34
నేను
కాస్త నా ధ్యానములో ఫలాన దానిపై మనస్సు పెట్టి ధారణ చేస్తూ ధ్యానించాలని ఉండేది
గాదు. శ్వాసపైన, మనస్సుపైన,శూన్యముపైన ఏది పడితే అది చేసుకుంటూ ధారణ చేసేవాడిని. లోగడ ధ్యానము
చేసేటపుడు శరీర స్పృహ ఉండేది. కాని ఇప్పుడు శరీరము కాస్త దశేన్ద్రియాలను విస్మరించే స్థాయిలో నా ధ్యాన
శక్తి ఉండేది. మొట్ట మొదటిలో ధారణ ప్రక్రియ ఎంత అవసరమో- తర్వాత తర్వాత అది
అనవసరముగా మారేది. అలాగే మొదటిలో ఏకాగ్రత అవసరము చాలా ముఖ్యముగా కనిపించేది. రాను
రాను తీవ్ర ధ్యాన స్థితిలో దీని అవసరమే కనిపించేది గాదు. రాను రాను భావాలపైన
ధ్యానము చెయ్యడము ఆరంభించాను. ఆ తర్వాత ధ్యాన అనుభవాలు కల్గడము మొదలైనాయి.
ఒకసారి నేను తీవ్ర ధ్యానస్థితి లో
యుండగా... శరీర స్పృహ తెలియకుండా పోయింది. కాల గమనము తెలియడము లేదు. ఇంద్రియ
ధర్మాలు దూరమవుతూ వచ్చాయి. కదలాలని అన్పించలేదు. ధ్యానము నుండి లేవాలని
అన్పించలేదు. కళ్లు తెరవాలని అన్పించలేదు. ఆకలి,
నిద్ర తపనలు లేవు. ఏదో గావాలని ఆరాటాలు, పోరాటాలు,
స్పందన, ప్రతిస్పందనలు కనిపించలేదు. ఏదో
తెలియని అనుభూతి వైపు నా మనస్సు వెళ్ళుతోందని నాకు అర్ధమైంది. నిద్ర, మెలకువ కాని మధ్యమ స్థాయిలో నా మనస్సు చేరుకున్నదని నేను గ్రహించాను.
దానితో నెమ్మది నెమ్మదిగా ధ్యాన అనుభవ అనుభూతులు పొందడము ఆరంభించాను. నా తొలి
అనుభవముగా మా ఆవిడ యశోధరతో శృంగార ఆలోచనలు నన్ను వేధించాయి. నా మనస్సు కాస్త కామ
మాయను ఆశ్రయించినదని గ్రహించాను. ఇలాంటి సమయములో నాకు నీళ్లలో సంసారము చేస్తూ
సంతానోత్పత్తి చేసే జంటచేపలు గుర్తుకు వచ్చాయి. ఇవి గేలానికున్న ఆహారానికి ఆశపడి
ప్రాణాలు ఎలా కోల్పోతాయో.... అలా నేను ఈ కామమాయ దాటకపోతే గాలానికి చేప
చిక్కినట్లుగా నా మనస్సుకి కామ మాయ పట్టుకుంటుందని గ్రహించి దీనిని
నిగ్రహించడానికి దేనియందు అయిన మంచి దృష్టి ఉంటే దేనినైనా నిగ్రహించవచ్చునని,
మొహమాటముతో కాని భయముతో కాని ఆశతో కాని గౌరవముతో ఏ పని చెయ్యకూడదని
నిశ్చయించుకొని నిగ్రహించుకున్నాను.
***
*** *** *** *** ***
నిర్వాణలామాతో
పాటుగా విభూధినాద్,జేసి,ఆనందభిక్షువు,గంజాయి స్వామి అందరు గూడ పోలీసుల ఆధీనము ద్వారా బుద్ధగయ క్షేత్రానికి
చేరుకున్నారు.అంగుళీమాలను మాత్రమే పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొని మిగిలిన వారిని
కులకర్ణి ఉండే చాంబర్ లోకి పంపించారు.అక్కడ ఒక వీల్ చైర్ లో కులకర్ణి హుందాగా
సిగార్ వెలిగించుకుంటూ కనిపించి లోపలకి వచ్చిన వీరందరిని చూస్తూ
“రండి.కంగారుపడకండి.భయపడకండి.ఎవరి కుర్చిలలో వారు కూర్చోండి.నేను మీతో ఒక
విషయము మాట్లడటానికి పిలిపించాను.అరెస్టు అయిన వాడు అంగుళీమాలయని వీడు దేవదత్త అనే
మాఫియాలీడర్ తొత్తుయని మీరు ఈ పాటికే తెలుసుకొని ఉంటారు.వీడిద్వారా దేవదత్త
వివరాలు తెలుసుకోవాలని వాడిని మా కస్టడీలోకి తీసుకోవడము జరిగినది.వాడు వివరాలు
చెబితే సరే.చెప్పకపోయిన వాడి శవము చేత
అయిన నిజాలు చెప్పించి దేవదత్త ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాము.ఇన్నాళ్ళు మేము
మీ వెంటబడటానికి కారణము దేవదత్త చేతిలో మీ
ప్రాణాలకి ఎక్కడ హాని కలుగుతుందేమోనని మీకు రక్షణగా ఉన్నాము.కాని మా జేసి వలన అది
కాస్త మీ దృష్టిలో చేజింగ్ గా మారిపోయింది.ఇది మేము గూడ ఊహించలేకపోయాము.కాని
ఎపుడికపుడు జేసి తన ప్రయాణవివరాలు రహస్యముగా నాకు అందిస్తూ ఉంది.దానిని బట్టి మేము
మీరుండే ప్రాంతాలను మా అధికారుల చేత చేజింగ్ చేపిస్తూ మీకు రక్షణ వలయముగా
ఉన్నాము.లోతుగా వెళ్ళే కొద్ది మీరంతా మరింత ప్రమాదములో పడతారని నాకు అనిపించి
మిమ్మల్ని బంధించక తప్పలేదు.ఇపుడు చెప్పండి.మీ తరవాత ఆలోచన ఏమిటి?మీ తరవాత కార్యాచరణ ఏమిటో చెబితే మీ రక్షణ జాగ్రత్తలు ఎలాగో నేను
చూసుకుంటాను” అనగానే
నిర్వాణలామా
అందుకొని “స్వామి.మీరు మాకు అండగా ఉన్నందుకు చాలా కృతజ్ఞునుడిని.మాకు
కాశీ క్షేత్రములో స్ఫటిక రత్నాలతో అంబేద్కర్ చనిపోయిన గదికి వెళ్ళితే గాని ఏమి
చెప్పలేము.అక్కడ మాకోసము ఏ ఆధారాలు ఎదురు చూస్తున్నాయో ఇక్కడున్న వీరికి ఎవరికి
తెలియదు” అనగానే
కులకర్ణి
వెంటనే “నిర్వాణలామా. మీ ఆధారాలు సంగతి ఏమో గాని దేవదత్త మీకోసము అక్కడ ఏ
రూపములోనైన ఏ అవతారములోనైన ఉంటాడు.వాడు మమ్మల్ని చూస్తే మీ దగ్గరకి రాడు.అపుడు
మేము అలాగే పోలీసులు గూడ వాడిని పట్టుకోవాలంటే కుదరదు.అందువలన మేము మీకు ఎలాంటి
రక్షణ ఇవ్వము.మీకు మీరే రక్షణ బాధ్యత తీసుకొని వాడి నుంచి రక్షించుకొని మణి శోధనలో
ముందుకి వెళ్ళవలసి ఉంటుంది.ప్రాణాలు పోతాయని అనుకుంటే మీరు ఇంతటితో ఈ మణి శోధన
ఆపివేసిన మాకు ఎలాంటి అభ్యంతరము లేదు” అంటుండగా అంగుళీమాల
మీద థర్డ్ డిగ్రీ ప్రయోగాలు చేస్తున్నారనుటకు గుర్తుగా వాడు పెద్దగా అరిచే అరుపులు గదిలో ప్రతిధ్వనించేసరికి అందరి శరీరాలు
ఒక్కసారిగా జలదరించాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి