43
ఈ
నా బౌద్ధ సంఘములో చేరడానికి మొట్టమొదటిగా వారణాశి క్షేత్రము నుండి 'యాశీ' అనే వ్యక్తి వచ్చాడు. ఇతను గొప్ప సంపన్నుడు.
పైగా వ్యభిచారుడు. కానీ కనకము, కాంతము మీద స్మశాన వైరాగ్యము
కల్గి మా బౌద్ధ ధర్మాలకి ఆకర్షితుడై మా సంఘ సభ్యుడిగా అదే బౌద్ధ భిక్షువుగా
మారడానికి వచ్చాడు. అతనికి అన్ని నియమాలు ధర్మాలు తప్పులేకుండ మేము అతనికి చెప్పాము. అందుకు అతడు
ఒప్పుకోగానే... మా సంఘ మొదటి నియమానుసారముగా అతడికి గుండు కొట్టించి... చేతిలో
భిక్షాపాత్రను పెడుతూ... ఎరుపు-నలుపు రంగు వస్త్రమును దీక్షా వస్త్రముగా చేసి....
బౌద్ధ భిక్షువుగా మార్చి వాడితో "మా సంఘ వ్యక్తియైన ప్రతివాడు
భిక్షమెత్తుకొని జీవించాలి. అపుడే వాడిలో ఉన్న 'నేను'
అహంకారము పోతుంది.అహం పోయి అణుకువ కలుగుతుంది. ధనిక, పేద భావము పోయి అందరి యందు సమదృష్టి కలుగుతుంది. సహనము, ఓర్పు, ఓపిక, శాంతము కలుగుతాయి.
ఆకలి విలువ తెలుస్తుంది. దాని కోసము పడే కష్టాలు, అవమానాలు,
బాధ, ఆవేదనల నుండి నీలో జ్ఞాన విచారణ మొదలు
అవుతుంది. కోపతాపాలు తగ్గుతాయి. చెడు ఆలోచనలు, అమిత కోరికలు,
తగ్గుతాయి. బ్రహ్మచర్య నిష్ఠ వలన ధ్యాన నిష్ఠ కలుగుతుంది అని చెప్పి
వాడిని బౌద్ధ భిక్షువుగా మార్చాము. ఇలా వీరిని చూసి మరో అయిదు మంది ఆపై 64 మంది ఆపై 120 మంది.... ఇలా సుమారుగామా సంఘములో 1000 మంది దాకా బౌద్ధ భిక్షువులుగా చేరినారు. వీరి
అందరికి నా పంచ మిత్రులే బాధ్యత వహించారు. వచ్చిన వారందరికి ఆరోగ్యము, కోసము ఆసనాలు, రక్షణ కోసము మార్షల్ ఆర్ట్స్ మానసిక
ఆరోగ్యము కోసము ప్రాణాయామాలు, జ్ఞానం కోసము ధ్యాన
విధి విధానాలు, ఆహారం కోసము భిక్ష చేయించడము... ఇలా మా
సంఘములో ప్రతీది నియమబద్ధముగా... క్రమ బద్ధముగా జరిగే విధంగా నేను అన్ని ఏర్పాట్లు
చేసి... నా తల్లిదండ్రులను, నా భార్యాబిడ్డను చూడటానికి
కపిలవస్తు పురము వైపుకి ప్రయాణించాను.
నా ప్రయాణాలు ఎపుడు
చిత్రంగా ఉంటాయి. లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టుగా నేను ఎప్పుడు ఎక్కడికి
వెళ్లుతున్నది ఎవ్వరికి చెప్పను. అలాగే ఎప్పుడు తిరిగి వచ్చేది గూడ చెప్పను.
ఎందుకంటే ఏది నా ఆఖరి ప్రయాణము అవుతుందో... ఎవరి చూపు నా ఆఖరి చూపు అవుతుందో
ఎవరికి ఎరుక. ఓంటరిగా చేతిలో భిక్షాపాత్ర, పైన
ఒక ఉత్తరీయం వేసుకొని వేళకానివేళలో ఎక్కడికో తెలియని ప్రాంతము వైపు.... నడకలో
ప్రశాంతతతో... కాళ్ళు ఎటు నడిస్తే అటుగా నడవడం.... శూన్య మనస్సుతో... శూన్య
హృదయముతో...శూన్యములోకి సంచరిస్తూ ముందుకి సాగిపోవడము నా ప్రయాణ లక్ష్యము అన్నమాట.
ఇలా ఇపుడు కపిలవస్తు వైపుకి బయలుదేరినాను. నా తల్లిదండ్రులు నన్ను చూసి సంతోషించి
నేను సత్యాన్వేషణ తపఃఫలితము పొందినానని అమిత ఆనందపడ్డారు. నేను తన దగ్గర లేనని మా
ఆవిడ యశోధర గూడ బ్రహ్మచర్యదీక్షబూని.... నేను ఒంటిపూట భోజనము చేస్తున్నానని
తెలుసుకొని తనుగూడ అలాగే భోజనము చెయ్యడము.... నా పడక కటిక నేలమీదనే అని తెలుసుకొని
తనుగూడ అలాగే రాజ ప్రసాద మంచాలున్నా గూడ కటిక నేలమీద పడుకోవడము చేస్తోందని
తెలుసుకున్నాను. నాకు ప్రతిరూపము నడుస్తోందని అర్ధము చేసుకొన్నాను. నా ఏడు
సంవత్సరాల కొడుకైన రాహుల్ ను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని వాడిని గూడ మా
సంఘ సభ్యుడిగా చేసి మార్షల్ ఆర్ట్స్ ను వాడి ఏడవ వయస్సులో నుండి నేర్పించడము
ప్రారంభించాను.
***
*** *** *** *** ***
నిర్వాణలామా
బృందము అంతా గూడ బద్రినాధ్ క్షేత్రములో ఉన్న బదరీనారాయణుడి సాలగ్రామ శిల్పమును
దర్శనము చేసుకొని అక్కడ ఈయనకి ముందు అఖండముగా వెలుగుతున్న అఖండ జ్యోతిని చూడగానే
జేసి ఈ విషయము గూర్చి నిర్వాణలామాను అడిగేసరికి జేసి.దీనికి ఒక స్థలపురాణగాధ ఒకటి
ప్రచారములో ఉంది. అది ఏమిటంటే
1992 సంవత్సరములో జరిగిన ఒక యదార్ధ
సంఘటన ఒకటి చెపుతాను. విను. కొంతమంది కర్ణాటక వాసులు బద్రీనాధ్ క్షేత్రానికి వెళ్ళారు. అప్పుడు ఒక పిల్లాడు ఈ గుడిలో ఉండిపోయాడు. ఆ రోజు
ఆరు నెలల పాటు గుడిని మూసే రోజు గావడము విశేషము. అనుకోకుండా
ఆలయ పూజారులు గుడిలోపుల ఉన్న పిల్లవాడిని గమనించకుండా గుడిలో అఖండ దీపారాధన చేసి
అక్కడ బ్రహ్మకమలాలుంచి ఆరు నెలల పాటు ఆలయ తలుపులు మూసి యధావిధిగా వెళ్ళిపోయారు. లోపల పిల్లవాడు అలాగే గుడిలో ఉండిపోయాడు. ఆరు నెలల
తర్వాత గుడి పూజారులు ఈ ఆలయమును తెరిచి చూస్తే... లోపల ఈ పిల్లవాడు ఉన్నాడని
గ్రహించి గమనించి ఆశ్చర్యము చెందారు. ఎందుకంటే ఆ పిల్లవాడు
ఆరు నెలల పాటు ఆహారము లేకపోయినా గూడ ఆరోగ్యముగా ఉండటము గమనించి ఆ పిల్లవాడిని
అడిగితే నా ఆకలి తీర్చటానికి హనుమంతు స్వామి వారు ఒక యతి రూపములో వచ్చి
బద్రినారాయణుడిని పూజించి ఆయనకి పెట్టిన నైవేద్యమును నాకు ప్రసాదముగా పెట్టి
ప్రతిరోజు ఇలా ఈ ఆరునెలలు చేశారని ఆ పిల్లవాడు అమాయకముగా అమిత భక్తితో
చెపుతూండేసరికి... అప్పుడు కాని ఈ లోకానికి ఆరు నెలల పాటు అఖండ దీపము ఆరిపోకుండా
వెలగటానికి.... అలాగే అక్కడ పెట్టిన బ్రహ్మకమలాలు వాడిపోకుండా ఉండటానికి....
కారణము సజీవ హనుమంతుడని తెలిసింది. అంటే ఈయన సజీవముగా
ఉన్నట్లే గదా. ఎందుకంటే బద్రీనాధ్ పర్వతమే-గంధమాదక పర్వతము
అంటారు గదా. అని చెప్పిన
తరవాత
వీరందరు కలసి పంచపాండవులు ఒక్కొక్కరిగా తనువులు చాలించిన ప్రాంతాలను చూడటానికి
బయలుదేరారు.కాని అపుడపుడు ప్రకృతిలో అనుకోని విధముగా తనకి తెలియకుండా
ఉన్మాదస్థితిలోనికి వెళ్ళడము నిర్వాణలామా గమనించి ఈమెను మరింత శ్రద్ధగా చూసుకోవడము
ప్రారంభించాడు.ఇలా అందరు గూడ ప్రత్యక్షముగా ఈ ప్రాంతాల దర్శనము చేసుకొని తిరిగి
బద్రినాధ్ క్షేత్రానికి చేరుకొని రాత్రికి అక్కడ బస చేసి విశ్రాంతి తీసుకొని
గాఢనిద్రలోనికి జారుకున్నారు.మర్నాడు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ
మరొకసారి బదరీనాధుడిని దర్శించుకొని తాము చేస్తున్న ప్రయోగానికి ఎలాంటి అవాంతరాలు
కలుగకుండా చూడమని నిర్వాణలామా కోరుకుంటే జేసి మాత్రము తన తండ్రి దగ్గరికి ఎలాంటి
ఇబ్బంది లేకుండా వెళ్ళే విధముగా చూడమని కోరుకుని అక్కడ నుండి 2
కి.మీ దూరములో ఉన్న బ్రహ్మ కపాలము ప్రాంతమునకు చేరుకున్నారు.ఈ పర్వత
పంక్తి మీద తను తయారుచేసిన సైన్స్ పరికరమును నిర్వాణలామా అమర్చే పనిలో పడ్డాడు.ఇది
చూడటానికి చిన్న సైజు డిష్ ఏంటినా లాగా ఉన్నదని జేసి అనుకున్నది.ఆ తరవాత దీనికి
సుమారుగా 100 బ్యాటరీలు అనుసంధానము నిర్వాణలామా చేశాడు.ఆ
తరవాత మానిటర్ ఉన్న అతి పెద్ద మిషన్ దగ్గరికి వెళ్ళి ఏవో మీటలు నొక్కుతుండగా ఈ
డిష్ ఏంటినా దానికి తగ్గట్లుగా ఏవో సంకేతాలు కోసము వెతుకుతున్నట్లుగా ప్రయత్నాలు
మొదలుపెట్టింది.మెషీన్ పనిచేస్తుందని నిర్వాణలామా దీనికి అనుసంధానమైన బ్యాటరీలను
ఉపయోగించి ఒక లక్ష నెగెటివ్ ఎనర్జీని ఈ
ఏంటినా ద్వారా అంతరిక్షము వైపుకి అదే పనిగా దిశలు అలాగే కోణాలు మారుస్తూ పంపిస్తుండగా
ఒక చోట గాలిలో ఒక స్పార్క్ లాంటి వెలుగు కనిపించేసరికి ఆనందపడుతూ జేసి మరియు థామస్
కేసి చూస్తూ
“జేసి.మనకి కావలసిన బ్లాక్ హోల్ దొరికింది.ఇపుడు దానికి మన దగ్గరున్న
నెగెటివ్ శక్తిని పది లక్షల దాకా పెంచి దానికి ఒక హోల్ పడేటట్లుగా చేస్తాను.అపుడు
మీరు 18 సెకన్స్ లొపల అందులో దూకండి.అక్కడ లోపల 36సెకన్స్ మాత్రమే ఈ భూమికి అనుసంధానమై ఉంటారు.ఎపుడైతే మీ చేతి వాచీలు పని
చేయవో అపుడు మీరు పితృలోకానికి అనుసంధానమైనట్లే అన్నమాట.ఈ వాచీలు ఆగిపోయే లోపలే
మీరు వెనక్కి రావాలనుకుంటే రాగలరు.భయపడవద్దు.బాధపడవద్దు.ఆనందముగా వెళ్ళండి.అందరిని
కలవండి” అంటూ సంఙ్ఞ చేయగానే ఈ లోపల అనుసంధానమైన బ్లాక్ హోల్
కి ఒక పెద్ద రంధ్రము పడినట్లుగా కాంతిపుంజ కిరణాలు కాంతిని వెదజల్లడము ఈ కాంతిని
తట్టుకోలేక అందరు ఒక్కసారి కళ్ళు మూయగానే
రంధ్రము తెరచుకున్నదని తెలుసుకున్న జేసి మరియు థామస్ ఏమాత్రము భయపడకుండా
మనో ధైర్యముతో ఈ హోల్ చేయడము వలన వచ్చిన కాంతి మార్గములోనికి ప్రవేశించిన క్షణాలలో
వీరు అదృశ్యము అవ్వడము దానితో 18 సెకన్స్ పాటు పనిచేయవలసిన
బ్యాటరీలు 11 సెకన్స్ కే డెడ్ అవ్వడము నిర్వాణలామా
గమనిస్తుండగా ఈ హోల్ నుండి రెండు వాచీలు విసరవేయబడటము గమనించి వాటి సమయము చూడగానే 42
సెకన్స్ అని చూపగానే అంటే వీళ్ళు పితృలోకము వైపు బయలుదేరారని
తెలుసుకొని మిగిలిన వాళ్ళు ఆనందపడ్డారు.ఆ తరవాత ఈ ముగ్గురు కలిసి నాగమణిని
ప్రత్యక్షముగా చూడటానికి నేపాలు ప్రాంతములోని ఖాట్మాండ్ లోని పశుపతినాధ్ దేవాలయ
దర్శనమునకు కాలయంత్రములో దొరికిన రూట్ మ్యాప్ అధారముగా బయలుదేరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి