37 భాగం

 

37

నాలోని ప్రతికణము, ప్రతిశరీర అణువుగూడ మహా ప్రవాహములోని బిందువులాగా కనిపించసాగింది. ఈ ప్రవాహములో జననం, స్థితి, మరణం అనే మూడు పాయలు కనిపించసాగాయి. అంటే ఆఙ్ఞా చక్రము వద్ద కనిపించే త్రివేణి సంగమము. దీని సంకేతమే ప్రయాగ క్షేత్రములోని గంగా,యమున, సరస్వతి త్రి నదుల సంగమము అని గ్రహించాను. ఈ శరీరములో ప్రతి భావము, ఆలోచన, సంకల్పాలు, స్పందన, ఆశ, భయాలు, కాంతి శరీరాలు, నల్లటి శరీరాలు, జీవ శరీరాలు పుడుతున్నాయి. పెరుగుతున్నాయి. నశించిపోతున్నాయి. అలాగే అసంఖ్యాకంగా లోకాలు పుడుతున్నాయి. నశించుతున్నాయి వీటిలో లక్షల కోట్లలో జీవులు పుడుతున్నాయి. కాలానుసారంగా క్రమానుసారంగా జీవనము కొనసాగిస్తూ అంతరించి పోతున్నాయి. అంటే సముద్రము పై అలలు పైన ఉండే నీటి బుడగలు లాగా ఇవి  పుడుతున్నాయి. అంతలోనే నశించి పోతున్నాయి. మళ్లీ పుడుతున్నాయి. మళ్లీ పోతున్నాయి. నేను కాస్త ధ్యానములో ప్రతి అణువులో భూమి, ఆకాశం, అగ్ని, వాయు, జల తత్వాలు, త్రికాలాలు దర్శించడము జరిగింది. అనుభవాలు, ఆనందాలు, విషాదాలు, కలుగుతున్నాయి. వీటి వలన భయం, కోపం, తాపం, ద్వేషం, మూర్ఖత్వం, అసూయ, అజ్ఞానం, లోభత్వం అనే మున్నగు భావాలు కలుగుతున్నాయి. వీటి మూలకారణము అజ్ఞానమని... ఈ అంధకార మాయ నుండి మనస్సు బయటపడితే కాని సృష్టి చక్ర మాయ నుండి విముక్తి పొందదని అనుభవ అనుభూతి పొందసాగాను. కాలములో ముందుకి, వెనక్కి వెళ్ళడము జరిగింది. వెనక్కి వెళ్లితే నా గతజన్మ అనుభవాలు జ్ఞానస్ఫురణకి వచ్చాయి. ముందుకి వెళ్లితే ప్రస్తుత జీవుల యొక్క పునఃజన్మలు కనిపించసాగాయి. దానితో ఈ శరీరములో శాశ్వతముగా ఉండేది ఏది కనిపించలేదు. దానితో ఆత్మ కోసము అన్వేషణ సాగించాను. కాని అది ఎక్కడ నాలో ఉన్నట్లుగా అగుపించలేదు. అంటే శరీర ధర్మాలు అన్ని కలిస్తేనే ఆత్మయని... ఆత్మ అనేది వేరేగా లేదని ఉండదని నా ధ్యాన అనుభవ అనుభూతి ద్వారా గ్రహించాను.

ఆ దేవుడు జాడ గూర్చి అన్వేషించాను. ఈయన రూపము కాని స్వరూప దర్శనము కాని నాలో ఎక్కడ అగుపించలేదు. ఆయన జాడ అగుపించలేదు. అంటే వేదాలలో చెప్పిన ఆత్మ అలాగే దేవుడు అనేది లేదని, ఆత్మ అలాగే దైవము అనేది రూపము లేనిది, ఆకారము లేనిది గుణము లేనిది, అర్ధముకానిది అర్ధంలేనిది లేని ఆత్మదర్శనం ఎలా అవుతుంది అలాగే లేని దైవ దర్శనం ఎలా అవుతుందో నాకైయితే అర్ధము కాలేదు. దానితో నాలో అనాత్మ భావము మొదలైంది. ఈ భావముతో శూన్యముపైన ధ్యానము చెయ్యడము ఆరంభించాను. దానితో ప్రతి అణువు ఒక బ్రహ్మాండమని అలాగే ప్రతి బ్రహ్మాండము ఒక అణువు యని అనగా ఇవి ఒకదానికి మరొకటి బింబ ప్రతిబింబ రూపాలేనని ఉన్నది ఒక్కటే అణువుయని...అదే మూల అణువుగా గ్రహించాను. ఈ అణువు లేకపోతే సృష్టి లేదని.... ఇక సృష్టి లేనిచోట ఉండేది అంతా శూన్యమేనని అనుభవ అనుభూతి పొందసాగాను. దానితో ఈ సృష్టిలో కనిపించే ప్రతి భౌతిక పదార్ధము యొక్క అంతరభాగము అణువు యని... ఇది శూన్యములో లయము చెందుతోందని... ఏది శాశ్వతముగా లేదని... ఈ అణువు నశించితే మిగిలేది శూన్యమని గ్రహించాను. దానితో నా అణు శరీరము కాస్త విస్తరించి మోకాళ్లు హిమాలయాలు దాకా, ఎడమకాలు తూర్పు సముద్రము దాకా, కుడికాలు పడమర సముద్రము దాకా, పాదాలు దక్షిణ సముద్ర తీరము దాకా అపుడే నా నాభి నుండి బండి చక్రము లాంటి అనంతపద్మం ఉద్భవించి అది కాస్తా ఆకాశములోని మేఘాల దాకా తాకడము అనగా నా విశ్వరూప దర్శన అనుభవ అనుభూతి పొందడము జరుగుతోందని గ్రహించాను. అంటే మూల అణువు పైన అంతరదృష్టిని సాధించగలిగితే విశ్వరహస్యమును చేధించవచ్చును. సత్యాన్ని ఆవిష్కరింప చేసుకోవచ్చు అని గ్రహించాను.

*** *** *** *** *** ***

కులకర్ణి తన ముందున్న పోలీసు అధికారులతో అలాగే తన ఆఫీసు అధికారులతో

మీరు నిజముగానే ఆ వ్యక్తి ఫోటోను అంగుళీమాల గదిలో చూశారా?” అనగానే

చూశాము సార్.పైగా ఆ ఫోటో క్రింద క్లియర్ గా పెద్ద పెద్ద అక్షరాలతో దేవదత్త అని పేరు గూడ వ్రాసి ఉంది.పైగా దానికి పూజ చేస్తున్నట్లుగా బొట్లు ప్రక్కన దీపారాధనలు అగరవత్తులు ఉన్నాయి అనగానే

అయితే మీరు ఆ ఫోటోను తీసుకొని వచ్చారా?”

లేదు సార్.కాని ఫోన్ లో ఆ ఫోటో తీశాము అంటూ ఫోన్ లోని ఫోటోను చూడగానే కులకర్ణి నొసలు ముడిపెడుతూ

మీరు చెబుతున్న అధికారి మంచివాడు.చాలా నిజాయితీ అధికారి.వాడే దేవదత్త అంటే నాకు నమ్మబుద్ధి కావడము లేదు.కాని నరహంతకుడైన అంగుళీమాల గదిలో ఈయన ఫోటో ఉండటము ఏమిటో నాకైతే అర్ధము గావటము లేదు.ఎందుకైనా మంచిది.ఒకసారి ఈ ఫోటోను అంగుళీమాలకి చూపించండి.వాడి రియాక్షన్స్ ఏమిటో చూద్దాము అనగానే

సరే సార్.ఏ విషయము మీరే స్వయముగా మానిటర్ లో చూడండి అంటూ వాళ్ళు కాస్త   అంగుళీమాల దగ్గరికి వెళ్ళి తమ ఫోన్ లోఉన్న ఫోటోను చూపించగానే

వాడు కాస్త ఆనందముగా గురూజీ.గురూజీ.ఈ రోజు మీ పూజ చేయలేదని బాధపడుతున్నాను.ఈ విధముగా నా దగ్గరికి వచ్చినారా?ఇదిగో మీకు పూజ చేస్తాను అనగానే

అంగుళీమాల.నీ గురూజీకి నీవు పూజ చేయాలంటే నీ గురూజీ ఎవరో చెప్పాలి.ఈయన పేరు ఏమిటి?”అనగానే

గురూజీ.వీళ్ళకి మీ అమూల్యమైన పేరు గావాలంట.మా గురూజీ పేరు దేవదత్త.ఆయన ఎలా ఉంటాడో లోకానికి తెలియదు.నాకు మాత్రమే తెలుసు.అందుకే ఆయన ఫోటోను నా పూజగదిలో ఉంచుకున్నాను.అనేమాటలు విన్న కులకర్ణి ముఖములో నెత్తురు చుక్క లేదు.

కారణము వాడి గురూజీ ఎవరోగాదు.త్రివేది పోలీసు అధికారి.

అంటే నిత్యము నా వెంట నీడలా ఉండే త్రివేది అధికారియే ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా ప్రపంచమును శాసించే మాఫియా లీడర్ దేవదత్త అంటే కులకర్ణితో  సహా ఎవరికి నమ్మకము కుదరలేదు.  ఒకటికి పదిసార్లు కులకర్ణి ఆలోచించుకొని ఎలాగైనా త్రివేది అధికారిని బ్లాక్ కమాండోలతో బంధించాలని ఆఖరికి నిర్ణయించుకొని కేంద్ర ప్రభుత్వమునకు తన సిఫారస్ చెప్పడానికి ఫోన్ దగ్గరికి బయలుదేరి ఆ విషయమంతా చెప్పడము వాళ్ళు వెంటనే కొన్ని గంటలలో బ్లాక్ కమాండోలను బుద్ధగయ క్షేత్రానికి వచ్చే విధముగా ఆఙ్ఞలు ఇవ్వడము క్షణాలలో జరిగిపోయింది.ఈ లోపల త్రివేది అధికారి గూడ బుద్ధగయలోని బౌద్ధమ్యూజియములో ఉన్నాడని కులకర్ణి తెలుసుకొని అక్కడికి ఈపాటికే నిర్వాణలామా బృందము ఉండి ఉంటారని గ్రహించి త్రివేది అధికారి దేశద్రోహి అయిన దేవదత్తయని ఈ బృందమునకు చెప్పాలని వీడి వలన వాళ్ళకి ఎలాంటి ప్రమాదము రాకుండా ఉండేందుకు తమ బలగాలను ఈ మ్యూజియము చుట్టూ రక్షణ వలయముగా ఉండే విధముగా ఏర్పాట్లు చేయడములో నిమగ్నమైనాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి