేతాత్మలు, దైవాత్మలు కనబడసాగినాయి. జంతువులు దగ్గరిగా వచ్చి వెళ్లుతున్న అనుభవాలు తెలిసేవి. మనము తినేవి మనల్ని తినే జంతువులు వచ్చినను నాలో ఎలాంటి చలనముండేదిగాదు. 

దానితో నాలో భయము లేదు. అలాగే శరీరము పైన మోహము,వ్యామోహము లేదు. ఆశ,భయం లేవు. సాధన పెరుగుతున్న కొద్ది చెవులలో భయంకర శబ్దాలు రావడము మొదలైంది. తల పగిలిపోతున్న బాధ. శరీరము నిప్పులలో కాలుస్తున్నట్లుగా వేడి వేడి సెగలతో మండుతున్నట్లుగా అన్పించేది. రాను రాను నా దేహస్థితి కాస్త అస్థిపంజరము లాగా మారిపోయింది. ఇలాంటి స్థితిలో యుండగా శరీరాన్ని శుష్కింప చేసుకోవడము వలన ఆత్మహత్య చేసుకున్నట్లేగదా. ఇక జ్ఞానము పొందే అవకాశమే లేకుండా పోతుందిగదా. అంటే ఈ లెక్కన శరీరము అలాగే మనస్సు అనేవి వేరు వేరు కావని... శరీరాన్ని బాధపెడితే మనస్సు బాధపడుతుంది. మనస్సుకి  బాధ కలిగితే అది కాస్త ధ్యానము మీద అలాగే శరీరము మీద ప్రభావము చూపుతుందని అంటే శరీరము అలాగే మనస్సు అనేవి స్పందన-ప్రతిస్పందన అవుతుందని గ్రహించి... ఆ నాటితో పాత సాంప్రదాయాలతో చేసే ధ్యాన ప్రక్రియలకి స్వస్తి పలికి... సరికొత్త ఒరవడి విధి విధానము కనిపెట్టాలని సంకల్పించుకొని ఆ గుహ నుండి బయటికి వచ్చి ఆ ప్రక్కనే ఉన్న నైరంజర నదీ తీరానికి స్నానము చెయ్యడానికి బయలుదేరాను. స్నానము చేసి ఒడ్డుకు వచ్చిన తర్వాత అక్కడ నాకు ఒక స్త్రీ మూర్తి శవము కనబడింది. ఆశవమునకు చుట్టియున్న కాషాయరంగు చీరెను తీసుకొని ఆ నగ్నస్త్రీమూర్తి దేహానికి నాకు దీక్షా వస్త్రము ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని ఆ ప్రక్కనే యున్న ఉరువిల గ్రామ సమీపమునకు వచ్చేసరికి చాలారోజుల పాటు నిద్రాహారాలు లేకపోవడముతో ఆ పొలిమేరలో సమీప అమ్మవారి ఆలయము దగ్గర స్పృహ తప్పి పడిపోవడము జరిగింది.

*** *** *** *** *** ***

అపరిచిత వ్యక్తి తుపాకి చేతిలో బందిగా మారిన విభూధినాధ్ ను చూసిన నిర్వాణలామా బృందము ఒక్కసారి బిత్తరపోయినది.వీడిని చూడగానే నిర్వాణలామా గుర్తుపట్టి

మిత్రమా.అంగుళీమాల.ఎలా ఉన్నావు?మనము కలసి చాలా రోజులు అయినది గదా అనగానే

ఈ గొంతు ఎక్కడో పరిచయముంది అనుకొని అంగుళీమాల వెంటనే అంటే నువ్వు పవన్ శర్మ గదా.వారే నా మిత్రుడు.వారే నా శత్రువు గూడ.నువ్వు ధర్మదీక్ష తీసుకొని నిర్వాణలామా గా మారిపోయావన్నమాట.అంటే నువ్వే బుద్ధగయ క్షేత్రములోని కాగిత పక్షి యంత్రమును నాశనము చేశావు అన్నమాట.నువ్వు అనుకోలేదు.ఒకవేళ నేను ఊహించి ఉంటే చచ్చినవాడి మీద ప్రయోగించేవాడినికాను.చచ్చేవాడివి అయిన నీమీద ప్రయోగించేవాడిని అనగానే

అంగుళీమాల.మన సంగతులు తరవాత మాట్లాడుకుందాము.ప్రొఫెసర్ ని వదలిపెట్టు.లేదంటే నీ ప్రాణాలు నా చేతిలో పోతాయి అనగానే

అంగుళీమాల వెంటనే నిర్వాణలామా.నీవు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు.నేను ఈ ఒక్క గన్ తో రాలేదు.నా శరీరములోపల మానవ బాంబ్ పెట్టుకొని వచ్చాను.ఒకవేళ నీవు ఈ బాక్స్ ను డీకోడ్ చేయకపోతే ఈ మానవ బాంబ్ పేలుతుంది.నాతోపాటుగా ఇక్కడున్న వారంతా గూడ మాడి మసై పోతారు.నేను చెప్పినట్లు చేయక తప్పదు.పిచ్చి వేషాలు ఎవరు వేయకండి.నా చేతులలో అందరు అకారణముగా చస్తారు అనగానే

నిర్వాణలామా ఆలోచనలో పడ్డాడు.పైగా అంగుళీమాల మహా మూర్ఖుడు.వాడు అనుకున్న పని జరుగకపోతే వాడిలో సైకో నిద్ర లేస్తాడు.వాడు నిద్రలేస్తే మిగిలిన వారందరు గూడ శాశ్వత నిద్రలోకి వెళ్ళవలసినదే అనుకొని జేసి చేతిలో ఉన్న మణి బాక్స్ ను తీసుకొని నిశిత దృష్టితో ఈ బాక్స్ మొత్తము పరిశీలించి చూడగా అందులో ఈ బాక్స్ కి నలువైపుల ఒక చోట గుఱ్ఱము తల,సింహము తల,ఏనుగు తల,కోతి తల బొమ్మలు ఉండటము గమనించాడు.అంటే తన దగ్గర ఉన్న కోడ్ కి ఈ జంతువుల తలలకి ఏమైన సంబంధము ఉన్నదా?అని ఆలోచిస్తూ ఒకవేళ ఉంటే ఏ జంతువు తలతో ఈ కోడ్ కి సంబంధము ఉన్నదో ముందు తెలుసుకోవాలి.ఇపుడు అన్ని జంతువుల తలలను ఈ కోడ్ ను డీకోడ్ కి ఉపయోగించే సమయము లేదు.సమయము తీసుకున్న కొద్ది అంగుళీమాలలోని సైకో సహనము కోల్పోతాడని తెలుసు కాబట్టి ఈ జంతువులలో ఏ జంతువు తల ఈ కోడ్ కి సరిపోతుంది అలాగే ఎలా ఈ జంతువు తలతో డీకోడ్ చేయాలని అనుకుంటూ అసహనముగా కుర్చిలోంచి లేచి కిటికి దగ్గరికి వెళ్ళగా అక్కడ రోడ్డు మీద ఒక వ్యక్తి గుఱ్ఱము మీద వెళ్ళుతూ లీలగా కనిపించాడు.అలాగే ఇంటిబయట ఉన్న పోలీసులు అధికారులు ఇంటిలోపలకి వస్తున్న దృశ్యము చూడగానే నిర్వాణలామా మనస్సు స్థిమితబడి అంటే వీరి వలన మా ప్రాణాలు రక్షింపబడతాయని అనుకొని రోడ్డు మీద గుఱ్ఱము పోతూ కనిపించినదానిని బట్టి ఈ కోడ్ లో గుఱ్ఱము ఉండి ఉండాలని అనుకొని మళ్ళీ యధావిధిగా కుర్చి దగ్గరికి వచ్చి కూర్చొని మణి బాక్స్ ను డీకోడ్ చేసే ప్రయత్నము ముమ్మరముగా చేయసాగాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి