23 భాగం

 

23

అప్పుడికే నా అన్వేషణ ప్రయాణ సమాచారము మా నాన్నగారికి అందడముతో ఆయన ఆందోళనపడుతూ

"నాయనా. సిద్ధార్థ. నేను విన్నది నిజమేనా. నువ్వు సత్యాన్వేషిగా మారి సత్యాన్వేషణ ప్రయాణమునకు బయలుదేరుతున్నావా? ఇలాంటి సంఘటన ఏదో ఒక రోజు నేను చూడవలసి వస్తుందని అనుకున్నాను. కాని అది నీ అరవై సంవత్సరాలలో చూస్తాను అనుకున్నాను కాని 29 సంవత్సరాల వయస్సుకే చూస్తానని అనుకోలేదు. మా గూర్చి, ప్రజల గూర్చి ఒకసారి ఆలోచించు."

"నాన్నగారు. నేను వైరాగ్యముతో ఈ నిర్ణయము తీసుకోలేదు. మీ యందు, ప్రజల యందు నా ప్రేమాభిమానాలు ఎప్పుడికి అలాగే ఉంటాయి. కాని నా అన్వేషణలో ఇవి ప్రతిబంధకాలు. వీటిని దాటుకుంటే కానీ నా అన్వేషణ మార్గము సుగమనం కాదు. బాధ్యత ఉన్నవాడిని కాబట్టి నా అన్వేషణ ప్రయాణానికి మీ అనుమతి గావాలని అర్ధిస్తున్నాను. మీ గుండె బరువును మీరు తగ్గించుకోగలరు. కాని నా గుండెలోని బాధను నేను తగ్గించుకోలేను. దీనికి సత్యాన్వేషణయే ఉపశమనము శాంతిని కల్గిస్తుంది. కొంత కాలము నన్ను ఒంటరిగా ఏకాంతముగా వదిలెయ్యండి. నా సత్యాన్వేషణ పూర్తికాగానే తిరిగి మీ దర్శనం చేసుకుంటాను." అనగానే .....

మా నాన్నగారు నన్ను కాదని.... వద్దని అనలేక మౌనముగా నా ప్రయాణానికి అనుమతిగా మనోవేదనతో తలమాత్రమే ఊపి అక్కడ నుండి తోట వైపుకి తన మనోవేదన తీర్చుకోవడముకోసము ఏకాంతముగా వెళ్లారు.

నా ప్రయాణానికి మహారాజు అనుమతి గూడ దొరికినది అని మా అర్ధాంగికి తెలిసి నా సన్నిహితుడైన చెన్నుని పిలిపించి వాడితో...

"చెన్నా. ఈ రోజు రాత్రికి మన రాజకుమారుడికి నీ అవసరం పడుతుంది. ప్రయాణానికి ఆయన గుఱ్ఱమైన కంటకమును సిద్ధముగా ఉంచు" అని ఆజ్ఞ ఇచ్చి....

నాకు గావాలసిన వస్తువులు, బట్టలు అన్ని సర్ది.... ప్రయాణమునకు వేసుకోవలసిన దుస్తులను శయన మందిరములోని బల్లపైన ఉంచి తాను నిద్రపోవటానికి శత విధాలుగా ప్రయత్నాలు చెయ్యసాగింది.

 

*** *** *** *** *** ***

జేసి కారును నడుపుతూ ఆనందభిక్షువు అలాగే అపరిచిత వ్యక్తి మధ్య జరుగుతున్న సంభాషణలను శ్రద్ధగా చెవులు రిక్కించి వినసాగింది.ఎంతైన సి.బి.ఐ ఆఫీసర్ గదా.ఆ మాత్రము అనుమానాలు ఉండక తప్పదు గదా.

ఆనందభిక్షువు వెంటనే అపరిచిత వ్యక్తికేసి చూస్తూ నీ పేరు గంజాయి స్వామి అంటున్నావు.విచిత్రముగా ఉందే?”

స్వామి.నేను సన్యాసులకి,బైరాగులకి,వైరాగ్యులకి,సాధువులకి మాత్రమే గంజాయి అమ్ముతూ వారి దగ్గర ఉన్న విచిత్ర వేరులు,విచిత్ర వస్తువులు అలాగే గుప్త నిధులు వివరాలు సేకరించి వాటిని విదేశీ యాత్రికులకి ఎక్కువ మొత్తములో అమ్మి వచ్చిన సొమ్ముతో ఎంజాయి చేస్తుంటాను.అందుకే నన్ను గంజాయి స్వామి అంటూ ఉండగానే

భాధగా మూలిగేసరికి పోలీసుల దెబ్బలకి తాళలేక ఇతను పడే అవస్థలు చూసిన ఆనందభిక్షువు తన చేతిలో ఉన్న సంచి నుంచి ఒక వేరు ముక్కను అరగదీసి దానిని గంధముతో దెబ్బలు పడిన చోట లేపనము రాసి రాయగానే ఇతనికి ఉపశమనము రావడముతో ఆశ్చర్యము చెంది

స్వామి.ఇందుకే మీ లాంటి వారికి గావలసిన గంజాయిని ఇస్తూ ఇలాంటి విచిత్ర వేర్లును సేకరిస్తాను.నిజానికి ఈ దెబ్బలు తగ్గాలంటే కనీసము ఆరు మాసాలైన పడుతుంది.అలాంటిది ఆరు నిమిషాలలో ఈ వేరు గంధముతో తగ్గించారు.ఈ వేరు వివరాలు నాకు చెబితే అది సంపాదించి సొమ్ము చేసుకుంటాను.

ఆనందభిక్షువు వెంటనే గంజాయిస్వామి.ఈ ఒక్క వేరుకే ఇలా అయిపోతే ఎలా?మా దగ్గర జంబూద్వీపంలో లభించే జామకాయలు ఉన్నాయి.వాటిని తింటే ఆకలి నిద్ర ఉండదు.గావలసినంత సేపు ధ్యానములో ఉండవచ్చును.ఇదిగో ఈ వేరుతో కూర్చున్న మన చుట్టూ ఉన్న భూమి మీద రాస్తే మనము తినే జంతువుల దగ్గర నుండి మనని తినే జంతువుల దాకా రక్షణ పొందవచ్చును అంటూండగానే

స్వామి.మీరు బౌద్ధ సన్యాసులా? అనగానే

అవును స్వామి.

అయితే నా పంట పండింది.నేను ఎపుడినుంచో బౌద్ధ సన్యాసులను కలవాలని అనుకున్నాను.కాని వారికి ఎలాంటి చెడు అలవాట్లు ఉండవని మత్తు పదార్ధాల సేవనము చేయరాదని వాళ్ళకున్న నియమాలలో ఒకటని తెలుసుకొని ఆశ్చర్యము చెంది మీలాంటి వారిని కలిసే అవకాశము నాకు ఇంతవరకు లభించలేదు.

అయిన మాలాంటి సన్యాసులతో నీలాంటి వారికి ఏమి పని?”

స్వామి.స్వామి.మీరు ఏమి అనుకోకూడదు.నిజము చెబుతాను.ఎందుకంటే మీరు ఏదో మణి మంత్రమును ప్రతినిత్యము చేస్తుంటారని విన్నాను.అది హిమాలయాలలో ఆ మణి నిజముగానే ఉన్నదని విన్నాను.మీలాంటి వారికి ఖచ్చితముగా ఆ మణి వివరాలు తెలిసే ఉంటాయి గదా.కాబట్టి వాటి వివరాలు నాకు చెబితే నేనే ఆ మణిని సంపాదించుకుంటాను లేదా పెద్ద మొత్తములో విదేశీయులకి ఆ వివరాలు అమ్మివేస్తాను అనగానే

గంజాయి స్వామి.ఆ మణి నీవు ఏమై ఉంటుందని అనుకుంటున్నావు?”

స్వామి.మీరు భలేవారండి.మీలాంటి వారికి తెలియకుండానే మణి మంత్ర జపము చేస్తూనే ఉంటారా?నాకు తెలిసి ఆ మణి కాస్త శమంతక మణి అయ్యుండాలి అనుకుంటాను.

గంజాయి స్వామి.అంత ఖచ్చితముగా ఎలా అనుకుంటున్నావు.అనగానే

స్వామి.మన బుద్ధ భగవానుడు విష్ణుమూర్తి దశావతారాలలో తొమ్మిదవ అవతారము. పైగా శ్రీ కృష్ణ అవతారము తరవాత ఈయన అవతారము వచ్చినది.మరి శ్రీ కృష్ణుడి దగ్గర శమంతకమణి ఒకటి ఉన్నదని ప్రతి సం... చేసుకొనే వినాయక చవితి కథలోని శమంతకోపాఖ్యానము కథ ద్వారా లోకానికి విదితమే గదా అనగానే..

ఇపుడు నీకు ఆ మణి వలన ఉపయోగమేమిటి?”

స్వామి. మీలాంటి సన్యాసులకు ఆ మణి వలన ఉపయోగము ఉండకపోవచ్చును.కాని అది ప్రతిరోజు ఇచ్చే 72కేజి బంగారముతో ఒక కె.జి.ఎఫ్ బంగారు గనియే ఏర్పడుతుంది.మీలాంటి వారికి ఈ మణి వివరాలు తెలిసిన లేదా మణి ఎక్కడుందో తెలుసుకున్న దానిని చూసి చూడనట్లుగా పట్టించుకోరు.అదే మా లాంటివారికి చెబితే ఆ మణితో ప్రపంచమునే బంగారుమయం చేయవచ్చును.కాబట్టి ఆ వివరాలు కొంతమేర మీకు తెలిసే ఉంటుంది.

గంజాయిస్వామి.ఒకవేళ ఆ మణి లేకపోతే

స్వామి. ఏముంది.మణి శోధన చేసిన ఒక అనుభవము మిగులుతుంది.నాలాంటి వారి ఆశ కాస్త నిరాశ అవుతుంది.ప్రయత్నము చేస్తేగాని ఏ విషయము   మనకి తెలియదు గదా.ఇందాక మీరు ఏదో మణి శోధన గూర్చి మాట్లాడుకుంటున్నారు. అపుడు స్పృహ తప్పి ఉండుటవలన మీ మాటలు స్పష్టముగా నాకు వినిపించలేదు.కాబట్టి నన్ను గూడ ఈ మణి శోధన యందు ఒక సభ్యుడిగా చేర్చుకోండి.మీ అందరికి సేవలు చేస్తూ సేవకుడిగా పడి ఉంటాను.అనగానే

నిర్వాణలామా వెంటనే

నీ అసలు పేరు ఏమిటి?”అనగానే

స్వామి.నా పేరు దేవా అనగానే

ఆనందభిక్షువు వెంటనే

కొంపతీసి నువ్వు దేవదత్త అనే నరహంతకుడివి కాదు గదా అనగానే..

స్వామి.మీరు భలేవారే.నేను ఏవో నాలుగు గంజాయి మొక్కలు అమ్ముకొని బ్రతికేవాడిని.వాడేమో విచిత్ర వస్తువులకోసం ప్రాణాలు తీసి శవాలతో వ్యాపారము చేసే ప్రపంచ మాఫియా లీడర్.

అంటే నీకు వాడిగూర్చి తెలుసా?”

స్వామి.మీరు భలేవారే.వాడి గూర్చి తెలియని సాధువులు,బైరాగులు,సన్యాసులు ఉంటారా.కాని వీళ్ళకి వాడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు.కాని వీళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళని బెదరించి వస్తువులు లేదా వేరులు తీసుకుంటాడని ఎవరైన ఎదురుతిరిగితే ప్రాణాలు తీయడానికి వెనుకాడడని నాకు తెలిసింది.వాడి వలన నేను ఎన్నో విలువైన వస్తువులు, వేర్లు కోల్పోయాను.వాడు నాకు పరమశత్రువు.అపుడపుడు నాకే తెలియని వాడిమీద కోపముతో యుద్ధము చేస్తూ ఉంటానని ఆవేశపడుతుంటే

దేవా.శాంతించు.శాంతపడు.నీ ఆవేశానికి అర్ధమున్నది.కాని నీవు మాతో వస్తే వాడి వలన ప్రమాదము కలుగుతుంది.ఎందుకంటే వాడుగూడ ఈ పరిశోధనలో ఉన్నాడని మాకు తెలిసినదని జేసి అనగానే

వాడు వెంటనే మేడమ్.అయితే ఇంకా మంచిది.నా శత్రువును త్వరలో నేనే స్వయముగా చూస్తున్నాను అన్నమాట.ఇంతవరకు ప్రపంచానికి వాడు ఎలా ఉంటాడో గూడ తెలియదు.నా ద్వారా వాడు నా చేతిలో ఎలా చచ్చాడో తెలుసుకుంటారు.మీరంతా మణి శోధన చేయండి.నేను వాడి అంతము కోసము పరిశోధన చేస్తాను అంటూండగానే

మూడు కారులు శరవేగముగా తమ కారును వెంబడించడము

జేసి గమనించి మీరంతా జాగ్రత్తగా  ఉండండి.త్రివేది,కులకర్ణి,దేవదత్త అనుచరులు మనల్ని వెంబడిస్తున్నారు.వారిని ఏమార్చి నా ఇంటి దగ్గరలో ఈ కారును ఆపుతాను.మనము దిగి పారిపోవాలి.పదినిమిషాలలో మనము మా ఇంటి దగ్గరికి చేరుకుంటాము.తలలు బయట పెట్టకండి.వాళ్ళూ కాల్చిన కాల్చేస్తారు అంటూండగానే

కారు నుండి తుపాకి పేలిన శబ్దము విని గంజాయి స్వామి అయిన దేవా కాస్త మళ్ళీ స్పృహను కొల్పోవడము జరిగినది.ఇదేమి పట్టించుకోని జేసి తమ వెంటాడుతున్న కారులను ఏమార్చడానికి దారులు వెతుకుతూ సన్నని గొందుల వెంట తన కారును పోనిచ్చసాగినది.నిర్వాణలామా మాత్రము కళ్ళు మూసుకొని ధ్యాన నిష్ఠలో ఉండిపోయాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి