13, జనవరి 2021, బుధవారం

ది బుద్ధ కోడ్ - Mystery- detective-thriller

మన బుద్ధ భగవాన్ జన్మించి 2550 సంవత్సరాలైంది.
వేదాల నీడ గాదని బోధి నీడను ఆశ్రయించి జ్ఞాని అయ్యి జ్ఞానబోధ చేసి బోధిసత్వుడై ఆపై బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేసి తధాగతుడైనాడు. 
కాని టిబెటన్ యోగులు,లామాలు గత రెండు వేల సం.రాల నుండి నిత్యము జపించే ఓం-మణి-పద్మ-హుం మంత్రార్ధము ఏమిటి
మణిపద్మం అంటే ఏమిటి
14వ శతాబ్ధము నాటి బుద్ధుడి చేతిలో మణి పట్టుకున్న ఆ మూడు చిత్రాలు లోకానికి ఏమి చెపుతున్నాయి. 
అలాగే 1903-1909 సం.కాలము నాటి లామా ద్యోర్జీ చోగ్యాల్ బృందము హిమాలయాలకి వెళ్ళి మణిశోధన చేసి ఏమి చూశారు.
1912 సం.లో చార్లెస్ బెల్ అను సైనికాధికారి ఈ మణిశోధన చేసి తయారు చేసిన సీక్రెట్212 రిపోర్ట్ ఏమి చెపుతోంది.
అసలు బుద్ధ భగవానుడు ప్రతిపాదించిన కాలచక్ర తంత్రము నిజానికి ఏమి చెపుతోంది. 
రహస్యముగా ధ్యానాలు చేసుకొనే యోగులు,మునులు,లామాలు తెలుసుకొని లోకానికి చెప్పని హిమాలయ రహస్య గ్రామాల వివరాలు ఏమిటి?.
వీళ్ళు నిత్యము పూజించే మణిమంత్ర రహస్యకోడ్ ఏమిటి.. 
ఒక పక్క పోలీసుల వేట... (detective)
మరోపక్క అర్ధముకాని పజిల్స్ (Mystery)
మరోవైపు ఏమి జరుగుతుందో అర్ధము కాని ఉత్కంఠ సన్నీవేశాలతో (thriller)
ఇలాంటి ఇత్యాది విషయాల సమాహారమే ఈ ఆధ్యాత్మిక నవల కధాంశము.

                                                                  ఒక విజ్ఞప్తి
బౌద్ధధర్మ బుద్ధుడు తను అంతిమముగా తెలుసుకున్న మదిసత్యమును లోకానికి ఒక మణిమంత్ర రూపములో అతిగోప్యముగా ఒక మణిపద్మముగా చెప్పడము జరిగింది.అది ఏమిటో మీరు తెలుసుకోవాలంటే ఈ కధాంశమును బుద్ధుడు చెప్పిన ఒక జాతక కథగా చదవండి. ఇందులో చెప్పిన ప్రతి అంశము నా మది నుండి వచ్చిన ఊహలే..కల్పిత పాత్రలే..కల్పితాంశాలే..ఈ కథాంశమును ఒక కథగా చదివి ఆనందించండి.

         Mystery- detective- thriller

                                    ----- పరమహంస పవనానంద

                       copyrights © writer 

7 కామెంట్‌లు:

  1. Very good and its like a The Davinci Code type book in Telugu. Right from the first page to the last page you will never feel bore. Most of the times you feel this is a real story.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ మాత్రే నమః ��శ్రీ గురుభ్యో నమః ��
    The buddha code చాలా బాగుంది......నిజానికి బాగుంది అనేది చిన్న word .....more than spell bound, amazing , mind blowing words.....all most అన్ని subjects vacchayi........అన్ని మతాలు కూడానూ....

    1.ఇందులోని ఒక్కొక్కరి గురించి ఒక book (more than 4000 pgs) రాయచ్చు....... అలాంటిది బాబోయ్ too much compression.....
    2. Climax కూడా చాలా compress చేశారు......ఎలాగంటే everest నుండి ఒక్కసారి నెట్టినట్టు...or..... last ki vacchanu అనే బాధ వల్ల కావచ్చు అలా అనిపించింది....
    ఈ శంబల ప్రస్తావన "శ్రీమద్రామాయణము" నందు కూడా వస్తుంది. బాలకాండలో, విశ్వామిత్రుడు...యాగ రక్షణార్ధము, తన ఆశ్రమ వాటికకు దారిననే , రామలక్ష్మణులను తీసుకు వెళ్తాడు. సిద్ధాశ్రమమునకు(perhaps Shambala) వెళ్ళే దారిలో ఉన్న, తాను తపమాచరించిన ప్రదేశాన్ని చూపించి, దాని విశిష్టతనీ తెలుపుతాడు. విష్ణు పురాణం, నవమాధ్యాయంలో కల్కి ప్రస్తావన జరుగుతుంది. అలాగే భవిష్యత్ పురాణంలో కూడా కల్కి, శంబలల ప్రస్తావన ఉంటుంది.

    కల్క్యావతారం :

    ఇది మహా విష్ణువు యొక్క పదియవ అవతరణ.

    భగవద్గీత ఏం చెపుదుంటే.....

    “ ||యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

    అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || ”

    భావం : అర్జునా, ధర్మం నశించి, అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా .... నేను ధర్మ సంరక్షణమునకొరకు, శిష్ట రక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు నేను అవతరిస్తూ ఉంటాను .

    కల్కి మూర్తి : "కల్కి" అన్న పదమునకు తెల్లని గుఱ్ఱము అన్న అర్థము కూడా సంస్కృతములో కలదు. తెల్లని గుఱ్ఱము వాహనము కలవాడగుట చేత ఆతడు కల్కి అయినాడని కొంతమంది ప్రాజ్ఞులు చెబుతారు. పెద్దలు ఈ అశ్వమును శక్తివంతమైన "గరుడాశ్వం"గా చెబుతారు. ఇది భూమ్యాకాశములయందు చరించగలదు. కల్కి...శివుని గూర్చి తపమాచరించుచున్నపుడు , శివుని యొక్క వరముగా ఈ "గరుడాశ్వము" ఇవ్వబడినదని పురాణ వచనం. కల్కి శివుని నుండి శతృభయంకరమైన కరవాలాన్ని కూడా పొందినాడని పురాణ వచనం. కల్కి మూర్తి శ్రీ మహాలక్ష్మీ అంశ అయిన, సింహళ రాజ పుత్రిక అయిన "పద్మావతి" ని వివాహం చేసుకుంటాడని కూడా పురాణం చెబుతోంది. అయితే కల్కి అవతరణ దేనికి?

    “ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ |

    ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ||

    భావం : శిష్ట జనుల సంరక్షణార్థమూ, దుష్టజన శిక్షణకూ, ధర్మసంస్థాపన కోసం … ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూనే వుంటాను. ”

    కల్కి మూర్తి ఉనికి :

    మంగోలియాలోని ఆశ్రమాలలో, శిల్పాలలో, చిత్రాలలో...కొన్ని నిధులు శంబల ప్రభుడివి కనిపిస్తాయి. 1. తెల్లని గుఱ్ఱం - దానిపై తేజోమూర్తి అయిన ఒక దివ్య పురుషుడు 2. దాని చుట్టూ రహస్యంగా తిరిగే కాల చక్రం 3. శంబల చుట్టూ అల్లుకొని యున్న మార్మిక గాథలు.....కనిపిస్తాయి.

    1906 లో నికొలాస్ రోరిక్ తన శంబల అన్వేషణలో భాగంగా....ఎందరో యోగులను, తాంత్రికులను, ఋషులను, సిద్ధులను కలిసి ...వారు చెప్పిన అనేక రహస్య విషయాలు , తన గ్రంథాలలో ప్రజలకు అందించాడు.

    బురియత్ లామా ప్రకారం, "శంబల" చుట్టూ శక్తివంతమైన ప్రకంపనలు ప్రజ్వలిస్తూ ఉంటాయి. ఈ స్థలం చుట్టూ ఒక పొగమంచు లాంటి శ్వేత వర్ణంగా గల తేజస్సు పల్చని వెలుగుతో ఒప్పారుతూ ఉంటుంది. ఈ బురియత్ లామా, శంబల వెళ్ళి వచ్చిన అదృష్ట శీలి అంటారు. దీని కోసం అతను వ్రాసిన పుస్తకం చదువవచ్చు.

    రిప్లయితొలగించండి
  3. టిబెట్ కు చెందిన లామాలు ఇప్పటికే, శంబల ప్రభుడు తన కార్య కలాపాలలో నిమగ్నమై ఉన్నాడంటారు.

    బౌద్ధ లామాలు శంబల ప్రభుని "రిడ్జెన్ గ్యాపో" అని కూడా అంటారు.

    కలాప గ్రామం :

    ఇక "కలాప" గ్రామం గూర్చి.....కలాప గ్రామంలో నివశించే ఋషులు,సిద్ధులు అత్యంత శక్తి సంపన్నులని తెలుస్తోంది. ఈ భరత వర్షంలో, హిమాలయాలకు ఉత్తరంగా శంబలకు సమీపంలోనే ఈ కలాప గ్రామం ఉంది. మన సాహిత్యంలో ఒక చోట నారాయణ ఋషి తపస్సు చేసాడని చెప్పడం వలన, ఇప్పటి బదరీనాథ్ (బదరీ నారాయణ క్షేత్రం) గందమాధన పర్వతం అని...దానికి ఉత్తరంగా , శ్వేత వరాహ కల్పం చివరి వరకూ....నారాయణ ఋషి తపస్సు చేస్తుండే "నారాయణాశ్రమం" ఉన్నదని తెలుస్తోంది. ఇప్పటి బదరీనాథ్, మన భారత రాజకీయ సరిహద్దు లోపలనే ఉంది. కానీ ఈ రోజు మన దేశానికి ఉత్తరంగా, ఉన్న కారాకోరం, టిబెట్, గోబీ ఎడారి...మధ్య ప్రాంతం "భరత వర్షం" గా చెప్పబడుతోంది. కాబట్టి ఈ "కలాప" అనే ఈ సిద్ధుల గ్రామం...హిమాలయాలకు ఉత్తరంగా, నేపాల్ కు ఈశాన్యంగా ఉండి ఉండాలి.

    పై విషయాన్ని ధృవీకరిస్తూ మహాభారతం లోని "శ్రీకృష్ణ నిర్యాణ ఘట్టం" ద్వారా ఈ క్రింది విధంగా తెలుస్తోంది.

    శ్రీకృష్ణ నిర్యాణం తరువాత, అర్జునుడు శ్రీకృష్ణుని పట్టపు రాణులను తీసుకొని, ఈశాన్య దిక్కుగా పయనం చేస్తుంటే....దారిలో దొంగలు వారిని కొల్లగొట్టి....కొంతమందిని వారి ఆభరణాలతో సహా అపహరించుకుపోతారు. రుక్మిణి వంటి రాణులు యోగ మార్గంలో శరీర త్యాగం చేసారు.

    ఇలా cheptunanduku తప్పుగా anukokandi.....
    Yedi yemyina ఈ book చదివే అదృష్టం, యోగం నాకూ లభించినందుకు......... నా జన్మ ధన్యం.....

    ఈ అవకాశం నాకు కల్పించినందుకు.....మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూన్నాను....ఇలాంటి మరెన్నో ఉన్నత books మీ నుండి రావలని ఆశిస్తున్నాను.......🙏🙏🙏

    శ్రీ మాత్రే నమః 🙏
    శ్రీ గురుభ్యో నమః 🙏

    రిప్లయితొలగించండి
  4. ఓం శ్రీ సాయిరాం. ఓం జీ.
    బుద్ధ కోడ్ e book కావాలండీ.

    రిప్లయితొలగించండి
  5. చాలా చాలా బాగుంది
    కృతజ్ఞతలు స్వామి
    🙏🙏🙏🙏🙏🙏🙏

    రిప్లయితొలగించండి
  6. మీ పుస్తక రచన ద్వారా what is what అని తెలియజేశారు. తప్పటడుగులు వేస్తున్నానో లేక సరియైన మార్గంలోనే ప్రయాణం చేస్తున్నానో తెలియని స్థితిలో ఉన్న నాకు, గురువుల్లో గురువుగా నా సాధన మార్గానికి దశా నిర్దేశం చూపించే విధంగా మీ సాంగత్యాన్ని కోరుకుంటే మీరు అనుగ్రహిస్తారా?

    రిప్లయితొలగించండి