24 భాగం

 

24

రాత్రి సమయము అవ్వగానే నేను తోటనుండి బయటికి వచ్చి శయనమందిరమునకు చేరుకొని....

నిద్ర... మెలకువ కాని స్థితిలో ఉన్న యశోధరను అలాగే పూర్తి నిద్రావస్థలో ఉన్న కుమారుడిని నేను కడసారిగా చూసుకొని... వీరిని నిద్ర లేపకుండా... లేపితే... మళ్లి నేనే ప్రయాణమును ఆపుకొనే స్థితి చేరుకుంటానని నాకు అన్పించి.... మౌనముగా వీరిద్దరికి వీడ్కోలు చెప్పి.... శయన మందిరము నుండి బయటికి రాగా....అక్కడ నిద్రమత్తులో జోగుతున్న రాజనర్తకీలు, రాజా పరిచారికలు, రాజ భటులు అందరుగూడ నాకు ఒక్కసారిగా చచ్చిన శవాలుగా కన్పించసాగారు. మౌనముగా అడుగు శబ్దాలు లేకుండా మెల్లగా వీరి అందరిని దాటుకుంటూ అంతఃపురమును దాటగానే.... ఎదురుగా... నా గుఱ్ఱముతో చెన్నా కనిపించడముతో.... వాడి సహాయసహకారముతో కపిలవస్తు పుర వీధులు దాటి పొలిమేరలకి చేరుకొని....

నాకోసము యశోధర దాచి ఉంచిన వస్తువులు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, అన్నింటిని వాడికి ఇచ్చి వేస్తూ.... అలాగే గుఱ్ఱము జీను లోంచి ఒక చుర కత్తిని బయటికి తీసి నా జుట్టును పూర్తిగా కత్తిరించుకొని గుండుగా మారి....

ఆ జుట్టును చెన్నాచేతికిస్తూ....చెన్నా. వీటిని నా గుర్తుగా అమ్మగారిని ఉంచుకొమ్మని చెప్పు. నా సత్యాన్వేషణ పూర్తికాగానే అందరిని కలుస్తానని మరి మరి చెప్పు అనగానే....

స్వామి. రాజకుమారా. నేను మీ సేవకుడిని మీరు ఎక్కడ ఉంటే నేను  అక్కడే ఉంటాను అనగానే....

చెన్నా. నీ ఆవేదన నాకు అర్ధమైంది. ఇప్పుడు నేను రాజకుమారుడిని కాను. సన్యాసిని. ఈ సన్యాసికి సేవకులు ఉండరాదు. నేను చెప్పిన పని చెయ్యి. వీటికి మన వాళ్లకి అందించు అంటూ....

నా గుర్రమైన కంటకము వైపు ప్రేమగా, ఆప్యాయంగా చూస్తూ "కంటకా. ఇన్నాళ్లు నువ్వు నా బరువు మోసావు. నా ప్రయాణ బడలిక తెలియకుండా జాగ్రత్తగా నన్ను తీసుకొని వెళ్లావు.కంటకా. దీనికి నా కృతజ్ఞతలు ఎలా చెప్పగలను. ఇప్పుడు గూడ నన్ను ఒక సురక్షిత అరణ్యమునకు క్షేమముగా చేర్చినావు. నీమేలు ఎన్నటికి మర్చిపోను" అనగానే...

బుద్ధుడి మనస్సు భాష తెలిసిన కంటక గుర్రము కంటివెంట కన్నీరు రావడము మొదలైంది. అయినగూడ నేను చలించలేదు. ఎందుకంటే ప్రాపంచిక విషయాలు దాటిన సన్యాసి స్థితిని నేను చేరుకోవాలి గదా. అనుకొని అరణ్యములోపలికి అడుగులు వెయ్యడము నేను ప్రారంభిస్తే... చెన్నా కాస్త నా గుఱ్ఱమును తీసుకొని మా రాజ్యము వైపు మనో వేదనతో బయలుదేరాడు.

*** *** *** *** *** ***

అంగుళీమాల కాస్త కాశీలో ఉండే విభూధినాధ్ ఎవరో వివరాలు తెలుసుకోవడానికి గది నుండి బయటికి రాగా ఎదురుగా కొంతమంది పోలీసులు ఇతను ఉన్న హోటల్ చుట్టు ఉన్న ఇండ్ల తలుపులు కొడుతూ ఎవ్వరైన అపరిచితవ్యక్తికి ఆసరా ఇచ్చినారేమోనని ఎంక్వైరీ చేస్తూ కనిపించగానే ఎందుకో సందేహము వచ్చి గదికి తిరిగి అంగుళీమాల వెళ్ళిపోయాడు.అంటే నిన్న మ్యూజియములో తను చేసిన లేడి ఆఫీసర్ హత్య గూర్చి ఈ ఆరాలు అని సూచనప్రాయముగా అంగుళీమాల తెలుసుకొని భయముతో

దేవదత్తకి ఫోన్ చేసి గురూజీ.కాశీక్షేత్రములో నేను చేసిన హత్య గూర్చి వివరాలు సేకరించడము మొదలు పెట్టారు. ఒకవేళ నా వివరాలు తెలుసుకొని నా దగ్గరికి వస్తే అని అంటూండగా

తలుపులు కొడుతున్న శబ్దము విని గురూజీ.లైన్ లో ఉండండి.ఎవరో తలుపులు కొడుతున్నారు.తలుపు తీస్తాను అంటూ తీయగానే ఎదురుగా ఇద్దరు పోలీసులు కనిపించగానే వీడి గుండెలో రాయి పడినది.ఫోన్ జారినది.

వాళ్ళల్లో ఒకడు వెంటనే అంగుళీమాల అంటే మీరేనా?నిన్న మీరు ఆ మ్యూజియమునకు వచ్చారు గదా.హత్య జరిగిన ఆ లేడి ఆఫీసర్ తో చివరిసారిగా మీరే మాట్లాడినట్లుగా అక్కడున్న సి.సి. కెమెరాలలో రికార్డ్ అయినది అనగానే..

అవును.నేను వెళ్ళిన మాట నిజమేగాని ఆ హత్యను నేను చేయలేదు.అనగానే

స్వామి.మీరు చేశారని ఎవరు అన్నారు.మీరు దేవదత్త మనిషియని మాకు తెలుసు.సార్ మాకు ఫోన్ చేసి ఆ కెమెరా రికార్డ్ ను మీకు ఇవ్వమని మాకు చెప్పారు.జాగ్రత్తగా ఉండండి.మా వలన మీకు ఎలాంటి ప్రమాదము జరుగదు.ఆ సి.డి. ఇవ్వడానికి మేము వచ్చాము.సార్.ఒకవేళ ఫోన్ చేస్తే ఈ విషయము చెప్పండి అంటూ సి.డి.ఇచ్చి వెళ్ళిపోయారు.

ఫోన్ అందుకొని స్వామీజీ.మీరు నిజముగానే నా గురుదేవుడు. మీ అనుమతి  లేకుండా నాలో ఉన్న సైకో బలహీనతకి గురి అయ్యి నేను చేసిన అనుకోని హత్య నుండి నన్ను రక్షించారు.జీవితాంతము మీకు నేను ఋణపడి ఉంటాను.మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డువేస్తాను.ఇదే నా గురుదక్షిణ అనగానే

అంగుళీ.నేను అడిగిన విభూధినాధ్ వివరాలు ఎవరికి అనుమానము రాకుండా సేకరించి నాకు ఫోన్ చేయి.నీకు ఈ క్షేత్ర పోలీసు అధికారుల నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ఎపుడో ఏర్పాట్లు చేశాను అంటూ ఫోన్ కట్ అయినది.

దానితో వీడు కాస్త గుండె నిబ్బరంతో గది నుండి బయటికి వచ్చి విభూధినాధ్ ఎవరో తెలుసుకొనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి