08 భాగం

 

08

దానికి అమ్మ వెంటనే "నాయనా. వేదాలు ఎవరు పడితే వాళ్లు చదవకూడదు. వాటిని బ్రాహ్మణులే చదవాలి. ఇతరులెవ్వరికీ వీటిని చదివే హక్కు లేదు అనగానే....

నాకు కోపము వచ్చి "మనకి ఎందుకు లేదు. చదవడానికి నేర్చుకోవటానికి హక్కు ఏమిటి?”అనగానే....

పూర్వం నుండి వస్తున్న ఆచార వ్యవహారాలు. ఇప్పుడు వాటిని కాదనలేము. కాదంటే మనకి పాపము వస్తుంది...

 నేను వెంటనే "పాపమా. అంటే ఏమిటి? పాపపుణ్యాలు ఎలా లెక్కిస్తారు. నేను రాను. వాటిని వినను.నేను రాను అన్నానని మా నాన్నగారికి నా మీద ఫిర్యాదు చేసుకోండి. నాకు ఇక్కడే బాగుంది అని ఖచ్చితంగా చెప్పేసరికి...."

మా అమ్మ నా మీద ఉన్న ప్రేమకొద్ది నన్ను ఏమీ  అనలేక... నన్ను కాదనలేక... నన్ను బాధపెట్టడము ఇష్టములేక ఆప్యాయంగా నా తలను నిమిరి అక్కడ నుంచి మౌనముగా వెళ్ళిపోయింది.

అమ్మ నా దగ్గర నుంచి వెళ్లిన తర్వాత నేను అలాగే నా బంధు మిత్రుడు కలిసి ఒక చెట్టు క్రింద కూర్చొని తీవ్ర ధ్యానములో మునిగిపోయాను. కొన్ని గంటల తర్వాత నాలో అనుకోకుండా వేదాలు బ్రాహ్మణులే ఎందుకు చదవాలి? ఇతరులు ఎందుకు చదవకూడదు అనే ఆలోచన రావడముతో నా ధ్యాననిష్ఠ భంగమైంది. కళ్ళు తెరిచాను. కనువిప్పు కలిగించాలని అనుకున్నాను.

దానితో ధ్యానము నుండి లేచి సరాసరి మా తండ్రిగారి వద్దకు వెళ్లి నాకు వేదాలు నేర్చుకోవాలని ఉందని దానికి తగ్గ ఏర్పాట్లు చెయ్యమని అడిగాను.

దానికి ఆయన "నాయనా. వేదాలు చదవడము బ్రాహ్మణ ధర్మము. యుద్ధాలు చెయ్యడము మన క్షత్రియ ధర్మము. కాబట్టి నీవు యుద్ధవిద్యల యందు నైపుణ్యము సంపాదించుకో. దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తాను అనగానే....."

 నేను వెంటనే.....నాన్నగారు. మీరు చెప్పినట్లుగా మన క్షత్రియ ధర్మముగా అన్ని యుద్ధ విద్యల యందు శిక్షణ పొందుతాను. అలాగే దానితో పాటుగా వేద జ్ఞాన విద్యను గూడా పొందాలని అనుకుంటున్నాను. అసలు వేదాలలో ఏమి జ్ఞానమున్నదో తెలుసుకోవడములో  ఎలాంటి తప్పు ఉండదుగదా అనగానే....

    *** *** *** *** *** ***

తన పక్షి యంత్రము ప్రయోగము నిర్వాణలామా అను బౌద్ధ సన్యాసి తిప్పికొట్టాడని తెలియగానే అంగుళీమాల తీవ్రమైన ఒత్తిడికి గురియై తనలోని సైకో బయటకి రావడము మొదలైనది.ఆ సమయములో వీడు ఏదో ఉన్మాదిగా మారి తన శరీర భాగాలను గాయాలు చేసుకుంటూ ఆ వచ్చే తన రక్తమును చూస్తూ తమకమును పొందుతూ విపరీతమైన ఆనంద అలాగే బాధ స్థితికి చేరుకొని తట్టుకోలేక స్పృహ తప్పిపోవడము జరుగుతుంటూంది.ఇపుడు కూడా ఇలాగే చేసుకొని స్పృహ కోల్పోవడము జరిగింది.ఈ స్థితి నుండి మామూలు స్థితికి రావడానికి కొన్ని గంటల నుండి కొన్ని రోజులు పైన పడుతుంది.

తన ప్రక్కనే నిర్జీవముగా పడియున్న ఫోన్ నుండి ప్రాణము వచ్చినట్లుగా విపరీతంగా రింగ్ టోన్ ఎవరిదో గుర్తు పట్టి భయపడుతూ దానిని ఎత్తి

స్వామి. నన్ను క్షమించండి. నా  ప్రయోగము త్రిప్పికొట్టేవాడు అక్కడ ఉన్నారని గ్రహించలేకపోయాను. స్వామి.మీరు చెప్పిన పని చేయలేకపోయాను.నాకు మీరు ఏ శిక్ష వేసిన ఆనందముగా భరిస్తాను అనగానే

అంగుళీ. గావాలని చెయ్యలేదు గదా. నీ ప్రయోగము నీవు చేశావు. గాకపోతే ఫలించకుండా ఆపడము జరిగింది.ఇంతకి ఆ అంబేద్కర్ చేతిలో ఉన్న తాళం చెవి సంగతి ఏమి చేశావు?” అనగానే

స్వామి.మీరు చెపితే నేను చేయకుండా ఉంటానా?మీరు నా సద్గురువులు గదా.మీ ఆఙ్ఞయే నా శిరోధార్యము. ఆ తాళం చెవి పట్టుకొని వాడుయున్న గదికి వెళ్ళితే అది కాస్త గోడకి ఉన్న రహస్య సొరంగ మార్గము గదికి తాళం చెవియని గ్రహించి దానిని పెట్టి త్రిప్పగానే లోపలకి వెళ్ళడానికి మెట్లు కనిపించగానే వీటిని దిగుతూ లోపలికి ప్రవేశించాను.



నాకు లోపల గది మధ్యలో ఒక చైనీస్ పెట్టె అంటే ఎనిమిది బాక్స్ లున్న నెస్టెడ్ (nested) బాక్స్ మాత్రమే కనబడినది.ఇక లోపల ఎలాంటి వస్తువులు కాని ఆధారాలు గాని రహస్య మార్గాలు కాని    నాకు అగుపించకపోయేసరికి ఈ బాక్స్ తీసుకొని నా రహస్యగదికి వచ్చాను.

అంగుళీ.దాని లోపల ఏముందో చూశావా?తెరిచావా?”

స్వామి.లేదు.తెరవడానికి వీలుగా ఏమి లేదు.కేవలము దాని మీద ఒక  ఆధార శ్లోకము మాత్రమే ఉన్నది.

ఆధార శ్లోకమా?అది ఏమిటో ఒకసారి చదివి చెప్పు అనగానే..

బౌద్ధధర్మములో

ఓంకారనాదమును

ఇచ్చే అష్ట మంగళ

వస్తువు ఏది?

అంగుళీ.అష్ట మంగళ వస్తువులలో ఓంకారనాదము ఇచ్చేది శంఖమే గదా అనగానే..

స్వామి.ఇక్కడ సమాధానము ఎక్కడ ఎలా ఇవ్వాలో తెలియడము లేదు. ప్రశ్న మాత్రమే ఉంది. సమాధానమునకు అవకాశమే లేదు అనగానే..

అంగుళీ.అంబేద్కర్ నేను అనుకున్నంత అమాయకుడు గాదని ఈ ప్రారంభ కోడ్ తోనే అర్ధమైంది.వాడు సామాన్యముగా కనిపించే అసామాన్యుడు అని ఇపుడే తెలిసినది.అర్హత, యోగ్యత ఉన్నవారికి మాత్రమే తను తెలుసుకున్న మణి రహస్యము తెలిసే విధముగా చాలా పకడ్భందిగా పెట్టినాడు.ఆ బాక్స్ ను నాకు అందచేయి.దాని సంగతి నేను చూసుకుంటాను.

అలాగే స్వామీజీ.మీకు ఒక గంటలో ఇది మీ ముందు ఉంటుంది అంటూండగా ఫోన్ కట్ అయినది.అంగుళీ మాత్రము తన శరీర భాగాల నుండి రక్తము కారుతున్న పట్టించుకోకుండా నిద్ర మత్తులోకి జారుకున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి