45
ఒకరోజు
నేను భిక్ష కోసము శ్రావస్తి నగరములోనికి ప్రవేశించాను.అక్కడ ఒక వీథిలో మనిషి
సంచారము కనిపించలేదు.పైగా ఇళ్ళకి తాళాలు బిగించుకొని లోపల ఉండిపోవడము గమనించి ఒక
ఇంటిముందు భిక్షి ఆగి ఇంటియజమానిని దీనికి కారణము అడిగితే దానికి ఆయన
“స్వామి.ఇపుడు ఇక్కడికి అంగుళీమాల అనే నరహంతుకుడు ఈ నగరమునకి వచ్చాడని
జాగ్రత్తగా ఉండమని ప్రచారము చేశారు.వాడు కనిపించిన వాడిని చంపుతూ వారి బొటన వేలును
కోసి మెడలో దండగా వేసుకుంటాడని వాడికి అంగుళీమాల పేరు వచ్చినదని” చెప్పి తలుపు వేసుకున్నాడు.
నేను
యధావిధిగా భిక్షకి వెళ్ళుతుండగా నన్ను అనుసరిస్తూ అంగుళీమాల నన్ను చంపటానికి నా వెంట పడ్డాడు.వీడికి అనుభవ
జ్ఞానబోధ చెయ్యాలని నేను ఆగకుండా ముందుకి పోతుంటే
వాడు
వెంటనే “స్వామి..ఆగండి..నేను ఎవరో..ఎలాంటి వాడినో
తెలుసుకొని నా ముందే ఎంత ధైర్యముగా వెళ్ళుతున్నావు.నేను ఆగమన్న గూడ ఆగకుండా పోతావే” అనగానే
నేను
వెంటనే వాడితో “అంగుళీమాల..నేను ఆగిపోయి
చాలా కాలమైంది.కాని నీవే ఆగడము లేదు.ఆగవలసింది నేను కాదు నీవే” అనగానే
నా
నిర్లక్ష్య సమాధానము వాడికి బుర్ర తిరిగి శరవేగముగా నా ముందుకు వచ్చి నన్ను ఆపి
నాతో “స్వామి..నీవు ఎపుడో ఆగిపోయానన్నావు.మరి
నడుస్తూన్నావేమిటి” అనగానే
నేను
వాడితో “అంగుళీ..నా మాటలకి అర్ధం నేను ఎపుడో
కర్మలు చెయ్యడము ఆపివేశానని అదే నువ్వు ఇంక జనాలను చంపే పాపకర్మలు చేస్తున్నావని
వాటిని ఆపమని ఆ విధముగా చెప్పడము జరిగింది” అనగానే..
“ఓ సన్యాసి..నీకు ఈ మనుష్యులు గురించి తెలిసినట్టు లేదు.వీళ్ళకి ఉన్న
కుళ్ళు, అసూయ, రాగద్వేషాలు,మదపిచ్చి,ధనపిచ్చి అందుకే వీరందరిని చంపితే కాని
నాకు తృప్తి ఉండదు.”అనగానే
నేను
వెంటనే వాడితో “అంగుళీ..నువ్వు ఇన్నాళ్ళు
వాళ్ళలలో ఈ చెడు లక్షణాలనే చూశావు.ఎందుకంటే నీలోను ఆవే లక్షణాలున్నాయి.ప్రపంచము
మారదు.కాలం మారుతుంది.మనము చూసే మనస్సును బట్టి కనిపించే ప్రపంచము కనపడుతుంది.నీకు
ఈ ప్రజల వలన అనుకోని నష్టాలు,ప్రమాదాలు కలిగినాయి.అది వారి
అజ్ఞానములో తెలియక చేశారు.ఇపుడు నాకు వారిలో ప్రేమ,ప్రేమించే
గుణాలు కనపడుతుంటే అదే మనష్యులలో నీకు రాగద్వేషాలు కనపడతున్నాయి.నా దారికి వచ్చి
చూడు.నాకు లాగా సన్యాసిగా మారితే ఈ లోకమంతా నీకు ప్రేమ, దయ,
కరుణ, ఆనందము,శాంతితో
కనపడుతుంది.హింసా మార్గమును వదులు పెట్టు.ద్వేషం వదిలిపెట్టు.చంపడం వదిలిపెట్టు” అనగానే
అంగుళీమాల
నా ప్రేమపూరిత మాటలకి చలించిపోయి నా కాళ్ళమీద పడుతూ
“స్వామి…మీ చల్లని చూపులు,మీ కారుణ్య మాటలు నన్ను
పూర్తిగా మార్చివేశాయి.నా ప్రాణాలు మీ చేతులలో పెడుతున్నాను.ఈ రాజ్యప్రజల నుండి ఈ
రాజ్య రాజు నుండి నన్ను రక్షించే భారము మీదే” అంటూ తన మొలలో
ఉన్న కత్తిని నేలమీద పెట్టగానే నేను వాడిని హత్తుకొని వాడికి అహింసక దీక్షనామముతో
సన్యాసి దీక్ష ఇవ్వడము జరిగింది.
రెండు
వారాల ఈ దీక్షలోనే వాడిలో ఎంతో మార్పురావడము నేను గమనించి ఆశ్చర్యము చెంది అపుడు
వాడిని నాతోపాటుగా భిక్షగా తీసుకొని వెళ్లగా నాకు ఆరోజు వీడిని వెతకటానికి స్వయంగా
ఆ రాజ్య రాజు అయిన ప్రసేనజిత్తు నాకు గుర్రముపై ఎదురై నన్ను చూసి గుర్రము దిగి
నాకు నమస్కారము చేస్తూ
“స్వామి..ఇలా మీరంతా భిక్ష కోసము బయటికి తిరగకండి.అంగుళీమాల అనే నరహంతుడు ఈ
నగరములో తిరుగుతున్నాడని నాకు సమాచారము అందినది.అందుకే వాడిని స్వయంగా నేనే
పట్టుకోవాలని తిరుగుతున్నాను” అనగానే
నేను
వెంటనే ఆ రాజుతో “స్వామి..ఒకవేళ అంగుళీమాల
మాకు లాగా కారుణ్య శాంతిమూర్తిగా సన్యాసిదీక్షకుడిగా మారితే ఏమి చేస్తారు” అనగానే
ఆ
రాజు వెంటనే “స్వామి.ఇలా మీకు లాగా వాడు
మారితే వాడు అన్నింటికి పశ్చాత్తాపము పడితే నాకు ఇంకేం గావాలి.వాడికి క్షమాభిక్ష
పెట్టి వదిలివేస్తాను” అనగానే
అయితే
ఈ సన్యాసియే మీరు వెతికే అంగుళీమాల అని నా వెనుక ఉన్న అహింసకుడిని చూపించగానే ఆ
రాజు వాడిని ఎగాదిగా చూస్తూ వాడి పుట్టుపూర్వోత్తరాలు అడిగితెలుసుకొని వాడు నిజమైన
అంగుళీమాల యని నిర్ధారణ చేసుకొని వాడికి క్షమాభిక్ష పెట్టి వదిలిపెట్టగానే దానితో
మేమంతా వీడితో కలిసి భిక్ష కోసము ముందుకి బయలుదేరాము.
***
*** *** *** *** ***
పైగా
హైందవ ధర్మము ప్రకారము చూస్తే పరమశివుడు కాస్త నాగపాములను కంఠాభరణముగా ధరించడము
పైగా ఈయన కాస్త సాగరమధనములో వచ్చిన హాలాహలము అనే కాలకూటవిషమును మ్రింగినపుడు ఈ
విషము కాస్త కంఠము నుండి క్రిందకి దిగకుండా అమ్మవారు తన స్వహస్తాలతో ఆపివేయడము
దానితో ఈ విషము కాస్త నీలిరంగుకు మారడముతో ఈ కంఠము గూడ నీలిరంగుగా కనిపించడముతో నీలకంఠుడని నామము
పొందటము పైగా ఈ విషమును తాళలేక క్రిందాపైన పడుతుంటే ఆది పరాశక్తి కాస్త తారాదేవి
అమ్మవారుగా ఉద్భవించి ఈయనకి తన చనుబాలు ఇచ్చి ఈ విష ప్రభావము నుండి ఉపశమనము
కలిగించినదని దానిని బట్టి చూసిన అలాగే ఈయన మానస కూతురు మానసాదేవి సర్ప దేవతగా
పూజింపబడటము మరియు బ్రహ్మదేవుడు ఒక మహా సర్పముతో అతిశక్తివంతమైన నాగాస్త్రమును
తయారుచేసి నాగాసురుడు అనే రాక్షస సం హారము చేశాడని మరియు కంద రామాయణము యుద్ధ
కాండలో నాగాస్త్రము యొక్క పుట్టుక వివరించిన దానిని బట్టి మరియు మహాభారత గాధలో గూడ
కర్ణుడు నాగాస్త్రాన్ని కలిగి ఉండి అర్జునుడు మీద ప్రయోగము చేశాడని చెప్పిన దానిని బట్టి మరియు
బౌద్ధధర్మములో
గూడ సర్పారాధన ఉంది.పైగా వీళ్ళు చాలా అరుదుగా కనిపించే శ్వేత నాగుల ఆరాధన
చేస్తారు.పైగా మన బుద్ధభగవానుడికి సప్త సర్ప జాతులు వశము అయినాయని ఆసియా ఖండములో
కాంబోడియా దేశములో ఉన్న క్రీ.శ.12 వ శతాబ్దము కాలము
నాటి గౌతమబుద్ధుడి శిలామూర్తిని చూస్తే అందరికి తెలిసిపోతుంది.అంటే ఈ విగ్రహమూర్తి
చూడటానికి బుద్ధభగవానుడు పద్మాసనము వేసుకొని ఆసనముగా ఏడు పడగలుండి తలమీద ఏడు తలల
మహాసర్పముంచుకొని దాని క్రింద తపస్సు చేస్తున్నట్లుగా ఈ విగ్రహము ఉంటుంది.ఆ దేశ
బౌద్ధ ధర్మ గ్రంథాల ప్రకారము పాతాళలోకానికి చెందిన నాగరాజు అయిన ముకులిందుడు ఇలా
గౌతమబుద్ధుడికి గొడుగు మరియు ఆసనముగా ఉన్నాడని చెప్పడము దానిని బట్టి చూస్తే అలా
మనకున్న ఆరు ధర్మ దైవ సిద్ధాంతాలలో తప్పనిసరిగా ఏదో ఒక చోట సర్పారాధన రావడము ఉండటము
బట్టి అలాగే మన బుద్ధభగవానుడు
ప్రతిపాదించిన కాలచక్రములో అంతిమముగా నీలిరంగు డ్యోర్జీనే ఆదిబిందువుగా అమర్చడము
బట్టి ఈ విశ్వమంతా గూడ ఒక పాము యొక్క నాగమణి నుండి స్వప్నముగా భ్రమ,భ్రాంతి,సత్యాసత్యాలుగా, ద్వంద్వ
భావ ప్రవృత్తిగా, మాయ, మోహ ,వ్యామోహాలుగా ,ఆశ, భయాలుగా,
సుఖదుఃఖాలతో ఉంటుందని ఇదియే హైందవ ధర్మములో ఆదియోగియైన పరమేశ్వరుడు
ధరించే వాసుకి సర్పము యొక్క నాగమణి ప్రభావమే దానికున్న కామరూప సిద్ధి వలన
పరమేశ్వరుడి మానస పుత్రికగా మానసాదేవి ఉద్భవించినదని ఈమెయే ఈ విశ్వసృష్టిని
నడిపించే అన్ని రకాల మాయలకి ఆధారమైన మనస్సుకి అధిదేవతగాను సర్పాలకి సర్ప దేవత
రాణిగాను ఉంటుందని నేను గ్రహించాను.వీటి అన్నింటిని సైన్స్ ప్రకారముగా విశ్లేషణ
చేస్తే సృష్టి కారకము పురుషుడి వీర్య కణమేగదా.ఇది స్త్రీ యొక్క అండముతో కలిసి
జీవము ఏర్పరస్తుంది.వీర్యకణమే లేకపోతే విశ్వ జీవ సృష్టి లేనట్లే గదా.నిజానికి
వీర్యకణము అనేది ఒక పాము ఆకారముగా ఉంటుంది.దీని ప్రవాహ నడక గూడ పాము నడకను పోలి
ఉంటుంది.ఇది చూడటానికి ఒక తల,మధ్యభాగము,తోక ఉంటాయి.ఈ వీర్యకణ పరిమాణము 1-3మిమి ఉంటుంది.దీని
జీవితకాలము 74 రోజులు ఉంటుంది.అదే ఇది అండములో ప్రవేశిస్తే 5 రోజులు మాత్రమే బ్రతుకుతుంది.ఈ వీర్యకణ మధ్యభాగములో అతిసూక్ష్మముగా
డి.ఎన్.ఎ ఉంటుంది.వీర్య కణము చనిపోయిన లేదా కదలకుండా నిశ్చలస్థితిలో ఉన్న గూడ
ఇందులోని డి.ఎన్.ఎ నుంచి మరొక వీర్యకణాలను అభివృద్ధి చేయవచ్చు.ఒక వీర్యకణము నుండి 30 వేల మిలియన్ల నుండి ఒక కోటి మిలియన్ల జీవాలను సృష్టించవచ్చని సైన్సు
చెబుతోంది.ఈ లెక్కన చూస్తే ఆదియోగి సేవించిన హాలాహలములో పాము యొక్క వీర్యకణ ముండాలి.ఈ
విషము కాస్త నాగమణిగా ఈయన కంఠమునందు మారిపోయి ఉండాలి.దానితో ఇందులో వీర్యకణము
కాస్త పాముచారికలాగా ఉండిపోవాలి.ఈ పాము వీర్యకణము యొక్క మధ్యభాగములోని డి.ఎన్.ఎ
నుండి కలలాంటి నిజము…
నిజము లాంటి కల ప్రతిరూపముగా విశ్వసృష్టి,జీవ,
దైవ సృష్టి జరిగినాయి.అంటే 1,,3,5,7,9,11 ఆపై 36 అటునుండి 3600,36000,36 లక్షలు,36 కోట్లుగా పాము ఈ వీర్యకణ డి.ఎన్.ఎ భావ పాత్రలు,
స్వప్న పాత్రలు ఏర్పడి ఉంటాయి.అంటే ఈ లెక్కన చూస్తే ఒక పాము యొక్క నాగమణిలోని
వీర్యకణములోని డి.ఎన్.ఎ (D.N.A)అంటే D=దేవుడు,N=నాన్న,A=అమ్మ అనే స్వప్న పాత్రల నుండి ఈ విశ్వ
సృష్టి నాంది అయింది.అలాగే మనకి నాగమణిలో పాముచారిక కనబడానికి కారణము ఏమిటంటే ఒక
పాము మణికైలాష్ ఎక్కే ప్రయత్నములో శిలగా మారి పోయినదని లోక విదిత స్థల పురాణగాధ
గదా.ఈ పాముయే నాగమణిలో పాముచారికలాగా మిగిలిపోయింది.ఎందుకంటే మణికైలాష్ పర్వతమే
మహాశివుడి కంఠములో ఉన్న కాలకూట విషమైన నాగమణి.ఇదియే ఆయన రుద్రమణి అని నేను
తెలుసుకున్నాను. అలాగే
విశ్వానికి మూలకేంద్ర బిందువు కైలాస పర్వతమైతే..మణి కైలాష్ పర్వతము అనేది ఈ
బిందువుకి ఆధారబిందువని నా పరిశోధనలో తెలుసుకున్నాను.
నా
పరిశోధనలో పాముల గూర్చి కొన్ని నిగూఢ రహస్యాలను తెలుసుకున్నాను.అవి ఏమిటంటే పాములు
కాస్త నగ్నముగా తిరిగే మనుష్యులను చూసి భయపడి పారిపోతాయి. దుప్పి కొమ్ముల పొగల
వాసనకి చనిపోతాయి.నాగమణి అనేది తలమీద ఉండదని దాని కంఠములో ఏర్పడుతుంది.పాములకు
కానుపు అయిన తరవాత సరిగ్గా కనిపించవు.అపుడు ఇవి సొంపు గింజల మొక్కలను తింటూ
కనుచూపును పెంచుకుంటాయి.అలాగే 48 రోజులపాటు ఉపవాసము చేసిన వ్యక్తి యొక్క ఉమ్మిని ఏదైన పాము నాకితే అది
క్షణాలలో చనిపోతుంది.సర్పాలకి తమను హాని చేసిన వారి మీద పగపడతాయి.పగ తీరకపోతే తలను
బండకేసి బాదుకొని చనిపోతాయి.ఇది సర్పశాపముగా మారి ఆ వ్యక్తి వంశములోని ఏడు తరాల వరకు మగసంతానమే
ఉండదు.అనగా వంశాభివృద్ధి ఉండదు.ఈ సర్పాలు నదిని దాటలేవు.వెనుతిరుగుతాయి.కొన్ని
సర్ప జాతులు మాత్రమే నీటిలో జలసర్పాలుగా ఉంటాయి.కొన్ని సర్పాలు అనేవి వృక్ష
సర్పాలుగా చెట్లమీద ఆవాసము చేస్తుంటాయి.ఇలాంటి సర్పము ఎపుడైన మనిషిని కాటు వేసి
అది కాస్త చెట్టు మీదకి వెళ్ళిపోతుంది.తను కాటు వేసిన వ్యక్తిని స్మశానములో
తగలబెట్టిన తరవాత వచ్చే ఆ శవ వాసనను చూసుకొని క్రిందకి దిగుతాయి.ఈ లోపల పాము
ఎపుడైన అనుకోని పరిస్థితులలో చెట్టు దిగితే కాటు వేసిన వ్యక్తికి విషము ఎక్కదని
అతను చనిపోడని నా పరిశోధనలో తెలుసుకొని ఆశ్చర్యానందమునకు గురి అయ్యాను.ఈ వృక్ష
సర్పాలకి ఆది దేవుడిగా మహాశివుడు ఉంటే జలసర్పాలకి ఆదిదేవుడిగా శ్రీ మహావిష్ణువు
ఉంటే సకల సర్పాలకి అధిదేవతగా మానసాదేవి ఉంటుంది.ఒక పాము అనగా నాగమణిలోని పాము
చారిక కన్న కలయే ఈ విశ్వమని తెలుసుకొనేసరికి ఇదే మూల విశ్వరహస్యమని గ్రహించేసరికి
మహానిర్వాణమైన మహానిర్యాణము చెందే స్థితికి చేరుకున్నాను.
ప్రకృతి
వెంటనే “స్వామి.అయితే ఇపుడు ఆ నాగమణిని మనము ప్రత్యక్షముగా చూసే అవకాశము ఉన్నదా?
“ అనగానే
“ప్రకృతి.ఇవాళ నాగ పంచమి.ఈ రోజు రాత్రి ఈ ఆలయ పూజారి దగ్గర తరతరాలుగా
అతిభద్రముగా దాచిపెడుతూ వస్తున్న నాగమణిని తీసుకొని వచ్చి ఈ పశుపతినాధ్ లింగము మీద
పెడతారని నేను విన్నాను.ఇంతవరకు నేను ప్రత్యక్షముగా చూడలేదు.అది నిజమో కాదోగూడ
నాకు తెలియదు”
అంటూండగా
వాసుకి దేవాలయము నుండి ఏవరో భక్తులు కాస్త పెద్ద అరుపులతో
పాము..పాము
అది దేవతా పాము వాసుకి సర్పము
ఇవాళ
నాగపంచమి గదా.బయటికి వచ్చి ఉంటుందని అంటున్న అరుపులు విన్న
నిర్వాణలామా
అలర్ట్ అయ్యి ఈ పాము వెళుతున్న దిశవైపు తన ప్రమేయము లేకుండా అనుసరించసాగాడు. వీరితో
పాటుగా ప్రకృతి అలాగే ఆనందభిక్షువు గూడ అనుసరించసాగారు.
ఇలా
ఈ వాసుకి సర్పము కాస్త మెట్లు దిగుతూ రోడ్డు సందులు గొందులు దాటుతూ ఈ దేవాలయ
ప్రధాన పూజారి ఇంటిలోనికి వెళ్ళి అదృశ్యమయ్యేసరికి ఈ ముగ్గురి నడక గూడ ఈ ఇంటి
దగ్గర ఆగిపోయింది.ఇంటి బయట నుండి లోపలవైపుకి వీళ్ళు చూస్తుండగా లోపలకి వెళ్ళిన
సర్పము కాస్త ఒక మగ మనిషిగా మారి బయటకి రావడము ఒక నిర్వాణలామా మాత్రమే గమనించి
ఈయనే వాసుకి నాగరాజు అయ్యి ఉంటాడు.ఈ ఇంటి ప్రధాన పూజారి దగ్గర నిజమైన నాగమణి ఉండి
ఉంటుందని అనుకొనేలోపల ఆ ఇంటిలోపల నుండి భజన భజంత్రీలతో ఒక పెద్దాయన పూజారి
వేషధారిగా బంగారపు పళ్ళెములో సుగంధ పుష్పాల మధ్య ఉన్న ఒక చిన్నపాటి గంధపు చెక్కతో
చేసిన భరణిని తీసుకొని గుడి వైపు రావడముతో
ఇందులో నాగమణి ఉంటుందని గ్రహించి మళ్ళీ ఈ ముగ్గురు తిరిగి శివాలయమునకు
చేరుకున్నారు.
కొన్ని
గంటల తరవాత చీకటి పడిన తరవాత గుడిలో ఉన్న అన్ని రకాల లైట్స్ ఆర్పివేయగానే అపుడికే
పశుపతినాధ్ శివలింగము మీద ఉంచి పూజించిన నాగమణి కాస్త కొద్ది కొద్దిగా కాంతిని
పుంజుకుంటూ అంతగాఢ చీకటిలో మణికాంతిలాగా మెరవడము అక్కడున్న భక్తులు గమనించి అందరు
గూడ హర్ష ధ్వానాలు చేస్తూ ఆ దివ్యమణి కాంతులు విరజిమ్ముతున్న నాగమణిని
తన్మయత్వముతో చూస్తూ ఈ ముగ్గురు గూడ మౌనముగా ఆనందమును అనుభవించసాగారు.దానితో జీవ
నాగమణి ప్రత్యక్ష దర్శనానుభూతిని తమకి కలిగించినందుకు ఆ పశుపతినాధ్ కు అలాగే
వాసుకి సర్ప నాగరాజుకి ఈ ముగ్గురు కృతఙ్ఞతలు చెప్పుకొని కాల చక్రములో దొరికిన రూట్
మ్యాప్ ఆధారముగా రుద్రమణి ఉండే మణి కైలాష్ పర్వతము వైపు ప్రయాణము సాగించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి