51 భాగం

 

51

21 . మట్టి ద్వారా అమృతం, విషము ఇది రెండిటిని స్వీకరిస్తుంది. ఇలాగే మనస్సు గూడ మంచి, చెడు ఆలోచనలలో మంచిని స్వీకరించాలి.

22 . నీళ్లను చూస్తే దీనిలో ఎంత మురికి చేరినా స్వచ్చంగా ఎలా అయితే మారుతుందో అలాగే మనలో వచ్చే అజ్ఞాన మాయలను తొలగించుకొని జ్ఞానములో ఉండాలి.

23 . అగ్ని ఎలాగైతే ఇది మంచి లేదా చెడు అనే పదార్ధాలను చూడకుండా కాల్చి వేస్తుందో అలా మనలోని అన్నిరకాల మాలిన్యాలు దగ్ధం చేసుకోవాలి.

24 . గాలి అన్ని రకాల సుగంధాలను, దుర్గంధాలను కలుపుకొని పరిస్థితులకి తగ్గట్లుగా మారుతుంది. స్వస్థితిని పొందుతుంది. అలా మనము గూడ ఉండాలి.

25 . కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం, మనస్సు, శబ్ద, రూప, రస, గంధ, స్పర్శ, అవగాహన చైతన్య, భావ, దృశ్య, శబ్ద, రస, అభిరుచి అనే స్పందనలు... ఇలా ఈ మొత్తం 18 అన్నింటిని అనుభవ అనుభూతిపరంగా అనుభవిస్తే మనకి శూన్యరహస్యం తెలుస్తుంది.

26 . యోగ్యులైన వారి సహాయ సహకారం పొందడం, నియమాలు పాటించడం, వివేకం పొందడం, బద్ధకం లేకపోవడం, అన్నింటి యందు అవగాహన కలిగి ఉండటం అనేది ప్రతి సాధకుడు ఈ అయిదు సూత్రాలను గుర్తు పెట్టుకోవాలి.

27 . ఎంతమంది దీక్ష తీసుకున్నారన్నది ముఖ్యం గాదు. ఎందరు సర్వసమర్పణ స్థితికి చేరుకున్నారో ప్రధానం.

28 . జయాపజయాలను సమంగా స్వీకరించే సమతా దృష్టి అవసరం.

29 . శరీరము, మనస్సు, వాక్కు వలన పాపాలు జరుగుతాయని తెలుసుకోండి. ఇందులో మనస్సుతో చేసే పాపాలు అతి పెద్దవి. చెడ్డవి.

30 . చంపాలన్న ఆలోచన లేనపుడు అది పాపము కాదు. అది జీవహింస గాదు.

31 . తప్పు చేసిన శిక్ష అనుభవించక తప్పదు.

32 . సమత అంటే స్వ-మతం.అంటే తనదైన దృష్టిని, అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడం

33 . సూత్రం చెప్పిన దారిలో సత్యాన్ని దర్శించాలి. సత్యాన్ని అన్వేషించాలి. సూత్రానికి- అనుభవానికి మధ్య చాలా శూన్యం ఉంటుందని గ్రహించు.

34 . ధర్మబోధ తెలిసిన వాళ్లు మాట్లాడలేరు. పొగడలేరు.

35 . సాధనకి మించిన తత్వం లేదు. అవలోకనాన్ని మించిన జ్ఞానం లేదు.

36 . కరుణ, ప్రేమ, ఆనందం, సమత- ఇవే ప్రతివారికి ఉండాలి.

37 . 'శూన్యధర్మం' పైన గాకుండా 'ధర్మశూన్యత' పైన దృష్టి సాధనను చెయ్యాలి.

38 . అవసరాలు పెరిగే కొద్దీ ఆశలు, కోరికలు, బాధలు పెరుగుతాయని తెలుసుకో.

39 . నిరాడంబరంగా కోరికలు, అవసరాలకు పరిమితము చేస్తూ జీవిస్తే ఆనందం, శాంతి కలుగుతుంది.

40 . ఇతరులకు సహాయం చెయ్యడము వలన ఆత్మతృప్తి, మనఃశాంతి కలుగుతాయి.

*** *** *** *** *** ***

నిర్వాణలామా కాస్త ప్రకృతితో

ఏమిటి..నువ్వు ఆనందభిక్షువు మరణము గూర్చి ఆలోచిస్తున్నావా?” అనగానే

స్వామి..నాకు అతని మరణ బాధలేదు. కాని నా కోసం అతను చనిపోయాడని బాధగా ఉంది అనగానే

ప్రకృతి..అంతాగూడ ప్రకృతిమాత చేతులలో చేతలలో జనన-మరణ-జన్మల చక్రము తిరుగుతూ ఉంటుంది గదా.రెండు రెప్పలు తెరిస్తే జననం..అదే రెండు రెప్పలు మూస్తే మరణము గదా.మన ఏమరుపాటు,గ్రహపాటు,పొరబాటు మన మరణానికి కారణమవుతాయి.వాడికి అలా రాసి పెట్టి ఉంది.ఇంతవరకే వాడికి మనకి ఋణానుబంధముంది అనగానే

ప్రకృతి వెంటనే స్వామి..విధివ్రాతను ఎవరు తప్పించుకోలేరు.మరణము గూడ అంతే.మన జననముతోపాటు మరణము గూడ పుట్టి మన నీడలాగా వెంటాడుతూనే ఉంటుందని లోకవిదితమే కదా.ఏది ఎపుడు జరగాలో అది అపుడు జరుగుతుంది.జరిగేది జరగక మానదు.జరగనిది ఎన్నడికి జరుగదు కదా. ఇంక మీకు తెలిసిన హిమాలయ విశేషాలు,వింతలుంటే చెప్పండి అనగానే..

ప్రకృతి...నీకు ఒక విషయము తెలుసా..ఈ ఖోజార్ నాథ్ దేవాలయమును కైలాస పర్వత పరిక్రమ యాత్ర పూర్తిచేసుకొని ఆఖరిగా ఈయనను దర్శించుకొంటే కైలాస-మానస సరోవర యాత్రఫలితము లభిస్తుందని ఇక్కడివారి నమ్మకము.ఇక్కడ నుండి 16 వందల కి.మీ దూరములోనే ఖాట్మాండ్ అదే పశుపతినాథ్ దేవాలయమునకు చేరుకొని అటుపై భారతదేశానికి వెళ్ళిపోవచ్చు.అంటే మనము దీనికి వ్యతిరేక యాత్ర అనగా మొదట ఈయనను దర్శించుకొని ఆపై కైలాసనాధుడైన అవలోకితేశ్వరుడి దర్శనానికి వెళ్ళుతున్నాము. ఎందుకంటే మన యాత్ర వెనక్కి వచ్చేది గాదుకదా.సరే.ఈ హిమాలయాలలో నా పరిశోధన వలన నేను తెలుసుకున్న వింతలు,విచిత్ర విషయాలు నీకు మనము ప్రయాణము చేస్తూ చూపిస్తాను అంటూ ముందుకి ప్రయాణము కొనసాగించారు.

ఈ ప్రయాణములో వీరికి రాత్రిపూట కాంతులు విరజిమ్మే చెట్ల లతలు కన్పించాయి. వాటిని చూడగానే నిర్వాణలామా ప్రకృతితో

"ప్రకృతి. వీటిని జ్యోతిర్ణత అంటారు.  ఇవి స్వయం సిద్ధగా రాత్రిపూట మిణుగురు పురుగులాగా ఇవి గూడ మెరవడము మీరు చూసి ఉంటారు గదా. ఇది మన యోగనాడులను , యోగ కేంద్రాలకు శక్తిని మేలుకొలిపి ఒక దివ్యమైన ఆధ్యాత్మిక చైతన్యమును కల్గిస్తాయి. కాబట్టి మనము ఈ లతలను తిందాము అంటూ వీటిని తిని తినగానే... వీరికి అలివికాని అద్వితీయమైన ఆనందానుభూతి లోనికి కొంతసేపు వెళ్లారు. ఆ తర్వాత ముందుకి ప్రయాణము సాగించగా.....వారికి దామోదర కుండం అనే సరస్సు కనబడింది. దీనిని నిర్వాణలామా చూసి వెంటనే " ఈ సరస్సు అడుగున మనకి సహజ సిద్ధమైన సాలగ్రామాలు దొరుకుతాయి. వీటిలో బంగారముంటుంది. ఈ సాలగ్రామాలలో శ్రీమూర్తి సాలగ్రామాలు అంటే లక్ష్మీదేవి సాలగ్రామాలుంటే... విష్ణు స్వరూప సాలగ్రామాలు అనగా నారసింహ, కూర్మ, సుదర్శన, మత్స్య , మహాసుదర్శన , షట్చక్ర సీతారామ లాంటి దివ్యమైన స్వచ్ఛమైన నిజమైన సాలగ్రామాలు ఈ సరస్సులో కనబడతాయి అని చెప్పగానే వీరిద్దరికి అందులోంచి సుదర్శన శాలిగ్రామము మరొకరికి శ్రీ సాలిగ్రామము దొరికినాయి. వీటిని తమ చేతి సంచిలో భద్రముగా పెట్టుకున్నారు. ఆ తర్వాత మరి  కొంత ప్రయాణము చేస్తుంటే ఒక చెట్టు ఆకులను ఆశ్చర్యముగా చూస్తుంటే ప్రకృతికి ఏమి అర్ధము కాని ముఖము పెట్టగానే... ఇది చాలా అరుదైన రుదంతి మహాహాధి లత. దీనిమీద రాత్రిపూట పడిన మంచు బిందువులు తెల్లవారేసరికి ముత్యాలవలె పేరుకొని ఈ ఆకుల మీద అలా ఉండిపోతాయి. వీటిని కదపకుండా పాదరసముపైన కొంత సేపు ఉంచితే... ఆ పాదరసం వెంటనే గడ్డ కట్టి రస బంధనము అవుతుంది. ఇలాంటి పాదరసానికి శమంతకమణి లేదా పరుశవేది మణి కాని తాకిస్తే అదికాస్త సహజ సిద్ధమైన బంగారములాగా మారుతుంది అని చెప్పగానే...

ప్రకృతికి ఒక సందేహము వచ్చి " స్వామి. ఇన్ని విషయాలు తెలిసిన మీకు.... ఆ బంగారమును లేదా మణులు లేదా వేరులను విదేశాలకి అమ్మి సొమ్ము చేసుకుంటే ఈ పాటికి బికారి నుండి బిలియనీరు అయ్యే వాళ్ళు గదా అనగానే...

నిర్వాణలామా ఒక నవ్వు నవ్వి " ప్రకృతి. మణులు , లేదా లతలు లేదా సాలగ్రామాలు ఎలాంటి దివ్యలక్షణాలుండాలో.... వాటిని భరించేవాడికి , ధరించేవాడికి , అనుభవించే వాడికి దివ్య లక్షణాలుండాలి. అనగా అతడి శరీరము మీద శంఖు , సుదర్శన చక్ర రేఖలు , తామరపువ్వు లాంటి పద్మ రేఖలు శరీరములో చెమటవాసన , కుళ్లు వాసన లేని సుగంధ పరిమళం వెదజల్లే యోగ శరీరము ఉన్నవారికి మాత్రమే ఇవి ఆధీనమవుతాయి. ఆజ్ఞలు పాటిస్తాయి. లేదంటే అనర్ధాలు కల్గిస్తాయి. అంతెందుకు ఇలాంటి లక్షణాలున్న మీ యోగ పుంగడైన శ్రీకృష్ణుడు కాస్త శమంతకమణి ధరించాడు గదా. కాని ఆయన మహా నిర్యాణము చెందిన తర్వాత ముసలం పుట్టి ద్వారకయే వినాశనము పొందింది గదా. అలాగే అర్హత లేని ఔరంగజేబు , గజినీ , విక్టోరియా మహారాణి ఇలాంటి వారు కోహినూరు వజ్రం ధరించి రాజ్యాలే కోల్పోయినారని చరిత్రయే చెపుతోంది గదా. అంటూ...    నిర్వాణలామా తన చుట్టూ పరిసరాలను ఒకసారిగా పరిశీలించి చూస్తూ... ఇప్పుడు మనము ఎవరెస్టు శిఖరానికి వాయువ్య దిశలో ఉన్నాము. నాకు తెలిసి ఈ దిక్కుగా మనము అరవై మైళ్లు వెళ్ళితే మనకి గావలసిన మనము అనుకున్న స్ఫటిక పర్వతము వస్తుంది. అని చెప్పగానే ప్రకృతికి ఆనందమేసింది.

ఉన్నట్టుండి…. …

అనుకోని విపత్తుగాఇంతలో అనికోని అతిథిలాగా..

సుమారుగా 15 లేదా 18 అడుగుల ఎత్తు ఉండి భారీకాయ శరీరముతో పైగా ఒంటినిండా చీము,పుండ్లలతో,గాయాలతో,వీటిపైన ఈగలు,దోమలు ముసురుతున్న దేహ పరిస్ధితిలో వంటిమీద అతిపలుచని బాగా మురికి పట్టి చిరిగిపోయిన పసుపు వస్త్రము ధరించి..నుదటికున్న గాయము కనిపించకుండా దానికి ఒక మాసిపోయిన బట్టపీలిక కట్టుకొని ఉన్నగూడ ఈ గాయము నుండి ఒక్కొక్క నెత్తురు బొట్టు బొట్టుగా కారుతున్న గూడ పట్టించుకోకుండా వీరిద్దరిని తన రౌద్రచూపులతో చూస్తూ

నాకు బాగా ఆకలిగా ఉంది.తినడానికి ఏమైనా పెట్టండి అనగానే

నిర్వాణలామా వెంటనే స్వామి..మీరు ఎవరో శాపగ్రస్తులైన యతీశ్వరులుగా ఉన్నారు.మీ ముఖము మీద నయము కాని గుంట గాయము బట్టి నేను అనుకుంటున్నాను.పైగా మీ భారీ కాయానికి ఉండే భారీ ఆకలి తీర్చే ఆహారము మా ఇద్దరి దగ్గర లేదు.కావలంటే మేమిద్దరము గూడ మీకు మనస్ఫూర్తిగా ఆహారము అవుతాము.అలా మీ భారీ ఆకలి కొంత అయిన తీరుతుంది అనగానే..

నాకు కావాలసిన ఆహారము మీరు కాదు అంటూ నిర్వాణలామా చేతిసంచి బలవంతముగా లాక్కుని అందులో ఉన్న ఒక జామపండును తీసుకొని దాని తింటూ వీటి రుచి కనిపెట్టి నిర్వాణలామా కేసి చూస్తూ..

అంటే ఈ జామకాయలు జంబూద్వీపములోని కల్పవృక్షము కాయలు గదా.ఎపుడో కాని ఇవి దొరకవు.ఇవి నీకు దొరికాయి అంటే నువ్వు ఖచ్చితముగా కారణజన్ముడివి.గత జన్మములో శాపము పొందిన శివయోగివి అంటూ నా ఆకలిబాధ తీర్చావు.మరో ఆరు నెలలు వరకు నాకు ఆకలి లేకుండా చేశావు.ఈ కాయలు ఉన్నవారిని కైలాస పర్వతము యొక్క అడుగుభాగమునకు వెళ్ళుటకు ఉన్న సొరంగమార్గమును చూపించాలని నాకు విధాత విధించిన విధి.నన్ను అనుసరించు.మీకు మేలు జరుగుతుంది అనగానే

ప్రకృతి లోగొంతుతో నిర్వాణలామాకి మాత్రమే వినిపించేటట్లుగా

స్వామి..ఈయన ఎవరో ఏమిటో తెలియకుండా ఈయన వెంట ఎలా వెళ్ళేది?పైగా ఈయన అవతారము చూస్తూంటే దీర్ఘకాలిక నయముకాని కుఘ్ఠవ్యాథితో ఉన్నాడు.పైగా నుదటి మీద నయంకాని గాయముతో ఉన్నాడు.శరీరము అంతా దుర్గంత పూరితము.ఎన్ని సం.రాలు అయినదో స్నానము చేసి ఒక్కటే చెమట కంపు..గాయల క్రుళ్ళు వాసన..పుండ్ల చీము వాసన..భరించలేకపోతున్నాను అనగానే

ప్రకృతి ఈయన ఎవరో నీకు తెలియకపోవచ్చును.కాని ఈయన ఎవరో గ్రహించాను.ఈయన వివరాలు నీకు చెప్పే అవకాశము నాకు ఇపుడు లేదు.ఈయన చూపే మార్గము మనకి అవసరము.మారుమాట్లాడకుండా మనము ఆయన వెంట మౌనముగా వెళ్ళడము తప్ప మనము ఏమి చెయ్యలేము.మనము ఈయన వెంట వెళ్ళలేకపోతే మన వెంట ఈయన పడుతూనే ఉంటాడు అనగానే

ప్రకృతి మౌనముగా తన అంగీకారమును తెల్పేసరికి వీరిద్దరు కలిసి ఈ భారీకాయుడు వెంట బయలుదేరారు.ఇలా వీరందరు ఒక మంచుమైదానము లాంటి ప్రాంతమునకు తీసుకొని వచ్చి

ఇదిగో ఇది మంచుమైదానములాగా కనిపించే అతిపురాతనమైన సరస్వతినది.దీని అడుగున ఒక సొరంగమార్గముంది.దీని లోపలకి వెళ్ళితే మీరు కైలాస పర్వత అడుగుభాగములో ఉన్న అగర్తల గ్రామానికి చేరుకుంటారు.ఆపై ఈశ్వరేఛ్చ అంటూ పది అడుగులు వేశాడో లేదో ఈ భారీకాయుడు కాస్త అదృశ్యమయ్యేసరికి...ప్రకృతి బిత్తరపోయింది.

వెంటనే స్వామి..ఈ మహానుభావుడెవరు అనగానే ...

నిర్వాణలామా అందుకొని ప్రకృతి..భయపడకు.ఈయన సప్తచిరంజీవులలో ఒకరైన ఆశ్వద్ధామ మహర్షి. ఈయనకి పుట్టుకతోనే నుదుటి మీద ఒక దివ్యమణితో సహజసిద్ధముగానే జన్మించాడు.గాకపోతే పంచపాండవుల సంతానమైన ఉపపాండవుల్ని ఆధర్మముగా అర్ధరాత్రి ఇతను చంపడముతో శ్రీకృష్ణుడు ఇందుకు శిక్షగా పుట్టుకతో వచ్చిన నుదటి మణిని భీముడు చేత బలవంతముగా పెకలింపచెయ్యగానే ఆపై నయముకాని నుదటి గాయము ఏర్పడినది.పైగా శాపము కారణముగా నయముకాని కుఘ్ఠవ్యాథి ఇచ్చి మరణయాతన పడేవిధంగా చిరంజీవితత్త్వమును ప్రసాదించి ఎపుడు తనకి శాపవిముక్తి అడుగగా ఏపుడైతే కల్కిభగవానుడి మానవరూపమును ఈ భూలోకములో తనకి దర్శనము కలుగుతుందో ఆ క్షణమే ఈయనకి శాపవిముక్తి కలిగి సప్తరుషులలో ఒకరిగా వెలుగొందే వరమును పొంది ఈ శాపాల కారణముగా ఇలా చిరంజీవిగా నయముకాని గాయలతో భరించలేని ఆకలి బాధతో కలిపురుషుడైన కల్కిభగవానుడి అనుగ్రహము కోసము ఈ హిమాలయపరిసరాలలో సంచారము చేస్తున్నారు అంటూ..మన కాలచక్రతంతులోని గాలిగోపురాలను మోస్తూ ఒక బలిష్టుడైన వ్యక్తులు ఉన్నారు గదా.వాళ్ళే ఇలాంటి సప్తచిరంజీవులు అన్నమాట.అంటే ఈ లెక్కన చూస్తే మనము కైలాస పర్వతమునకు 20 లేదా 30 కి.మీ దూరమునకు వచ్చిఉండాలి  అనుకుంటూ

ఈ మైదానము చుట్టుప్రక్కలకేసి చూడగా వీరికి అల్లంతదూరములో మహిమాన్వితమైన కైలాసనాథుడైన సదాశివమూర్తి ఆవాసము చేస్తున్న కైలాస పర్వతము కనిపించగానే వీరిద్దరూ అమితానందమునకు గురి అవుతూ

స్వామి..మీరు గమనించారా? ఈ పర్వతమును చూస్తూంటే తెల్లని స్ఫటిక మణి లాగా మెరుస్తూ కనపడుతోంది కదా అనగానే

ప్రకృతి..నువ్వు చెప్పినది అక్షర సత్యము.ఇంకొక విషయము గమనించావా? ఈ కైలాస పర్వతము చుట్టు ఉన్న అష్టపర్వతాలను కలిపి చూస్తే మనకి ఈ కైలాస పర్వతము ఒక అష్టదళ పద్మములో ఉన్న స్ఫటిక మణి లాగా కనపడుతుంది.అంటే

ఇదే నిజమైన మణిపద్మం అంటూ

వీరిద్దరు కలిసి

ఓం-మణి-పద్మ-హుం

అంటూ నమస్కారభక్తితో ఈ మణిపద్మ స్ఫటికమణి అయిన కైలాస పర్వతము కేసి ఆర్తిగా చూస్తూ తన్మయత్వము పొందసాగారు.

ఆ తర్వాత వీళ్ళు 20 కి.మీ దూరము నడవగా

వీరికి సుగంధభరిత పరిమళ సువాసనలు అమితముగా వచ్చేసరికి ఆ దిశగా వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ వీళ్ళకి పారిజాతపుష్ప వనము దర్శనమైంది.అంటే శ్రీకృష్ణుడు తన సత్యభామ అలక తీర్చటానికి దివి నుండి భువికి తెచ్చిన పారిజాతపుష్పాలు అలాగే కుంతిదేవి పూజకోసము అర్జునుడు ప్రార్ధనమేర ఇంద్రుడిచ్చిన పారిజాతపుష్ప వనములోనికి తాము ప్రవేశించినామని నిర్వాణలామా గ్రహించిడానికి అట్టే సమయము పట్టలేదు.

అపుడు ప్రకృతి వెంటనే స్వామి..ఈ పుష్పాలు ఏమిటి?మంచి సువాసనను ఇస్తున్నాయి అనగానే

ప్రకృతి..వీటినే పారిజాతపుష్పాలు అంటారు.ఇవి దేవతాపుష్పాలు.మన కాలచక్ర ఆధార బాక్స్ లో ఉన్న పుష్పాలలో ఇది ఒకటి.ఇవి ఉన్నచోట దేవతలు కాస్త సూక్ష్మశరీరధారిగా ఆవాసము చేస్తూంటారు.ఈ చెట్ల వయస్సు సుమారుగా 1000 సం.రాల నుండి 5000 సం.రాల దాకా ఉంటుంది.ఇవి పండ్లు,విత్తనాలను ఉత్పత్తి చెయ్యదు.ఈ చెట్టు పువ్వులు ఎపుడు మెరుస్తూంటాయి.గావాలంటే చూడు నీకే తెలుస్తోంది.అలాగే ఈ చెట్టు ఆకులు మన చేతివేళ్ళను పోలి ఉంటాయి.నువ్వు గమనించావా?చూడు.పైగా ఈ ఆకులు ఏడు భాగాలుగా చీలి ఉంటాయి.ఈ చెట్టుకి ఉన్న విశేషము ఏమిటంటే ఈ చెట్టు ఆకులు కాని పువ్వులు కాని కొమ్మలు కాని ఎప్పడికి ఎండిపోవు.అలాగే ఈ పువ్వులతో పూజ చేస్తే సకల దేవతలందరుగూడ మహాప్రీతి చెందుతారని పురాణవచనము.ఇది పాలసముద్రమును చిలికి నపుడు బయటికి వచ్చిన పవిత్ర వస్తువులలో ఈ పారిజాతం చెట్టు ఒకటని..దీనిని కల్పవృక్షమని అంటారని.. ఇది సర్వకోరికలు తీరుస్తుందని హైందవధర్మ పురాణ ఇతిహాసాలు మనకి చెప్పుతున్నాయి. అంటూ తలో ఒక పుష్పమును తీసుకొని వీరిద్దరు ముందుకి బయలుదేరుతుండగా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి