17 భాగం

 

17

గాకపోతే ఇలాంటి ధ్యానస్థితి పొందటానికి ఆశ్రమాలే ఉండవలసిన అవసరమే లేదని.... ఆశయం ఉంటే చాలునని నేను గ్రహించి

సంసారిగా జీవిస్తూనే తపస్సు చేయాలని నేను అలాగే యశోధర అనుకొని

మాకు ఎన్ని రాజకార్యాలున్న, ఇంటి పనులున్న గూడ ధ్యానము చేసుకోవడానికి రోజులో నాలుగు గంటలు పైగా మేమిద్దరము వీలు కల్పించుకొని ధ్యానము చేస్తుండేవాళ్లము. ఒకేసారి మేమిద్దరము  కలిసి ధ్యానానికి కూర్చునేవాళ్లము. అదే మాకు ఇష్టమైన కార్యాలలో ఒకటిగా ఉండేది.

ఇది ఇలా యుండగా....

ఒకరోజు నా దగ్గరికి యశోధర వచ్చి "స్వామి. మీకు అబ్బాయి కావాలా? అమ్మాయి గావాలా?" అని తన కౌగిలిలో నున్న నన్ను బిగించి అడిగింది.

నాలో ఒక్క క్షణం కలవరం కల్గి "నిజమా? గోపా? అని మురిపెంగా అనేసరికి

'అవునని' సిగ్గుతో తలవంచుకొనేసరికి... నాకు ఆశ్చర్యమేసింది."

స్వామి. నాకు మీలాంటి బాబుని కనాలని ఉంది. వాడు మీ ప్రతిరూపం కావాలి. మీ వంటి సుందర చైతన్యమూర్తి, ప్రజ్ఞాశాలి, ప్రతిభావంతుడు, యోగ పురుషుడు, ధ్యానసిద్ధుడై ఉండాలని ఇలా అంటూండగానే....

నేను కాస్త గోపాను మురిపెంగా కౌగలించుకొని నీ  అనురాగము, ప్రేమ ఆప్యాయతలు, సేవాతత్పరత గుణముతో పుట్టిన అబ్బాయి లేదా అమ్మాయి అయిన నాకు ఒక్కటే అని చెప్పాను.

నెలలు నిండాయి. నొప్పులు మొదలైనాయి.

*** *** *** *** *** ***



అంగుళీమాల

పద్మ కీ స్టోన్ కోసము అవిముక్త క్షేత్రమైన మహాకాశీక్షేత్రమునకు చేరుకోవడము జరిగింది.గంగా స్నానము చేసి కాశీ విశ్వనాధుడిని దర్శించుకొని కాలభైరవుడి ఆశీస్సులు పొంది..ఈ క్షేత్రములో ఉన్న బౌద్ధ మందిరము దగ్గరకి వెళ్లి అక్కడ ఆయనను దర్శించుకొని కీ స్టోన్ కోసము బౌద్ధ మ్యూజియము ఉన్న ప్రాంతము వైపు బయలుదేరడము జరిగింది.మ్యూజియము లోపలికి వెళ్లి దేవదత్త చెప్పిన వ్యక్తి గూర్చి ఆరా తీయగా ఇంకా అతను ఆఫీసుకు రాలేదని వచ్చే సమయము అవుతున్నదని చెప్పి అపుడిదాకా ఒక కుర్చి చూపించి కూర్చోమని చెప్పడముతో అంగుళీమాల ఆ వ్యక్తి కోసము ఎదురుచూస్తూ కూర్చున్నాడు.

ఇంతలో

తన ప్రక్కన మరో రెండు కుర్చిలలో కాశీ యాత్రను చేయడానికి వచ్చిన యాత్రికుల సంభాషణం మీద అంగుళీమాల దృష్టి పెట్టి వినసాగాడు.

అరే.నీకు తెలుసా.ఈ కాశీక్షేత్రములో ఇపుడికి కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి అంటూ..

ఈ క్షేత్రములోని పంచ క్రోశ ప్రాంతములోకి ఇపుడికి గ్రద్ద ఎగరడము ఎవరు గూడ చూడలేదు అంటూ..అలాగే ఈ క్షేత్రములో పూసే పూలకు వాసన ఉండదు అంటూ..అలాగే ఈ క్షేత్రములో చనిపోయే ప్రతివ్యక్తి లేదా ప్రతి జీవి గూడ తమ కుడి చెవిని ఆకాశము వైపుకి ఉంచి చనిపోతాయి అంటూ ఈ క్షేత్రములో సాక్షాత్తూ కాశీ విశ్వనాధుడే స్వయముగా చనిపోయే జీవి కుడి చెవిలో మణికర్ణిక ఘాట్ యందు తారకరామ మంత్రోపదేశము చేస్తాడని యోగులు చెపుతారట..ఈ క్షేత్రములో విశాలాక్షి అమ్మవారి మందిరము దగ్గర ఉన్న బావిలో 6 నెలలలో చనిపోయేవారి నీడ కనిపించదు అంటూ..అలాగే ఈ క్షేత్రములో బల్లి అరవడము ఇంతవరకు ఎవరు వినలేదు అంటూ..  క్షేత్రములో అస్థికలు గంగానదిలో నిమజ్జనము చేస్తే అవి కరిగేదాకా ఆ జీవుడికి శివలోకమునందు సర్వ సుఖాలు పొందుతూనే ఉంటాడట.అలాగే ఈ క్షేత్రములో సంచరించే ఆవులు, ఎద్దులు ఎవరిని పొడిచిన సంఘటనలు అలాగే వీధి కుక్కలు ఎవరిని కరిచిన లేదా బాధించిన సంఘటనలు ఇంతవరకు జరుగలేదు అంటూ చెబుతున్న విషయాలను రహస్యముగా వింటున్న అంగుళీమాలకి ఆశ్చర్యానందము కలుగుతుండగా

స్వామి.మీకు గావలసిన ఆఫీసర్ గారు తన కేబిన్ గదిలోకి వచ్చారని సిబ్బంది చెప్పగానే అయిష్టముగా  అక్కడ నుండి అంగుళీమాల లేచి ఆ ఆఫీసర్ ఉన్న గది దగ్గర వైపుకు బయలుదేరాడు.

తీరా గదిలోనికి వెళ్ళిన అంగుళీమాలకి తన ఎదురుగా  ఒక లేడి ఆఫీసర్ పైగా ఒక విదేశీ యువతిలాగా కనిపించేసరికి ఆశ్చర్యము పోతుండగా

స్వామి.మీరు ఎవరు?నాకోసము ఎందుకు వచ్చారు అనగానే 

మేడం.నన్ను దేవదత్త గురూజీ మిమ్మల్ని కలవమని పంపించారు.ఆయన నన్ను ఎందుకు పంపించారో మీకు ఫోన్ లో చెప్పి ఉంటారు గదా.

ఒహో.ఆ వ్యక్తి మీరేనా.మీకోసము ఎదురు చూస్తున్నాను.దేవదత్త సార్ నాకు ఫోన్ చేసి మీకు గావలసిన వస్తువు గూర్చి చెప్పారు.నాతో రండి.అది మీకు ఇస్తాను  అంటూ

తన గది నుండి బయటికి వచ్చి దాదాపుగా 54 గదులు దాటుకుంటూ చివరికి ఒక చీకటి గదిలోనికి దారితీసినది. గదిలో ఎలాంటి బల్బ్ లేకపోవడము ఉన్న సి.సి కెమెరాలు పని చేయకపోవడము అంగుళీమాల దృష్టి నుండి తప్పించుకోలేదు.

ఇంతలో

ఆమె కాస్త ఈ గది మూలకి చేరుకొని అక్కడ ఉన్న పద్మాకార రాయిని వంగి పైకి తీస్తుండగా అమె నడుము వంపుల సౌందర్యము అలాగే ఆమె వక్షోజాల సౌందర్యము స్పష్టముగా కనిపిస్తున్నగూడ  అంగులీమాలలో ఎలాంటి స్పందనలు కనిపించలేదు కాని ఈమె వంగి చేతులతో ఈ రాయిని పైకి తీస్తుండగా అనుకోకుండా ఈమె కుడి చేతి బొటనవ్రేలుకి గాయమై రక్తము కారుతుండేసరికి ఆమె బాధతో కేకవేసేసరికి అక్కడ ఉన్న అంగుళీమాల బొటనవ్రేలును చూసి తన నోటిలో పెట్టుకొని స్పర్శానందమును పొందుతూ మరొక ప్రక్క ఈ పద్మాకార రాయిని పట్టుకొనేసరికి అసలు ఏమి జరిగినదో తెలుసుకొని ఆమె వెంటనే తెలివి తెచ్చుకొని

సారీ.నా  వ్రేలును మీనోటి నుండి తీస్తారా?” అనగానే

క్షమించండి మేడం.రక్తము చూసేసరికి నేను ఎపుడు ఇలాగే చేస్తాను సారీ అనగానే

ఓకే.ఇందులో తప్పు ఏమి లేదులే.ఇదిగో మీకు కావసిన కీ స్టోన్ అనగానే ఆ పద్మాకార రాయిని యధాలాపముగా అపుడికే పట్టుకొని ఉండుట వలన అంగుళీమాల దానిని తన చేతిసంచిలో పెట్టుకొని

వెనక్కి తిరిగి వెళ్ళుతున్న లేడి ఆఫీసర్ ఏదో చెప్పపోతుండగా ఆమె బొటనవ్రేలు గుర్తుకు రాగానే అంగుళీమాల లోని సైకో కిల్లర్ బయటికి వస్తూ

మేడం.ఒక నిమిషము ఆగండి అంటూ

చేతిసంచిలోంచి ఒక చురకత్తిని బయటికి తీస్తూ

మేడం.నన్ను క్షమించండి.నాకు బొటనవ్రేలు సేకరించడము నా బలహీనత.అందులో మీ బొటనవ్రేలు స్పర్శానందము నన్ను పిచ్చివాడిని చేసింది.నాకు సహకరించండి.మీబొటనవ్రేలు ఇవ్వండి అనగానే..

స్వామి.నీవు ఏమి మాట్లాడుతున్నావో నీకు తెలుస్తున్నదా? బొటనవ్రేలు కోసి ఇవ్వడమేమిటి.పెద్దగా అరుస్తాను.మా సిబ్బంది నిన్ను పట్టుకొని పోలీసులకు అప్పచెబుతారు.నువ్వు దేవదత్త మనిషివి కాబట్టి ఇంకా ఏమి చేయకుండా వదిలివేస్తున్నాను.వెళ్ళిపో అనగానే..

మేడం.మీరు దయతో నన్ను వదలివేయవచ్చు కాని నాలోని సైకో యొక్క బలహీనతను ఎవరు వదిలించలేరు

అంటూ చురకత్తితో ఆమె మెడను కోస్తూ ప్రాణాలు పోతుండగానే ఆమె బొటనవ్రేలు కోస్తూ విపరీత రాక్షస ఆనందమునకు గురి అవుతూ నేను వచ్చిన పని అయినది.నా సంబరము గూడ తీరినది అనుకుంటూ ఆమె శవము అలాగే వదిలివేసి ఆమె బొటనవ్రేలును భద్రముగా తన చేతిసంచిలోని ఖాళీ సీసాలో ఉంచి యధావిధిగా ఏమి తెలియనివాడిలాగా ఆ గదినుండి బయటికి వచ్చి ఆ మ్యూజియము వెనుక ద్వారము గుండా బయటపడి తను ఉన్న బస వైపు శరవేగముతో బయలుదేరాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి