41 భాగం

 

41

అప్పుడికే నాకు జ్ఞానోదయమై ఏడు వారాలు గడిచాయి. ఈ జ్ఞానమును మొదట నా గురువులు అయిన  ఉద్రక మహర్షికి అలాగే అలారకలామ గురువుకి చెప్పాలని.... ఆ తర్వాత నన్ను వదిలి వెళ్లిపోయిన నా అయిదుగురు మిత్రులకి మరియు నా తల్లితండ్రులకి, నా భార్య బిడ్డకి ఆపై కపిలవస్తు పుర ప్రజలకి నేను తెలుసుకున్న సత్యమును జ్ఞాన బోధ చెయ్యాలని జ్ఞాన ప్రచారము కోసము నేను ఉంటున్న ఊరవిల గ్రామమును వదిలిపెట్టి ఊరి పొలిమేరలకి రాగానే.... నాకు ఒక సన్యాసి ఎదురై... వారి మాటల ద్వారా నా గురువులు ఇద్దరు గతించినారని... వీరి శిష్యులైన నా పంచ మిత్రులు కాస్త వారణాశికి దగ్గరలో ఉన్న మృగదాయి అనే ప్రాంతములోని హరితవనములో ధ్యానాలు చేసుకుంటూ కాలము గడుపుతున్నారని నేను తెలుసుకొని... నా ప్రయాణము అటు వైపుకి కొనసాగించాను. 

           వారణాసికి చేరుకొని నా మిత్రులను చేరుకున్నాను. అపుడికి వారికి నా మీద ఉన్న అనుమాన బుద్ధి పోలేదని నేను తెలుసుకున్నాను. వెంటనే వారితో

"మిత్రులారా. నా సత్యాన్వేషణ ఫలించింది. నాకొక జ్ఞాన మార్గము దొరికినదని అనగానే....

మిత్రులలో ఒకడు వెంటనే....మిత్రమా. నువ్వు ఎప్పుడో సన్యాస ధర్మాలు మరిచి... తిండికి మరిగి ఆడపిల్లతో సరసాలు, సరదాలు చేస్తూ ఎపుడో బాట తప్పావని మాకు తెలుసు అనగానే...

మిత్రమా. నేను మాట అలాగే బాట తప్పలేదు. నా ధ్యాన విధానము మీకు సరిగ్గా అర్ధము కాలేదు. అందుకే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. పుస్తక జ్ఞానము వలన ఎలాంటి ప్రయోజనముండదు. మన ఆలోచనలలో మార్పులు రావాలి. దానికి ధ్యానము చెయ్యాలి అంటే అనుభవ జ్ఞానము పొందాలి. ఇది ఎవరికి వారే సాధించాలి. నా జ్ఞానం అనేది ధ్యాన అనుభవాల వలనే కలిగింది. ఈ అనుభవ ధ్యానము కోసము భోగాలను, సుఖాలను వదిలిపెట్టాలి. ఆ తర్వాత మన శరీర ధర్మాలను గౌరవిస్తూ సాధన చేసుకోవాలి. ఏది అతిగా చెయ్యకూడదు. ఏది మితంగా చెయ్యకూడదు. మధ్యస్తంగా చెయ్యాలి. దీనికి నేను ఏనిమిది సూత్రాలను తెలుసుకున్నాను. అనగా

1. సమ్యక్ దృష్టి,

2. సమ్యక్ సంకల్పం,

3. సమ్యక్ వాక్కు,

4. సమ్యక్ కర్మ,

5. సమ్యక్ జీవనం,

6. సమ్యక్ కృషి,

7. సమ్యక్ స్మృతి,

8. సమ్యక్ సమాధి.

ఈ అష్టాంగ మార్గ సాధన వలన మనము శాంతిని వేరుగా అన్వేషించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే వీటివలన ఏకాగ్రత కల్గుతుంది. తద్వారా ఏకాగ్ర భావములోనికి వస్తాము.ఈ భావము వలన అవగాహన కలుగుతుంది. తద్వారా కలిగే సదవగాహన వలన మనము ఎరుకతో ఉంటాము. ఎరుకతో పని చేస్తాము. అందువలన మనకి బాధలు, కష్టనష్టాలు, హింసలు, ఆవేదనలు తొలిగి ఆనందము ఆపై శాంతి సహజ సిద్ధముగానే కలుగుతాయి.

*** *** *** *** *** ***

ఆనందభిక్షువు ఈ తాళపత్రాల వెనుక ఉన్న విషయము చదివాడని తెలుసుకొని ఈ మణిపద్మ బాక్స్ మూస్తుండగా తన ప్రక్కనే ఉన్న అచేతన స్థితిలో ఉన్న ప్రకృతిలో కదలికలు రావడము నిర్వాణలామా గమనించి ఆశ్చర్యానందమునకు గురి అవుతుండగా ….

ఆమె కాస్త కళ్ళు తెరిచి త్రాగడానికి మంచినీళ్ళు గావాలని నోరు తెరచి అడిగేసరికి సంతోషముగా తన చేతి సంచిలోంచి మంచినీళ్ళు ఇవ్వడము వీటిని ప్రకృతి త్రాగడము ఏకకాలములో జరిగిపోయింది.

ఆ తరవాత ఈ బాక్స్ లోంచి ఏదో సుగంధ పరిమళాలతో గూడిన ఘాటైన వాసన నా ముక్కుకి సోకగానే నాకు స్పృహ వచ్చిందని ప్రకృతి చెప్పగానే

అంటే ఈ బాక్స్ లో ఉన్న దేవతాపుష్పాలు అయిన బ్రహ్మ కమలము అలాగే పారిజాత పుష్పాల సుగంధవాసనలకి ఈమెను యధార్ధ స్థితికి తెచ్చినాయని నిర్వాణలామా గ్రహించి అయితే ఖచ్చితముగా హిమాలయాలలో ఉన్న అగర్తల గ్రామములోని  పాదరస మణి పంచామృత అభిషేకమును ప్రకృతి తాగితే మామూలు మనిషి అవుతుందని అపుడికి కాని నిర్వాణలామాకి నమ్మకము రాలేదు.కుదరలేదు.ఏదైన అనుభవము అయితే గాని ఙ్ఞానము కలుగదు గదా అని అనుకుంటుండగా

స్వామి.మీరు ఏమిటి?ఈ బౌద్ధ సన్యాస దీక్షలో ఉన్నారు? కొంపదీసి నేను పోతానని అనుకొని ఈ పని చేశారా? “ అని ప్రకృతి అడిగేసరికి

ప్రకృతి.అదేమిగాదు.నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు.మామూలు స్థితికి రావాలంటే హిమాలయాలలో ఉండే మణితీర్ధమును నీకు ఇవ్వమని ఒక నాగాసాధువు చెప్పాడు.మరి హిమాలయాలలోకి వెళ్ళాలంటే సాధకుడు పవిత్రముగా పరిశుద్ధముగా కఠిన నియమాలతో ఉండాలంటే మనకి ఏదైన దీక్ష అవసరమని అందులో నాకు గావలసిన మణి వివరాలు ఈ బౌద్ధ ధర్మములో ఉండేసరికి ఈ దీక్ష తీసుకోవడము జరిగింది.

స్వామి.అవునుకాని నేను కోమాలోకి వెళ్ళి ఎన్ని రోజులు అయినది అనగానే

ప్రకృతి.రోజులు కాదు.5సం||రాలు అయినది.అచేతనస్థితిలో మాట పలుకు లేకుండా కేవలము ఆహారము తీసుకుంటూ ఉండిపోయావు.అనగానే 

ప్రకృతి నోటమాట రాలేదు.కొద్దిసేపు ఆలోచించుకొని ….

స్వామి.ఈ అయిదు సం||రాలు జరిగిన విషయాలు చెప్పగలరా?”అనగానే

ప్రకృతి.నీవు వినాలే గాని నా ప్రారంభ దీక్ష నుండి విజయవంతమైన నా సైన్స్ ప్రయోగాలదాకా అన్నీ చెబుతాను అంటూ అక్కడున్న వారందరిని ప్రకృతికి పరిచయము చేసి ఆ తరవాత అన్నీ ఉన్నది ఉన్నట్లుగా వివరించి చెప్పడము మొదలుపెట్టాడు.

ఒక ప్రక్క జేసి దంపతులు మరొక ప్రక్క నిర్వాణలామా దంపతులు ఏకాకిగా బ్రహ్మచారిగా ఆనందభిక్షువు ఎవరి ఆనందలోకాలలో వాళ్ళు ఉన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి