10 భాగం

 

10

నా స్వయంవరం కోసము అందరి రాజవంశీయులకి లేఖలు ద్వారా ఆహ్వానాలు పంపడము జరిగింది. కాని  అందరూ అనుకున్నట్లుగా నాది స్వయంవర వివాహము గాదు. ప్రేమ వివాహము. ఎవరినో తెలుసా? స్వయానా నా మేనకోడలైన యశోధర యందు ప్రేమలో మునిగి పోయాను. ఎలా అంటారా? ఈమె గూడా నా స్వయంవరమునకు వచ్చింది. కాని స్వయంవరములో  పాల్గొనడానికి కాదు. వాటి ఏర్పాట్లు చూడటానికి వచ్చింది. మా నాన్నగారి మరొక సోదరియైన సమిత కూతురే. అంటే మా మేనత్త కూతురే యశోధర అన్నమాట. మహా సౌందర్యవతి. పైగా మాటకారి.  చూపులలో కవ్వింపులు, మాటలలో చలోక్తులు, ఆటపాటలలో,నడకలో, నడతలో ఆమెకి ఎవరు సాటిరారు. అన్నింటికీ మించి సేవాతత్పరురాలు. ఎలా అంటారా?

              నాకు రాజభోగాల మీద అంతగా ఆసక్తి ఉండేది కాదు. ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ కష్టసుఖాలను తెలుసుకొని వాటిని కొంతమేర అయిన తీర్చాలనే తపన తాపత్రయాలు పడుతూ ఉంటాను. అందరూ నిద్రపోతున్న వేళ నేను మెలకువగా ఉండి మారు వేషాలు వేసుకొని నా స్నేహితుడైన చెన్నుడితో కలిసి గుర్రాలు ఎక్కి రాజ్యములో ఉండే చుట్టుప్రక్కల గ్రామాలు దర్శిస్తూ.... ప్రజల కష్టాలు, వారి ఈతి బాధలు తెలుసుకునేవాడిని. అందరు నిద్ర లేస్తున్న సమయములో నేను యధావిధిగా అంతఃపురమునకు చేరుకునేవాడిని. ఇది ఎవరికీ తెలియని నా రహస్య దినచర్య అన్నమాట. ఒక రోజు తెల్లవారుజామున ఇలాగే మేము మా మారు వేషాలతో నగరసంచారము చేస్తుండగా....

              ఒకచోట ఇలా ఎలాంటి యువరాణి అలంకార దుస్తులు లేకుండా కేవలము సాదా సీదా దుస్తులలో ప్రజలకి సేవలు చేస్తూ యశోధర నా కంట పడింది. నేను నమ్మలేక పోయాను. నాకు ఆశ్చర్యమేసింది. ఒక యువరాణి కాస్త అంతఃపురమునందు రాజభోగాలు అనుభవించకుండా పేదల కన్నీళ్ల గూర్చి సేవలు చేస్తుందా? అనిపించింది. ఆమె ఒక పూరి గుడిసె దగ్గర ఉన్న చిన్న పిల్లలకి వైద్య చికిత్స చెయ్యడము  చూస్తున్న నేను వెంటనే ఆమెను సమీపించి "యశోధర. నువ్వు ఇలా? ఒక యువరాణియై ఉండి ప్రజలకి సేవలు చేస్తున్నావా? ఇలా ఎన్నాళ్ళ నుంచి ఈ సేవలు చేస్తున్నావు" అని అడిగాను. దానికి ఆమె సమాధానముగా నా వైపు ఒక చిరునవ్వు నవ్వి యధావిధిగా తన పనిలో నిమగ్నమైంది.

*** *** *** *** *** ***

దేవదత్త చేతికి..తన ప్రియశిష్యుడైన అంగుళీమాల నుండి రహస్యముగా దాచి ఉంచిన అంబేద్కర్ యొక్క చైనీస్ బాక్స్ అందడముతో దాని మీద అంగుళీమాల చెప్పిన ఆధార శ్లోకము కనబడేసరికి నిరుత్సాహము వచ్చినది.ఈ శ్లోకమునకు సమాధానముగా శంఖము అని తెలుసు.కాని ఈ సమాధానముతో ఈ పెట్టె ఎలా తెరవాలో ఓ పట్టాన దేవదత్తకి అర్ధము కాలేదు.తన పలుకుబడితో ఇలాంటి పజిల్స్ సాల్వ్ చేసే వారిని పిలిపించిన ఎలాంటి ప్రయోజనము కనిపించకపోయేసరికి తల పట్టుకున్నాడు.

ఇలాగాదనుకొని తనే స్వయముగా రంగములోనికి దిగి మణి పరిశోధన పూర్తి చేయాలని నిశ్చయించుకొని ఇదే విషయాన్ని తన మిత్రుడైన త్రివేది పోలీసు అధికారికి చెప్పగా..

సార్.ప్రమాదమేమో ఆలోచించండి.మిమ్మల్ని పట్టుకోవాలని దేశాలకే దేశాలు ఎదురు చూస్తున్నాయి.మీరు ఎలా ఉంటారో ఎపుడు ఏ అవతారము ఎత్తుతారో మీకు తప్ప ఎవరికి తెలియని మర్మ రహస్యము గదా.దీనివలన మీరు ఇన్నాళ్ళు జైలులో మగ్గకుండా ప్రాణాలతో తిరుగుతున్నారు.ఎందుకో.మీరు ఈ విషయములో ప్రమాదము కొని తెచ్చుకుంటారని అనిపిస్తున్నదని అనగానే..

త్రివేది.ఆ విషయాలు నాకు వదిలేయి.ఎప్పటికప్పుడు నాకు పోలీసు పరిశోధన రిపోర్టులు అలాగే గూఢాచారి పరిశోధన రిపోర్టులు నాకు చెబుతూ ఉండు.నీకు గావలసినవి అన్నియు నేను చూసుకుంటాను అనగానే..

సార్.ఆ భరోసా నాకిచ్చారు.మీకు ఎపుడికపుడు మణి శోధన విషయాలు అందిస్తూ ఉంటాను.దాని ప్రతిఫలము మీరిచ్చే బహుమానాలు అందుకుంటాను.అవును గాని మీ అనుచర నాయకుడు అంగుళీమాలను ఈ పనిలో ఎపుడో దింపారు గదా.వాడు ఉండగా మీరెందుకు రిస్క్ తీసుకుంటారు అనగానే..

త్రివేది.అంబేద్కర్ ఈ మణి శోధన విషయాలను మానవమాత్రుడికి అర్ధము కాని విధముగా పజిల్స్ రూపములో  ఉంచాడు.వీటికి సమాధానాలు చెప్పాలంటే చచ్చిన అంబేద్కర్ తిరిగి రావాలి.లేదా అర్హత,యోగ్యత ఉన్న బౌద్ధ సన్యాసి వలనే ఇది సాధ్యపడుతుందని నాకు అనిపిస్తోంది.

సార్.అంటే నిర్వాణలామా లాంటి వారి వలన ఈ మణి శోధన రహస్యాలు మనకి తెలిసే అవకాశాలుంటాయా అంటారా?”

త్రివేది.నిర్వాణలామా ఎవరు?” అనగానే..

సార్.మీకు చెప్పడము మర్చిపోయాను అంటూ రెండు రోజుల క్రింద మ్యూజియములో నిర్వాణలామాకి తనకి జరిగిన సంభాషణలు పూసగ్రుచ్చి చెప్పేసరికి చంకలో పిల్లవాడిని పెట్టుకొని ఊరంతా తిరిగినట్లుగా ఉన్నదని అనిపించి..

త్రివేది.నీవు అలాగే మీ ఫొలీసులు ఈ లామా మీద కన్నేసి ఉంచండి.వాడి ప్రతి ఆలోచన అలాగే ప్రతి కదలిక నాకు ఎపుడుకపుడు తెలియాలి.అలాగే అంగుళీమాలను గూడ రహస్యముగా అనుసరించమని చెపుతానని ఫోన్ కట్ చెయ్యడముతో

దేవదత్త తిరిగి అంగుళీమాలకు ఫోన్ చేసి నిర్వాణలామాను రహస్యముగా అనుసరించమని అనుఙ్ఞ ఇచ్చి ఫోన్ కట్ చెయ్యగా..

తన ఎదురుగా సాల్వ్ చేయలేని విధానముతో ఉన్న చైనీస్ బాక్స్ వంక మురిపెంగా చూస్తూ..

నిన్ను తెరిపించే అసాధ్యుడిని త్వరలో కలుస్తాను.వాడి చేతనే నిన్ను తెరిపిస్తాను.నీ కడుపులో ఉంచిన రహస్యమును నేను తెలుసుకొని మణి ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి దానిని ఆధీనము చేసుకొని ఈ విశ్వానికి అధినేత అవుతాను అంటూ పగలబడి నవ్వసాగాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి