11 భాగం

 

11

దానితో ఆమె మనస్సు నాకు అవగతమైంది. నాకు లాగానే ఈమెకి గూడా రాజభోగాలన్న,సంపదలన్న,  అతిశయాలన్న, అహంకారాలు లేవని గ్రహించాను. నాకు లాగానే ఆర్తజనాల పట్ల అనురాగం, స్పందన, కన్నీరు తుడవాలన్న తపన జనజీవనంలో కష్టాలు పంచుకోవాలన్న ఆశయం, నన్ను బాగా ఆకర్షించాయి. రాజరికం, బ్రాహ్మణాధికత్యను ఈమె ధిక్కరించినది. ఈమె ఒక స్త్రీగా గొప్ప సంస్కరణలు తీసుకొని రాకపోవచ్చు కానీ తన వంతు సహాయ సహకారముగా  ప్రజలకి సేవ చేయడములో అలాగే సహాయపడటములో తనకే ఆదర్శముగా  ఉండటముతో... ఈమెయే నాకు తగిన ఇల్లాలు అవుతుందని నాకు అనిపించడముతో... ఆనందముగా రాజపురమునకు చేరుకున్నాను.

                ఇంతలో మా తండ్రిగారు తన వంతు ప్రయత్నముగా నాకు స్వయంవరము ఏర్పాట్లు  చేశారు. సుమారుగా 1000 మందికి పైగా రాజ కన్యలు వచ్చారు. వీరికి గావలసిన ఏర్పాట్లు స్వయంగా యశోధర చూసుకునేది. స్వయంవరమునకు వస్తుంది అనుకున్న అమ్మాయి కాస్త స్వయంవర ఏర్పాట్లు  చెయ్యడానికి రావడముతో నాకేమి చెయ్యాలో తోచలేదు. అనుకున్నది ఒకటి.అయినది మరొకటి. అవుతోంది మరొకటి అన్నట్లుగా నాకు అనిపించసాగింది.

           ఈ రాజకన్యల ముందు ప్రతిభా పాటవాల పరీక్షలు అనగా విలువిద్య, కత్తిసాము, దేహధారుడ్య పోటీలు, గుర్రపు స్వారీ పోటీలలో నేనే ప్రథముడిగా నిలిచాను. నా అజాత శత్రువైన దేవదత్త మాత్రము  ఎప్పటిలాగానే రెండవ స్థానములో సరిపెట్టుకున్నాడు. దానితో వాడికి నా మీద కోపము పదింతలు అయింది. నేను అన్ని పోటీల యందు ప్రథముడిగా నిలచిన నన్ను చూసి యశోధర తన మనస్సులో ఎంతో బ్రహ్మానందము పొందడము నా కనుచివరల నుండి తప్పించుకోలేదు. దానితో నాకు ఈమె చేతులు మీదగా  ఒక తెల్లని ఏనుగును బహుమానముగా బహూకరణ చేస్తూ "బహుమతిని అందుకో. ఓ రాజకుమారా అని  యశోధర అనేసరికి.... అప్పుడు ఆమెను నేను కాస్త చాలా నిశితదృష్టితో ఆమె అందచందాలనే చూస్తూ విరిసీ విరియని పద్మములాగా ఉండటముతో ఈమె నా 'హృదయ పద్మం' అనుకున్నాను. అని అనుకుంటూ ఆ మాట పైకి అనేశాను. దానితో నా హృదయ పద్మముకి వచ్చిన చిరు మందహాసము నా దృష్టి నుండి తప్పించుకోలేదు.

*** *** *** *** *** ***

నిర్వాణలామా తన గొంతును సవరించుకొని

జేసి.ఆనందభిక్షువుకు తెలిసిన విషయాలు మీకు టూకీగా చెబుతాను.వాడికి తెలియని విషయాలతో ఈ సంభాషణను కొనసాగిస్తాను అంటూ..నా భార్య ప్రకృతికి ఒకసారి తన క్లినిక్ కి ఒక పాప వచ్చి చావుబ్రతుకుల మధ్య ఉన్న ఒక కుందేలు పిల్లను తీసుకొని వచ్చి తన చేతులలో పెట్టి కాపాడమని వేడుకొంది.కాని అపుడికే దాని ప్రాణాలు పోయాయని ఆ పాపకి తెలియదు.దానిని ఎలా చెప్పాలో ఈమెకి అర్ధము గాలేదు.ఇంటికి వచ్చిన ఈమె ఈ సంఘటనను మర్చిపోవడానికి ఆరు నెలలు పైగా పట్టినది.దానితో నేను ఈమెను మంచి సైకాలజిస్టుకి దగ్గరికి తీసుకువెళ్ళి చూపించగా ఈమెకి ఉన్న మానసిక ఆందోళన ఉద్రిక్తత స్థితి తగ్గాలంటే ధ్యానమే సరియైన మార్గమని చెప్పడముతో ధ్యానము నేర్చుకొని అభ్యాసము చేయడముతో ఈమెలో మార్పు రావడముతో నేను కాస్త స్థిమితబడి నా సైన్సు పరిశోధనలలో ఎక్కువ సమయము కేటాయించడము మొదలుపెట్టాను. ఈమె గూడ ధ్యానమునకు ఎక్కువ సమయము కేటాయించినది.

ఇది ఇలాయుండగా..

నా సైన్సు పరిశోధనలలో బ్లాక్ హోల్స్ కి ఎలా వెళ్ళాలో తెలుసుకున్నాను.కాని అవి ఎక్కడికి అనుసంధానము ఎలా అవుతాయో తెలుసుకొనలేకపోయాను.నా అవస్థను గమనించిన నా భార్య నా కోసము ధ్యానము చేస్తూ నేను చేస్తున్న బ్లాక్ హోల్ ప్రాంతము ఫలాన లోకమునకు వెళ్ళుతుందని..బ్రహ్మాండ పురాణములో ఈ అంశము ప్రస్తావన ఉన్నదని నిరూపించి చెప్పేసరికి నాకు మతిపోయినది.దానితో నా సైన్సు పరిశోధనలు ప్రక్కనపెట్టి ఈ పరిశోధన జయం పొందితే వచ్చే ఫలితాలను ముందుగానే నా భార్య ధ్యానము ద్వారా తెలుసుకోవడము ఆరంభించాను.నాలో ఉత్సాహము కొద్ది ఆమె ధ్యాన కాలమును గంట నుండి 18 గంటల దాకా వెళ్ళిపోయినది.ఇలా అంతరిక్ష రహస్యాలు అలాగే లోకాలు వాటి రహస్యాలు గ్రహ రహస్యాలు ఇలా ప్రతి దానిని తన ధ్యాన స్థితితో నా భార్య తన దివ్యదృష్టితో చూసి చెబుతుండేసరికి వాటిని నేను నోట్స్ రాసుకోవడము మొదలుపెట్టాను.ఇలా సుమారుగా 5 సం.పాటు ఇదేవిధముగా కొనసాగింది.

ఒకరోజు ఉన్నట్టుండి నాతో

మనిషికి మరణము ఎందుకు వస్తున్నది?మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి?ఎవరి వలన మనిషి ఈ పాపపుణ్యాలు కర్మ ఫలాలు అనుభవిస్తాడు.రోగము,మరణము,ముసలితనము లేని మానవ జీవితమును తాను ఎలాగైనా పొందాలని అది లోకానికి తెలియజేయాలని

నాకు తెలియకుండా మెదడు శక్తి మించి ధ్యానము చేస్తుండేసరికి ఒకరోజు నేను లేను.సర్వము ఏమి లేదు.సర్వము శూన్యము అనే శూన్యత భావ స్థితికి చేరుకొనేసరికి నాలో తెలియని ఆందోళన మొదలైనది.నాటు వైద్యుడి నుండి విదేశీ డాక్టర్లు వరకు చూపించాను.అలాగే నవ ధాన్యాల నుండి నవరత్నాలతో దానము ఇస్తూ గ్రహ పూజలు చేయించాను.ఇలా ఎన్ని చేసిన గూడ మా ఆవిడ మామూలు యదార్ధస్థితికి రాలేకపోయినది. ఉన్నట్టుండిపెద్దగాఏడ్వడము,నవ్వడము,బాధపడటము,కొట్టుకోవడము,కొట్టడము,పూనకమువచ్చిన దానిలాగా దెయ్యం పట్టిన దానిలాగా ప్రవర్తిస్తూ వచ్చేది. దానితో ఈమెను తీసుకొని భారతదేశ తీర్ధ యాత్రలు చేశాను.అన్ని నది స్నానాలలో స్నానాలు చేయించాను. ఉపశమనం లేదు.ఉపాయము లేదు.దానితో ఏమి చేయాలో ఎలా చేయాలో తెలియక నేను గూడ నాకు తెలియకుండానే శూన్యత భావ స్థితిలోనికి ప్రవేశించాను.

ఇలాంటి సమయములో నాకు కాశీ క్షేత్రము నందు జరుగుతున్న కుంభమేళాకి వచ్చే నాగ సాధువులలో ఒకరు మా ఇద్దరిని తేరిపారా చూసి ఓరేయి.పశువుల్లారా.మీ అత్యాశకి హద్దు పద్దు ఉండదా?మానవ మెదడు 48ని. మించి ధ్యాన స్థితిని తట్టుకోలేదు గదరా.శివ పురాణము ఈ విషయము మీకు చెబుతుంది కదరా.అయినా ఏనాడైన మీరు వేదాలు,పురాణాలు చదివారా.మీకు తెలియడానికి అన్నట్లు..దీనికి పరిష్కార మార్గముగా హిమాలయాలలో ఉండే రహస్య గ్రామములోని మణి యొక్క పంచామృత అభిషేక జలమును ఈమెకి పట్టిస్తే గాని ఈమె మామూలు స్థితికి రాదు.దీనికి నీకు 108 రోజుల సమయమే మాత్రము ఉన్నది. ఆ సమయములోపల ఈ మణి తీర్ధమును ఈమెకి అందించకపోతే బ్రతికున్న శవములాగా మారిపోతుంది.అపుడు ఏ భగవంతుడు ఈమెను రక్షింపలేడు.ళే.వెళ్ళు.ఆ గ్రామమును చేరుకో.సర్వేశ్వరుడి అనుగ్రహము పొందుఅంటూ పెద్దగా అరుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

దానితో ఈ మణి గూర్చి అలాగే రహస్య గ్రామము గూర్చి అందరిని విచారణ చేస్తూ ఎవరికి తెలియదని చెబుతుండేసరికి విచారపడుతూ బౌద్ధగయలోని బుద్ధుడి బోధి వృక్షమును దర్శించుకోవడానికి వచ్చాము.ఆ సమయములో బౌద్ధ భిక్షువులు చేసే మణి మంత్రమును వినగానే..అలాగే వీళ్ళలలో 1903-1909 సం.కాలములో లామా ద్యోర్జీ చోగ్యాల్ మరియు మిత్ర బృందము కలసి హిమాలయాలలోని రహస్య గ్రామమునకు వెళ్ళి ఈ మణి దర్శనము పొందినాడని ఎవరో లామా చెప్పేసరికి నాలో ఉత్సాహము బయలుదేరి మేమిద్దరము ధర్మ దీక్ష తీసుకొని బౌద్ధధర్మములోకి అడుగుపెట్టాము. కాని నా శూన్యత భావ స్థితి కాస్త బుద్ధుడు చెప్పిన దైవిక వస్తువుల సాధనతో తొలగించుకున్నాను గాని మా శ్రీమతి యొక్క శూన్యత భావ స్థితి  వేరని ఆమె కాస్త 17వ స్థితియైన మూల శూన్య  స్థితికి చేరుకున్నదని ఆపై 18వ స్థితికి వెళ్ళితే ఈ దేహ జన్మకి విదేహ ముక్తి కలుగుతుందని అదే వారి భాషలో మహానిర్వాణమని చెప్పడము దీని పరిష్కారముగా హిమాలయాలకి దగ్గర సానువులలో టిబెట్ ప్రాంతముండుట వలన అక్కడ ఉండే రహస్య గ్రామములోని మణి ప్రభావము అంతా ఈ సానువులలో చూపుతుందని చెప్పడముతో మా భార్యను అక్కడున్న బౌద్ధ ఆశ్రమములో చేర్పించి నేను కాస్త బౌద్ధగయకి చేరుకొని ఈ మణి శోధన పరిష్కారము చూపమని మా బుద్ధ భగవానుడిని వేడుకోవడము తప్ప ఏమి చెయ్యలేకపోయాను.మీ నాన్నగారి పుణ్యము వలన నాకు ఈ మణి శోధన చేసే అవకాశము అలాగే మీరు చేయడము వలన మీ నాన్న గారికి ఆత్మశాంతి కలిగితే నా వలన మా ఆవిడకి మనఃశాంతి కలుగుతుందని నాకు నమ్మకము ఏర్పడినది అని చెప్పి కొంతసేపు మౌనము వహించాడు.

జేసి వెంటనే గురూజీ.మా నాన్నగారిని ఎవరు ఎందుకు చంపారో మీ దివ్యదృష్టి ద్వారా  తెలుసుకోవచ్చునా?”

జేసి.అంత శ్రమ ఎందుకు?ఆయన ఖచ్చితంగా మణి శోధన చేసి ఆ రహస్య ప్రాంతములో అది ఎక్కడ ఉన్నదో తెలుసుకొని ది బుద్ధ కోడ్ రూపములో దాచి ఉంచారని త్రివేది పోలీసు అధికారి చేసిన రిపోర్టులు చదవండి.ఆ విషయము మీకే తెలుస్తుంది.గాకపోతే ఈయనను చంపిన వ్యక్తి మాత్రము నాకు తెలుసు.నేను ఈ బౌద్ధమతములో దక్షిణాచార విధి విధానాలు నేర్చుకుంటున్న సమయములో నా సహ విద్యార్ధి అయిన అంగుళీమాల అనేవాడు మాత్రము మహాయానము చెప్పే తాంత్రిక విద్యలందు పట్టు సాధించాడని నేను తెలుసుకున్నాను.మీ నాన్న గారి హత్యతో అలాగే ఆయన మీద చేసిన కాగిత పక్షి యంత్ర తాంత్రిక ప్రయోగము ద్వారా వీడే ఈ హత్య చేశాడని నేను తెలుసుకున్నాను.వాడు మాత్రము బుద్ధుడు కాలము నాటి అంగుళీమాల జన్మమే ప్రస్తుత తన జన్మయని..ఆ కాలములో వాడు చేసినట్లుగా బొటనవ్రేలును మెడలో వేసుకోకుండా ఈ కాలములో వీటిని సేకరించి తీసుకొని వెళ్ళుతున్నాడని గ్రహించాను.వాడు నాకు తెలిసి దేవదత్త అనే అవినీతి పురావస్తు శాఖ ఉన్నత అధికారి క్రింద తన మంత్ర తంత్ర విద్యతో హత్యలు చేస్తూ ఆయనిచ్చే అతి విలువైన కానుకలు పొందుతాడని అందరు అనుకుంటున్నారని నేను విన్నాను అనేసరికి

జేసి ఉన్నట్టుండి అయితే నా అనుమానమే నిజమైనది.మా నాన్న గారి హత్యలో తప్పకుండా దేవదత్తుడి పాత్ర అలాగే వాడి తొత్తు అంగుళీమాల పాత్ర ఉండి ఉండాలని అనుకుంటూ..

తన చేతిలోని పెన్ను కెమెరాను యధాలాపముగా నిర్వాణలామా చేతి సంచికి తగిలించగానే దానిలోంచి ఒక రకమైన శబ్ద తరంగాలు వచ్చేసరికి జేసికి ఏదో అనుమానము కలిగి ఆ చేతి సంచిని తెరిచి చూడగా అందులో నిత్యము వాడే కులకర్ణి వాయిస్ రిసీవర్ పరికరము ఉండేసరికి అంటే తన మీదనే తన బాస్ నిఘా పెట్టాడని..ఇపుడుదాకా జరిగిన సంభాషణలు అన్ని గూడ ఈయనతో పాటు తన ఆఫీసు సభ్యులు గూడా వింటున్నారని తెలియగానే..

ఆమె సహనము కోల్పోయి ఆ రిసీవరును బలంగా నేలకేసి కొట్టగా దీని ద్వారా విషయాలు వింటున్నవారికి సిగ్నల్స్ అందక మాటలు వినిపించకపోయేసరికి వారికి ఏదో అనుమానము వచ్చి వీళ్ళున్న చోటుకి వీరంతా పోలీసు వ్యానులలో బయలుదేరి వస్తారని ముందుగానే ఊహించిన జేసి వెంటనే అక్కడనుండి నిర్వాణలామాని ఆనందభిక్షువును వెంటబెట్టుకొని గది నుండి శరవేగముతో బయటికి వచ్చి కారు ఎక్కి తన కారు అద్దములోంచి ప్రక్కకు చూడగా..తన బాస్ తన కారు వెనుక కారులో ఉన్నాడని తెలుసుకొని కారును వేగముగా పోనిస్తుండేసరికి కొంతదూరము వెళ్ళేసరికి తన సహచర ఉద్యోగులు కూడా తన బాస్ కారుతో పాటుగా తన కారును వెంబడిస్తున్నారని జేసికి తెలుసుకోవడానికి అట్టే సమయము పట్టలేదు.దానితో ఎవరికి తెలియని తనకి మాత్రమే తెలిసిన ఒక హోటల్ వైపు తన కారును జేసి పోనిచ్చింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి