21
తీరా
నేను అంతఃపురమునకు వెళ్లేసరికి యశోధర దిగులుతో కనిపించింది. కారణము ఏమిటని ఆరా
తియ్యగా ఇంతక్రితము చనిపోయిన పాపని
మృత్యువు నుండి తను రక్షించలేక పోయినందుకు బాధపడుతుంది. అక్కడ నుండి వచ్చిరాగానే
ధ్యానము చేసుకున్నగూడ మనస్సు నిగ్రహము
కోల్పోయి కళ్ళవెంట కన్నీరు వస్తూనే ఉంది. ఆపుకోలేకపోతున్నానని అంటూ నా మీద పడి బావురుమని ఏడ్చింది. నేను
వెంటనే ఈమెను కౌగిలిలోనికి తీసుకొని కన్నీరు తుడిచి.... నేను వెంటనే ఆమెతో "గోపా. నీ గుండె బరువు తగ్గే వరకు
ఏడుస్తూనే ఉండు. మానసిక ఆందోళనకి సరియైన పరిహారము ఏడుపే సరియైన మందు.ఏడవడం మంచిదే.
దీనివలన బాధ ఉపశమనము కలుగుతుంది. ఈరోజు నేను చూసిన సంఘటనలు బట్టి చూస్తే ప్రతి
జీవికి జననం, ముసలితనం, రోగం, మృత్యువు నీడలాగా వెంటాడే శాపాలని తెలుసుకున్నాను. వీటి నుండి మహర్షులైనా,
మహాయోగులైనా, మానవులైనా, మాధవులైనా గూడా అనుభవించి తీరవలసినదేనని నేను గ్రహించాను. ఈ పాపకి
జరిగినట్లుగా ప్రతివాడికి ఎప్పుడో ఒకప్పుడు తప్పక జరుగుతుందని గ్రహించు. గుండె
దిటవు చేసుకో. నిగ్రహము పాటించు. అప్పుడే నీ గుండె ఆవేదన నుండి బయటపడగలవు
స్వామి.
మీరు ఈనాడు నాకు చెప్పినవి అన్నియు గూడ నిత్య సత్యాలేనని నాకు తెలుసు. ఈ
ప్రపంచములో కలిగే ఈతిబాధలను నా చేతులతో పూర్తిగా నివారణ చెయ్యాలని అనిపిస్తోంది. ఆ
పని నేను చేయగలనా? నా ఆందోళన తీరే మార్గం
ఏదైనా ఉంటే చెప్పండి. దానిని ఆచరిస్తాను
అనగానే....
"గోపా. ఇందాకటి నుంచి నేను అదే ఆలోచిస్తున్నాను. మనిషికి ఈతి బాధలకి కారణము
ఏదో తెలుసుకోవాలని అనుకున్నాను. అలాగే దీని పరిహారము తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
ప్రస్తుతము నా మనస్సు అల్లకల్లోలంగా ఉంది. ఏమి చేయాలో ఎలా చేయాలో తెలియడము లేదు.
గాకపోతే ఏదో ఒక నాటికి అందరికీ కష్టాలు తీరి
శాంతిని పొందే ఉపాయము దొరుకుతుందని నా నమ్మకము. నా మనో సంకల్పముగా ఉంది.
నన్ను నమ్ము. దీని పరిష్కార కర్తగా నేను మారాలని అనుకుంటున్నాను అనగానే...
***
*** *** *** *** ***
అంగుళీమాల
కాశీక్షేత్రములోని
బౌద్ధమ్యూజియము నుంచి తెచ్చిన పద్మ కీ స్టోన్ ను తన గదిలో తన ఎదురుగా ఉంచుకొని
దానిని నిశిత దృష్టితో పరిశీలించడము మొదలుపెట్టాడు.ఈ కీ స్టోన్ చూడటానికి తిరుగలి
ఆకారముగా ఉండి పైభాగములో ఒక అష్ట
దళ పద్మము కనబడుతోంది. తిరుగలికి ఉన్నట్లుగా రెండు భాగాలుగా ఉంది.పైగా తిరుగలి
తిరుగుతున్నట్లుగా ఈ స్టోన్ లోని రెండు భాగాలు తిరుగుతున్నాయి.కాని తన దగ్గర ఉన్న
పద్మాకార ఇత్తడి తాళం చెవి ఉపయోగించడానికి ఈ కీ స్టోన్ లో ఎక్కడ ఎంత వెదకిన
రంధ్రము కనిపించడము లేదు. దానితో సహనము తగ్గిపోయి
తన
గురువైన దేవదత్తకి ఫోన్ చేయగా
“గురూజీ.ఇక్కడ మ్యూజియములోంచి పద్మ కీ స్టోన్ తెచ్చాను.కాని ఇత్తడి తాళం
చెవితో ఎలా తెరవాలో తెలియడములేదు.”
“అంగుళీ.నీవు అసలు ఏమి చేశావో నీకు తెలుసా? కీ స్టోన్
అంటే రాతి తాళం కాదురా.అది ఒక క్లూ మాత్రమే.దాని పేరు పద్మ కీ స్టోన్ అని పేరు పెట్టారు.ఈ
స్టోన్ ఉన్నచోట దానిని పైకితీస్తే అక్కడ నీ దగ్గర ఉన్న ఇత్తడి తాళం చెవి పెట్టి
తిప్పడానికి వీలుండే ఒక రహస్య ద్వారమున్నది.కాని ఆ అమ్మాయి యొక్క బొటనవ్రేలుకి
ఆశపడి ఆమె చెప్పాలనుకున్న వివరాలు నీవు తెలుసుకోకుండా నీ మానాన నీకున్న సైకో
బుద్దితో చంపేసి వచ్చావు.ఆ రాయి తెచ్చుకున్నావు.దానితో ఏమి చేసుకుంటావు.నెత్తి కేసి కొట్టుకో.ఒక పని అయిపోతుంది.” అనగానే
“స్వామీజీ.కీ స్టోన్ అంటే రాతితాళం అనుకొని పైగా ఇది గూడ పద్మాకార రాతి
రాయిగా ఉండటముతో ఇదే ఇత్తడి తాళం చెవి యొక్క తాళం అయ్యి ఉంటుందని అనుకున్నాను.గురూజీ.నన్ను
క్షమించండి.నేను ఏదో అనుకొని ఏదో పని చేశాను.ఇంతకి ఆ రహస్య ద్వారము ఎక్కడికి
వెళ్ళుతుంది” అనగానే
“అంగుళీ.నీవు చేసిన ఈ తెలివితక్కువ పని వలన కైలాసపర్వతము అడుగున ఉన్న పద్మ
మణికి వెళ్ళే మహత్తర అవకాశము కోల్పోపోయాము.ఈ రహస్య ద్వారమును నీ దగ్గర ఉన్న ఇత్తడి
తాళం చెవితో తెరిస్తే అది అక్కడున్న సొరంగమార్గము ద్వారా దశాశ్వమేధ ఘాట్ దగ్గర
మహావతార్ బాబాజీ చెల్లెలు నాగాలక్ష్మి మాతాజీ తపస్సు చేసుకున్న పాతాళ గుహకి
దారితీసేది.ఈమె సజీవ సమాధి చెందిన గూడ ఈ గుహ యందు ఆత్మ శరీరముతో సాధన చేస్తూ
ఉన్నది.అలాగే ఈ గుహయందు 280సం.లు పాటు జీవించి నడయాడే కాశీ
విశ్వనాధుడిగా పేరుగాంచిన శ్రీ త్రైలింగ స్వామి వారు గూడ సజీవముగా ఆత్మ శరీరముతో ఈ
గుహలోనికి వచ్చి హిమాలయ గురువులతో అలాగే యోగులతో సమావేశాలు చేస్తూ ఉంటారని ప్రతీతి.అంటే ఈ గుహ నుంచి
హిమాలయాలలోకి సరాసరిగా వెళ్ళే రహస్య సొరంగమార్గమున్నది అన్నమాట.కాని ఈ ఘాట్
దగ్గరికి వెళ్ళితే పాతాళ గుహ ఉన్నదని తెలుస్తుంది గాని అది ఎక్కడ ఎలా వెళ్ళాలో
ఎవరికి తెలియదు.కాని అంబేద్కర్ తన పరిశోధనలో ఈ గుహకు వెళ్ళే మార్గము మ్యూజియము
నుంచి ఉన్నదని తెలుసుకొని అక్కడ ఉన్న ముఖద్వారముపైన గుర్తుగా పద్మ కీ స్టోన్
అమర్చి ఈ ద్వారం తాళం చెవిగా నీ చేతిలోని ఇత్తడి తాళం చెవిగా ఏర్పరచాడు.నీవు ఈ
విషయాలు తెలియకుండా ఆ అమ్మాయి నీకు చెప్పేలోపల ఆమెను చంపేసి ఎందుకు పనికిరాని
రాయిని తెచ్చుకున్నావు.”
“గురూజీ.నా వలన ఇంత పొరబాటు జరుగుతుందని జరిగినదని నాకు తెలియదు.ఇపుడు
అక్కడికి వెళ్ళి ఆ ద్వారము ద్వారా
హిమాలయాలకి వెళతాను.”
“అంగుళీ.ఆ అవకాశము లేదు.ఎందుకంటే అక్కడున్న పద్మ కీ స్టోన్ తీసిన 18 ని.లోపున నీ
దగ్గర ఉన్న ఇత్తడి తాళం చెవితో ఆ ద్వారాలు తెరవాలి.లేదంటే అది శాశ్వతముగా
మూసుకొనిపోయే విధముగా అంబేద్కర్ ఏర్పాట్లు చేశాడు.నేను చేసిన
పొరపాటు ఏమిటి అంటే ఈ వివరాలు నీకు ముందుగానే చెప్పాల్చి ఉండాల్చింది.కాని ఆ
అమ్మాయి చెబుతుంది గదా పైగా నేను ఎందుకు చెప్పడము అని ఊరుకున్నాను. కాని ఆ అమ్మాయి
బొటనవ్రేలుకి కక్కుర్తి పడి చంపుతావని ఊహించలేదు.అన్ని మనము ఊహించినట్లుగా జరిగితే
అది జీవితము ఎందుకు అవుతుంది” అనగానే
“గురూజీ.ఇపుడు ఏమి చేయాలి.”
“అంగుళీ.మణి శోధనలో మనకు అందిన మహత్తర అవకాశము కోల్పోయాము.కాని ఇలాంటి కీ
మన నిర్వాణలామాకి దొరికినదని అతను గూడ ఆధారాలు సేకరిస్తూ కాశీ క్షేత్రానికి ఎవరో
విభూధినాధ్ అనే వ్యక్తిని కలవడానికి వస్తున్నాడని నాకు సమాచారము అందినది.నువ్వు ఈ
లోపల ఈ వ్యక్తి ఎవరో ఎక్కడ ఉంటాడో వివరాలు సేకరించు.నిర్వాణలామా కాశీకి వచ్చి ఇతనితో సమావేశము పెట్టుకొనే సమయానికి నువ్వు
అక్కడికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకొనే విషయాలు విను.మనకి ఏమైన ఆధారాలు
దొరకవచ్చును.ఈసారైన వళ్ళు దగ్గర పెట్టుకొని మనస్సు పెట్టి ఆలోచించి పనిచెయ్యి” అని ఫోన్ కట్ చేయగానే
ఆవేశమును
ఆపుకోలేక ఆ తిరుగలి లాంటి పద్మ కీ స్టోన్ ను బలంగా నేలకేసి కొట్టి గది నుండి
బయటికి వచ్చి విభూధినాధ్ గూర్చిన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి